Halloween Costume ideas 2015

work of God?

దేవుడు నీకు అప్పగించిన పని చేయుచున్నావా?
మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.
1) దేవుని మహా జ్ఞానాన్ని మన భుజస్కంధాల మీద వేసుకుని దేవుని వైపు తిరగని ఈ సమజాన్ని దేవుని వైపు మళ్లించగలిగే భాద్యతే దేవుడు మనకు అప్పగించిన పని. మనకి చెప్పి చేయకుండ ఉండువాడు మన పరలోకపు తండ్రి కాదు. అస్సలు పనిని ప్రారంభించిందే దేవుడు. అయన చేసిన పనిని ఆలోచిస్తే చాలా పెద్దదిగా, గొప్పదిగా ఉన్నదీ. దేవుడు చేసిన పని ఎంత గొప్పది అని ఆలోచిస్తే మనం చేయలేనంత గొప్పది. ఏంటి దేవుడు చేసిన పని అని ఆలోచిస్తే ఈ అనంతమైన విశ్వాన్ని (సృష్టిని)కలిగించే పని ప్రారంభించూటయే. పనిని ప్రారంభించింది , పనికి ప్రారంభికుడు, మనలను కనిన, ఈ లోకానికి మనలను పంపిన మన పరలోకపు తండ్రినే. అయన కలిగించిన పనిని చూస్తుంటే మనకకు అర్చర్యం కలుగుతుంది. శాస్త్రవేత్తలు లెక్కల ప్రకారంగా 1800 కోట్ల సంవత్సరాలు క్రిందట ఈ సృష్టిని కలిగించినట్టుగా అంచనాగా చెబుతున్నారు. సృష్టిలో ఉన్న ప్రతి వాటికీ ఒక పనిని పెట్టాడు. సూర్యుడు ,చంద్రుడు ఇలా ప్రతిది దాని దాని పని నేటికి చేయుచున్నది. 2) ప్రకృతిలో ఉన్న దేనినైన చూస్తే దేవుడు అప్పగించిన పనిని తుచా తప్పకుండా జరిగిస్తుంది.సామెతలు 16:4-యెహోవా ప్రతి వస్తువును “దాని దాని పని” నిమిత్తము కలుగజేసెను. అంటే ప్రతి వస్తువును దేవుడు కలిగించటానికి ముందే పనిని నిర్ణయించి కలిగించాడు. అన్నిటికి ఒకే పని లేదు. ఏ వస్తువుకు ఏ పని దేవుడు అప్పగించాడో అదే పని ప్రకృతంతా జరిగిస్తుంది. దేవుని మాటలు వినిన ఈ ప్రకృతి తనకు అప్పగించిన పనిని,భాద్యతను సక్రమముగా జరిగిస్తుంది కానీ మనిషికి దేవుడు అప్పగించిన పని ఏంటో తెలుసుకునే స్థితిలో లేడు. మనిషికి దేవుడు పనిని ఎప్పుడు నిర్ణయించాడో కూడా నేడు ఉన్న మనుషులకు అర్థం కావడం లేదు.

3) మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తీస్మం పొంది బైబిల్ చదువుతున్న ప్రతి క్రైస్తవుడికి దేవుడు అప్పగించిన పని ,భాద్యత ఏంటో తెలియక ఈ రోజు అనేకులైన క్రైస్తవులు భాద్యత లేనివారుగా జీవిస్తున్నారు. క్రైస్తవుడిగా మారిన ప్రతి వారికీ దేవుడు ఒక పనిని నిర్ణయించాడని,ఒక భాద్యతను అప్పగించాడన్న సంగతి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాలి. ప్రకటించే పని కేవలం పాస్టర్ గారిదే అని నేడు చాలా మంది విశ్వాసులలో కలుగుతున్న అభిప్రాయం. దేవుడు ఈనాడు ఉన్న క్రైస్తవులకు పనిని ఏమి అప్పగించాడో, ఆ పనిని ఎలా జరిగించాలో మనం జాగ్రతగా క్రింది వివరణ నుండి ఆలోచన చేద్దాము.

4) మనిషికి దేవుడు అప్పగించిన పని ఎప్పుడు నిర్ణయించాడో అని ఒక వేళ బైబిల్ నందు అలోచోస్తే మనిషి పుట్టక మునుపే మనిషికి దేవుడు పనిని అప్పగించినట్లుగా అర్థమవుతుంది. పాత నిబంధన కాలములో ఒక వ్యక్తి పుట్టుక ముందే ఆయనకు ఎలాంటి భాద్యతను దేవ దూత ద్వార దేవుడు వర్తమానాన్ని పంపించాడో చూద్దాం.. న్యాయాధి 13:5-నీవు గర్భవతివై కుమారుని కందువు..... ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకుని దేవునికి నాజిరు చేయబడినవాడై ఫిలిష్తియుల చేతిలో నుండి ఇశ్రాయేలియులను రక్షింప మొదలు పెట్టునని ఆమెతో అనగా... ఈ వచనమును జాగ్రతగా ఆలోచిస్తే ఫిలిష్తియుల చేతిలో నుండి ఇశ్రాయేలియులను రక్షింపజేయాలన్న పనిని “సంసోనుకి” పెట్టాడు. మనోహ దంపతుల దగ్గరకు దేవదూత వచ్చి చెప్పిన వర్తమానము ఇది. పాత నిబంధనలో భలాడ్యుడైన సంసోను ఇంకా పుట్టాక ముందు దేవదూత పలుకుతున్న మాట ఇది. చరిత్రలోనికి వెళ్లి మనం జాగ్రతగా బైబిల్ నందు ఆలోచన చేస్తే సంసోను ఇంకా భూమి మీదకు రాక మునుపు అతడు పుట్టిన తర్వాత చేయవలసిన పని ఏమిటో ఇక్కడ దేవుడు ముందుగానే దూత ద్వారా తెలియజేసాడు. ఫిలిష్తియుల చేతిలో నుండి ఇశ్రాయేలియులను రక్షింపజేయుటయే సంసోను పుట్టుక కారణం .పుట్టుక పేరుతో సంసోను ఈ భూమి మీదకు రాక ముందే దేవుడు పనిని నిర్ణయించాడు.

5) ఇక క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధనలో కూడా మళ్ళి దేవదూత ద్వారా దేవుడు చెప్పిన మాటలు లూక సువర్తలో చూడగలము. లుకా 1:12-17-అప్పుడు దూత అతనితో- జేకర్య భయపడకుము. నీ ప్రార్ధన వినబడింది. నీ భార్యయైన ఎలిసబెతు నీకు కుమారుని కనును. అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై, ద్రాక్ష రసమైనను ,మద్యమైనను త్రాగక ,తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుదాత్మతో నిండుకొనినవాడై “ఇశ్రాయేలీయులలో అనేకులను దేవుని వైపుకు త్రిప్పును”.. బాప్తీస్మం ఇచ్చు యోహాను గూర్చి కూడా దేవదూత జేకరియ దగ్గరకు వచ్చి పలుకున్న మాటలు ఇవి. తల్లి గర్భములోకి ఇంకా రాకముందే యోహాను పుడతాడని ,ఆ యోహాను ఎలాంటి కార్యక్రమాలు చేస్తాడో అని దూత ద్వార దేవుడు సెలవిచ్చిన మాటలు ఇవి. అనగా ఇశ్రాయేలీయులను ప్రభువు వైపు త్రిప్పే పని దేవుడు యోహానుకు పుట్టక ముందే నిర్ణయించాడు.

6) అలానే యేసుక్రీస్తు రాకడ గుర్చిన విషయాలు చూద్దాం. లుకా 1:29,30-దూత-మరియా భయపడకుము.దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు.... అనగా యేసు ఇంకా మరియ గర్భములోకి రాకమునుపే ఆయనకు ఏ పేరు పెట్టాలో దూత చెబుతున్నది. మత్తయి 1:20,21- ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై ..... తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదవనేను.... యేసు యొక్క పుట్టుక పరమార్ధము ప్రజల యొక్క పాపాల నుండి రక్షించే పని. గలతీ 1:15- అన్యజనులలో యేసును ప్రకటింపవలెనని పని పెట్టాడు దేవుడు.

7) ఇలా బైబిల్లో అనేక సందర్భాలను చదువుతున్నప్పుడు ఇలా మనిషి పుట్టక ముందు మనిషికి దేవుడు పనిని,భాద్యతను అప్పగించినట్లుగా పైన చెప్పబడిన సందర్భాలులో అర్థమవుతున్నాయి. యేసు ఏ పనిని అయితే చేయమని అప్పగించాడో ఆ పనిని క్రైస్తవులైన మనము చేయాలి. అదే మార్కు 16:15-మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి.అలసిపోయి చివరికి ప్రాణం పోయే అంతగా తండ్రి తనకు అప్పగించిన పనుల మీద యేసు నిమగ్నమైపోయాడు. యోహాను 17:4-చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరచితిని... వాస్తవముగా దేవుడు మహిమపరచబడాలంటే దేవుడు చెప్పిన పనిని చేయాలి.

8) మనం క్రీస్తును గుర్చిన మాటలు(మరణ సమాధి పునరుర్ధానము) ప్రకటించే పని చేయాలి .నీ,నా జీవిత కాలములో నీవు నేను అలసిపోయే అంతగా దేవుని కార్యక్రమాలలో ,పనులలో నీవు నేను ఉండాలని దేవుడు మన తల్లి గర్భములో రూపించుకొనక ముందు తలచి మనకు చక్కటి ఆకారాన్ని అమర్చాడు. తన కొరకు అమర్చిన ఈ అవయవాలతో దేవుని పనిని చేయాలి. ఈరోజు మనలను తగిన ఆరోగ్యముతో ,ఆయుష్షుతో కాపాడుతున్నది ఎందుకు అని నీవు నేను ఆలోచిస్తే దేవుని పనిని జరిగించటానికి,దేవుని ఇష్టాన్ని నెరవేర్చటానికి....మనం ప్రాణం పోయేంత వరకు పనిలో ఉండాలి.

9) చివరిగా దేవుని మనస్సైన బైబిలను బాగా చదివి అలోచించి,పరిశోధించి,పరిశీలించి,చదివి,విశ్వసించి,నమ్మి ,అలాగున జీవించి మరొకరికి వాక్యం చెప్పి వారిని దేవుని వైపు మళ్ళించండి.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget