Halloween Costume ideas 2015

Talli Tandrula Pempaka Lopam

తల్లితండ్రుల పెంపక లోపం-నెరవేరని దేవుని సంకల్పం
తల్లితండ్రుల పెంపక లోపం-నెరవేరని దేవుని సంకల్పం
మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ప్రతి స్వాతంత్ర్య దినోత్సవ దినమున , గణతంత్ర దినోత్సవ దినమున ,నెహ్రు జయంతి దినమున (బాలల దినోత్సవo) రాజకీయ నాయకులు కానీ , ప్రజా ప్రతినిధులు కానీ, లోక జ్ఞానం నేర్పే గురువులు ఇలా వీరందరు బడి పిల్లలను ఉద్దేశించి మాట్లాడే మాట “”” నేటి బాలలే రేపటి పౌరులు””. దేశ అభివృద్దికి యువత అత్యవసరమని ,యువత నవ సమాజాన్ని నిర్మించగలదని, రాబోతున్న తరాలకు యువత దేశ పౌరులగా అవ్వాలంటే నేటి బాలలే అని ప్రతి నాయకుడు ప్రసంగాలు చేస్తాడు. వినడానికి ఈ మాటలు బాగున్న యువత మరింత దిగజారుతుందని నేటి సమాజన్ని చూస్తే అర్థమవుతుంది.

2) ఇక వివరాల్లోకి వెళ్తే బాలిక అత్యాచార హత్య కేసులో ఉరితీయబడ్డ మనోహర్, ఇంజినీరింగ్ విద్యార్ధినలైన సప్నిక,ప్రనితల యాసిడ్ దాడి , అయేషా హత్య కేసులో నిందితుడుగా శిక్ష అనుభవిస్తున్న సత్యం బాబు, ప్రేమించలేదని కారణంతో వెంటపడుతూ వేదిస్తుంటే పొలిసు కేసు పెట్టిందని ఇంటర్ చదువుచున్న రాజమండ్రి నివాసి అనుష పై కత్తితో గొంతు కోసి అడ్డోచ్చిన ఆమె తల్లితండ్రులను కత్తితో పొడిచి చంపిన రాజేష్ ,తల్లితండ్రులు తమ ప్రేమ వ్యవహారం తెలుసుకుని వేరే పెళ్లిసంభంధాలు చూస్తున్నారని ప్రేమించిన ప్రియులను వదిలి వేరే పెళ్లి చేసుకోలేమని ఉత్తరం వ్రాసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న డిగ్రీ అమ్మాయిలు.... ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటె సాగుతూనే ఉంటాయి... అస్సలు యువత ఎందుకిలా తయారయ్యారు???? ఎవరు కారకులు?

3) పిల్లలపై ప్రేమానురాగాలు పెంచుకుని ,చిన్ననాటి నుండి వారు అడిగినవి కొని ,తెచ్చి అతిగారాభం చేస్తున్న తల్లి తండ్రులు కాదా?? లోకమే శాశ్వతమనుకుంటూ ,లోక సంపాదనే ధ్యేయంగా పెట్టుకుని తమ పిల్లల చదువుల కోసం లక్షలాది రూపాయులు ఖర్చు చేస్తున్న తల్లితండ్రులు కాదా???కోటి విద్యలు కూటి కొరకేగా అని లోకంలో ఏ విధంగానైనా ధనం సంపాదించాలనే ధ్యేయంతో తమ పిల్లలను చిన్ననాటి నుండే టీవీ మీడియాలో ప్రసారమయ్యే డాన్స్ ప్రోగ్రాంలకు, గాన కచేరీలకు దగ్గరుండి తీసుకెళ్తు ,వారు పోటిలో గెలవకపోతే స్వర్గం కోల్పోయినట్టు ఏడుస్తున్న తల్లితండ్రులు కాదా? 4) ఈ రోజు ప్రపంచంలో ఉగ్రవాది,నక్సలైట్లు,హంతకుడు,ఫ్యాక్షనిస్టు, ఉన్మాది,దొంగ,లంచగొండి, రేపిస్ట్ గా తయారవ్వడానికి కారణం తల్లితండ్రుల పెంపకలోపమే. ఒక కోడిపిల్లలను ఎలా పెంచాలో తెలుసుకున్నారు, రొయ్య పిల్లలు ఎలా పెంచాలో నేర్చుకున్నారు, తెనేటిగల పంపకం ,పట్టు పురుగుల పెంపకం, చేప పిల్లల పెంపకం, కుక్కల పెంపకం ఎలాగో నేర్చుకున్నారు. దేని నుండి ఎలా లాభం సంపాదించాలో అని ప్రత్యేక శిక్షణ తరగతులు తీసుకుంటున్న మనిషి తమ కడుపున పుట్టిన పిల్లలను ఎలా పెంచాలో తెలుసుకోవడం లేదు. రైతు తన పంట మిధ చూపించే శ్రద్ద జాగ్రతలు , బస్సులో ఉన్న వారిని క్షేమముగా గమ్యం చేర్చాలని డ్రైవెర్ చూపించే శ్రద్ద జాగ్రతలు,ఒక ఉద్యోగి తన ఎదుగుదల కోసం చూపించే నిపుణత ,నమ్మకం ఇలా ప్రతి ఒక్కరు తమ కార్యనిర్వహణలో చూపించే శ్రద్ద తమ పిల్లల్ని పెంచడంలో చూపించక పోబట్టే నేడు సమాజం ఇంత భయంకరముగా తయారైనది.

5) పోట్లకాయలు మీ అందరికి తెలుసు. కూరగాయలన్నిట్లో పొడవుగా ,నిటారుగా ఉంటుంది.దానికి అదే అలా తయారు అవ్వదు. పూత పూసి పువ్వు పిందెగా మారగానే రైతు ఆ పిందే చివరి చిన్నపాటి బరువైన రాయిని తాడ్రుతో వ్రేలాడేతట్టుగా కడతారు. ఎందుకంటే పొట్లకాయ ఓంకర టింకరగా ఎదగకుండా నిటారుగా ,పొడవుగా తయారు అవ్వడానికి ఆ రాయిని వ్రేలాడతీస్తారు.పిందే కాయగా తయారు అవ్వకముందే ఆ పని చేస్తారు. కాయగా మారిన తర్వాత రాయి కట్టినా ఫలితం ఉండదు. తల్లితండ్రులు తమ పిల్లలను బాల్యదశ నుండే మంచి దారిలో పెట్టకపోతే పెద్దవారైన తరువాత దుర్మార్గులుగా,హంతకులుగా మారక తప్పదు. తమ పిల్లలకు నడక నేర్పడం కొరకు తల్లితండ్రులు అనేక రకాలుగా ఆలోచిస్తారు.తల్లి తండ్రి చేరోచేయ్యి పట్టుకుని నడిపిస్తూ నడక నేర్పిస్తారు.నడక వచ్చిన తర్వాత వాడు వేసే ప్రతి బుల్లిబుల్లి అడుగును చూసి మురిసిపోతూ ఉంటారు. వాడు నడవడం కోసం విటమిన్స్,మినరల్స్,ప్రోటీన్స్ లాంటి శక్తినిచ్చే మెడిసిన్ లేదా పాలలో కలిపి ఇచ్చే పౌడర్ ఎన్నోన్నో వాడుతారు... పిల్లలకు నడక నేర్పకపోయిన వాడు వయస్సు వచ్చిన తరువాత నడిచేస్తాడు.కానీ వయస్సు వచ్చిన నేర్చుకోనలేనిది బాల్యదశ నుండే నేర్పించమంటున్నాడు దేవుడు.

6) సామెతలు 22:6- బాలుడు నడవవలసిన త్రోవను వాడికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు.. తింటే పోయే పొట్లకాయ మీద చూపించే శ్రద్ద కన్న తమ పిల్లల పరలోక భవిష్యత్తు మీద తల్లితండ్రులు ద్రుష్టి పెడితే వారు బాగుపడుతారు. మన కళ్ళ ముందు గుడ్లును పెట్టి పొదిగి పిల్లల్ని చేసిన కోడిని చూసైనా పిల్లలను ఎలా కాపాడుకోవాలో నేర్చుకోకపోతే మరణించిన తరువాత మనకి ,మన పిల్లలకు నరకం తప్పదు. గ్రద్ద బారిన పడకుండా కోడి తన పిల్లలను కాపాడుకోవడం మీకు తెలుసు. దాని పిల్లలు మేత మేస్తున్నంత సేపు రెక్కలు విచ్చుకుని రోషంగా పిల్లల చుట్టూ అటు ఎటు తిరుగుతూనే ఉంటుంది. తన పిల్లలను ఎత్తుకుని పోయి ,చీల్చివేసి తినడానికి శత్రువు గ్రద్ద రూపంలో ఉందని కోడికి తెలుసు. మనల్ని మన పిల్లల్ని మ్రింగివేయడానికి మన శత్రువైన అపవాది అనేక రూపాలలో పొంచి ఉందని మనకు తెలియదు.

7) మోషే నాయకత్వం తర్వాత ఇశ్రాయేలియులు యెహోషువా నాయకత్వంలో కనాను దేశాన్ని పంచుకుని జీవిస్తున్న కాలములో మరలా దేవుని దృష్టికి ఇశ్రాయేలియులు దోషులుగా ఎంచబడి 40 సం ఫిలిస్తియులకు బానిసలుగా అప్పగించబడతారు. ఆ సమయంలో మనోహ దంపతులకు పిల్లలు లేకపోవడం వలన దేవుడు వారిని ఆశీర్వదించి ఒక దూతను మనోహ భార్య యొద్దకు పంపి పుట్టబోయే బిడ్డ విషయములో తన సంకల్పాన్ని మనోహ భార్యకు తెలియజేసాడు ( న్యాయాధి 13:2-6). పుట్టబోయే బిడ్డ ఫిలిస్తియుల చేతిలో నుండి ఇశ్రాయేలియులను రక్షించేవాడు అనే దేవుని సంకల్పాన్ని తన భర్తకు చెప్పడం మరిచిపోయింది (న్యాయాధి 13:7-14). మనోహ దంపతులకు దేవుడు చెప్పినట్లుగా సంసోను పుడతాడు.

8) కొడుకు పుట్టాడనే ఆనందంతో ఉన్నారే కానీ దేవుని సంకల్పాన్ని నెరవేర్చే నాయకుడిగా వారు సంసోనును పెంచలేదు. సంసోను ఫిలిస్తియుల చేతిలో నుండి ఇశ్రాయేలియులను రక్షించునన్న దూత ద్వారా దేవుడు చెప్పిన మాటను బట్టి అతని తల్లితండ్రులు సంసోనును పెంచినట్లయితే దేవుని సంకల్పం నెరవేరి ఉండేది కానీ వారి పెంపక లోపం వలన దేవుని సంకల్పం నెరవేరలేదు.. సంసోను ఫిలిస్తియుల కుమార్తెలలో ఒకతిని పెళ్లి చేసుకోవాలని మనస్సు కలిగాడు. తన పెళ్లి విషయంలో తన మామ చేత మోసపోయాడని తెలిసి ఫిలిస్తియుల సంపదను తగుల బెట్టాడు. తర్వాత ఫిలిస్తియుల నిజనిజాలు తెలుసుకుని అతని మామను, ఆమెను అగ్ని చేత కాల్చి వేస్తారు. జరిగిన విషయం తెలుసుకున్న సంసోను ఫిలిస్తియులపై పగ తిర్చుకోనుటకు వారిని హతం చేయడం జరిగింది. (న్యాయాధి 14,15 చదవగలరు)

9) దేవుని సంకల్పం ప్రకారం సంసోను తల్లితండ్రులు పెంచకపోవటం వలన అతని జీవితం అర్థంతరముగా ముగిసి పోవాల్సివచ్చింది. దేలిలాకు తన మహా బలము యొక్క రహస్యం చెప్పడం వలన సంసోను ఫిలిస్తియుల చేతికి చిక్కిపోయాడు. కండ్లు పికివేయబడి ,ఇత్తడి సంకెళ్ళతో బంధింపబడి,శత్రువుల బంధి గృహంలో ఉన్నాడు. కడసారిగా దేవుని దయ వలన బలము పొందుకున్న వాడై శత్రువులను చంపడంలో వారితో కూడా చనిపోయాడు(న్యాయాధి 16:16-22) ఇది సంసోను యదార్ధ గాధ..... సంసోను అల మారడానికి కారణం ఎవరు? అతని తల్లితండ్రులు కాదా?? దేవుడు బహుమానముగా మనకు అనుగ్రహిస్తున్న పిల్లలు సాక్షాత్తు దేవుని పిల్లలే. వారిని సంరక్షించడానికి మనల్ని తల్లితండ్రులుగా దేవుడు నియమించాడు. మనం సంరక్షణలో దేవుని భయ భక్తులతో వారి యెడల దేవుని సంకల్మ్పం నెరవేరడానికి మనం పెంచాలి.

10) బైబిల్ చరిత్రలో అబ్రహాము , శారాలాంటి వృద్ద దంపతులు మరొకరు ఉన్నారు. వారే జేకర్య,ఎలిసిబెత్ .ధర్మశాస్త్రమెరిగిన జేకర్య తనకు పుట్టబోయే బిడ్డ(యోహాను) యెడల దేవునికున్న సంకల్పాన్ని గుర్తుపెట్టుకున్న వాడై పుట్టిన తర్వాత బిడ్డను అలా పెంచాలనుకున్నాడు. బిడ్డ గర్భంలో పుట్టిన తరువాత జేకర్య తన భార్యతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ముసలివారైనా మనకు దేవుడు బిడ్డనిస్తున్నాడంటే పుట్టబోయే బిడ్డ యెడల మన కోరికలను నెరవేర్చు కోవడానికి కాదు కానీ ఇక కొంత కాలమే బ్రతికి ఆయుష్షు ముగిశాక చనిపోయే మనకు దేవుడు బిడ్డను ఎందుకు ఇచ్చాడో తెలుసా? అతడు ప్రభువు మార్గము సరాళము చేయువాడు కావాలి కాబట్టి మన బిడ్డను మనము అలా పెంచాలి. కాబట్టి యెషయా గారు ప్రవచించినట్టు మనం బిడ్డను చిన్ననాటి నుండే అడవిలో వదిలేద్దాం అని తన భార్యతో చెప్పి ఒప్పించాడు. కడుపు తీపిని చంపుకుని ,దేవుని యెడల భయ భక్తులతో భర్తకు లోబడి తన బిడ్డను చిన్ననాడే అరణ్యములో వదిలివేయడానికి ఎలిజిబెత్ సిద్దపడింది. వారిద్దరికీ తన బిడ్డ యెడల నేరవేరబోయే దేవుని సంకల్పమే కనబడింది.

11) యోహాను తల్లితండ్రులకు ఒక్కటే ఆలోచన –తన కడుపున పుట్టబోయే వాడిని గూర్చి ముందుగా వ్రాయబడిన దేవుని సంకల్పం నేరవేరాలి కాబట్టే వారు బిడ్డను అరణ్యములో వదిలివేయగలిగారు. లేక లేక పుట్టిన బిడ్డ ఇక తమకు లేడు అనుకున్నారు కాబట్టే బాప్తీస్మం ఇచ్చు యోహాను దేవుని సంకల్పాన్ని నెరవేర్చడమే కాకుండా, దేవుని నీతిని నెరవేర్చుట కొరకు తన ప్రాణాన్ని పెట్టి మహా దేవుని సేవకుడయ్యాడు..

12) తల్లితండ్రుల పెంపక లోపం వలన సంసోను యెడల దేవుని సంకల్పం నెరవేరలేదు . బాప్తీస్మం ఇచ్చు యోహను యెడల వ్రాయబడిన దేవుని సంకల్పం నెరవేరిందంటే తల్లితండ్రుల సక్రమ పెంపకమే అని చెప్పక తప్పదు. కేవలం సంసోను, యోహాను ఎడలే కాక భూమి మిద పుట్టుకొస్తున్న కోటాను కోట్ల మంది పై దేవుని సంకల్పం ఉంది. మనం అయన సంకల్పం ప్రకరమే పుట్టాము. దేవుడు కావాలనుకోకపోతే భూమి మీద మనము పుట్టి ఉండేవారము కాదు.

13) ఎఫిసి 2:10- ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు(వాక్యానుసారమైన క్రియలు) చేయడానికి మనము పుట్టాము అని వ్రాయబడింది. మనము అనుభవించే ఈ ప్రకృతి పుట్టుటకు మనకు సేవ చేయాలనే కారణం ఉంది. మనం పుట్టడానికి కారణం లేదంటారా??? దేవునికి పని చేయడానికి మనము పుట్టాము మరియు మనకు సేవ చేయడానికి ప్రకృతి పుట్టింది. మనం పుట్టాక ముందే మనకు చేయాల్సిన పని(ప్రకృతి) పుట్టించాడు. తల్లి గర్భములో నుండి బయట పడ్డాక తల్లి,తండ్రి ,భంధువులు మన ఆకారాన్ని చూసి ఎవరి పోలికో అని మాటలాడుకుంటారు. ఆ పోలిక ,ఆకారం రాక ముందు తల్లి గర్భములో పిండంగా ఉన్న రక్తపు గడ్డకు ఆకరామివ్వడానికి దేవుడు చూస్తున్నాడు(కీర్తనలు 139:16). ఆకారము ,అవయవాలు దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయడానికి ఇచ్చాడు. మీ బిడ్డ యెడల మీకెంత ప్రేమానురాగాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువుగా మన అందరిపై కన్న తండ్రియైన దేవునికున్నాయని మరచిపోకండి. ఈ లోకంలో మంచి భవిష్యత్తు ఉండాలని వారి పిల్లల పట్ల తల్లి తండ్రులు ఆలోచిస్తారు కానీ దేవుడైతే ఈ లోకంలోనూ,శాశ్వతమైన పరలోకంలోనూ మనకి భవిష్యత్తు ఉండాలని ఆలోచించాడు. మంచి భవష్యత్తు ఈ భూమిపై లేదు. ఒక రోజు యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. అయన రాకతోనైనా మనం పోవచ్చు లేదా మన ఆయుషు ముగిసిపోయిన మనం చనిపోవచ్చు. తన కొరకు మన పిల్లలను పెంచుతారాని నమ్మి బహుమానంగా మికిచ్చాడు. లేకపోతే రక్తపు గడ్డగా తల్లిగర్భంలోనే రాలగోట్టే వాడు. ఆలోచించండి. పిల్లలను ప్రభువు వాక్యములోను,శిక్షణలోను పెంచి దేవుని సంకల్పాన్ని నెరవేర్చండి.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget