Halloween Costume ideas 2015

Katte (Shariram) Migilchina Kannite Gadha?

కట్టే (శరీరం) మిగిల్చిన కన్నీటి గాధ
మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) శరీరమన్న పదముకున్న పర్యాయ పదాలలో ఒక్కటే ఈ కట్టే అను పదం. ఈ రోజు ప్రపంచ మానవాళి అనుకుంటున్నట్లుగా మనిషి అనగానే పైకి కనిపించే ఈ రూపం కాదు కానీ కనిపించే ఈ రూపాన్ని కదిలించే ఒక మహా శక్తియైన ఆత్మన్న సంగతి మొదట మనం తెలుసుకోవాలి. ఆ ఆత్మయే నీవు & నేను . ఈ రోజు ప్రపంచమును చూస్తే పైన ఉన్న శరీరాన్ని గుర్చిన ఆలోచనలతో ఉన్నదే తప్ప ఈ శరీరంలో ఉన్న ఆత్మ గుర్చిన ఆలోచనలు లేవు.పామరుడు మొదలుకుని పండితుడు వరకు, సామాన్యుడు మొదలుకుని శాస్త్రవేత్త వరకు, పేదవాడు మొదలుకుని ధనవంతుడు వరకు ఇలా ప్రతి ఒక్కరు పైన ఉన్న శరీరాన్ని గూర్చే ఆలోచిస్తున్నారే తప్ప లోనున్న ఆత్మ గురించిన ఆలోచన ఏ మనిషికి లేదు. ఈ రోజు ఏ వ్యక్తిని చూసిన ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునేంత వరకు చేసే ప్రతి ఆలోచన కానీ, చేసే ప్రతి పని కానీ పైనున్న ఈ శరీరం కోసమే అన్నది వాస్తవం.. ఒక ఉద్యోగం చేసిన ,వ్యాపారం చేసిన శరీరం కోసమే. ఇది చేసిన ,ఏది కొన్న ఈ శరీరం కోసమే తప్ప లోనున్న ఆత్మ కొరకు కాదు.

2) యోహాను 6:63-ఆత్మయే జీవింపజేస్తుంది కానీ శరీరం కేవలము నిషప్రయోజనము.... అనగా ఆత్మ అనునది “జీవింపజేసిదిగా” & శరీరం అనునది “జీవించేదిగా” ఉన్నదీ. జీవింపజేసే ఈ ఆత్మ మన శరీరంలో ఉంటేనే విలువ. ఏ రోజున ఆత్మ శరీరాన్ని విడిచి వెళ్లిందో అప్పుడు అది శవంగా మారుతుంది. ఈ శవాన్ని పెట్టెలో పెట్టి స్మశానానికి తీసుకెళ్ళి ముందుగా తీయబడిన గోతిలో పెట్టి పూడ్చి ఇంటికి వస్తాము. ఇలా ఆత్మ శరీరాన్ని విడిచి పెట్టాక జరిగే కార్యక్రమము అని మనకు తెలుసు. మనిషి చనిపోయేంత వరకు ఈ శరీరం గూర్చే ఆలోచిస్తున్నారే తప్ప శరీరాన్ని కదిలించే ఆత్మ కోసం ఆలోచించుట లేదు. 3) చనిపోయేంత వరకు ఈ శరీరాన్ని ఎలా పోషించాలి, ఎలా సుఖపెట్టాలన్న ఆలోచనలే తప్ప ఆత్మ అను నేను(పేరు అన్నది అత్మకే కానీ శరీరమునకు కాదు) ఈ శరీరాన్ని విడిచిపెట్టాక ఏమైపోతానో,ఎక్కడికిపోతానో అన్న ఆలోచనలు లేవు. యేసు క్రీస్తు కాలములో మనుషులు ఏమి తినాలి, ఏమి త్రాగాలి,ఏమి ధరించుకోవాలి అన్న ఆలోచనలే తప్ప చనిపోతే ఏమైపోతమో అన్న ఆలోచన వారిలో లేదు. వారి నిమిత్తము యేసు అంటున్న మాటను చూస్తే యోహాను 6:25-మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారనీ మీతో నిర్చయముగా చెప్పుచున్నాను.... ఈ రోజు అనేక మందిలో దేవుని దగ్గరకు వచ్చు ఉద్దేశము చూస్తే వాళ్ళ శరీర రోగాలు నయం కోసమో, శరీర సంభంధమైన అవసరాలు తీర్చుకోవడం కోసమో వస్తారు. ఆనాడు ఉన్న మనుషులు కానీ & ఈ రోజున్న మనుషులను చూస్తే మనుషులు మారిన వారి మనస్సులు ఒకేలా ఉన్నాయి. ఆ రోజున్న మనుషులు శరీరం కోసం ఆలోచించారు & ఈ రోజున్న మనుషులు శరీరం కోసం ఆలోచిస్తున్నారే తప్ప శరీరం లోనున్న ఆత్మ కోసం ఆలోచించుట లేదు. శరీర సంభంధమైన కోర్కెలు తీర్చుకునే పనిలో నేటి ప్రపంచం ఉన్నదే తప్ప ఆత్మను గురించిన ఆలోచన లేదు .

4) ఎంత కాలం మనం ఈ శరీరంలో ఉంటాము? శరీరంతో వచ్చిన కాలము తెలుసు కానీ ఈ శరీరాన్ని విడిచే కాలం మనకు తెలియదు. యాకోబు 4:14-రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జివిమేపాటిది?మీరు కొంత సేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే... నిజముగా మరుక్షణం ఏమి జరుగుతుందో తెలియని స్థితిలో నేడు జీవిస్తున్నాం.ప్రపంచములో ఉన్న ఎవరైనా ,ఎంతటి వారైనా ఈ శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత వెళ్ళాల్సింది మట్టిలోకే... ఈ చిన్న స్వల్ప జీవిత కాలంలో పదవులు అని, అధికారం అని, పంతాలు అని, పట్టింపులని, డబ్బు అని ఈ రోజు ఎన్ని కోర్కెలు పెట్టుకున్నాడు ఈ శరీరంతో మనిషి అన్న సంగతి ఒకసారి ఆలోచించండి.

5) ఈ శరీరం నుండి ఆత్మ విడిచివెళ్ళిన తర్వత శరీరమును పెట్టెలో పెట్టి మట్టిలో పాతిపెట్టడo అని విషయం అందరికి తెలుసు. కానీ ఆ తర్వాత ఏమి జరుగుతుందో చూస్తే యోబు 24:20-కన్న గర్భము వారిని మరుచును.పురుగు వారిని కమ్మగా తినివేయును.... అనగా శరీరమును పురుగులు కమ్మగా తింటాయట.. వర్ష కాలం ప్రారంభం అయ్యాక ఏదైనా కుక్క చనిపోతే కుక్క శవాన్ని ఊరు భయట పడేస్తారు. ఆ కుక్క శవాన్ని పడేశాక ఒక ఐదు లేక ఆరు రోజు తర్వాత కుక్క శవాన్ని చూడడానికి వెళ్తే శవం కనిపించనంతగా దానిపై పురుగులు వాలిపోతాయి.. ఈ సందర్బాన్ని ఉహించుకుంటే రేపు మనం కూడ ఒక దినాన చనిపోయాక భూమిలో పెడితే ఇలాంటి స్థితి ఉంటుంది. బ్రతికి ఉన్నంత వరకు మన శరీరము కొరకు ఎంతో డబ్బు ఖర్చుపెడుతాము కానీ చివరికి పురుగు తినేస్తుంది. నేడు జరిగే నేరాలు, ఘోరాలు, యుద్ధాలు ఇలా అన్నిటిని ఆలోచిస్తే ప్రతి మనిషి శరీరంలో పుట్టే తప్పుడు కోరికలను తిర్చుకోనుటకు మనిషి తప్పు చేసి హంతకుడై ఈ రోజు దోషిగా జైలుకి పోతున్నాడు. ఈ రోజు నేరం చేసిన వారిని ఎందుకు చేసావు అంటే డబ్బు కోసమో,అధికారం కోసమో అని జవాబు ఇస్తాడు.మనిషి చేయు ప్రతి తప్పులో శరీరం పాత్ర ఉన్నదీ.

6) ప్రపంచములో జరిగే ప్రతి అవినీతి వెనుక,అక్రమం వెనుక, ప్రతి నేరం వెనుక ఉన్నదీ “శరీరం”. శారిరంలో పుట్టిన చెడు కోరికలు వలన తప్పులు జరుగుతున్నాయి. యాకోబు 4:1-మిలో యుద్దములును,పోరాటములును దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో(శరీరం) పోరడు మీ భోగేచ్చల నుండియే (కోరికలు) గదా???.. ప్రపంచములో పుట్టిన ప్రతి మనిషి ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నాడు,ప్రతి మనిషి శరీరాన్ని ఎలా సుఖ పెట్టాలని ఆలోచిస్తున్నాడు & శరీరంలో పుట్టిన ప్రతి తప్పుడు కోరికను తీర్చుకోవాలని అనుకుంటున్నాడు.. ఇలా తీర్చుకోవడానికి అవసరమైతే చంపడానికైనా ,చావడానికైనా సిద్దపడుతున్నాడు.

7) శరీరం మట్టిలో కలిసిపోతే మరి శరీరాన్ని నడిపే ఆత్మ ఎక్కడికి పోతుంది? ఈ శరీరాన్ని విడిచి పెట్టిన తర్వాత ఆత్మగా ఉన్న నీవు ,నేను ఏమైపోతున్నమో ఎప్పుడైనా ఆలోచించారా?? లూకా 16:19 నుంచి - ధనవంతుడు-లజరు యదార్ధ గాధలో స్పష్టముగా మనకు అర్థమవుతుంది. నిజముగా క్షణములో ఏమైపోతమో తెలియని చిన్న జీవితం మనది. ఈ చిన్న జీవితము కలిగిన మనిషికి పోరాటాలు,గొడవులు, అల్లర్లు,రక్త పాతం,నిందలు, హత్యలు ,అవమానాలు అవసరమా????? ఈ చిన్నపాటి జీవితం కోసము రాబోయే శాశ్వతమైన ఆత్మ జీవితం(పరలోకం) పోగొట్టుకుంటారా??? వద్దు...

8) చావు తర్వాత ఉండే జీవితం(పరలోకం) కొరకు చావక ముందే ఆలోచించాలి. ఒక్కసారి పాతాళంలోకి వెళ్ళిపోతే ఇక బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ మంటలలో కాలిపోవాలే తప్ప బయటకు వచ్చే అవకాశం లేదు. 60 ఏళ్ల చిన్న జీవితములో శరీరం గూర్చి ఆలోచించిన ధనవంతుని చివరి స్థితిని ఆలోచించండి. ధనవంతుని శరీరం చివరికి కన్నీటిని మిగిల్చింది & అతని ఆత్మ మంటల్లోకి వెళ్లిపోయింది. భాద అన్నది శరీరానికి కాదు కానీ అత్మకే...ఆత్మకు ఆనందం కావాలన్న లేక ఆత్మకు కన్నీళ్ళు కావాలన్న మనం శరీరంను ఉపయోగించుట విధానములో ఉన్నదీ. మిమల్ని పరలోకం తీసుకెళ్లాలన్న లేదా మంటల్లో వెళ్ళాలన్న శరీరంను ఉపయోగించుట విధానములో ఉన్నదీ. ఈ శరీరాన్ని దేవుని కొరకు వాడితే పరలోకం వెళ్తాము మరియు ఈ శరీరమును మన కొరకు వాడితే నరకంలో ఉండే మంటల్లోకి వెళ్తాము. నిజముగా ఈ శరీరము అన్నది రాబోయే జీవితమును( పరలోకపు జీవితము & నరక జీవితము) నిర్ధారిస్తుంది.

9) సజీవ యగాముగా నీ ,నా శరీరాన్ని దేవునికి అప్పగిస్తే పరలోకంలో ఆనందపడుతాము. శరీరంతో ఉన్నంత వరకు ఈ శరీరం గూర్చి ఆలోచిస్తే ఆ తర్వాత ధనవంతుడు ఉండే మంటల్లోకి వెళ్లి కలకలం కాలిపోతూ భాదపడాలి. కనుక శరీరం కోసం బ్రతికి జీవితాన్ని కన్నీళ మాయం చేసుకుంటావా లేక ఈ శరీరం దేవుని కోసం బ్రతికి, దేవుని పనిలో పెట్టి నలుగ గొట్టుకొని ఆ తర్వాత పరలోకంలో శాశ్వతముగా ఆనందపడతావా అన్నది నీ చేతిలో ఉన్నదీ. ఈ కాళ్ళు,చేతులు ఇలా దేహములో ఉన్న ప్రతి అవయవాలుతో దేవుని చెప్పిన చేయమన్న మహిమ తెచ్చే పని చేయండి.

10) శరీరం కన్నీటిని మిగల్చకూడదు అని అనుకుంటే శరీరాన్ని దేవుని కొరకు వాడండి. ఈ శరీరం ఒక వేళ కన్నీటిని మిగిల్చాలి అంటే మీ కోసం వాడుకోండి. మీ కోసం వాడి జీవితాన్ని కన్నీళ మాయం చేసుకుంటారో లేదా దేవుని కోసం వాడి జీవితాన్ని ఆనంద మాయం చేసుకుంటారో నిర్ణయం మీ చేతిలో ఉన్నదీ.







Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget