Halloween Costume ideas 2015

Yesu lekunte Papamu Podha?

యేసే లేకుంటే పాపమే పోదా?
 శాస్త్రవేత్తల అంచనాల మేరకు ఈ సృష్టి

మన పాపాలనుండి రక్షించుటకు ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.
1) మన భారత దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఆనాడు ఎంతో మంది తమ ప్రాణాల సైతం త్యాగం చేసారన్న విషయం మనకు తెలుసు. 1947 వరకు మన భారతియులు అందరు britishers వారి క్రింది బానిసగా బ్రతికేవారు. వీరి బానిసత్వం నుండి భారత దేశ ప్రజలను విడిపించడానికి గాంధీ ,ఇంకా అనేకమంది తమ ప్రాణాన్ని కూడా అర్పించారని చరిత్ర చెబుతుంది. అనగా భారత దేశానికీ స్వాతంత్రం తీసుకురావటానికి ఎంతో మంది మహానుభావులు తమ ప్రాణాలను అర్పించారు .
ఇది ఎంత వాస్తవమో ప్రపంచ ప్రజలందరు ఇప్పటికి పాపం అనే బానిసత్వం క్రింద బ్రతుకుతున్నారు. ఆదాము మొదలుకుని ఇప్పటివరకు ఎంతమంది పుట్టి చనిపోయారో,ప్రస్తుతం ఎంత మంది బ్రతికియున్నారో అందరు పాపం అనే బానిసత్వం క్రింద బ్రతుకుతున్నారు.

2) వీరిని విడిపించాలి. ఎందుకంటే ఈ సృష్టి పుట్టక ముందే ఒక అద్బుతమైన ఆలోచన దేవుడు కలిగియున్నాడు. ఎఫేసి1:4,6-తన ప్రియునియందు తాను ఉచితముగా మనక అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున ,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వికరించుటకై,మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని ,మనం తన యెదుట పరిశుద్దులుగా,నిర్దోషులుగా యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ,ప్రేమ చేత అయన క్రిస్తులో మనలను ఏర్పరుచుకోనేను. అనగా సృష్టి or విశ్వం or జగత్తు వేయబడకముందే మనలను తన కోసము నిర్ణయించుకున్నాడు. శాస్త్రవేత్తల అంచనాల మేరకు ఈ సృష్టి పుట్టి సుమారు 1500 crores years. అనగా మనం కావాలనే కోరిక దేవునికి 1500 crores years ముందే కలిగింది. ముఖ్యముగా మనం దేవుని యెదుట పరిశుద్దులుగా,నిర్దోషులుగా ఉండాలని ఏర్పరుచుకున్నాడు.
3) పరిశుద్దులు,నిర్దోషులు అన్న ఈ రెండు పదాలకు ఒకటే అర్థం వచ్చినట్లు అనిపిస్తుంది .దేవుని ఆలోచనలలో,దేవుని భావములో,మనస్సులో , మాటలో వ్రాయబడిన పదాలకు మనం అనుకునే అర్థాలు సరిపోవు.
(a) పరిశుద్దుడు--- దేవుడు మాట్లాడుతూ నేను పరిశుద్దుడను అని అన్నాడు. పరలోకమందున్న దేవ దూతలు దేవునిని యెహోవా పరిశుద్దుడు పరిశుద్దుడు అని నిత్యం స్తుతిస్తున్నాయి. అంటే దేవుడు యొక్క లక్షణం పరిశుద్దుడు. ఇంతకు దేవుడు ఎవరు? యోహాను 4:26-దేవుడు ఆత్మ. దేవుని పోలిక ఒక ఆత్మ. అంటే దేవుడు ఆత్మ అయితే ఆ ఆత్మయైన దేవుడు నేను పరిశుద్దుడు అని అంటున్నాడు. పరిశుద్దత అనే పదం ఆత్మకు వర్తిస్తుంది.మనిషి అనగా కనబడే శరీరంతో,కనబడని ఆత్మల కలయికతో ఉంటాడు. అనగా పరిశుద్దత అన్నది ఆత్మకు సంభందించినది
(b) నిర్దోషం--- వాస్తవముగా దోషి and నిర్దోషి అన్న రెండు పదాలు కోర్ట్ లో వింటాం. courtలో ఒక వ్యక్తి చేసిన తప్పుకు వాదోపవాదాలు జరిగి చివరికి దోషి or నిర్దోషిగా తీర్పునిస్తారు. కోర్ట్ ఆత్మను శిక్షించలేదు కానీ శరీరానికి శిక్ష విదిస్తుంది. శరీరంతో చేసే తప్పులను బట్టి నేరంగా పరిగణిస్తారు. అనగా శరీరంతో చేసిన నేరం రుజువైతే దోషిగా , శరీరంతో చేసిన నేరం రుజువు కాకపోతే నిర్దోషి అంటారు. 4) అంటే నిర్దోషత్వం అన్నది శరీరానికి సంభంధమైనది .పరిశుద్దత అన్నది ఆత్మకు సంభందమైనది. అనగా శరీరం,ఆత్మల కలయికతో ఉన్న మనలను దేవుడు తన యెదుట పరిశుద్దులుగా,నిర్దోషిగా ఉండాలని అనుకున్నాడు. ఈ కోరిక సృష్టి పుట్టాక ముందే కలిగింది. ఆత్మ and శరీరం నిష్కలంకముగా తన యెదుట నిలువబడాలని దేవుని కోరిక. 11 కోరంది 7:1-శరిరమునకును,అత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసికొందము. అనగా అత్మకును,శరీరానికి కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా ప్రతి మనిషి మారాలన్నది దేవుని కోరిక.
5) తల్లి గర్భం నుండి శరీరం ,ఆత్మల కలయికతో ఒక పరిపుర్ణమైన ఆకారం భయటకు వస్తుంది. తండ్రి నుండి తల్లిలోకి ఒక జివ కణం ప్రవేశిస్తుంది.ఆ కణం తల్లి గర్భంలో ప్రవేశించి తల్లి గర్భములో ఆకారం ఏర్పడుతుంది. పుట్టిన బాబుకి ఏ కల్మషం అన్న తెలుసా?? లేదు.పుట్టిన బిడ్డ పుట్టినది మొదలుకుని లోక జ్ఞానం తెలిసేంత వరకు or మంచి చెడులు గ్రహించేంత వరకు పరిశుద్దుడే.. ఎప్పుడైతే లోక జ్ఞానం తెలిసిందో,లోకంలో మంచి,చెడు తెలిసిందో వెంటనే మనిషిలో ఉన్న శరీరం,ఆత్మ మలినమైపోతుంది. అనగా ఈ లోకంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు తల్లి గర్భంలో ఎంత పరిశుద్దముగా వచ్చారో అంతే పరిశుద్దముగా తండ్రియైన దేవుని యెదుట నిలువబడలి.
6) తల్లి గర్భములో ఎలా అయితే మొదట పరిశుద్దముగా వచ్చిందో అంతే పరిశుద్దముగా స్వీకరిస్తాడు. తల్లి గర్భము నుంచి ఎంత నిర్దోషంగా శరీరం వచ్చిందో అంతే నిర్దోషముగా స్వీకరిస్తాడు.. example::::: పెళ్లిళ్లకు,శుబకర్యలకు పాత్రలు,కుర్చీలు తెస్తాము shop నుంచి. ఇప్పుడు తెచ్చిన వాటినన్ని సొట్టలు పెట్టి తిరిగి ఇస్తే తీసుకుంటాడా??? లేదు. అంటే తెచ్చిన పాత్రలు ఎలా తెచ్చమో తిరిగి ఆ విధముగా అప్పగిస్తే కానీ తీసుకోనప్పుడు తల్లి గర్భంలో నుంచి పరిశుద్దమైన ఆత్మగా,నిర్దోషమైన శరిరంగా ఈ లోకానికి దేవుడు పంపిస్తే సమస్త కల్మషాలు అంటించుకుని, సమస్త పాపలతో మలినమైతే తండ్రి!!!!!! నన్ను చేర్చుకో అంటే చేర్చుకుంటాడా??? లేదు.
7) ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి పాపంతో నిండియున్నాడు. british వారి బానిసత్వం నుండి విదీన్చదనికి ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల మనకు స్వాత్రంత్రం వచ్చింది అని అంగీకరిస్తే మరి ప్రపంచ ప్రజలందరి పాపాలను or పాపం అనే బానిసత్వం క్రింద నున్న మనకను విడిపించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. 1తిమోతి 1:15-పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను.. ఆ ప్రపంచం శరీర రోగాలనే గుర్తిస్తుంది కానీ ఆత్మకు రోగంయాన పాపాన్ని గుర్తించలేదు. అందుకే ఈ రోగంతో ఉండి చివరికి మనుష్యులందరు నరకాని వెళ్ళిపోతున్నారు. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి మంది మాట ద్వారా, చూపు ద్వారా, ఆలోచన ద్వారా ,క్రియల ద్వారానో ఏదో ఒక రీతిగా ప్రతి రోజు పాపం చేస్తున్నే ఉన్నాడు. మరి చేస్తున్న పాపాల నుండి ఎవరు విడుదల చేస్తారా? పాపం అనే భానిసత్వం క్రంద నున్న మనల్ని విడిపించడానికి ఒక మహానుబావుడు ఈ లోకానికి రావాలి. ఆయనే యేసుక్రీస్తు.
8) చనిపోయిన తర్వాత ఏమి జరుగుతుందో మనుషులకు తెలియదు గనుక చచ్చిపోయిన ప్రతి ఒక్కరు స్వర్గం వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారే కానీ చచ్చిపోయిన ప్రతి ఒక్కరు నరకానికి జారిపోతున్నారన్న సంగతి ప్రపంచం గుర్తించడం లేదు. ఈ రోజు పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని చెభుతుంటే క్రీస్తును నమ్మని అన్యజనాంగం అంత అడిగే ప్రశ్న “” నేను ఏమి పాపమూ చేయలేదు గనుక నాకు యేసు అవసరం లేదు అంటున్నారు. మనుష్యులు అనుకున్న పాపాలు చూస్తే దొంగతనం,వ్యబిచారం,లంచం,హత్య, హత్యాచారం ఇలా .......... ఇవే పాపాలు అని నిర్ణయించుకుని ఏమి ఇలాంటి పాపాలు మేము చేయలేదు కనుక మాకు యేసు అవసరం లేదు అని అంటున్నారు. వీటి అన్నిటికంటే ఘోరమైన పాపం దేవుడు ఒక్కడే అన్న సంగతి నమ్మకపోవడము. ప్రపంచ ప్రజలందరు చేస్తున్న పాపం ఇది. దేవుడు ఒక్కడే అంటే నమ్మడం లేదు, ఒప్పుకోవడం లేదు.
9) మన భారత దేశములో ముక్కోటి దేవుళ్ళు ఉన్నారట. అనగా ఉన్న 100 కోట్ల జనాభాలో 3 కోట్ల మంది దేవుళ్ళే అంట. ఒక familyకీ ఒక్కడే తండ్రి ఉంటే బాగుంటుంది. కానీ ఒక familyలో తల్లి ఒకటి ఉండి నలుగురు తండ్రులు ఉంటే ఎంత అసహ్యముగా ఉంటుంది???? ఒక familyలో ఒక తండ్రి ఉండడం ఎంత న్యాయమో అలానే ప్రపంచ ప్రజలందరికీ ఒక్కడే తండ్రియైన దేవుడు ఒక్కడే ఉండాలన్నది దేవుడు నిర్ణయించిన న్యాయం. ప్రపంచ ప్రజలందరు తండ్రియైన్ దేవుడు ఒక్కడే అన్న సంగతి ప్రపంచ ప్రజలు నమ్మకపోవడం వారు చేస్తున్న ఘోరమైన పాపం. దేవుడిని నమ్మకపోవడం మొదటి పాపమైతే and ఆ దేవుడే తమ ప్రియ కుమారుడైన యేసునీ ఈ లోకానికి మన పాపాల నుండి రక్షించడానికి పంపించాడు అని నమ్మకపోవడం రెండోవ తప్పు. తప్పు చేస్తున్న వీరిని ఎవరు కాపాడుతారు??? ఎలా వీళ్ళను మరలా తన యెదుట పరిశుద్దులుగా,నిర్దోషులుగా నిలువబెట్టాలి? దేవుడు ముందుగా అలోచించి తగిన కాలమందు తన కుమారునిని ఈ లోకానికి పంపించాడు. అంటే యేసుక్రీస్తు లేకుంటే ఈ ప్రపంచం అంత నరకానికే పోతుంది.
10) యోహాను 3:16-దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా అయన తన ఆద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. అనగ ఏ ఒక్కరు నశించిపోకూడదని అయన తన ప్రియకుమరుడైన యేసుక్రీస్తును విశ్వసించిన ప్రతి వాడు పరలోకం రావాలని దేవుడు ఈ ప్రపంచానికి క్రీస్తును పంపించాడు. ఎంత గొప్ప ప్రణాళికను దేవుడు కలిగియున్నాడో ఇంత వరకు తెలుసుకున్నాం.. క్రీస్తు ఈ లోకానికి వచ్చింది మనుషుల పాపం అనే ఉబిలో నుండి వారిని రక్షించడానికి. చిన్న నటి నుండి ముసలి అయ్యే వరకు ప్రతి మనిషీ పాపిగానే బ్రతుకుతున్నాడు. ఎలాగైనా మనుష్యులను పరలోకానికి తీసుకెళ్ళడానికి యేసు రావాలని తండ్రి యేసును పంపించాడు. నిజముగా యేసు లేకుంటే పాపములో బ్రతికి చివరికి చనిపోయే వారము. యేసు రక వలన ఆయనను నమ్మడం ద్వారా అందరికి నిత్య జీవాన్ని ఇచ్చాడు.
11) యేసు అనగా ఒక మత స్థాపకుడిగా అనుకొనక పరలోకానికి ఒక మార్గదర్శిగా అనుకుని యేసును నమ్ముకుని విశ్వసించి యేసులా,యేసు వాలే ,యేసుకొరకై,యేసు కోసం బ్రతుకుదాం.




Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget