Halloween Costume ideas 2015

Why did God give the body?


శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు?
ఈ రోజు సమాజములో నేరస్తులుగా అవ్వడానికి కారణము వారి జన్మకు గల పరమార్ధము తెలుసుకోకపోవటము వలనే.చిన్ననాటి నుండి దేవుని గుర్చిన జ్ఞానము,దేవుని గుర్చిన మాటలు పాఠాలుగా వారికీ నేర్పించకపోవడమే లోపము. సత్యము తెలిసిన మనము ,ఈ సత్యాన్ని సమాజానికి చెప్పకపోవడము వాళ్ళ ఏంతో మంది నశించిపోతున్నారు.
1) అస్సలు దేవుడు మనకు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడో తెలుసుకోవడము చాల అవసరము. తల్లి గర్భమున పడినది మొదలుకొని స్మసానానికి చేరేంత వరకు మనుషులు ఆలోచించేది ,శ్రమించేది తన ధరించుకున్న దేహము గుర్చియే. ఈ దేహము చాలా గొప్పది,విలువైనది. ఎవరి వలన ఈ దేహము మనకు వచ్చింది అని ప్రశ్నించుకుంటే “ దేవుడనే” చెప్పాలి. ఈ దేహము దేవుడు ఇచ్చినది.మన తల్లి తండ్రులు ఇచ్చారు అని అనుకుంటే పొరపాటు.ఎందుకంటే ఒకానొక రోజున తల్లి గర్భమున ఉన్నాము.తల్లి గర్భములో ఉన్న ఆ క్షణాలు,దినాలు ఏమి జరిగిందో ,జరుగుచున్నదో మన తల్లికే తెలియదు.కానీ ఒక్కటి మాత్రము తెలుసు నేను తల్లి కాబోతున్నానని.అంతకు మించి లోపల పెరుగుతున్న బిడ్డ పాప,బాబు అన్న సంగతి తెలియదు. లోపల ఏ అవయము ఏ క్షణాన నిర్మాణము జరిగిందో ,జరుగుతుందో తల్లికి తెలియదు. 2) ఈ దేహము దేవుడు ఇచ్చినది.దేవుని వలన వచ్చింది. అస్సలు ఈ దేహము ఎవరి వలన మనకి వచ్చిందో అన్న విషయాన్ని చూస్తే 1 కొరంది 6:19- మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి,మీలో ఉన్న పరిశుదత్మునికి ఆలయమైయున్నది. దేవుడు వలన వచ్చిన ఈ దేహము మనకు ఎందుకు ఇచ్చాడు???psalm 139:13-దావీదు-నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు. అనగా ఈ దేహము దేవుని నిర్మాణము అంటున్నాడు. ఈ దేహము ఒక నిర్మాణము. ఈ దేహాన్ని నిర్మించడము సామాన్యమైన విషయము కాదు.ఈ దేహాన్ని దేవుడు తప్ప ప్రపంచములో ఎవరైనా నిర్మించగలరా? లేదు. మనిషిని చూసి మనిషిని మట్టితో చేయగలడు. మట్టితో మనిషి ఆకారము చేయగలడు కానీ శరీరాన్ని మాత్రము నిర్మించలేడు.ఇది దేవుడే చేయాలి. మన కంటికి కనిపించే ,కనపడని అవయవాలు ఎన్నో ఉన్నాయి.మనవ దేహములో ఉన్న ఈ అవయవాన్ని ఈ ప్రపంచములో ఎవరు చేయలేరు.ఇంత విలువైన దేహము (ఎవరు చేయలేనిది) దేవుడు ఎందుకు ఇచ్చాడో అన్న విషయము ఎప్పుడైనా ఆలోచించరా?

3) దేహము ఎందుకు ఇచ్చాడో అన్న విషయము తెలియక ఈ దేహాన్ని ,అవయవాలను తనకు ఇష్టము వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. చంపటానికి,చావటానికి దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు అన్నట్లుగా ఈ రోజు సమాజము మారిపోయింది.ఇందుకేనా దేవుడు మనకు దేహాన్ని ఇచ్చింది?? చస్తూ అనేక మందిని చంపడము దైవ నిర్ణయమని ,దేవుని నిజ సేవ అని jihad(పవిత్ర యుద్దము) అనుకుంటున్నారు. యేసుక్రీస్తు ఈ పరిస్థితులను గూర్చి మొదటి శతాబ్ధములోనే ముందుగా ప్రపంచ భవిష్యతు చెప్పాడు. john 16:1 నుంచి- మిమ్మును చంపు ప్రతివాడు తను దేవునికి సేవ చేయుచున్నాడని అనుకోను కాలము వచ్చుచున్నది..

4) క్రైస్తవులైన మనము సమాజానికి నిజ నిజాలు చెప్పవలసిన భాద్యత ఉన్నది. దేవుడు ఈ దేహాన్ని ఇచ్చాడు. ఇచ్చిన ఈ దేహాన్ని ఎందుకు కొరకు వాడాలో,ఎలా వాడాలో చెప్పకుండా ఎందుకు ఉంటాడు?? roma 6:12-మీ శరీరము నందు పాపము ఎలనియ్యకుడి.మరియు మీ అవయవాలు దుర్నితి సాధనాములుగా( ఆయుధాములుగా) పాపమునకు అప్పగింపకుడి...... . మీ అవయవాలు నీతి సాధనాములుగా( ఆయుధాములుగా) దేవునికి అప్పగించుడి. అనగా మన దేహమందు పాపము ఎలనియ్యకుండా,దుర్నితి సాధనాములుగా వాడక నీతి సాధనాములుగా దేహాన్ని దేవునికి అప్పగించాలి అని అర్థము. కనుక మన అవయవాలు నీతి? దుర్నితికి ఉపయోగిస్తున్నమా???నీతి అనగా వాక్యము.వాక్యము కోసము ,దేవుని కోసము ఎవరు శరీర అవయవాలను use చేస్తున్నారు??? కనుక నీతి సాధనాములుగ మన శరిరాలను దేవునికి అప్పగించుకోవాలి. roma 12:1- సజీవ యగాముగా మీ శరీరాలను దేవునికి సమర్పించుకోనుడి. సజీవ యగాముగా అనగా బ్రతికిఉండగా,అవయవాలలో శక్తీ ఉండగా,శరీరము ఆరోగ్యముగా ఉండగా అని అర్థము.అవయవాలు బాగుండి,ఆరోగ్యము బాగుండి,శక్తీ ఉన్నపుడు దేవుని కోసము సమర్పించకుండా ముసలి దశలో ,వృద్దాప్య దశలో వచ్చిన తరువాత అప్పుడు దేవుని కొరకు ఏమి చేయగలము?ఎక్కడికి వేళ్ళగలము? ఏమి మాట్లాడగలము?? నిజముగా దేవుని కొరకు బ్రతకవలసిన సమయము ఇదే .మనలో ఉన్న ప్రతి part దేవుని పని కొరకు,దేవుని పనిలో ఉపయోగపడాలి.

5) మనకు దేహము ఇచ్చినట్లుగా తండ్రి ఏసుక్రీస్తుకు కూడా ఇచ్చాడు.ఇదే దేహముతో ఈ లోకానికి వచ్చిన యేసు దేహము ఎందుకొరకో అన్న విషయము గూర్చి తండ్రితో మాట్లాడుతున్నాడు. హెబ్రీ 10:5- లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగు చెప్పుచున్నాడు. బలియు ,అర్పనయు నీవూ కోరలేదు గాని, నాకొక శరీరము అమర్చితివి ........ దేవా “ ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని...అనేక మంది యేసు పుట్టాడు అంటున్నారు.యేసు ఎప్పుడో ఈ సృష్టి పుట్టకముందే పరలోకములో పుట్టాడు. అది నుంచి తండ్రి దగ్గర పరలోకములో ఉన్నాడు. birthday అనగా delivary date అని అర్థము. అనగా తల్లి గర్భము నుండి ఈ భూమి మీదకు వచ్చిన రోజు అని అర్థము.తల్లి గర్భములో భయటకు రాకముందు 9 months లోపలే ఉన్నాము. మన పుట్ట్టుకే మనకు సరిగా తెలియకపోతే మరి యేసు పుట్టుక దినముగా చేస్తామా??date of birth అనగా day,month,year ఉంటుంది కానీ యేసుకు day,month ఉంది కానీ year లేదు. నాకొక శరీరము అమర్చితివి అంటున్నాడు. నిజముగా మన శరీరము గొప్ప అమరిక చేయబడింది. ఆదాము నుండి ఇప్పటి వరకు కొన్ని కోట్ల మందిని అమర్చాడు. దేవుని అమర్చిన విధానము,నైపుణ్యత ఆలోచిస్తే దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తుంది.ఇన్ని కోట్ల మందిని అమర్చిన ఎవరికీ ఈ పోలిక ఉండదు కానీ అందరికి అవయవాలు స్థానాలు ఒకేదగ్గర ఉంటాయి ..
ఒకరికి పోలికగా గా మరొకరు ఉండరు. ఒకటే ear,nose.ears,ips etccc కానీ వేరుగా identify చేయగలము. దేవా “ ని చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చియున్నానంటిని అని అంటున్నాడు. అనగా యేసు మనలాంటి దేహముతో వచ్చి తండ్రియైన దేవుని చిత్తమును నెరవేర్చాడు. ఈ దేహము తండ్రి చిత్తము నెరవేర్చటానికి ఇచ్చాడు. కనుక దేవుడు ఇచ్చిన దేహాన్ని దేవుని చిత్తానికి ఉపయోగిస్తావా లేక స్వచిత్తానికి ఉపయోగిస్తావా?? ఒకసారి ఆలోచించండి. దేవుని చిత్తము – పరలోక తండ్రి యొక్క మనస్సును,భావాలను తెలుసుకుని,మన జీవితాలలో అలవరుచుకుని మొరోకరికి ప్రకటించడమే.యేసు తన దేహాన్ని తండ్రి చిత్తమును నెరవేర్చడానికి పెట్టాడు. యేసు దేహాన్ని అర్పనముగా పెట్టి మన ఆత్మలను రక్షించి ఆత్మల రక్షకుడు అయ్యాడు. యేసు తన దేహాన్ని ప్రపంచాని కోసము పెట్టాడు అందరిని రక్షించాలని ,కాపాడాలని. యేసు ను నమ్మిన మనము మనము ధరించుకున్న ఈ దేహమును దేవునికి ఉపయోగించాలి. 1 john 3:16- అయన ( యేసు) మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీనివలన ప్రేమ ఎట్టిదని తెలిసికోనుచున్నాను. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్దులమై ఉన్నాము.

6) యేసుక్రీస్తు మన నిమిత్తము తన ప్రాణము పెట్టాడు కానీ ఎవరి ప్రాణము తీయలేదు.అయన అనేక ప్రాణులను రక్షించటానికి తన ప్రాణాన్ని పెట్టాడు. యేసు మన కొరకు ప్రాణము పెట్టి ఆత్మ రక్షకుడు అయ్యాడు. మనము కూడా మన సహోదరుల రక్షణ కొరకు ప్రాణము పెట్టి ఆత్మ రక్షకులు అవ్వాలి.

7) 1 peter 4:18-నితిమంతుడే రక్షింపబడుటకు దుర్లబము అయితే మరి భక్తిహినుడును,పాపియు ఎక్కడ నిలుతురు??? అనగా క్రైస్తవుడీకే రక్షణ లేదంటే ఇంకా మిగతా వారి సంగతి ఏంటి?baptism పొంది రక్షణలోనికి వచ్చిన నటి నుండి నేక మందిని రక్షించటానికి నడుము కట్టి సమాజానికి వెళ్లి వాక్యము చెప్పవలసిన క్రైస్తవులే రక్షింపబడటము అసాధ్యము అయితే ఈ సమాజములో ఉన్న మిగతా వారి పరిస్థితి ఏంటి? వీరిని ఎవరు రక్షిస్తారు?వారములోని sunday ఒక్కరోజున churchకి వెళ్లి వస్తే క్రైస్తవుడిగా పని అయిపొయింది అని అనుకుంటే ఈ సమాజాన్ని ఎవరు బాగు చేస్తారు?? నాశనానికి వెళ్ళేవారిని ఎవరు రక్షిస్తారు?
8) కనుక మనము ఆత్మ రక్షకుడిగా కదలాలి. ఆత్మకు చావులేదు .చనిపోయిన వెంటనే ఉండబోయే శాశ్వతమైన నిత్యజివమైన లేక నరకమైన వెళ్ళాలి



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget