Halloween Costume ideas 2015

Devuni Pani Chestu Papam Cheyyavatcha?

దేవుని పని చేస్తూ పాపం చేయవచ్చా? 

అతి పరిశుద్దుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
ఈ అనంత విశ్వంలో నీలి ఆకుపచ్చని గ్రహమైన భూమి పై మానవ జీవితం ప్రారంభమైనది. దేవుడే తన సంకల్ప ప్రణాళిక చొప్పున కోటానుకోట్ల మంది పిల్లలు కావాలనే ఉద్దేశ్యంతో సృష్టిని కల్గించాడు.మానవ పుట్టుటకు దేవుడే కారకుడై మనం తన కొరకు బ్రతకాలనే ఆశ కలిగియున్నాడు కానీ, అందుకు భిన్నముగా ఈ రోజు మనషి ప్రవర్తిస్తున్నాడనే చెప్పాలి. దేవుని కొరకు కష్టపడాల్సిన మనిషి సుఖాన్ని ఆలవాటు చేసుకుని సుఖపడే ప్రయత్నంలో దేవున్ని పూర్తిగా మర్చిపోయడనే చెప్పాలి. అవినీతి పరులుగా,దోపిడి దొంగలుగా, దేవునియెడల భయభక్తులు లేకుండా పాపం చేసే వారిగా, పైకి దేవుని పని చేస్తూ పాపం చేస్తూ శారీరక ఆనందము పొందువారిగా జీవిస్తూ దేవునిని దుఖపెడుతున్నారు.

1) ఈ సమాజములో మనుష్యుల మధ్యన బ్రతుకున్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్న మాటను చూస్తేఎఫేసి 5:15-దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనునట్లు జాగ్రతగా చూచుకొనుడి.ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకోనుడి. చెడిపోయిన సమాజములో బ్రతుకుతున్న మనం చెడిపోకుండా మనకున్న సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుడు చెబుతున్నాడు. చావుకు,పుట్టుకకు మధ్యనున్న ఈ కాలమే మనల్ని పరలోకానికైన లేక నరకానికైనా చేర్చుతుంది. అనగా మనిషి జీవితంలో అత్యంత విలువైన, ప్రాముఖ్యమైన సమయమే ఈ భూమిమీద మనకున్న బ్రతుకు కాలం. సమయమును పోనియ్యక జ్ఞాని వాలే సద్వినియోగము చేసుకోవాలంటే ముందు దేవుని చిత్తమేంటో తెలియాలి.

2) 1 దేస్సలోనిక 4: 3 నుండి- మీరు“పరిశుద్దులగుటయే” అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము.మీలో ప్రతివాడును దేవునిని ఎరుగని అన్యజనులవలె కామాభిలాషయందు కాక పరిశుద్దతయందును, ఘనతయందును తన తన ఘటమును(శరీరమును) ఏట్లు కాపాడుకోనవలేనో ఆది యేరిగియుండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడైనను అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండవలెను. ఎందుకనగామేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము “ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిదండన చేయువాడు”. “పరిశుద్దులగుటయే దేవుడు మనలను పిలిచెను గానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు”.ఎఫేసి 1:4,6-మనము తన యెదుట పరిశుద్దులమును, నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత అయన క్రిస్తులో మనలనుఏర్పరచుకొనెను. అనగామనము పరిశుద్దత కలిగి నడుచుకొనుట దేవుని చిత్తమని పై వచనముల ద్వారా తెలుస్తుంది. 3) ఈ రోజు క్రైస్తవ సమాజములో కొందరు అనగా అబద్ద భోదకులు చెబుతున్న మాటలను వింటే దేవుని పని చేసే వాడు పాపం చేసిన ఫరవాలేదని,తన పని చేస్తున్నాము కనుక పాపం చేస్తున్నదేవుడేక్షమించుకుంటాడని అనుకుంటూ భోదిస్తున్నారు. ఒక ఉద్దేశ్యంతో దేవుడు ఇచ్చిన ఈ శరీరముతో సాతాను కార్యాలు చేయాలా లేక దేవుని కార్యాలు చేయాలా అని మానవులైన మనము తెలుసుకొనవలసిన మొదటి విషయము. రోమా 12:1-పరిశుద్దమును దేవునికి అనుకులమునైన సజీవ యగాముగా మీ శరిరములను ఆయనకు సమర్పించుకోనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. పరిశుద్దులగుటకే దేవుడు మనలను పిలిచెను కానీ ఆపరిశుద్దులుగా,ఆపవిత్రులుగా,పాపాత్ములుగా, పాపం చేసే వారిగా,పాపంలో నిమగ్నమై పోయే వారిగా ఉండుటకు దేవుడు మనలను పిలవలేదన్న విషయము తెలుసుకోవాలి.

4) జ్ఞాని వలేసమయమునుసద్వినియోగం చేసుకొనవలసిన క్రైస్తవుడు ఆజ్ఞానిగా కలిగియున్న సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు. ప్రకటన 3:16- నీవు వెచ్చగానైనను,చల్లగానైనను ఉండక నులి వెచ్చనగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నుద్దేసించున్నాను. దృష్టి యొక్క ఇష్టం చొప్పున,మనస్సు యొక్క ఇష్టం చొప్పున వాక్యనుసారముగా కాక ప్రవర్తించినచో విటినన్నిటి విషయమై దేవుడు ఒక దినాన తిర్పులోనికి తెచ్చునని ప్రతి మనిషి జ్ఞాపకం ఉంచుకోవాలి.ప్రసంగి 12:14-గూడమైన ప్రతి అంశమును గూర్చి దేవుడు విమర్శ చేయునప్పుడు అయన ప్రతి క్రియను ఆది మంచిదే గానీ, చెడ్డదే గానీ తిర్పులోనికి తెచ్చును.

5) పరలోకము పై ఆసక్తి తగ్గుట వలన,ఈ లోకంపై మోజు పెరుగుట వలన ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. 1 కోరంది 6:9- ఈ వచనములో దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారో అన్నవిషయాలు చెప్పబడినవి. గలతీ 6:1- ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకోనిన యెడల ఆత్మ సంభందులైన మీలో ప్రతి వాడు తానును శోదింపబడునేమో అని తన విషయమై చూచుకోనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకుని రావలెను. దేవుని పని చేస్తున్న ఫలానా వ్యక్తి పాపంలో పడిపోతే ఇక మనం ఎందుకు పాపం చేయకూడదు అని అనుకుంటున్నారు. చిన్న ఉదాహరణ చూస్తే ప్రతి ఒక్కరికి బండి నేర్పించుటకు సహాయం చేసిన వారు ఎవరో ఒకరు ఉండి ఉంటారు.బండి నేర్పించిన వాడు బస్సు నీ డి కొడితే నాకు బండి నేర్పించిన వాడే బస్సు నీ డి కొట్టాడు కనుక నేర్చుకున్న నేను కూడ డి కొడతానని అంటామా? అనము. కానీ ఆయనే పాపం చేసాడు కనుక మనం పాపము చేసేద్దాం అనే ఆలోచనను కలిగియున్నారు.

6) దేవుని మాటలు చెప్పి మంచి దారికి తీసుకుని రావాలే కానీ మనం కూడా వారి పాపములో కలసిపోకూడదు. నిజముగా నువ్వు దేవునిని ప్రేమించేవాడివైతే తప్పిపోతున్న వాడి నిమిత్తము భాదపడి మంచి దారికి తెచ్చుటకు కృషి చేయాలి. అలా తీసుకుని వస్తే ఒక్క ఆత్మను పరలోకపు గమ్యం వైపు తీసుకునివచ్చిన వాడువైతావు. యాకోబు 5:19- మిలో ఎవడైనను సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి యొకడు అతనిని సత్యమునకు మళ్లించిన యెడల; పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి యొక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోనవలెను. అనగా ఎవరైన వాక్యము నుండి పడిపోతే వాడు పడిపోయాడని ఆనందపడక ,వాడు పడిపోయాడని నువ్వు పడిపోక నేను ఎక్కడ పడిపోతానో అని జాగ్రతగా చూసుకుంటూ వాడిని కూడ మంచి దారిలో తీసుకుని రావాలి.

7) 1 కోరంది 10:12-తాను నిలుచున్నానని తలంచుకోనువాడు పడకుండునట్లు జాగ్రతగాచూచుకోనవలెను. అనగ పాపంలో పడక స్థిరమైన విశ్వాసములో ఉంటూ పడిపోయిన వాడిని నిలబెట్టే పనిలో ఉండాలే కానీ వాడితో పాటు నువ్వు పడిపోకూడదు. వాస్తవముగా పాపంలో బ్రతకాలని అనుకుంటే మారుమనస్సు అనే పదానికి అర్థం లేదు. అపోకర్య 2:38-మీరు మారుమనస్సు పొంది ,పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీస్మం పొందుడి. పని చేస్తూ పాపం చేయవచ్చు అనే మాట నిజమైతే మారుమనస్సుతో అవసరత ఉందా?ఉండదు. మూర్ఖులైన ఈ తరము వారి నుండి వేరై ప్రత్యేకముగా దేవుని కొరకు జీవించాలి.

8) రోమా 2:21-ఎదుటి వానికి భోదించు నీవు నీకు నీవే భోదించుకొనవా? దొంగిలవద్దని ప్రకటించు నీవు దొంగిలేదవా? వ్యభించారించవద్దని చెప్పు నీవు వ్యభించరించేదవా? ...... మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది? నా స్నేహితులు నన్ను బాగా ఇబ్బంది పెట్టారు కనుక నేను ఇలా పాపాన్ని చేశాను అంటూ ఉంటారు. అలా అయితే రైల్ పట్టాల దగ్గరకు తీసుకుని వచ్చి రైల్ వచ్చాక దాని క్రింద తల పెట్టు అని మీ స్నేహితులు ఇబ్బంది పెడితే చేస్తామా? చేయము. అంటే నచ్చకపోయినా స్నేహితుడు ఇబ్బంది పెట్టిన చేయవు.

9) వాక్యానికిలోబడి, వాక్యనుసారముగా బ్రతికి దేవుని కొరకు ఈ లోకములో ఉన్నతముగా జీవించాలనే ఆశ కలిగియుండాలి.గుండెల నిండ దేవుని మాటలు నింపుకొని దేవుని కొరకు బ్రతకాలి. ఈ కడవరి దినాలలో,ఈ అంత్య దినాలలో,భయంకరమైన దినాలలో ఎప్పుడు కన్నుముస్తామో తెలియని జీవితాలు మనవి . యాకోబు 4:14- రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జివమేపాటిది? మీరు కొంత సేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటివారే....సామెతలు27:1- రేపటి దినమున గూర్చి అతిశయ పడకుము. ఏ దినమున ఏది సంభవించునో ఆదినీకు తెలియదు..

10) హెబ్రీ 12:1-సుళువుగా చిక్కున బెట్టు పాపమును విడచిపెట్టి విశ్వాసమునకు కర్తయు, దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు ,మన యెదుట ఉంచబడిన పందెములో ఓపికతో పెరుగెత్తుదము. క్రైస్తవం అనగా ఒక పందెపు రంగమనే చెప్పాలి. ఆగటానికి,వెనక్కి తిరగడానికి, అలసట తీసుకోడానికి అవకాశమే లేదు కానీ గమ్యమైన ఆ పరలోకం వైపు అలయక పయనించాలి. ఒక వేళ దేవుని గురించి తెలుసుకున్నాక, సత్యం గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత,దేవుని పనిలోకి వచ్చిన తర్వాత, దేవుని వాక్యము ప్రకటిస్తున్న తర్వాత,దేవుని కొరకు ఉన్నతముగా బ్రతుకుతున్న తర్వాత పాపం చేస్తే క్షమాపణ లేదు అనే మాటను చూస్తే హెబ్రీ 10:26- మనం సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము పొందిన తరువాత బుద్ది పూర్వకముగా పాపము చేసిన యెడల పాపములకు బలి యికను ఉండదు గానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు , విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఉండును.

11) ఏది మంచి,ఏది చెడు అని తెలిసిన కూడ కావాలనే కోరిక కలిగి లోకానుసారముగా జీవిస్తూ పాపం చేయుట అవసరమా? అట్టివారికి అగ్ని సిద్దముగా ఉన్నదని పై వచనము ద్వార అర్థమవుతుంది.పరిశుద్దముగా, దేవునికి అనుకూలమైన సజివ యాగముగా మనం శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించాలి. దేవని కొరకు ఉన్నతముగా జీవించి దేవునికి మహిమ తీసుకొచ్చే విధముగా బ్రతకాలి. లోకంలో కలసిపోకుండా లోకానికి వేరై జీవించాలి. మన విశ్వాసాన్ని చివరి వరకు పరిశుద్దముగా కాపాడుకోవాలి. 12) రోమా 13-8- 14 వరకు చూడగలరు. ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోనినవారై శరీరేచ్చలను నేరవేర్చుకోనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికోనకుండా ఉండాలి.సంకల్ప బలం అనేది నీలో ఉంటే, వాక్యాన్ని నిజముగా పాటిస్తే, వాక్య ప్రకారముగా బ్రతకాలని నిర్ణయం నీలో ఉంటే, నశించుపోయే ఆత్మల పట్ల భారము కలిగి జీవించాలని ఆశ ఉంటేఖచ్చితముగా దేవుని కోసము ఏదైనా చేయగలవు.








Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget