Halloween Costume ideas 2015

Manishi Chesina Tappu - Pakruthi valana Muppu

మనిషి చేసిన తప్పు- ప్రకృతి వలన ముప్పు

మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. 1) భూమి మీద మానవ అవిర్భాము జరిగి కొన్ని వేల సంవత్సరాలు అవుతున్న మనిషికి ఇప్పటికి అంతు చిక్కనిది తన కళ్ళముందు ఉన్న ప్రకృతి నిర్మాణం. ప్రకృతి అనగానే కేవలం మన కళ్ళకు కనబడుతున్నవే కాక కనిపించనివి కూడా ఉన్నవి. ప్రారంభము నుండి ఇప్పటి వరకు మనిషికున్న తన మేధా సంపత్తితో ప్రకృతిని బట్టి అలోచించి శాస్త్రాలను పుట్టించిన చివరికి వాతావరణంలో కలుగుతున్న మార్పులను, ప్రకృతి వైపరిత్యాలను గుర్చిన వివరణ లేదు. ఒక భూకంపాల గూర్చి కానీ, సునామీల గూర్చి కానీ, ప్రళయాల గూర్చి కానీ ఇలా వాతావరణ పరిస్థితుల పై గూర్చి అంతు చిక్కకుండా ఎప్పుడు ,ఏమి ,ఎలా జరుగుతుందోనన్నభయముతో మనిషి ఉన్నాడు.
2) ప్రకృతిలో ఏదైనా విపత్తు సంభవిస్తే దాని వెనుక కారణాలు ప్రకృతిలో వెతికితే దొరకవు. ఈ రోజు ప్రకృతి నుండి వచ్చే ప్రతి ముప్పుకు కారణం మనిషి చేస్తున్న తప్పుడు కార్యక్రమలేనన్న సంగతి బైబిల్లో ఉన్న దేవుని మాటలను బట్టి అర్థమవుతుంది. ఈ రోజు పంచభూతాలు అని పిలుచుకుంటున్న గాలి, నీరు, నింగి,నేల & నిప్పు ఇవన్ని ప్రారంభములో దేవుడు కలిగించినప్పుడు ఎంత చక్కగా ఉన్నవో బైబిల్ లోని మాటల ద్వార అర్థమవుతుంది. మనిషి భూమి మీదకు రాబోతున్నాడని దేవుడు అలోచించి అందమైన ప్రకృతిని కలిగించి, ప్రకృతిలో పంచభూతాలను మనిషికి సిద్దపరచి ఇచ్చాడు. అనగా ప్రకృతి రారాజుగా మనం ఉండాలనే కోరిక దేవునికి ఉండేది. అందుకే ప్రారంభములో మనిషి వచ్చిన తొలి రోజులలో ప్రకృతి అంత చాలా బాగుండేది. ఆదికాండ 1:31- దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు ఆది చాలా మంచిదిగా ఉండెను.
3) అయితే అప్పటిలో బాగున్న ప్రకృతి ఎందుకు ఇలా భయంకరముగా మారిపోయింది? ప్రకృతి నుండి మనిషికి ఎందుకు ముప్పు వస్తుంది? మనo బ్రతకడానికి దేవుడు ప్రకృతిని కలిగిస్తే నేడు మనిషిని చంపడానికి త్వరపడుటకు కారణాలు తెలియాలి. ఒక్కొక్కటిగా చూద్దాము.
నీరు:
ఆదికాండం 2:6-ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను. నేల ఎంతగా తడిస్తే అంతగా మంచి వర్షంగా మనం గుర్తిస్తాము.. ఈ రోజు వర్షము కురుస్తుంది అంటే దేవుని దయనే. వర్షమే లేకుంటే పాడిపంటలు ఉండవు. పంటలే లేకపోతే ఆహారమే లేదు. ఆహారమే లేకపోతే అస్సలు ఈ భూమి మీద మానవ మనుగడే ఉండదు. ప్రారంభములో దేవుడు వర్షానికి ఒక క్రమాన్ని బెట్టి రాబోతున్న కోటాను కోట్ల మందికి ఆహారం పండే గుణాన్ని భూమికి పెట్టాడు. విత్తనాలు విత్తితే వాటిని మోలిపించి చివరికి దేవుడు మనకు ఆహారమును ఇస్తున్నాడు. అనగా మొదటిలో కురిసిన వర్షం మనిషికి చాలా ఉపయోగకరముగా ఉండేది. మరి ఇప్పుడు కురుస్తున్న వర్షమును ఆలోచిస్తే ఒక్కసారి వర్షం మొదలయితే ఆనందపడుతున్నామా లేక భయపడుతున్నామా? వింతైన తుఫానుల బట్టి భయం వేస్తుంది. అనగా ప్రారంభములో కురుస్తున్న వర్షాలు వేరు & ఇప్పుడు కురుస్తున్న వర్షాలు వేరు.
నేడు తుఫాను సంభవిస్తే ఎన్ని రోజులు ఉంటుందోనన్న భయం కలుగుతుంది. తుఫాను వలన వేగంగా వీచే గాలి వలన ఏమౌతుందోనన్న భయం కలుగుతుంది. ప్రారంభములో లేని భయం నేడు మనిషిని ఎందుకు కలుగుతుంది? ఒకప్పుడు వర్షం నేలను తడిపింది కానీ నేడు వర్షం పడితే నేల తడవడం కాక ఏకంగా పంటలు మునుగిపోతున్నాయి. అనగా వర్షములో మార్పు మనకు కనబడుతుంది. యెహేజ్కేలు 13:13- యెహోవా సెలవిచ్చునదేమనగా నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగోట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరుచును.
దేవుడు ప్రేమిస్తే నేల తడుస్తుంది & దేవునికి కోపం వస్తే ప్రవాహం వస్తుంది . అనగా దేవుడు ప్రేమిస్తే దయ కలిగిన వర్షాన్ని కురిపిస్తాడు, పంటలు పండించి కడుపు నింపుతాడు అలానే దేవునికి కోపం వస్తే ప్రవాహాలను రప్పించి పంటలను మునిగేటట్టు చేస్తాడు. నేలను తడపవలసిన వర్షం ఎందుకు ప్రవాహముగా కురుస్తుందో అని, నీరు ఉప్పెనలా సునామీలా ఎందుకు మారుతుందో అని ఆలోచించాలి.
పై వివరణ బట్టి ప్రారంభములో ప్రకృతి బాగుండినట్టుగా, ఆ తర్వాత కాలాలలో ప్రకృతి నుండి మార్పు వచ్చినట్టుగా అర్థమవుతుంది.
సుర్య వ్యవస్థ:
ఆదికాండ 1:15,16- భూమి మీద వెలుగు ఇచ్చుటకు అవి( సూర్యుడు,చంద్రుడు) ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాక అని పలికెను. అనగా పగటిని ఎలుటకు సుర్యుడను, రాత్రిని ఎలుటకు చంద్రుడను దేవుడు కలిగించెను. అయితే వెలుగును ఇవ్వటానికి దేవుడు సూర్యుడిని కలుగజేస్తే ఆ తర్వాత కాలాలలో సూర్య వ్యవస్థలో మార్పులు వచ్చి నేడు వెలుగు పోయి వేడి భూమిని నింపుతుంది. వెలుగు ఇవ్వవలసిన సూర్యుడు ఎందుకు వేడిని ఇస్తున్నాడు? ప్రారంభములో దేవుడు వెలుగును ఇవ్వాలని కోరుకుంటే భూమి మీదకు వచ్చిన మనిషిని చల్లగా చూడవలసిన సూర్యుడు మనల్ని ఎందుకు వేడితో మడ్చేస్తున్నాడు??
ప్రకటన 16:8- నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుష్యులను ఆగ్నితో కాల్చుటకు సూర్యునికి అదికారము ఇయ్యబడెను. ప్రారంభములో వెలుగును ఇవ్వాలని సూర్యునికి అధికారం ఇస్తే ప్రకటన గ్రంధముకు వచ్చే సరికి అగ్నితో కాల్చుటకు అధికారం ఇస్తున్నాడు.
ప్రారంభములో ప్రకృతిని గూర్చి బాగుందన్న దేవుడు ఆ తర్వాత కాలములో ప్రకృతిలో విపరీతమైన మార్పులు కన్పిస్తున్నాయి. వెలుగు ఇవ్వవలసిన సూర్యుడు ఎందుకు వేడిని ఇస్తున్నాడని ఆలోచించాలి.
గాలి:
గాలి అనగానే ప్రాణ వాయువు అని మనకు గుర్తుకు వస్తుంది. గాలిని పీల్చుకుని వదిలే వ్యవస్థను మన శరీరములో పెట్టాడు. దేవుడు గాలిలో ప్రాణ వాయువుని ఉంచి మనలను దిన దినము ప్రాణాలతో ఉంచుతున్నాడు.యిర్మియా 23:19-ఇదిగో యెహోవా యొక్క మహోగ్రత యను పెనుగాలి బయలు వెళ్ళుచున్నది.అది భీకరమైన పెనుగాలి . అది దుష్టుల తల మీదకు పెళ్లున దిగును. ఆనగా గాలి పెనుగాలిలా ఎందుకు మారుతుంది అని ఆలోచించాలి.
నేల:
యోబు 37:12- నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద... అపోకర్య 17:26- యావద్భుమి మీద కాపురముండుటకు అయన( దేవుడు) యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి.... అనగా భుమి మీద కాపురము ఉండాలన్నదే దేవుని కోరిక. తన పిల్లలు తాను కలిగించిన ఈ భూమిలో చక్కగా బ్రతకాలని అనుకున్నాడు. బ్రతుకునిచ్చే ఈ నేల నేడు భూకంపాల పేరట మనిషిని హతమర్చేస్తుంది ఎందుకు? భూకంపంతో భూమి ఒక్కసారిగా కదులుతుంది. మనం బ్రతకడానికి ఉండవలసిన భూమి కదలి ఎందుకు మనిషిని చంపుతుంది?ఒక్క నిమిషం భూమి కదలితే ఇంతగా విపత్తు & లక్షల కిలోమీటర్ వేగంతో భూమి తిరుగుతున్నపుడు మనకు ఏమి అనిపించడం అంటే అర్చర్యముగా ఉన్నదీ కదూ.. మన కొరకు భూమి ఇంత వేగంగా తిరుగుతున్న మనకు ఏమి అవ్వటం లేదు కానీ ఒక్క నిమిషంలో కొన్ని సెకండ్స్ కదిలితే ?
పంచ భూతాల నుండి మనిషికి ప్రమాదం పొంచి ఉందన్న సంగతులు పై మాటలను బట్టి అర్థమవుతుంది.
ఆకాశం:
ఆకాశం నుండి కూడ మనషికి ప్రమాదాలు ఉన్నాయి. వర్షాకాలములో ఉరుములు,మెరుపులు వస్తున్నప్పుడు పిడుగులు పడుతాయి. కీర్తనలు 147:17- ముక్క ముక్కలుగా వడగండ్లు విసరువాడు ఆయనే. అయన పుట్టించు చలికి ఎవరు నిలువగలరు??
4) ఎందుకు దేవుడు ఈ ప్రకృతిని విక్రుతముగా మర్చి మనిషిపైకి గురి పెట్టాడు? ప్రారంభములో అన్ని బాగా చేసిన దేవుడు ఆ తర్వాత కాలములో అన్నింటిని ఎందుకు మార్చినట్టు?ప్రారంభములో ఈ ప్రకృతిని మనకు అనుకూలముగా చేసాడు కదా మరి ఇప్పుడు ఎందుకు ప్రతి కులముగా మారిపోయింది? తప్పు ఎవరిది? ప్రకృతి నుండి ముప్పు వస్తుంది అంటే ప్రకృతిది తప్పా లేక ప్రకృతిలో ఉంటున్న మనిషిది తప్పా? ఎందుకు మనిషి మీదకు ప్రకృతి ఎదురు తిరుగుతుందో, ఎందుకు ప్రకృతి వలన ముప్పు కలుగుతుందో అని బైబిల్ నుండి ఆలోచిస్తే ఆదికాండ 3:17,18- అయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమ్మితము నేల శపింపబడియున్నది..... దేవుని మాటను మీరుట వలన ప్రకృతిలో సమస్యలను మొదలు పెట్టాడు. మనిషి చేసిన పాపం వలనే ప్రకృతి సమస్యగా మారింది.
5) ఆ రోజు నుంచి నేటివరకు పాపం ఏమన్నా తగ్గింది అంటారా? లేదు. కయ్యిను తన తమ్ముడైన హేబెలును చంపాడు. నోవాహు కాలము రాగానే నోవాహు కుటుంబము తప్ప అందరు పాపములో మునిగిపోయారు. సోదోమ గోమ్మర్ర నాశనం. పౌలు కాలము వచ్చేసరికి ఎఫేసి 5:15- దినములు చెడ్డవి గనుక.... అనగా దినములే చెడ్డవి అన్నాడు. క్రీస్తు రాక ముందు, క్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత పాపం ఎక్కువైనది. 11 తిమోతి 3:1 నుండి – సూపర్ మార్కెట్ లోకి వెళ్తే అన్ని ఎలాగు దొరుకుతాయో అలానే పై చెప్పబడిన దుర్గుణాలు మనిషిలో కనబడుతున్నాయి. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన పాపం మాత్రం ఇప్పటికి అలానే ఉన్నదీ. యేసుక్రీస్తు పాపాలను తీసివేయుటకు వచ్చిన ఆయనను సిలువకూ అప్పగించేసారు కానీ పాపాన్ని మాత్రం మనిషి చేయడం మానలేదు.
6) నేడు సమాజములో జరుగుతున్న విషయాలను బట్టి మనిషి ఎంత భయంకరముగా మారిపోయాడో తెలుస్తుంది. ఇలా ఇష్టానుసారముగా దేవునిని లెక్క చేయక జీవిస్తూ ఉంటె దేవుడు సహించడు. మారని మనిషి కొరకు ఎందుకు ప్రకృతి సహకరించాలి?మనిషితో మాట్లాడడం మానేసిన దేవుడు ప్రకృతితో మాట్లాడటం మొదలు పెట్టాడు. యెషయా 1:2- యెహోవా మాటలడుచున్నాడు ఆకాశమా ,ఆలకించుము;భూమి చెవియోగ్గుము. నేను పిల్లలను పెంచి గోప్పవారినిగా చేసితిని వారు నా మీద తిరుగబడియున్నారు. అనగా తప్పుడువాడిగా మారిపోయిన మనిషికి దేవుడంటే ఇష్టంలేనివాడిగా ,భయం లేని వాడిగా, భక్తి లేని వాడిగా మారిపోయి చివరికి దేవుని మీదకు ఎదురు తిరిగితే ప్రకృతి కన్నెర చేయదా? కీర్తనలు 7:11- ప్రతి దినము కోపపడు దేవుడు. నేడు సమాజములో జరుగుతున్న క్రియలు ద్వార దేవుడు ప్రతి దినము కోపపడుతున్నాడు.
7) మనిషి దేవుని మాట వింటే మనిషి మాటను ప్రకృతి వింటుంది.మనిషే దేవునికి ఎదురు తిరిగితే ప్రకృతి కూడా మనషికి ఎదురు తిరుగుతుంది. అందుకే గాలి ఎదురు తిరిగి సుడిగాలిగా పెనుగాలిగా మారిపోయింది, వెలుగునిచ్చే సూర్యుడు వేడినిచ్చే వాడిగా మారిపోయింది, నేలను తడపే వర్షం తుఫానుగా మారిపోయింది,సముద్రములో ఉండవలసిన నీరు సునామీగా విరుచుకు పడుతుంది.
8) తుఫాను పట్టింది అనగానే మనకు అర్థం అవ్వాల్సింది దేవుని కోపం మొదలు అయింది అని. దేవునికి కావాల్సింది మనిషి మారాలని. ఎప్పుడైతే మనిషి మారుతాడో అప్పుడు ప్రకృతి కూడా అనుకూలముగా మారుతుంది. మనిషి మారనప్పుడు ప్రకృతి ఎందుకు మారకుండా ఉంటుంది? దేవుని వాక్యాన్ని సమాజానికి ప్రకటిస్తే మనిషి మారుతాడు. మనిషి మార్పు జీవితములో ఉండాలి. మనిషి దేవునివైపు మళ్ళాలి.ఎప్పుడైతే మనిషి దేవుని వైపు మళ్ళుతాడో ప్రకృతి కూడ మనిషి మాట వింటుంది, మనిషికి లోబడుతుంది. లేకపోతే మనిషి దేవునికి ఎదురుతిరిగితే ప్రకృతి కూడా మనిషికి ఎదురు తిరుగుతుంది.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget