Halloween Costume ideas 2015

The secret to the production of human


దేవుడు చేసిన మానవ అకార నిర్మాణపు 

రహస్యములు గల సందేశము

దేవుడు చేసిన మానవ అకార నిర్మాణపు రహస్యములు గల సందేశము
ప్రభువు నామములో మీకు శుభములు తెలియజేస్తూన్నాను.
1) మానవ జన్మను గురించి ప్రపంచములో వ్రాయబడిన పుస్తకాల అన్నిటిలో కన్న శ్రేష్టమైనది ,సాక్షాత్తు దేవుడు మన గురించి వ్రాయించిన ఏకైక గ్రంధమైన bible లో చెప్పబడింది. scientists అయితే మనిషి కోతి నుండి వచ్చాడని, ఒకప్పుడు కోతులు మనుషులుగా మారిపోయారని చెప్తున్నాడు. మేధావులు కూడా ఏదో మనిషి పుడుతున్నాడు,బ్రతుకుతున్నాడు, చచ్చిపోతున్నాడు మరియు పుట్టుక ముందు ఏమి లేదు-మరణించిన తర్వాత ఏమి లేదు అని అంటున్నారు. మానవ జన్మ గురించి మనిషికి తెలియని మహా జ్ఞాన సంగతులు మన చేతులో ఉంటున్న bibleలోనే దేవుడు వ్రాయించాడు. మన చరిత్ర ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే భూమి మీద రాక ముందు తల్లి గర్భములో,తల్లి గర్భములో రాక ముందు తండ్రి గర్భములో,తండ్రి గర్భములో రాక ముందు మన పితరుల గర్భములో,ఒకప్పుడు ఆదాములో, అంతకంటే ముందు దేవునిలో పరలోకములో ఉన్నవారము మనము. అనగా పరలోకములో దేవుని నుండి మట్టి శరీరంలోకి వచ్చి ,ఆ తర్వాత మనుషుల ద్వారా ప్రయాణించి దేవుడు అనుకున్న రోజు ఈ భూమి మీదకు వచ్చాము.

2) పుట్టుక ముందు మన చరిత్ర దేవునిలో ఉన్న చరిత్ర. పరలోకములో ఉంటున్న మనం కొద్ది కాలం ఈ భూమి మీద దేవునికి ఇష్టకరముగా జీవించుటకు వచ్చాము. 6 days మనకు కావలసినది అన్ని సృష్టిలో కలిగించి,మనలని ఈ భూమి మీదకు పంపుట వెనుక గల ఉద్దేశము “” ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయాలనీ(ఎఫేసి 2:10). మనల్ని ఈ భూమి మీదకు పంపుతూ ఒక ఉద్దేశాన్ని కలిగియున్నాడు.అస్సలు మన జన్మ గురించి మొదట బాగా తెలియాలి.ఎందుకంటే ఈ చిన్న జీవితములో ఏదో తిని,త్రాగి చావాలనుకుంటూన్నాడే తప్ప దేవుడు మన గురించి ఏంత కష్టపడ్డాడని,ఏంత ఆలోచిస్తూన్నాడనే సంగతులు తెలిస్తే మనం అయన గురించి ఆలోచించడానికి ఇష్టపడుతాము.

3) యెషయ44:1,2- నిన్ను సృష్టించి,గర్భములో నిన్ను నిర్మించి, నీకు సహాయము చేయువాడైన యెహోవా...... ఒక కన్న తండ్రిగా నిన్ను కావాలనుకుని ,నీ కోసం నేను ఏంత కష్టపడ్డానో నీకు తెలియాలి అని ఈ మాట చెపుతున్నాడు దేవుడు.అప్పుడప్పుడు తల్లితండ్రులు వారి పిల్లలతో మేము ఏంత కష్టపడితే నువ్వు ఈ రోజు ఈ స్థితిలో ఉన్నావు అని చెప్తారు. వారు పడ్డ కష్టాన్ని పిల్లలకు తెలియజేస్తే మా తల్లితండ్రులు నా కోసము ఇంతగా కష్టపడ్డారు గనుక వాళ్ళు కోసము ఏమన్నా చేయాలన్న ఆలోచన వస్తుంది. అలానే పరలోకమందున్న తండ్రి కూడా తన పిల్లలకు తన కష్టాన్ని గూర్చి తెలియజేస్తున్న వచనము పై వచనమ. మానవ జన్మ యొక్క రహస్యాన్ని యెషయ44:1,2లో చెబుతున్నాడు. దేవుడు మన గురంచి పడిన కష్టాన్ని ఈ వచనములో చెప్తున్నాడు. ఈ రోజు చక్కటి మానవ ఆకారముతో ఉన్న మనిషికి ఈ ఆకారం ఎలా వచ్చిందో తెలియదు.తెలియదు కాబట్టి నాది నాది అనుకుంటూ తనకు ఇష్టమైనట్టు బ్రతకడానికి ఆలోచిస్తున్నాడు. 4) ఈ యెషయ44:1,2లో చెప్పబడినట్టుగా దేవుడు అస్సలు ఎలా సృష్టించాడు, ఎలా నిర్మించాడు,ఎలా సహాయము చేశాడు అన్న లోతులకు వెళ్దాము.ఒక్కొక్కటిగా ఆలోచిద్దాము. దేవుడు చెప్పిన ఈ సృష్టించుట,నిర్మించుట,సహాయము చేయుట అను మాటలు అర్థము కావాలి. ఎలా,ఎప్పడు,ఎక్కడ సృష్టించాడో,నిర్మించాడో,సహాయము చేసాడో చూద్దాము.

:::సృష్టించుట:::
(a)మనల్ని సృష్టించడం అంటే ఏంటి? ఎక్కడ ,ఎప్పుడు ,ఎలా సృష్టించబడ్డామో ఆలోచించాలి.గలతీ 1:15-తల్లి గర్భము నందు పడినది మొదలుకుని నన్ను ప్రత్యేకపరచి........ అంటే ప్రత్యేకపరుచుకున్నాడట. వాస్తవముగా ప్రత్యేకించబడిన వారే ఈ భూమి మీదకు వస్తారు. తల్లి గర్భములో పడ్డవారు అనేక మంది కానీ ప్రత్యేకింపబడిన వారు కొద్ది మందే. కోట్లను కోట్ల వీర్య కణాలు తల్లి గర్భాములోకి వెళ్తాయి కానీ తల్లి గర్భములో ఉన్న అండం ఒకే ఒక్క కణంనే స్వీకరిస్తుంది. ఆ స్వీకరించబడిన కణం నువ్వు. నువ్వు అనబడుతున్న కణం ఆ రోజు తల్లి అండంతో కలవకపోతే నువ్వు లేవు. తండ్రిలో నుంచి తల్లి లోనికి వెళ్ళుతున్న వీర్యకణాలు సుమారు 50 కోట్లు. 50 కోట్లలో ఒక్క కాణానివి నువ్వు. ఈ భూమి మీదకు రావడానికి ఏంత పోటి జరిగిందో ఆలోచించండి. 50 కోట్ల కణాలలో నిన్ను ప్రత్యేకపరిచి ,నిన్ను కావాలనుకున్నాడు దేవుడు. అప్పుడు సృష్టింపబడ్డావు.నువ్వు భూమి మీదకు వచ్చావంటే 50 కోట్ల కణాలలోనుంచి నిన్ను ప్రత్యేకపరచి సృష్టించుకున్నాడు. కేవలము నీవు తన కోసము కావాలని,తన కోసము బ్రతకాలని.

:::నిర్మించుట:::సహాయము చేయుట::::
(a) తల్లి గర్బము నుండి బయటకు రావాలంటే ఒక సరియైన ఆకారం ఉండాలి. నిన్ను సృష్టించిన తర్వాత దేవుడు తల్లి గర్భములో నీకు నిర్మాణం ఇవ్వడానికి ప్రారంభించాడు.అనగా ఒక మహా కట్టడాన్ని చేపట్టాడు. మానవ ఆకారము అనే మహా కట్టడాన్ని ప్రారంభించడానికి తల్లి గర్భము అనే క్రేంద్ర స్థానoలో ప్రారంభించాడు.నిన్ను సృష్టించక ఆకారం ఇవ్వడానికి మహా నిర్మాణాన్ని చేపట్టాడు.యోబు10:11చర్మముతోను,మంసముతోను నీవునన్నుకప్పితివి. ఎముకులతోను,నరములతోను నన్ను చేసితివి........అనగా మానవ అకార నిర్మాణానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము,మంసము, ఎముకులు,నరాలు.. నిర్మాణము అన్నాడు గనుక మన కళ్ళ ముందు ఉన్న నిర్మాణాలు ఆలోచిద్దాము. ఉదాహరణకు ఒక ఇంటి నిర్మాణాన్ని చెప్పటడానికి మనం స్థలము ఎంపిక చేసుకోవాలి. స్థలము తర్వాత house plan కావాలి. తర్వాత కావాల్సిన పదార్ధాలు అనగా పునాదులు వేయడానికి రాయి,cement,iron,water,sand ఇలా అన్ని కావాలి.పునాది వేసిన దగ్గర నుంచి slab వేసే వరకు పదార్ధాలు కావాలి. మానవ నిర్మాణము వీటితో కట్టితే కుదరదు కదా.....
(b) మనవునిని కట్టడానికి ఉపయోగించిన పదార్ధాలు చర్మము,మంసము, ఎముకులు,నరాలు. గర్భములో నిన్ను సృష్టించిన తర్వాత నిర్మించడానికి దేవుడు ఉపయోగిస్తున్న పదార్ధాలు ఇవన్ని.మానవ ఆకారము దేవుడు ఇస్తే దేవుడు చేస్తే,నిర్మిస్తే వచ్చింది. చర్మము లేకపోతే చూడలేము అని చర్మాన్ని మాంసపు ముద్డపై కప్పాడు. ఎముకులను మాంసము మధ్యలో దృడముగా ఉండడానికి పెట్టాడు. ఇల్లు కట్టేటప్పుడు iron rods పెట్టి pillarsకి కంకర cement వేస్తారు దృడముగా ఉండడానికి. తల్లి గర్భము అనే నిర్మాణ స్థలాన్ని ఎంచుకుని అక్కడ మాంసము మధ్యలో bones use చేశాడు. bones లేకపోతే మన ఆకారము ఒక మాంసపు ముద్దలా ఉంటుంది. bones లేకపోతే ఏ అవయవము కూడా కదలదు.లోపల bones ఉంటేనే అవయవాలు కదులుతాయి.
(c) మన లోపల రక్త నరాలు ఎన్ని ఉన్నాయో చూస్తే భూమిని ఒక సారి చుట్టూ వచ్చే అంతగా ఉన్నాయి. bonesకి అనుకుని ఉంటాయి. తల్లి గర్భములో దేవుడు ఏంత కష్టపడుతున్నాడో ఆలోచించండి. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఒక్కొక్క అవయవము ఒక్కొక్క స్థలములో అమర్చాడు. ముక్కు,కళ్ళు,చెవులు ఇలా అన్ని వాటి వాటి స్థానాలలో స్థిరపరిచాడు. భూమి మీదకు వచ్చిన తర్వాత అమ్మ మనకు ఆహారమును తినిపించింది. మరి కడుపులో ఉన్నప్పుడు మనకు ఎవరు తినిపించారు???? తల్లి గర్భములో ఉన్న నీకు ఆహారము,గాలి ఎలా వచ్చింది???? ఎవరు సహాయము చేసారు???? దేవుడే చేశాడు. భూమి మీదకు వచ్చాక అమ్మ సహాయము చేసింది కానీ భూమి మీదకు రాక ముందు నువ్వు తినడానికి,త్రాగడానికి,పిల్చుకోవడానికి దేవుడే సహాయము చేశాడు.

5) అయన పుట్టిస్తే వచ్చిన నీవు వచ్చిన తర్వాత తన కోసము ఆలోచిస్తున్నావా???? యెషయ 1:2-ఆకాశమా ఆలకించుము,భూమి చెవి యోగ్గుము. నేను పిల్లలను పెంచి గోప్పవరినిగా చేసితిని.వారు నా మీద తిరుగబడియున్నారు... మనిషికి తన జన్మ రహస్యము అర్థము కాక దేవునిపై తిరుగబడుతున్నారు. దేవుడు మనల్ని సృష్టించిన సంగతి, నిర్మించిన సంగతి,సహాయము చేసిన సంగతి మరచిపోయి తిరగబడుతున్నాడు. మన అవయవాలు దేవుని కొరకు use చేస్తున్నామా???రోమా12:1,2-సజీవ యగాముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనుడి... మన కన్నులను దేవుని వాక్యమును చదువుటకు,మన చెవులను దేవుని మాటలు వినుటకు, మన కళ్ళు ,చేతులు దేవుని పని కొరకు వాడబడుతున్నాయా లేక లోక సంభంధమైన పాపాలు చేయడానికి ఉపయోగపడుతున్నాయా???? మనకు కలిగియున్న ఆకారాన్ని ఎవరు ఇచ్చారు,ఎందుకు ఇచ్చారు అని ఆలోచిస్తే మన జన్మ ఎందుకో అర్థమవుతుంది మరియు ఈ జన్మలో ఏమి చేయాలో అర్థమవుతుంది.
6) రోమా 6:12- కాబట్టి శరీర దురశలకు లోబడునట్లుగా చావునకు లోనైనా మీ శరీరమందు పాపమును ఎలనియ్యకుడి. మరియు మీ అవయవములను దుర్నితి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి.అయితే మృతులలో నుండి సజీవులమనుకుని,మిమ్మును మిరే దేవునికి అప్పగించుకోనుడి. మీ అవయవాలను నీతి సాధనాములుగా దేవునికి అప్పగించుడి.... అనగా ఈ వచనములో మన body parts దేవుని కొరకు ఉపయోగపడాలి అని అర్థమయింది.. మన mind-దేవుని గురించి ఏమి చేయాలనీ ఆలోచించాలి,మన eyes- దేవుని వాక్యమును చదవడానికి ఉపయోగపడాలి, మన నోరు- దేవుని మాటలు ప్రకటించుటకు ఉపయోగపడాలి, మన కాళ్ళు,చేతులు- దేవుని పని కొరకు ఉపయోగపడాలి. అందుకే మనల్ని సృష్టించి ,నిర్మించి and ఇప్పటి వరకు సహాయము చేస్తున్నాడు అయన కొరకు బ్రతకాలని.




Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget