Halloween Costume ideas 2015

Can believe the body?

శరీరాన్ని నమ్మొచ్చా??

శరీరాన్ని నమ్మొచ్చా??
ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను

1) మనుష్యులంతా తమ శరీరాన్ని గూర్చి ఆలోచిస్తున్నారు ,భయపడుతున్నారు. కనుకనే ఉదయం లేవగానే దానికి భోజనం పెట్టాలి అనే బెంగతో దివారాత్రులు కష్టపడి సంపాదించిన దానిని గంటలో వంట చేసి పావుగంటలో దానికి(శరీరానికి) పెడుతున్నారు. శరీరానికి ఒక్క తీపి లేదా పులుపు ఇస్తే చాలు అనుకోదు కానీ అన్ని రుచులు కావాలి. ఏది తక్కువైన అస్సలు బాగా లేదని చాలా బాధపడుతుంది.అందరిని తిడుతూ భాదపడుతుంది. ఈ ప్రపంచములో ఎవరినైనా చుడండి పేదవాడు గానీ, కోటిశ్వరుడుగానీ ,ప్రజా సేవకుడు గానీ,ప్రజల అధికారి అయిన అంత “””” కోటి విద్యలు కూటి కొరకే. అలగే ఈ శరీరానికి ఏ చిన్న రోగమొచ్చిన గల్లి నంది డిల్లీ లేదా విదేశాలకైనా వెళ్లి doctorsను బ్రతిమాలి ఎంత ఖర్చు అయిన పర్వాలేదు దానిని కొసైనా, అవసరమైతే వేరేవాడి శరీరాన్ని కోసి అయిన నా శరీరాన్ని బాగుచేయండి అంటారు. 2) మట్టి శరీరానికి మనిషి కట్టుబానిసగా మట్టిలో కలిసి పోయే వరకు జీవిస్తున్నాడు. శరీరాన్ని సుఖపెట్టేదే చేయాలి. ఎవరి గురించి ఆలోచించదు.ఆలోచించనివ్వదు.ఫలానా చోటులో డబ్బులు పంచుతున్నారన్న ,లేక స్పెషల్ బిర్యానీ కూడిన విందు జరుగుతుందని రమ్మనా ,ఎక్కడ లేని సంతోషం కల్గుతుంది శరీరానికి. మనిషి తనను కన్నా దేవునికి కూడా భయపడడం లేదు కానీ తన శరీరానికి భయపడుతున్నాడు. దాని కోసమే బ్రతుకుతున్నాడు.ఈ శరీరానికి లొంగిపోయిన వారు శరీరం యొక్క ముడిలో భందింపబడిన వారు కాదా?

3) ప్రతి వారికీ చావు తప్పదు గనుక జీవితంలో ఒక్కసారి చావు రోజుకి(death day) వెళ్లి ఈ శరీరాన్ని గూర్చి ఆలోచించండి. మనిషి బ్రతికి ఉన్నతకాలం పీల్చి పిండి చేసిన తర్వాత పనికి రాని మట్టిలో ఈ శరీరం కలిసి పోతుంది. ఈనాడు మట్టిలో అనగా కటిక నెల మీద పడుకోలేనని ఇబ్బంది పడే ఈ శరీరం ఒక రోజు శవమై అంతకన్నా ఘోరమైన గోతిలో హాయిగా పడుకొంటుంది. ఈ శరీరం కోసం ఎంత సంపాదించినా చివరికి ఏంటి మిగిలేది?విద్యా-ఉద్యోగమా?? పదవా-ప్రఖ్యాతా?
ఆస్తి-అంతస్తా? కులమా-మతమా? ఊరా-పేరా? రక్త సంభంధమా-రాగ భంధమా??? ఇల్లు,డబ్బు,దేశం ,విదేశం ఏది మిగలదు. చివరికి మనది లేక మనమే అనుకునే మనం ప్రియమైన శరీరమే మిగలదు.

4) శరీరం కోసమే ఆలోచిస్తాం గానీ దాన్ని జీవింపజేసే ,నడిపింపజేసే ఆత్మ కోసం ఎవరైనా ఆలోచిస్తారా?? అందుకే ఆ శరీరాన్ని ,ఆత్మను ఇచ్చిన దేవుడు తన గ్రంధమైన bibleలో సర్వమానవాలి కోసం ఎంత మంచి మాటలు వ్రాయించాడో ఒకసారి చూద్దాము. యాకోబు 4:14-రేపేమి సంభవించునో మీకేమి తెలియును.... అవును రేపు ఏం అవుతారో అది అస్సలు తెలియదు. రేపటి దాకా ఎందుకు ఇంకో గంటలో,క్షణంలో ఏం జరుగుతుందో ఏమవుతామో ఎవ్వరూ చెప్పలేరు. ఈ శరీరానికి ఏది ఎప్పుడు కావాలో దాని కోసం జాగ్రత్త పడుతాo కానీ ఆ శరీరంలో కనిపించని శక్తి ఒకటుంది అదే నువ్వు-నేను అని పిలువబడే “ఆత్మ” అని ఆలోచన లేదు. నీ శరీరంలో నీవు అనే ఆత్మ ఉంటేనే విలువ. ఆత్మ లేకపోతే అది ఉపయోగం లేదు (యోహాను 6:63) అనగా ఎందుకు పనికి రానిది. ఆత్మ ఉంటే శరీరం and ఆత్మ లేకపోతే శవం. కానీ మనిషి శరీరం కోసం ఎక్కువుగా ఆలోచిస్తాడు.ఆత్మ బ్రతకాలి and నిత్యం జీవించాలి అంటే “” దేవుని వాక్యం అవసరం. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు ఆ రొట్టెను కూడా సృష్టించిన దేవుని మాట వలననే జీవిస్తాడు(మత్తయి 4:4).

ఆత్మ అనునది పరలోకం నుండి వచ్చింది.అది అక్కడే ఉండాలి. అక్కడికే వెళ్ళాల్సింది. మట్టి లోకం నుండే వచ్చి,మట్టిలోనిదే భుజించి చివరికి మట్టిలో కలిసి మాయమైపోయే శరీరం గూర్చి ఆలోచిస్తారా?

5) యాకోబు 4:14-మీ జివమేపాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు అని దేవుడు అంటున్నాడు. అయ్యో! నిన్ననే లేదా ఇప్పుడే గంట క్రితమే కన్పించి మాట్లాడాడండి.ఇద్దరం కల్సి hotelలో biryani తిన్నామనో, చాయ్ తాగామనో చెప్పి ఆ తిన్నది సరిగ్గా అరగక ముందే చనిపోయాడా అని అంటాము. కొంత కాలమే కదా ఆ తర్వాత దేవుని గూర్చి,ఆత్మ గూర్చి తరువాత ఆలోచిద్దాం అనుకుంటున్నారా???? గ్యారంటి ఇవ్వగలరా??మనిషి తయారు చేస్తున్న ప్రతి వస్తువు గ్యారంటి ఇవ్వగలడేమో గానీ తన శరీరానికి మాత్రం గ్యారంటి ఇవ్వలేదు. శరీరాన్ని తయారు చేసిన దేవుడు దానిని ఆవిరి లాంటి దంటున్నాడు. చావుకు చిన్న-పెద్ద ,పాపి-భక్తుడా అనే తేడా లేదు.అందరం చావుకి కనురెప్ప పాటులో ఉన్నాం.

6) మత్తయి 25:46- వీరు నిత్య శిక్షకును,నితిమంతులు నిత్య జీవమునకు పోవుదురు. నిత్య శిక్ష(నరకానికి) వెళ్ళిన ఆత్మను నిత్యము శిక్షిస్తాడంట. ఎందుకంటే నీవు అనబడే ఆత్మకు చావులేదు. మధ్యలో వచ్చిన శరీరానికి చావు ఉంది కానీ ఆత్మకు చావులేదు.ఎందుకంటే అది దేవుని నుండి విడిపోయి శరీరంలో కొంత కాలం ఉండడానికి భూలోకం వచ్చింది.””” ఇందులోనికి రాకమునుపు దేవునిలో దేవుడై ఉన్న ఆత్మ అది.””” మార్కు 9:48-నరకమున అగ్ని ఆరదు పురుగు చావదు. అంటే నరకానికి వెళ్ళిన,వెళ్ళబోవుచున్న వారు ఎక్కువ మందా? తక్కువ మందా?? పరిశిలించి ,పరిశిదించి ఆలోచిస్తే ఎక్కువ మందే కనబడుతున్నారు. ఎందుకంటే ఈ లోకంలో ఎక్కువ మంది లోక సంభంధమైన శరీరం,దాని ఆశలు,ఆశయాలు కోసమే ప్రతి రోజు బ్రతికి చనిపోతున్నారు.

7) రోమా8:5- శరీరానుసారులు శరీర విషయాలు మీద మనస్సుంతురు. గ్యారంటి లేనిదీ ఈ శరీరం.అయిన దీనిని నమ్మినట్లు మనం దేనిని నమ్మం.శరీరానుసరమైన మనస్సు మరణం.శరీర స్వభావం(లోకాశ) గల వారు దేవునిని సంతోషపరచనేరరు.శరీరాన్ని నమ్మేవారు అనగా లోకములోని ఆస్తి-అంతస్తు,పదవి,కులం,మతం,ప్రాంతం,భాష... మొదలగు వాటి కోసమే బ్రతుకు అనుకొనే వారు దేవునికి విరోధులని యేసు భోదించాడు.అయన భోదలు నమ్మి ఆ ప్రకారం జీవించే వారే ఆత్మనుసారులు అనగా ఆత్మ కోసమే బ్రతికే వారు. ఎప్పుడు ఊరు వెళ్ళాలని, ఎప్పుడు పెళ్లి చేయాలని, ఎప్పుడు పండగలు చేయాల్ అని years నుండి ఆలోచిస్తారో అలాగే దేవుని కోసం ఏం చేయాలో అని ఎవరైనా ఆలోచిస్తున్నారా?

8) ఈ మట్టి లోకాన్ని ,దాంట్లో నుంచి మన శరీరాన్ని నిర్మించి దానిలోనికి మన ఆత్మను పంపించి,ఆరోగ్యంగా సంతోషముగా అను క్షణం పెంచి పోషిస్తున్నది మనకందిరికి తండ్రియైన ఒకే ఒక్క దేవుడు.మనం ఆయనను నమ్మి అయన కోసమే జీవించాలో లేక శరీరాన్ని నమ్మి దానికి బానిస అయ్యి ఆత్మను నరకానికి పంపిస్తారో మన చేతిలో ఉన్నది.



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget