Halloween Costume ideas 2015

Maranichinavaru Dayyaluga Marutara?

మరణించిన వారు దయ్యాలుగా మారుతారా?

మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది? ఇదే మానవ మేధస్సులో కదులుతున్న ప్రశ్న. భూమి మీద

మరణించిన వారు దయ్యాలుగా మారుతారా?
యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వందనాలు తెలియజేస్తున్నాను.
1) మరణం ఉందన్న సంగతి ఎవ్వరు చెప్పకుండానే తనకు తానుగా తెలుసుకుంటున్నాడు మనిషి. మనం కళ్ళముందు ఎన్నో మరణించడం మనం చూస్తున్నాం. సుక్ష్మ జీవుల నుండి మన కంటికి కనిపించే జంతువులు మన కళ్ళ ముందే మరణం పేరుతో కనబడకుండా పోవటం జరుగుతుంది & చివరికి మనిషి కూడ మరణం పేరుతో వెళ్ళిపోతున్నాడు. మన కళ్ళ ముందు ఇలా జరుగుట బట్టి ఏదో ఒక రోజు మనం కూడ మరణించాలనే నిజం ప్రతి ఒక్కరికి తెలుసు. మనిషి మరణం ఉందని తెలుసుకోవడం కంటే మరణం తర్వాత ఏమి ఉందో అని తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం. ఈ రోజు ప్రపంచములో ఏ మనిషిని అడిగిన మనిషికి మరణం ఉందన్న సంగతి అందరు మాట్లాడుతారు & అందరు ఒప్పుకుంటారు. అంటే మరణం తర్వాత ఏమి ఉందన్న సంగతి ప్రపంచములో ఉంటున్న ప్రతి మనిషికి తెలుసేమో కానీ ,మరణం తర్వాత ఏమి ఉందన్న ప్రశ్నకు మనిషి దగ్గర సమాధానం లేదు.

2) మానవ జ్ఞానం మరణం ఉందన్న దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఆ మరణం తర్వాత ఏమి ఉందో మనిషికి తెలుసుకొనే ప్రయత్నం చేయలేదు. ఆ మరణం తర్వాత ఉన్నదేంటో,వాస్తవాలు ఏంటో సమాజానికి చెప్పేవారు నేడు కావాలి.మానవ జీవితం స్మశానంతో ఆగిపోయేది కాదు. తల్లి గర్భములో ప్రారంభింపబడి తిరిగి స్మశానంతో ముగిసిపోయేది మానవ జన్మ కాదు. అస్సలు మరణం తర్వాత ఏమి జరుగుతుంది? మనిషి మరణించగానే ఏమి చేస్తారో మనకు తెలుసు. సాంప్రదాయము ప్రకారం ఒక పెట్టెను తయారు చేసి,ఆ పెట్టెలో మరణించిన వారికీ స్నానం చేపించి,కొత్త బట్టలు వేసి,అత్తరు పూసి తర్వాత పెట్టెలో పెట్టి అందరికి చివరి చూపుగా చూపెట్టి భుజాలపై ఎత్తుకుంటూ స్మశానానికి మోసి అందరు మట్టి వేసిన తర్వాత చివరిగా ఉన్న మట్టినంత కూలివారు కప్పివేసి ఇళ్ళకు వెళ్ళిపోతారు.
3) మరణించిన తర్వాత ఏమి జరుగుతుంది? ఇదే మానవ మేధస్సులో కదులుతున్న ప్రశ్న. భూమి మీద ఈ 60,70 జీవితం మీద ప్రేమ పుట్టి మరణం తర్వాత ఏమి లేదు అనుకుంటూ బ్రతుకుండగానే బ్రతికి వేయాలన్న ఆలోచనలు ఈ రోజు మనిషిని చుట్టుముట్టాయి. ఈ రోజు అనేక మంది అనుకుంటునట్లుగా మరణం తర్వాత ఏమి లేదా? ఏమి లేకపోతే మరణించిన తర్వాత మనం ఏమైపోతున్నాం??? శవం అయితే మట్టిలోనికి వెళ్తుంది. మరి శరీరంలో ఉంటున్న ఆత్మ ఎక్కిడికి పోతుంది? బ్రతికినంత కాలం మన శరీరంలో ఉంటున్న ఆత్మ మరణించిన తర్వాత ఈ మట్టి శరీరాన్ని వదిలిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఒక వేళ ముగింపు అనుకుంటే శరీరంతో పాటు శరీరంలో ఉంటున్న ఆత్మ కూడా చావాలి కానీ శరీరం మరణిస్తుంది & ఆత్మ మరణించకుండా వెళ్ళిపోతుంది. మరి మరణించకుండా ఆత్మ వెళ్లిపోయింది అంటే ఎక్కడో ఉండాలి అని అర్థమవుతుంది. 4) ఎవరైనా మరణించినప్పుడు మన భాషలో తిరిగిరాని లోకానికి వెళ్లిపోయాడండి అని అంటారు. వెళ్ళిపోయాడు అని అంటామే తప్ప ఎక్కడికి వెళ్లిపోతున్నాడు ,ఏమి జరుగుతుంది అన్న ఆలోచనలు మనకు రావటం లేదు. “బ్రతికి ఉండగా ప్రతి మనిషి మరణాన్ని గురించి ఆలోచించుకోవాలి”. మరణం తర్వాత ఏమి లేదు అని కొందరు అనుకుంటే, మరణం తర్వాత ఉందనుకుంటున్న వారు నిజాన్ని అందుకోలేక మరణం తర్వాత మనం ఇక్కడిక్కడే తిరిగుతూ ఉంటాము అని అనేవారు కూడా ఉన్నారు.
5) బ్రతికి ఉన్నప్పుడు భూమిలో & చనిపోతే గాలిలో ఉంటామని అనేవారు కూడా ఉన్నారు. మరణించినప్పుడు ఎవరైనా గాలిలో కలిసిపోవుట చూసారా??లేదు. మరణించిన తర్వాత మనిషి గాలిలో కలిసిపోడు. భూమి మీద బ్రతికినప్పుడు కోరికలు తీరనప్పుడు అలా గాలిలోకి వెళ్లి అప్పుడప్పుడు వచ్చి కోరికలు తీర్చుకుంటారన్న అపోహ ఉన్నదీ. భూమి మిధ మరణించిన వారు కోరికలు తీరకుండా ఒక వేళ చనిపోతే కోరికలు తీర్చుకోవడానికి మళ్ళి భూమి మీదకు వస్తారా?
6) ఈ రోజు ప్రజలు వీటిని నిజమని ఎందుకు అనుకుంటున్నారో చూస్తే ప్రతి అబద్దాన్ని అందమైన తెరలపై చూసారు కనుక నిజం అని అనుకుంటున్నారు. మూడ నమ్మకాలను ప్రోత్సహించి ఆ రోజు సినీ వ్యవస్థ వీటికి భిజాలు వేసింది. మరణించిన తర్వాత మళ్ళి కోర్కెలు తిర్చుకోనుటకు భూమి మీదకు వస్తారా??? ఇవన్ని నిజలేనా??? ఒక వేళ భూమి మీద వచ్చిన వాళ్ళు పగలు రాకుండా రాత్రినే ఎందుకు వస్తున్నారు?? ఇలాంటి సినిమాలు ప్రజల మధ్యకు తీసుకొచ్చి మరణం తర్వాత ఉంటున్న ఒక మహా వాస్తవాన్ని కప్పి పెట్టేసారు. మనిషికి మరణమే ముగింపు అనుకుంటూ తినీ,త్రాగి మట్టిలోకి వెళ్ళిపోతున్న వారు కొందరు అయితే ,మరణం తర్వాత గాలిలో ఉంటామని కొందరు అనుకుంటే, మరణం తర్వాత కోరికలు తీరకపోతే ఇక్కడిక్కడే దయ్యాలుగా తిరిగుతాయనీ ఈ రోజు ఎన్నో అపార్ధాలకు గురి అవుతున్నారు.
7) మరణించగానే మనిషిలో ఉంటున్న ఆత్మ గాలిలో కలిసిపోయే అంత చిన్నది కాదు. ఆత్మ అనేది శక్తి స్వరూపం. దేవుడు సర్వ శక్తిమంతుడు అని అర్థం చేసుకుంటే ఆ సర్వ శక్తిమంతుడైన దేవునిలో నుంచి మనలోనికి వచ్చింది ఆత్మ స్వరూపం. అంటే మనలో ఉంటున్నది శక్తీ. శక్తీ అన్నది గాలిలో కలిసిపోదు. విద్యుత్ తీగలు తెగి గాలిలో కలిసిపోతుందా???లేదు. శక్తీ గాలిలోకి కలిసిపోదు.. ఎందుకంటే ఈ కంటికి చూపునిస్తుంది,చెవికి వినికిడి ఇస్తుంది,గొంతుకు మాటనిస్తుంది,చేతులకు కదలిక,కాళ్ళకు నడకను ఇస్తుంది. ఇలా లోపల శక్తీ ఉండటం వలన మనం పని చేయగలుగుతున్నాము. ఒక motor vehicle కదులుతుంది అంటే లోపల ఇంధన శక్తీ ఉంది కాబట్టి. మన ఇంటిలో lights వెలుగుతున్నాయంటే అందులో విద్యుత్ శక్తీ ఉన్నదీ.
8) మన లోపల కూడ శక్తివంతమైన ఆత్మ ఉండటం వలన ఈ చెవికి వినికిడి,కంటికి చూపు,నోరుకి మాట వస్తుంది. మరణించిన రోజు ఆ ఆత్మ బయటకు వస్తే గాలిలో ఎలా కలిసిపోతుంది? శక్తీ గాలిలో కలిసిపోదు అన్న విషయం అర్థమైతే నీలో,నాలో ఉంటున్న ఆత్మ కూడ శక్తీ స్వరూపమని ఆలోచిస్తే మనం మరణించిన తర్వాత మన శరీరంలో నుంచి వచ్చిన ఆత్మ గాలిలో కలిసిపోదు. ఇది కూడ శక్తీ కాబట్టి. ఒక వేళ ఆత్మ గాలిలో కలిసిపోతుందని మీరు అనుకుంటే మన కంటే ముందు దేవుడు గాలిలో కలిసిపోవాలి.. ఎందుకంటే దేవుడు కూడ ఆత్మ గనుక(యోహాను 4:24) . నీలో,నాలో ఉంటున్న ఆత్మ మరణించిన తర్వాత బయటకు వచ్చి గాలిలో కలిసిపోతే దేవుడు(ఆత్మ) కూడ గాలిలో కలిసిపోవాలి కదా??? దేవుడు గాలిలో కలిసిపోయేవాడా?కనే కాదు. గాలినే కలిగించేంత గొప్ప వాడు. దేవుడు గాలిలో కలిసిపోయేంత చిన్నవాడు కాదు. అలాంటప్పుడు దేవుడిలో ఉంటున్న ఆత్మ నీలో,నాలో ఉంటున్నప్పుడు ఎలా ఆత్మ గాలిలో కలిసిపోతుంది?
9) ఈ రోజు అబద్దాలను వందల సార్లు మాట్లాడి నిజాలుగా స్థిరపరిచారు ఈ లోకపు వారు. కల్పించిన కధలను వాస్తవాలు అన్నట్టుగా చూపించూట వలన ప్రజలు నేడు మరణించిన తర్వాత కోరికలు తీరకపోతే మళ్ళి ఇక్కడిక్కడే తిరిగుతారు అని అనుకుంటున్నారు. ఇది నిజం కాదు.ఎందుకు నిజం కాదు అంటే కోరికలు అనేవి శరీరానికి సంభందించినవి. ఇల్లు కట్టాలన్న కోరిక ఆత్మకు సంభందించింది కాదు కానీ శరీర సంభంధమైనది. bibleలో శరీర సంభందించిన కోరికల list గలతీ 5:19లో చదవండి. శరీరానికి సంభందించిన కోరికలు ఈ శరీరానికే ఉంటాయి. మరి శరీరం శవమై మట్టిలోనికి వెళ్ళిపోతే ఇక శరీర సంభంధమైన కోరికలు ఎక్కడివి? నేడు అనేకమంది కోరికలు తీరకపోతే మళ్ళి వస్తారని అంటున్నారు. అస్సలు కోరికలు కలిగిన శరీరమే మట్టిలోనికి వెళ్ళిపోతే మరి ఇలాంటి కోరికలు ఆత్మకు ఉంటాయా?
10) మట్టిలో కలిసిపోయిన శరీరానికి ఇక కోరికలు ఉండవు. ఈ శరీర సంభంధమైన కోరికలు తీర్చుకోవడానికి ఆత్మ వస్తుందా??. జ్ఞానము లేకపోవడం వల్ల అబదాన్ని నమ్ముతున్నారు. ఈ శరీరం ఎలాంటిది అంటే ఆత్మ ఉంటే కానీ శరీరం ఉండదు. ఆత్మ లేకపోతే శరీరం ఎందుకు పనికి రాదు. శరీరం లేకపోతే ఆత్మ ఉండదు.అంటే ఈ భులోకంలో శరీరం+ ఆత్మ కలిసి ఉంటేనే జివించగలం. శరీరం+ ఆత్మ విడిపోతే రెండు ఈ లోకంలో ఉండలేవు.ఆత్మ లేని శరీరం ఉండదు & శరీరం లేని ఆత్మ కూడ ఉండదు.
11) చనిపోయిన తర్వాత ఆత్మలుగా తిరుగుతున్నారనీ ఎందుకు అనుకుంటున్నారు అంటే శరీరాన్ని మన చేతి ద్వారా కప్పి పెట్టెశాము మరి ఆత్మ ఏమి అయిపోయిందో తెలియదు గనుక ఇక్కడిక్కడే ఉందని అనుకుంటున్నారు. కానీ శవాన్ని తీయటం మన పని & ఆత్మను ఈ లోకం నుంచి తీసివేయుట దేవుని పని.అనగా ఇంటిలో ఉన్న శవాన్ని తీయుట మన పని & ఈ లోకంలో ఆత్మను ఉండకుండా తీసివేయడం దేవుని పని. దేవుడు చేసే పని తెలియకపోవడం వలన శవాన్ని మనం తీసుకెళ్ళాము కానీ ఆత్మను తీసుకెళ్ళలేదు గనుక ఆత్మ ఇక్కడిక్కడే తిరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ శవాన్ని తీయడానికన్న ఆలస్యం అవుతుందేమో గానీ ఆత్మను తీసివేయుటలో ఆలస్యం జరగదు.
12) యోబు 21:13-ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. అనగా చనిపోయిన తర్వాత ఆత్మ పాతాళానికి వెళ్ళడానికి కేవలము ఒక్క నిమిషము మాత్రమే. ఈ జ్ఞానము లేకపోవుట వలన మరణించిన తర్వాత ఇక్కడిక్కడే ఉంటున్నారని చాలా మంది ఉహించుకుంటున్నారు.కానీ మరణం తర్వాత మానవ జీవితం ఈ లోకములో కాదు. బ్రతుకున్నప్పుడు ఈ కోరికలు తీరకపోతే మరణించిన తర్వాత కోర్కెలు తీర్చుకునే అవకాశమే లేదు. ఎందుకంటే కోరికలు ఉంటున్న శరీరం శవం అయ్యినప్పుడు ఆత్మకు ఈ భుసంభందమైన కోరికలు ఎందుకు ఉంటాయి?
13) కనుక గాలిలో కలిసిపోతున్నారు అని అనుకుంటున్నారు కానీ శక్తీ గాలిలో కలిసిపోదని తెలియాలి. ఇక్కడిక్కడే తిరుగుతున్నారు అని అనుకుంటున్నారు కానీ మరణించగానే ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారన్న సంగతి తెలియాలి. కోరికలు తీరకుండా ఉన్నవారే ఒక వేళ మళ్ళి వస్తారనుకుంటే ప్రపంచములో మరణిస్తున్న ప్రతి ఒక్కరు అన్ని కోరికలు తీరే మరణిస్తూన్నారా???? లేదు. ప్రతి ఒక్కరు ఏదో ఒక కోరిక తీరకుండా చస్తున్నప్పుడు అందరు కనబడుతారు. మన గురించి మనకు సరిగ్గా తెలియకపోతే ముంచుకొస్తున్న మరణం తర్వాత ఏమి జరుగుతుందో తెలియకపోతే బ్రతికి ఉన్నను కూడ మనం బ్రతుకుకు అర్థం లేదు.కనుక మరణించిన వారు దయ్యాలుగా మారరు.






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget