Halloween Costume ideas 2015

Kalamu Nerigi Nidra Meluko

కాలము నెరిగి నిద్ర మేలుకో


మన ఆత్మలను పాతాళము నుండి రక్షించుచున్న రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) కాలము(సమయము) అనేది మనిషి జీవితములో ఎంతో విలువైనది. కాలము విలువైనది అని, కాలము బంగారము అని , కాలము డబ్బు అని ఇలా కాలాన్ని గూర్చి ఎందరో ఎంతో గొప్పగా చెప్పారు. వాస్తవముగా మన జీవిత కాలములో దేనినైనా పోగొట్టుకుంటే తిరిగి పొందుకోగలము. ధనం పోయిన, ఆస్థి పోయిన ,అంతస్తు పోయిన, భూమి పోయిన,బంగారం పోయిన ఇలా ఎన్ని పోగొట్టుకున్న మరళా అన్నిటిని సంపాదించుకోవచ్చు కానీ మన జీవితములో వెళ్ళిపోయిన కాలాన్ని మాత్రం తిరిగి సంపాదించుకొలేము.

2) నిజముగా మన జీవితములో గడిచిపోయిన ఒక్క సెకండ్ కానీ, ఒక్క నిమిషం కానీ ,ఒక్క గంట కానీ తిరిగి పొందుకోలేము తెచ్చుకోలేము. కాలము విలువ తెలియక చాలా మంది వృధా చేసుకుని ఆ తర్వాత ఒక దినాన భాదపడుతూ ఉంటారు. నిజముగా కాలము చాలా విలువైనది, అముల్యమైంది. ఈ లోకంలో ఉన్న అన్నిటికంటే దేవుడు నీకు ప్రసాదించిన కాలం చాలా గొప్పది. దేవుడే తన సంకల్ప ప్రణాళిక చొప్పున కోటాను కోట్ల మంది పిల్లలు కావాలనే ఉద్దేశంతో సృష్టిని కల్గించి,పిల్లలుగా మనల్ని కన్నాడు. మానవ పుట్టుకకు దేవుడే కారకుడై మనము తన కొరకు బ్రతకాలనే ఆశ కలిగియున్నాడు కానీ అందుకు బిన్నముగా ఈ రోజు మనిషి ప్రవర్తిస్తున్నాడు.
3) అవినీతి పరులుగా,దోపిడీ దొంగలుగా ఎందుకు పుట్టామన్న సంగతి మర్చిపోయి ఎవరికీ ఇష్టమైనట్టుగా వారు బ్రతుకుతున్నారు. పిల్లలను ఆలోచిస్తే చదువులంటూ ఆ తర్వాత ఉద్యోగాలంటూ దేశ దేశాలకు తరలి వెళ్లిపోవడంలో ఉన్నారు. ఇక పెద్దవారిని ఆలోచిస్తే పదవులంటూ ,అధికారాలంటూ పేరు ప్రఖ్యాతల కోసం ప్రాకులాడుతున్నారు. ఎఫేసి 5:15- దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనునట్లు జాగ్రతగా చూచుకొనుడి. అనగా సమయాన్ని దేవుని కొరకు సద్వినియోగించుకొమంటున్నాడు. 4) రోమా 13:11-కాలము నెరిగి నిద్ర మేల్కొను వేళ అయినదని తెలుసుకోనుడి . ఈ మాటను జాగ్రతగా ఆలోచిస్తే కాలాన్ని గురించి తెలుసుకోమంటూన్నాడు. ఇక్కడ ప్రకృతిలో ఉన్న కాలాలు కాదు కానీ చెప్పబడుతున్న కాలము మనకివ్వబడిన జీవిత కాలం. ఈ జీవిత కాలాన్ని గూర్చి లేఖనాలను పరిశిలిస్తే విలువైన సమాచారం మనకు తెలుస్తుంది. ప్రసంగి 5:18-నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్షు కాల దినములన్నియు.... ప్రసంగి 8:15-బ్రతికి కష్టపడవలెనని దేవుడు వారికీ నియమించిన కాలమంతయు.... పై రెండు వచనాలను గమనిస్తే ప్రతి మనిషికి దేవుడు ముందుగా కాలాన్ని నియమించిన తర్వాతే భూమి మీదకి పంపుతున్నాడని అర్థం అవుతుంది.

5) ఒక్కొక్కరికి ఒక్కొక్క కాలాన్ని అనగా 20,30,40,50,60,70 ఏళ్ల ఆయుష్షు కాలాన్ని నియమించాడు. ఈ నియామకం ఎప్పుడు జరిగింది అని ఆలోచిస్తే కీర్తనలు 139:16-నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను.నియమింపబడిన దినములలో ఒకటైన కాకమునుపే నా దినములన్నియు నీ గ్రంధములో లిఖితములాయెను... అనగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నపుడే ఏ రోజు భూమి మీదకి రావాలో, ఏ రోజు భూమి మిది నుండి వెళ్లిపోవాలో ముందుగానే ముహూర్తాన్ని నిర్ణయించి మరి మనల్ని పంపాడు

6) ఒక ఉదాహరణగా చూస్తే మందుల షాపులో ఒక టానిక్ బాటిల్ చూస్తే manufacturing date (తయారీ దినం), expiry date (ఉపయోగం లేని దినం) రెండు కనిపిస్తాయి.ఈ రెండు ఒకేసారి ముద్రించబడతాయి . అలాగే మనిషి విషయములో కూడా దేవుడు ముందుగా రెండిటిని(పుట్టుకను,చావును) ఒకేసారి మనకు నిర్ణయించి భూమి మీదికి పంపించాడు.

7) అస్సలు ఈ కాలాన్ని మనకు దేవుడు ఎందుకు ఇచ్చాడు అనేది ప్రశ్న. కాలాన్ని నిర్ణయించేటప్పుడు దేనిని పరిగణలోనికి తీసుకున్నాడో మనకు అర్థం కావాలి. ఈ రెండు మనకు తెలిస్తేనే కాలాన్ని గూర్చి తెలుసుకున్న వారమవుతాం. యోబు 7:1,2- భూమి మీద నరుల కాలము యుద్దకాలము కాదా? వారి దినములు కూలి వని దినములు వంటివి కావా?ప్రస్తుతం నరులకాలమైతే యుద్దాన్ని గుర్తుకుతెస్తుంది. కనీస అవసరాల కొరకు కూడా మనుష్యులు చేసే పోరాటాలు యుద్దాన్ని తలపిస్తున్నాయి.ప్రతి దానికి పోట్లాడుకునే సంస్కృతి ఈ రోజు ప్రపంచంలో కనబడుతుంది. ఇక దినాలు గురించి కూలివాని దినాలతో పోల్చడం జరిగింది. మనకివ్వబడిన ఆయుష్షు కాలాన్ని గురించి కూలివాని దినములతో దేవుడెందుకు పోల్చాడు??? కూలివాని దినములను గూర్చి ఆలోచిస్తే మన దినాలు మనకు అర్థమవుతాయి. యోబు 14:5,6- కూలి వారి వాలే తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరుకు ..... ఈ పోలిక మనుష్యులందరి గురించి వ్రాయబడిందే గానీ కూలి పని చేసుకునే వారి గురించి అని అనుకోకూడదు. కులివానికి కాలం, పని రెండు ఎంత ముఖ్యమో మనకు కూడా దేవుడిచ్చే జీవిత కాలం, ఈ కాలములో చేయవలసిన పని కూడా అంతే ముఖ్యం. ఈ కోణములో పై వచన్ని పరిశిలిస్తే దేవుడు ఆయుష్షు కాలాన్ని పనిని బట్టి నిర్ణయించాడు(ఎఫేసి 2:10)

8) మన ఆయుష్షు దేవుని చేతిలో ఉంది.ఆరోగ్యంగా ఉండటం మన చేతుల్లో ఉంది .వ్యాయామాలు ,ఆహార పదార్ధాలు ఆయుష్షు కాలమును పెంచలేవు. యోబు 14:6 వచనాన్ని గమనిస్తే కూలివాని దినములు అనే మాట మనకు కనబడుతుంది.. కూలివాని దినములు ఎలా ఉంటాయో ఆలోచిద్దాం. కూలివాడు కుటుంబమును పోషించాలంటే ప్రతి దినము పని చేయక తప్పదు. పని వల్ల వచ్చే డబ్బుతోనే తన కుటుంబ ఆర్థిక సమస్యలు తిర్చుకోవాలనే పనికి వెళ్ళిన కూలివాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పని చేసి వచ్చిన డబ్బులతో సంతోషముగా ఇంటికి వెళ్తాడు. ఇటువంటి కూలివాని దినాలతో దేవుడు మన ఆయుష్షు కాలాన్ని ఎందుకు పోల్చాడో ఇప్పుడు మరింత జాగ్రతగా ఆలోచిద్దాం.. కులివానికి సమస్యలు ఉన్నట్టే భూమి మీదున్న ప్రతి మనిషికి భయంకరమైన సమస్య ఉంది. అదే మనిషి మరణించిన తర్వాత వెళ్లబోయే నరక సమస్య. మరి దీనిని మనిషి పరిష్కరించు కోవాలనుకుంటున్నాడా?? ఆలోచించాలి.

9) పాతాళాన్ని గుర్చి కొన్ని మాటలను చూస్తే యెషయ 5:14- అందు చేతనే పాతాళం గొప్ప ఆశ పెట్టుకుని అపరిమితంగా తన నోరు తెరుచుచున్నది. వారిలో ఘనులును,సామాన్యులను, ఘోష చేయువారును, హర్షించు వారును పడి పోవుదురు. కీర్తనలు 9:17-దుష్టులును, దేవున్ని మార్చు జనులందరు పాతాళమునకు దిగిపోవుదురు. సామెతలు 27:20- పాతాళమునకు అగాధ కుపమునకు తృప్తి కానేరదు. ఇలా పై వచనాలన్నిటిని పాతాళానికి మనిషిని మ్రింగేయాలన్న ఆశ కనబడుతుంది. మరి భూమి మీదున్న మనిషికి తప్పించుకోవాలన్న ఆశ ఉందంటారా??? కూలివాడు ఎలాగైతే తన సమస్యలను ఆలోచించుకుని పనికి వెళ్ళాలని ఎలా నిర్ణయించుకున్నడో ప్రతి మనిషి కూడ అలాగే క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుని పనిలో ఉండటం చాలా అవసరం. దేవుని పని ద్వారానే నువ్వు పాతాళాన్ని తప్పించుకోగలవు.ప్రతి మనిషికి ఒక కాలము ఉంటుంది. ఆ కాలములోనే నువ్వు దేవుని పని చేయాల్సి ఉంటుంది. అంటే భూమి మీద ఉంటున్న మన మందరం దేవునీ పని కొరకు వచ్చిన వారమని మర్చిపోకూడదు.

10) ఈ రోజు చాలా మంది ఈ సంగతి మరచి ఆఫీసర్లు అనుకుంటూ, ఇంజినీర్లు అనుకుంటూ డాక్టర్లు అనుకుంటూ తమ హోదాను చూపుకుంటున్నారు.నువ్వు డాక్టరైనా , యాక్టరైనా, ధనవంతుడైనా పేదవాడైనా, ప్రధాని మంత్రివైనా ఎవరైనా దేవుడు తన పని కొరకు పంపిన కూలివాడవని మర్చిపోకు. దేవుడిచ్చిన విలువైన కాలాన్ని భూమి మీద బ్రతకడానికై మనిషి వెచ్చిస్తే కాలం కరిగిపోయి పని మిగులుతుంది. పని పూర్తి చేస్తేనే డబ్బులొస్తాయి గానీ పని మిగిలితే రాదు కదా.. అలాగే మన పనిని మెచ్చి ఇచ్చేది పరలోకపు జీతం(జీవితం). లుకా10:7-పనివాడు జితమునకు పాత్రుడు, మత్తాయి 7:21- న తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును( పరలోకమునకు),యోహాను 17:4-చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని.

11) నిన్ను నరకానికి వెళ్ళనివ్వకుండా కాపాడేది నీవు దేవుని కొరకు చేసే పని. కాలాన్ని ఎరిగి నిద్రమేల్కోవాలి అని పౌలు గారు వ్రాస్తున్న మాట పరమార్ధం ఆలోచిస్తే” జీవిత కాలాన్ని దేవుని పనిలో పెట్టి ఇప్పటి వరకు వ్యర్ధమైన కార్యక్రమాలలో కాలాన్ని వెచ్చించిన మనం ఇక ముందు దేవుని కొరకు సాగాలి” .నిద్రలో ఉన్న వ్యక్తికి బయట జరుగుతున్నవి ఎలా తెలియదో అలాగే లోక సంభంధమైన వ్యాపకాలలో ఉన్నవాడికి కూడా బ్రతుకు విలువ తెలియదు.

12) కాలం విలువ తెలుసుకొనిన వారిని ఆలోచిద్దాం. ఒక మిశే కాలము నెరిగి నిద్ర మేల్కొని మిగిలిన కాలాన్ని ఇశ్రాయేలియుల రక్షించుట కొరకు ధారపోసాడు. హెబ్రీ 11:26- మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు దానము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. అలాగే దావీదు తన తరము వారికీ సేవ చేయటానికి తన జీవితకాలాన్ని అంకితమిచ్చాడు. అపోకార్య 13:36-దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికీ సేవ చేసి నిద్రించెను.. అలాగే పేతురు క్రీస్తుతో కష్టపడి చివరి దశలో కూడా ఇంకా దేవుని సంగతులను జ్ఞాపకం చేయాలనే కోరిక కలిగియున్నాడు(11పేతురు 1:13,14,15).

13) దేవుని కొరకు చేయాలన్న తపన మనలో ఉండాలి. మీ పని మీకు నరకాన్ని ఇస్తే దేవుని పని మిమల్ని పరలోకానికి చేరవేస్తుంది.ఇప్పటికైన నిద్ర మేల్కొని కూలివాని వాలే దేవుని కొరకు కష్టపడుదాం.లోకసంభంధమైన నిద్ర మత్తు అనగా చదువులు, వ్యాపారాలు, విందులు, వినోదాలు, హోదాలు , పదవులు, కాలక్షేపాలు , సినిమాలు, షికార్లు, విహార యాత్రలు మాని క్రీస్తు కొరకు మేలుకో! దేవుని పనిని కోరుకో!! పరలోకo చేరుకో!!!






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget