Halloween Costume ideas 2015

Father, Son, Jesus Christ, parisudatma okkatena?

తండ్రి , కుమారుడైన యేసు క్రీస్తు
పరిశుదాత్మ ఒక్కడేనా ?
నేటి క్రైస్తవ సమాజములో తండ్రి,కుమారుడు ,పరిశుదాత్మ ముగ్గురుగా వేరువేరుగా ఉన్నారని
కొందరనుకోగా,ముగ్గురూఒక్కటేఅనగాఒకప్పుడుతండ్రిగాను,తరువాతకుమారునిగాను,ప్రస్తుతముపరిశుద్దాత్మ దేవునిగానూ ఒకే దేవుడు పాత్రలను పోషించినట్లుగా మరికొందరు తలంచుచున్నారు.మరి కొంతమంది తండ్రే క్రీస్తు,పరిశుద్దాత్మఅని,యేసే తండ్రి అని తలంచుచున్నారు.... ఈ యొక్క సందేశములో ముఖ్యముగా
a) bible లోని వచనాల ఆధారముగా యేసు,తండ్రి ,పరిశుద్దాత్మ ముగ్గురు వేరు వేరుగా ఉన్నట్టు తెలుస్తుంది.b)ఒకే వచనములో తండ్రి,కుమారుడు ,పరిశుద్దాత్మ కనపడు వచనాల వివరణ..
b) నేటి క్రైస్తవులు ఏ వచనాలను ఆధారము చేసుకుని ముగ్గురు ఒక్కటే అంటున్నారో వాటి సంపూర్ణ వివరణ. కనుక శ్రద్ధతో లేఖనాలను పరిసిలిస్తూ చదవండి.ఇప్పుడు topicలోకి పోదాము.

1) ఆదికాండము 1:26-దేవుడు-మన స్వరుపమందు,మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఆదికాండము3:22-అప్పుడు దేవుడైన యెహోవా-ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ,ఆదాము మనలో ఒకనివంటివాడాయాను. ఆదికాండము 11:7-గనుక మనము దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయుదుము అంది అని అనుకొనెను..... సృష్టి అంతా పూర్తి అయ్యాక ఆదామును కనాలని మన పోలిక,మన స్వరుపమందు అని ఎవరితో చెప్పుచున్నాడు దేవుడు?ఒక్కడే ఉంటె ఒక్కడు అంటారు,ఒకటి కంటే ఎక్కువ ఉంటె మన అను పదము use చేయబడుతుంది.పై references లో బహు వచన పదమైన మన అని చెప్పబడినది.. దేవునితో పాటు ఇంక ఎవరో ఉన్నట్టుగా తెలుస్తుంది.పై references ద్వార దేవుడు ఎవరితో మాట్లాడుతున్నట్లుగా అర్థమవుచున్నది.ఎవరు ఉన్నారో క్రింది వివరణలో అర్థమవుతుంది. 2) john 1:1- అది యందు వాక్యము ఉండును. వాక్యము దేవుని యెద్ద ఉండెను.వాక్యము దేవుడై ఉండెను.john1:14-ఈ వాక్యము శారిరధారియై యేసుగా వచ్చెను. ప్రకటన 19:13-దేవుని వాక్యము అను నామము ఆయనకు(యేసు) పెట్టబడియున్నది. ఇప్పుడు వాక్యము అనగా యేసు అను మాటను john1:1లో పెట్టి చదవండి. అనగా అది నుండి దేవుని యెద్ద దేవుడిగా ఉన్నాడు యేసు.అయన సృష్టి పుట్టక ముందే ఉన్నవాడు. యెషయ 9:6-మనకు శిశువు పుట్టెను. ఇక్కడే పుట్టెను అను మాట ఉంది కానీ పుట్టబోవుతున్నాడు అని లేదు.యెషయ చెప్పక ముందే యేసు పరలోకములో ఉన్నాడు. john1:3- కలిగి ఉన్నదేదియు అయన(యేసు) లేకుండా కలుగలేదు. అంటే యేసు సృష్ట పుట్టాక ముందే తండ్రి దగ్గర ఉన్నాడు. 3) ఇప్పుడు తండ్రి,యేసుక్రీస్తు వేరు వేరుగా ఉన్నట్టుగా అర్థమయ్యే వచనాలను చూద్దాము.
(a) మత్తాయి16:13-అందుకు సిమోను పేతురు –నీవూ సజివుడగు దేవుని కుమారుడైన క్రిస్తువని చెప్పెను.. ఇందులో తండ్రి పేతురుకు యేసు కుమారుడిగా బయలపరిచాడు.
(b) john 8:16-19-నేను ఒక్కడనై యుండక నేనును,నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము.18లో నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్షమిస్తున్నాడు. ఇందులో యేసు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు.
(c)john14-21to24-నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును.ఇందులో యేసు తండ్రి గురించి మాట్లాడుతున్నాడు.
(d) అపోకార్య2:35,psalm 110:1,మత్తాయి22:41-43- ప్రభువు(తండ్రి) నా ప్రభువుతో(యేసు) చెప్పెను. ఇందులో ఇద్దరు వేరు వేరుగా కనపడుతున్నారు.
(e) psalm 2:3-భురాజులు యెహోవాకును ,అయన అబిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. ఇక్కడ అబిషిక్తుడు అనగా క్రీస్తు(john1:14-see footnote).
(f)psalm 2:7-నీవూ నా కుమారుడవు.నేడు నిన్ను కనియున్నాను.ఇందులో తండ్రి కుమారుని గూర్చి చెప్పిన సందర్భము.
(g)john20:17-నేను ఇంకను తండ్రి యొద్దకు పోలేదు గనుక ముట్టుకోనవద్దు.
(h) ఎఫేసి 1:3-ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును.
(i) 1కొరంది 15:24-28-తన తండ్రి అయిన దేవుని రాజ్యము అప్పగించును.అప్పుడు అంతము వచ్చును.
(J) john 13:3-తను దేవుని యెద్ద నుండి భయలుదేరి వచ్చెనని,మరలా దేవుని యొద్దకు వెళ్ళవలసి ఉన్నదని యేసు ఎరిగి... ఒకవేళ jesus తండ్రి అనుకుంటే మరలా వెళ్ళాలి అంటున్నాడు??తండ్రి యేసుగా వస్తే మరి పరలోకములో ఎవరు ఉంటారు?
(k)psalm 2:12-కుమారుని ముద్దుకోనుడి లేనియడల అయన కోపించును.
(l)మత్తాయి5:16-పరలోకమందున్న మీతండ్రిని మహిమ పరచునట్లు.....
(m)john 17 అంత యేసు తండ్రి కి ప్రార్దిస్తున్నాడు.
(n)john8:26-నేను(యేసు) అయన( తండ్రి) యెద్ద వినిన సంగతులే లోకమునకు భోదించుచున్నాను....
(o)మత్తాయి5:48-యేసు-మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులైయుండుడి.
(p) మత్తాయి 5,6,7లో యేసు తండ్రి అను మాటను ఎక్కువుగా అన్నాడు. ఇలా references చెప్పుకుంటూ పోతే జవాబులు ఒక మహా గ్రంధముగా అయిపోతుంది. కనుక పై referencesబట్టి యేసు and తండ్రి వేరు వేరుగా కనపడుతున్నట్లుగా అర్థమైనది.

4) ఇప్పుడు పరిశుద్దాత గురించి చూద్దాము..
(a) ఆదికాండము1:2- దేవుని ఆత్మ జలములపై అల్లడుచుండెను. దేవుని ఆత్మ ఎవరో క్రింది referencesలో అర్థమవుతుంది.
(b)మార్క్ 1:9-పరిశుద్దాత్మ తన(యేసు) మీదకి దిగివచ్చుట.....
(c)మత్తాయి3:16,17-దేహ్వుని ఆత్మ దిగెను...
(d)luke 3:21,22-పరిశుద్దాత్మ శరిరముతో పావురము వలె అయన మీదకు దిగివచ్చేను..
(e)roma 8:16-మనము దేవుని పిల్లలమని ఆత్మ తనే మన ఆత్మతో సాక్షమిస్తుంది.ఇక్కడ పరిశుద్దాత్మ అందరు అయన పిల్లలు అంటున్నాడు.
(f)roma 8:26-ఆ ఆత్మ తనే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు...
(g)john14-25to 28,john 14:16,17- ఆదరనకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్దాత్మ సమస్తమును మీకు భోదించి..
(h)john 16:13-సత్యస్వరుపిఅయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యమును నడిపించును. అనగా తండ్రి దగ్గర నేర్చుకున్న సంగతులు మనకు తెలియజేస్తున్నాడు.

5) ఒకే వచనములో తండ్రి,కుమారుడు ,పరిశుద్దాత్మవేరు వేరుగా కనపడు వచనాల వివరణ చూద్దాము. మత్తాయి 3:16,luke 3:21,22-ఇదిగో ఆకసము తెరవబడెను,దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదకు వచ్చుట చూచెను.. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు,ఈయన యందు నేను అనంధించుచున్నాను అని యొక శబ్దము ఆకసము నుండి వచ్చెను... ఇక్కడ 1) తండ్రి—ఆకసము నుండి ఒక soundతో మాట్లాడుతున్నాడు.2)పరిశుద్దాత్మ-పావురమువలె దిగి.3)jesus-అక్కడే ఉన్నాడు........ అలానే luke1:41-తండ్రి-గాబ్రియేల్ ద్వారా వర్తమానము పంపించాడు,పరిశుదత్మ-సహాయకర్తగా ఉన్నాడు.jesus-మరియ గర్భములో రూపింపబడుతున్నాడు. అలానే యెషయ 48:16-ఇప్పుడు ప్రభువగు యేహోవాయు.అయన ఆత్మయు నన్ను(యేసు)పంపెను...

6) కనుక పై వచన ఆదారాలు బట్టి అది నుంచే యేసు,పరిశుద్దత్ముడు తండ్రి దగ్గర ఉన్నారు.మన అంటే యేసు&పరిశుద్దత్ముడు అని.వేరు వేరుగా ఉన్నారు గనుక మన అన్నాడు తండ్రి.ఈ ముగ్గురు ఒక్కొక్కరుగా వేరుగా ఉన్నారు. పై వ్రాయబడిన వచనాలు చూస్తే నేనే కుమారుడైన యేసు అని గానీ, నేనే పరిశుద్దత్ముడు అని గాని తండ్రి ఎక్కడ bible లో చెప్పలేదు.అదే విదముగా నేనే తండ్రి అని గాని,నేనే పరిశుద్దత్ముడు అని గాని యేసు bibleలో చెప్పలేదు.

7) నేటి క్రైస్తవులు ఏ వచనాలను ఆధారము చేసుకుని ముగ్గురు ఒక్కటే అంటున్నారో వాటి సంపూర్ణ వివరణ చూద్దాము.john 17:22-మనము ఏకమై ఉన్న లాగున.... ఈ వచనములో యేసు తండ్రితో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏకము అనగా తండ్రి ఆలోచనలు కుమారుని ఆలోచనలు ఒక్కటని అర్థము.ఏకము అనగా ఒకరిలో ఒకరు ఉండడము కాదు.ఒకరికొకరి ఆలోచనలు ఒక్కటే అని. example1::nithin,martin అనువారు ఉన్నారు.విల్లిద్దరు ఒక్కటే అంటే nithin ఏది చేస్తే ,చెప్తే martin కూడా అదే చేస్తాడని అర్థము. ఇద్దరి ఆలోచనలు ఒక్కటే అని. nithin లో martin ఉన్నాడని కాదు అర్థము.ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు కానీ ఆలోచనలు,పనులు కలుస్తున్నాయి. ఆదాము హవ్వ ఎకశరిరము అయ్యి అంటే హవ్వ అదాములోవెళ్ళిపొయినది అని నా??? john 8:16- నేను ఒక్కడినే కాకా నేను నన్ను పంపిన తండ్రి కూడ ఉన్నాడు.example2:nithinగా పుట్టిన వాడికి nithin యొక్క నాన్న పోలికలే వస్తాయి. nithin ని చూస్తే వాళ్ళ నాన్నను చూసినట్లే అంటారు. ఇక్కడ nithin nithinగా, nithin father nithin fatherగా వేరుగా ఉన్నారు కానీ పోలిక వచ్చింది.ఎందుకు nithin వాళ్ళ fatherలో నుంచి వచ్చాడు కాబట్టి father పోలిక వచ్చింది . ఇప్పుడు యేసు తండ్రి నుంచి వచ్చాడు కాబట్టి ఏకమై ఉన్న లాగున అన్నాడు. john 14:3 to10-నన్ను చుసిన వాడు తండ్రిని చూసినట్లే అంటే నాలాంటి లక్షణాలు,ఆలోచనలు,ఉద్దేశాలు తండ్రికి ఉన్నాయి గనుక ఈ మాట అన్నాడు. తండ్రి,యేసు,పరిశుద్దాత్మలా ఆలోచన ఒక్కటే. అదే మనుష్యుల రక్షణ,పరలోకము చేరాలని మనము....

8) ముగ్గురు వేరు వేరుగా ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచనలు ఒక్కటే. యేసు,పరిశుద్దాత్మతండ్రిలో నుంచి తండ్రి పంపగా వచ్చారు.

9) 1 john 2:22,23-తండ్రిని కుమారుడిని ఒప్పుకోనని వాడే క్రీస్తు విరోధి.కుమారుడిని ఒప్పుకోనని వాడును తండ్రిని అంగికరించువాడు కాదు. అనగా తండ్రిని తండ్రిగా,క్రీస్తును క్రీస్తుగా ఒప్పుకోవాలి. తండ్రిని కుమారుడిని ఒప్పుకోవాలి. ముగ్గురు వేరు వేరు గా ఏమి పని చేస్తున్నారో తెలయాలంటే ఒప్పుకోవాలి..

10) తండ్రి-మన అందరిని monitor చేస్తున్నాడు..... యేసుక్రీస్తు-మన కొరకు పరలోకములో స్థలము సిద్దపరుస్తున్నాడు.... పరిశుద్దత్ముడు-వాక్యములో నడిపిస్తున్నాడు యేసు రెండవ రాకడ వరకు.

11) కాబట్టి తండ్రి అయిన దేవుడు ఈ ప్రపంచములో ఉన్న 700 కోట్ల మంది మనుషులకు అంతేకాకుండా యేసు క్రీస్తుకు, పరిశుదాత్మకును తండ్రి. ఈ ముగ్గురు వేరు వేరు గా ఉన్న ఆలోచనలోను,ఉద్దేశములోను, హృదయములోను,గుణములోను, భావంలోనూ,క్రియలలోను ఏక అబిప్రాయము కలిగి ఉంటారు. కాబట్టి christians అయిన మనము తండ్రిని, కుమారునిని,పరిశుదత్మను తెలుసుకోవాల్సిన అవసరం చాల ఉంది. ఈ ముగ్గురు ఎప్పటి గా ఉన్నారు,ఎలా ఉన్నారు ముగ్గురికి మధ్య ఉన్న భంధం తెలియలి. ఎందుకంటే ఏ వక్తినన్న ప్రేమించాలన్న, గౌరావించాలన్న వారి గురించి మనకు తెలుసుండాలి.కాబట్టి మనం bible లో ఉన్న 66 పుస్తకాలను పరిశిలిస్తూ తండ్రి మనస్సును అర్థం చేసుకుని బ్రతికినంత కాలము దేవుని కోసం , దేవుని ఆశయాల కోసం, అయనకు ఇష్తంగా మనం బ్రతికి దేవుడున్న ఆ పరలోకం చేరుకోవాలి...





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget