Halloween Costume ideas 2015

Forget heaven

దేవుని పని చేసి పరలోకం వెళ్తావా? దేవుని పని మరచి నరకానికి వెళ్తావా?

దేవుని పని చేసి పరలోకం వెళ్తావా? దేవుని పని మరచి నరకానికి వెళ్తావా?? యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నా ను. 1) ఈ రోజు మనం ఉంటున్న ఈ ప్రకృతిలో ఎన్నో వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులను లెక్కించగలమా అని అనుకుంటే లెక్కించలేము. లెక్కించలేని వస్తువులు దేవుడు మన కొరకు ప్రకృతిలో పెట్టాడు అన్నది వాస్తవం.దేవుడు కలిగించిన ప్రతి వస్తువు ఉట్టిగానే కలిగించినట్ట్లుగా మనకు కనబడుట లేదు. ప్రతి వస్తువుకు పని ఉంది. ఒక్కో వస్తువు ఒక్కో పని నిమిత్తమే దేవుడు ఈ ప్రకృతిలో ఉంచాడు. సామెతలు 16:4- యెహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగజేసెను.అనగా ప్రతి వస్తువు వెనుక పని ఉందట. ప్రతి వస్తువు పని కొరకు కలిగించిన్నట్లు మనకు అర్థమైనది. ఒకసారి మనము ఉన్న ఈ ప్రకృతిలోని వస్తువులను ఆలోచిస్తే సూర్యుడు,చంద్రు డు ,నక్షత్రాలు,గ్రహాలు యొక్క పని చూస్తే సూర్యుడు- వెలుగు,వేడి ఇవ్వాలి, చంద్రుడు-వెన్నల ఇవ్వాలి,నక్షత్రాలు – కాంతిని ఇవ్వాలని.ఇలా ఆకాశములో ఉన్న ఒక్కొక వస్తువుకు ఒక్కొక్క పని ఉంది. పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని( సూర్యుడు),రాత్ర ిని ఏలుటకు చిన్న జ్యోతిని (చంద్రుడు) కలుగజేసాడు. ఆకాశాముకి సంభందించిన ఒక్కొక వస్తువు ఒక్కొక్క పని కొరకు కలిగించాడు.

2) దేవుడు దేనిని ఏందు నిమిత్తము కలిగించాడో అవన్నీ ఆ పనిలో ఉన్నట్టుగా మనకు చూస్తున్నాము. ఏంతకలముగా వాటి పనిలో ఉన్నాయని అనుకుంటే సృష్టి పుట్టినప్పటి నుండి. శాస్త్రవేత్తల ప్రకారముగా సుమారు 1500 కోట్ల years. అంటే ఇవన్ని 1500 కోట్ల years నుంచి వాటి వాటి పనిలో ఉన్నాయన్నమాట.ఆక ాశ వస్తువులను పని నిమిత్తము కలిగించిన దేవుడు ఆకాశ వస్తువులను నిత్యము అనుభవిస్తూ భూమి మీద జీవిస్తున్న మానవులైనా మనల్ని పని లేకుండా కన్నాడు అనుకొనుట పొరపాటు.మనుషులను కూడా దేవుని పని నిమిత్తము కన్నాడు. భూమి మీద ఉన్న మనుషులకు కూడా దేవుడు ఒక పని నిమిత్తమే జన్మను ప్రసాదించాడు అన్న సంగతి నీకు తెలుసా? 3) మనం అనుభవిస్తున్న ప్రతి వస్తువుకు దేవుడు పని పెట్టినప్పుడు ,వాటి అన్నిటిని అను క్షణము అనుభవిస్తున్న మనల్ని పని లేకుండా కన్నాడా???? ఈ రోజు government ఉద్యోగులను మనము చూస్తున్నాము. ప్రతి ప్రభుత్వద్యోగి ప్రజలకు సేవ చేయాలి కనుక ప్రభుత్వo వీరి కొరకు ఆలోచిస్తుంది. అనగా ప్రభుత్వo చేయమన్న పని ఉద్యోగి చేస్తున్నాడు గనుక వీరికి quarters, water supply,electric ity,medical allowances, children education అందిస్తున్నారు. అదే విధముగా పరలోకములో ఉన్న దేవుడు మనం పుట్టక ముందే మన గురించి ఆలోచించాడు. కారణము అంటే పుట్టిన తర్వాత నా కుమారుడు కుమార్తె నా పనిలో ఉండుబోతున్నారు మరియు పనిలో ఉన్న నా కుమారుడు కుమార్తె కొరకు అలోచించి అన్ని వసతులు సమకుర్చాలి అనుకున్నాడు. మనకు అవసరమైనవి అన్ని దేవుడు ఈ ప్రకృతిలో ముందుగానే సిద్దము చేశాడు.

4) ఆదికాండ2:1- దేవుడు తాను చేసిన తన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. అనగా ఆదాము సృష్టించక ముందు 6 దినములు కష్టముతో సృష్టిని చేశాడు. పరలోకములో ఉన్న దేవుడు రాబోతున్న తన పిల్లలకు అన్ని ముందుగా సిద్దము చేయాలనుకున్నడు. మనము తినడానికి వివిధ రకాలైన పండ్లను ప్రకృతిలో పెట్టాడు. మళ్ళి ఒక్కొక్క పండుకు ఒక్కొక్క రకాలని పెట్టాడు. నా పిల్లలు భూమి మీద నా పని నిమిత్తము వెళ్తున్నారు కాబట్టి ఇన్ని రకాల ఆహార పదార్ధాలు కలిగించాలనుకున్నాడు. వస్తముగా మనము తింటున్నాము-నిద్రపోతున్నాము కానీ దేవుని పని గురించి ఆలోచించుట లేదు. ఏది విడిచి పెట్టకుండా ప్రతిది తింటున్నాము. తింటూ పని చేయమన్నాడు.

5) తల్లి గర్భములో ఉన్నప్పుడే మనం యెడల కలిగియున్న శ్రద్ద చూస్తే కీర్తనలు 139:16- నేను పిండమునై యుండగా నీ కన్నులు నన్ను చూచెను... మొట్టమొదట మనం మాంసపు ముద్దగా ఉన్నప్పుడే దేవుడు చూపు మనపై పడింది.. ఆ రోజు నుంచి( పిండము అయిన రోజు నుంచి) దేవుడు మనకు అవయవాలను ఒక్కొకటిగా నిర్మించి ఎదుగుదలను ఇచ్చాడు. చక్కటి అవయవ నిర్మాణము కొరకు దేవుడు తొమ్మిది నెలలు వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. కళ్ళు,ముక్కు, చెవులు ,చేతులు,కాళ్ళు ఇలా దేహ్హములో కనిపించే కనిపించని ఎన్నో అవయవాలు తల్లి గర్భములో నిర్మాణము చేశాడు. తల్లితండ్రులకు లోపల జరుగుతున్న పక్రియ తెలియదు. వైద్య శాస్త్రము వారికీ లోపల జరుగుతున్నది చెప్పగలరు తప్ప ఎవరి వలన,ఎలా జరుగుతుంది అన్న విషయము వీరికి తెలియదు. కేవలము ఒక్క దేవుడికే తెలుసు.

6) కీర్తనలు-139:13- నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడవు నీవే.నీవు నన్ను కలిగా జేసినా విధము చూడగా భయము, అర్చర్యము నాకు పుట్టుచున్నది. ప్రతి రోజు అద్దము ముందు నించొని చూసుకుంటున్న ఈ ఆకారము దేవుడే ఇచ్చింది. దేవుడు ఇచ్చిన ఈ దేహానికి మెరుగులు దిద్దే పనులో ఉన్నామే తప్ప అస్సలు దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు అని ఆలోచించవా?????? ఎందుకు దేవుడు తొమ్మిది నెలలు తల్లి గర్భములో నిర్మించాడు అంటే తన పని చేస్తావని.

7) మన దేహములో ఉన్న ప్రతి అవయములన్నిటికీ పని ఉంది. ఈ అవయవాలు దేవుని పనికి సాధనములు. ఒక apartment కట్టాలన్న మనిషి సహాయము లేకుండా ఎన్నో machines ద్వారా పని జరిగిస్తున్నారు. అలానే దేవుడు కూడా తన పనిని మనకు ఉన్న అవయవాలతో జరిగించాలని అనుకున్నాడు. మరి మన అవయవాలు దేని కొరకు ఉపయోగిస్తున్నాము???? ఏందుకొరకు మనకు దేవుడు చేసాడో చూస్తే ఎఫేసి 2:10- దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలను చేయుటకై,మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడినవార మై అయన చేసిన పనియైయున్నాము.. అనగా సత్ క్రియలు చేయడానికి మనల్ని సృష్టించాడట. అయితే సత్ క్రియలు అనగా ఏంటో చూస్తే యోహాను 17:17-నీ వాక్యమే సత్యము. వాక్యము సత్యమైతే సత్ క్రియలు అనగా వాక్య సంభందమైన క్రియలు అని. అనగా వాక్య సంభంధమైన క్రియలు చేయడానికే మనము దేవుని చేత సృష్టింపబడినవారమై ఉన్నాము.

8) వాక్య సంభంధమైన క్రియలు అనగా దేవుని కొరకు జరుగుతున్న ప్రతి కార్యక్రమములో మన వంతు సహాయత. ఈ పనులు మనము చేస్తున్నామా?? దేనికి కష్టపెట్టుచున్నాము మన అవయవాలను?? వాక్య సంభందమైన పనులు కొరకు దేవుడు ఈ భూమి మీదకు మనల్ని పంపిస్తే ఏ పని మీద దేవుడు పంపించాడో ఆ పనిని చేయనప్పుడు ,అయన పనిలో ఉండక ,అయన ఇచ్చిన ప్రకృతిని అనుభవిస్తున్నప్ పుడు దేవుడు పరలోకము ఇవ్వాలా?

9) అయన పని మీద ఉంటావని, అయన పనులలో ఉంటావన్న ఆలోచనతో ,నమ్మకముతో దేవుడు నీ కొరకు ఆరు దినాలు కష్టపడి అనంతమైన ప్రకృతిని కలిగిస్తే దేవుడు కలిగించిన ప్రకృతిలో ఉన్నవాటినన్నిటిని అనుభావిస్తూ ఆయనను మరిచి అయన పనిని మర్చిపోయి బ్రతికితే దేవుడు నరకానికి కాక పరలోకానికి తీసుకేళ్తాడా???? ప్రభుత్వం ఇచ్చే అన్ని వసతులు అనుభవిస్తూ చెప్పిన పని చేయకపోతే అప్పుడు job నుంచి suspend చేస్తుంది. చెప్పిన పని చేయని ప్రభుత్వ ఉద్యోగిపై ప్రభుత్వం ఇలాంటి నిర్ణయము తీసుకుంటే మరి పరలోకములో ఉన్న దేవుడు నీ కొరకు 1500 కోట్ల years సూర్యుడిని మండిస్తూ, చంద్రుడిని,నక్ష త్రాలను ప్రకాశిoపజేస్తూ ,అడగక పోయిన అన్ని సమకూరుస్తున్న దేవుని కోసము బ్రతకవా????? అయన పని చేయవా??? అయన పనుల మీద ఉండవా?

10) ఉన్న ఈ అవయవాలతో ఏమి చేయగలుగుతున్నాము,ఏమి చేస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి???? దేవుడు నియమించిన దినానికి వెళ్లిపోతున్నామన్న సంగతి అర్థమవుతున్న అయన పని కోసము ఇంకా ఆలోచించక పోతే ఎలా????మరణించిన మరుక్షణమే దేవుని ఎదుట ప్రత్యక్షమైతే దేవుడు మొట్ట మొదట అడిగే ప్రశ్న- నీకు ఇచ్చిన ఈ ఆయుషు కాలములో నా కొరకు ఏంత పని చేసావు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు మనము తల ఎత్తి సరియైన జవాబు చెప్పగలమా??నా పని ఉందని తెలిసి కూడా , నా పని కోసము సహకరించక, నా పనిలో లేక, నా పని చేస్తున్న వారికీ సహాయము అందించక భూమి మీద ఇచ్చిన కాలము అంత వృధా చేసుకున్నావు గనుక వెళ్ళు నరకానికి అంటాడు. ఆ తరువాత ఏడుస్తూ,రోదిస్తూ,భాదపడుతూ, ఆవేదన పడుతూ, ఏంత పొరపాటు,తప్పు చేశాను అని అనుకుంటూ నరకానికి వెళ్లిపోవడమే తప్ప మనం చేయగలిగినది ఏది లేదు.

11) ఏదైనా చావుకు ముందే దేవుని కొరకు పని చేయాలి. ఆస్తులు అని అనుకుంటే మనకన్న ముందటి తారలు వారు ఏమి తీసుకుని వెళ్ళిపోయారు??? మనకన్న ముందున్న వారు కోట్లు సంపాదించినా కానీ చివరికి చనిపోయకు ఏమి తీసుకెళ్తున్నారు??? దేవుడు ఇచ్చిన ఈ జీవితం, ఈ బ్రతుకు అయన పని కోసము కొరకు ఇచ్చాడు.మనకు లాంటి శరీరము,ఆకారము యేసుక్రీస్తుకు ఇచ్చాడు. మనకు ఉన్న అవయవాలే యేసుకు ఇచ్చి ఈ లోకానికి పంపించాడు. వచ్చిన అయన మరణానికి ముందు పరలోకమందున్న తండ్రితో ప్రార్ధిస్తున్న ప్రార్ధన చూస్తే యోహాను 17:4-చేయుటకు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. యేసు పనిని సంపూర్ణముగా చేశాడు. సంపూర్ణముగా పనిని చేసిన తర్వాతనే యేసు తండ్రిని పరలోకము అడుగుతున్నాడు యోహాను 17:5-తండ్రి, లోకము పుట్టాక మునుపు నీ యెద్ద ఏ మహిమ యుండునో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్దకు మహిమపరచుము.

12) నహుము 1:14-నీవు పనికి మాలిన వాడవు గనుక నేను నీకు సమాధి సిద్దపరచుచున్నాను.. నహుము 1:15- సువార్త ప్రకటించుచు ,సమాధాన వర్తమానము తెలియజేయువాని పాదములు పర్వతముల మీద కనబడుచున్నవి. దేవుడు ఏది అయిన చెప్పి చేస్తాడు. కానీ చెప్పకుండా చేయడు.చెబుతున్న మాటయే పని చేయమని. పని చేస్తే పరలోకము.పని చేయకుంటే నరకమే.పరలోకమా లేక నరకమా అన్నది నువ్వే నిర్ణయించుకో..... పని చేసి పరలోకము వెళ్తావో లేక పనిలో నుండి ప్రక్కకు వెళ్లి నరకానికి జారిపోతరో నిర్ణయము మీద


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget