Halloween Costume ideas 2015

Ippativaraku varu andaru paralokaniki vellara?

ఇప్పటివరకు చనిపోయిన వారందరు 
పరలోకము వెళ్ళరా?
ఈ రోజు మరణించిన వారి విషయములో christians కీ ఉన్న అభిప్రాయము,ఆలోచన మరణించగానే పరలోకము వెళ్ళిపోతున్నారని. మరణించినవారు ఎలాంటి వారు అనే ఆలోచన చేయకుండా ఎవ్వరు మరణించిన స్వర్గాస్తులు అయ్యారు,పరలోకము వెళ్లారు అని చెప్పడము పరిపాటి అయ్యినది. అస్సలు వీరి మాటలలో ఎంత వాస్తవం ఉంది?మరణించినవారు పరలోకానికి వెళ్ళిపోతున్నారా?? మనము bibleనే నమ్మాలి తప్పమనుష్యులు రాసిన పుస్తకాలను కాదు.bible లోని దేవుని మాటలకు శిరస్సు వంచాలే తప్ప మనుషుల మాటలకు కాదు.అంటే మనుష్యుల మాటలలో లేదు నిత్యజీవము దేవుని మాటలలో ఉంది.
1) భూమి మీద మొదటి జననము ఆదాము జరిగింది కానీ మరణము మాత్రము హేబెలు ద్వార ప్రారంభం అయినట్లుగా మనకు తెలుసు.మొదటిగా మరణించిన ఈ నితిమంతుడైన హేబెలు మొదలుకొని నేటివరకు మరణించిన నీతిమంతులు అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు?ఎక్కడ ఉన్నారు?ఎంతకాలము ఉంటారు? ఆ తర్వాత ఏమి అయిపోతారు అన్న విషయాలను ఇప్పుడు ఆలోచిద్దాము. మరణించినవారు మరణించగానే స్వర్గాస్తులు అయ్యారు అని చెప్పటము చాలా తప్పు.మరణము అనగా ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టడము.ఆత్మ విడిచిపెట్టినప్పుడు ఎవరికీ కనపడదు కదా? కనపడని ఆత్మ స్వర్గానికి వెళ్లిందని వీళ్ళకు ఎలా తెలుసు??? ఏమి జరుగుతుంది మరణము తర్వాత???మరణించిన వారిలో నీతిమంతులుగా ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు??? నిజముగా అనుకున్నట్టు పరలోకముకి వెళ్ళుతున్నార?
ఇంకా ఎక్కడికైనా వేళ్ళుతున్నారా? అన్న ప్రశ్నలకు జవాబు bible లోని మాటలు ద్వార చూద్దాము.
2) అబ్రహాము మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము-- ఆదికాండ25:8-నిండు వృద్దాప్యముకు వచ్చినవాడై మరణించి “”తన పితరుల యొద్దకు చేర్చబడెను””. ఇక్కడ అబ్రహాము మృతి చెంది పరలోకముకు చేర్చబడ్డాడు అని వ్రాయబడిందా??? లేదు. అబ్రహామునే పరలోకము వెళ్ళకపోతే వీరు ఎలా పోతారు? మరణించిన అబ్రహాము పితరుల యొద్దకు చేర్చబడెను. నీతిమంతుడు, విశ్వాసులకు తండ్రి, దేవునికి స్నేహితుడుగా పిలవబడిన అబ్రహాముచనిపోయిన తర్వాత పితరులయొద్దకు వేళ్ళాడే తప్ప పరలోకము చేరుకోలేదు అని తెలుస్తుంది. 3) ఇస్సాకును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము— ఆదికాండ35:28- నిండు వృద్దుడై మరణించి “”తన పితరుల యొద్దకు చేర్చబడెను””. ఇస్సాకు విషయములో కూడా మరణించిన తర్వాత తన పితరుల యొద్దకు చేర్చబడ్డడే తప్ప పరలోకమునకు కాదు. అంటే అబ్రహాము ,ఇస్సాకు ఇద్దరు ఒకే చోటులో ఉన్నారని అర్థమైనది. వీరికి ముందు novah,హనోకు, హేబెల్ కూడా ఒకే చోట ఉన్నట్టుగా మనకు అర్థమైనది.
4) యాకోబును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము—ఆదికాండ 49:33-తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. ఈయన కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డడే తప్ప పరలోకమునకు కాదు. అంటే నీతిమంతులు అందరు ఒక చోటికి చేరిపోతున్నారని అర్థమైనది. పరలోకము వెళ్ళారని వీళ్ళులేదు.
5) దావీదును మరణించిన తర్వాత ఎక్కడికి పోయాడో చూద్దాము. అపోకర్య2:34- దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు.. దేవునికి ఇస్టానుసారుడు, దేవుని ఉద్దేశాలను నెరవేర్చిన దావిదే పరలోకము వెళ్ళకపోతే నీతిమంతులు(novah, హనోకు, హేబెల్ ఇస్సాకు, అబ్రహాము) కూడా వెళ్ళలేదు.మరణించినవారు పరలోకము వెళ్లలేదని చెప్పితే ఈ మధ్యకాలములో మేము పరలోకము వెళ్లి వచ్చాము అని అంటున్నారు. మరణించినవారు నితిమంతులైన వారు పరలోకము వెళ్లలేదని bible చెప్పింది.
6) ఇంతవరకు పరలోకము ఎవ్వరు వెళ్లలేదని bible ద్వార సులువుగా అర్థమైతే ఈ మధ్యకాలములో ఒకడు నేను పరలోకము వెళ్లివచ్చానని, చనిపోయినవారు పరలోకము పోతున్నారని అంటున్నారు.పరలోకానికి picnic అని, నరకానికి picnic అనే పుస్తకాలను చదివి నమ్ముతున్నారు. మోసపోయేవాడు ఉన్నంతకాలము మోసగించేవాడు మోసగిస్తునే ఉంటాడు.ఇలాంటి అబద్ద భోదలు వినినంతకలము అబద్దభోదకులు చెప్తూనే ఉంటారు.ఇప్పటివరకు bible లోని సందర్భాలను బట్టి ఎవ్వరు పరలోకము వెళ్ళలేదు కానీ యేసుక్రీస్తు వెళ్ళాడు. john 3:13-పరలోకము నుండి దిగివచ్చినవాడే,అనగా పరలోకములో ఉండు మనుష్యకుమరుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడు లేడు. ఇది యేసు స్వయముగా చెప్పుతున్న మాట.ఇప్పటివరకు పరలోకానికి jesus తప్ప ఎవరు వెళ్ళలేదు. యేసు అయన మాత్రము వెళ్ళాడు అంటే వీరు మేము పరలోకము వేల్లివచ్చము అంటారు ఏంటి?గొప్పలు కోసము దేవుని మాటలను మార్చేస్తున్నారు.

7) మరి మరణించినవారు ఇటు ఈ భూమి మీద లేక, అటు పరలోకము వెళ్ళక మరి ఎక్కడికి వెళ్లినట్టు??ఏమి అయ్యినట్టు??మనకు తెలిసింది మూడు లోకాలు. పరలోకము-దేవుడు ఉండే స్థలము,భూలోకము-నరులు ఉన్న లోకము , పాతలలోకము-మరణించినవారు ఉండే లోకము.ఇప్పటి వరకు మరణించిన నీతిమంతులు పరలోకములో లేరు, భూలోకములో లేరు ఇంకా పాతాలలోకము లో ఉన్నట్టు. ఇదేంటి నీతిమంతులు కూడా పాతాలములో ఉంటారా అని సందేహపడకండి. దీనికి జవాబు చూద్దాము.
8) luke 16:22 నుంచి ప్రతిమాట చదివితే మనకు పూర్తిగా అర్థమవుతుంది. ధనవంతుడు and లజారు సన్నివేశము..అబ్రహాము address తెలిస్తే ఇప్పటివరకు మరణించిన నీతిమంతులు కూడా ఎక్కడ ఉన్నరో తెలుస్తుంది. చదివితే అబ్రహాముకూడా పాతాలములో ఉన్నట్టు తెలుస్తుంది. అంటే దేవుని కోసము ఈ భూమి పై బ్రతికిన వారు పాతాళము పోతున్నారు and అంటే దేవుని కోసము ఈ భూమి పై బ్రతకని వారు పాతాళము పోతున్నారు అని అర్థమైనది. ఈ భూమి పై మరణించిన తర్వాత వెనువెంటనే వెళ్ళే చోటు పాతాళము అని తెలుసుకున్నాము.
9) లజారు ను పంపుము అంటున్నాడు అంటే ఒకే పాతాల ప్రదేశములో స్థలాలు వేరుగా ఉన్నట్టు అర్థమవుచున్నది. ఈ భూమి పై దేవుని కోసము బ్రతకక చనిపోయిన ధనవంతుడు అగ్ని జ్వాలలలో ఉన్నాడు. హా పాతాలములో ఉన్నప్పటికీ ఒక ప్రతేకమైన స్థలములో ఉన్నట్టు అర్థమవుచున్నది. కనులెత్తి అను మాటను బట్టి నీతిమంతులు up section లో ఉన్నట్టుగా, ధనవంతుడు down section లో ఉన్నట్టుగా అర్థమైనది.పతలములో రెండు sections అంటే వేధనకరమైన స్థలము మరియు నెమ్మది స్థలము.
10) పాతాళము ఒక్కటే కానీ రెండు విబిన్న స్థలాలు కనపడుతున్నాయి. a) నెమ్మది స్థలము b) వేధనకరమైన స్థలము. ఈ భూమి పై దేవుని కొరకు బ్రతికేవారు వెళ్ళు చోటు నెమ్మది స్థలము. ఈ భూమి పై దేవుని కొరకు బ్రతకనివారు వెళ్ళు చోటు వేధనకరమైన స్థలము అని మనకు అర్థమవుతుంది. luke 16:26- రెండిటి స్థలాల మధ్య ఒక అగాధము ఉన్నట్టుగా చూస్తున్నాము. నెమ్మది స్థలము అనగా luke 23:43 లో పరదైసు అని ఉంది. పరదైసు ,పరలోకము ఒక్కటి కాదు( john 20:17). పరదైసు(నెమ్మది స్థలమ) పాతాలములో ఒక భాగము. ఈ భాగము లో హేబెలు మొదలుకొని ఇప్పటివరకు చనిపోయిన నితిమంతుకు అందరు ఉన్నారు.యేసుక్రీస్తు రెండవ రాకడ గా వచ్చేంతవరకు వెళ్ళవలసిన స్థలము ఇదే.
11) హెబ్రీ 11:36 నుంచి చూస్తే నెమ్మది స్థలము కు వెళ్ళిన వారు ఈ భూమిపై దేవునికోరకు ఎంత శ్రమ పడ్డారో తెలుస్తుంది. john 14:2- నేను వెళ్లి మీకు స్థలము సిద్దపరచ వెళ్ళుతున్నాను.......... అంటే పరలోకములో స్థలము సిద్దపరిచే వరకు ఈ పరదైసులో ఉండండి అని అర్థము.
12) conclusion::::: హేబెలు మొదలుకొని ఇప్పటివరకు మరణించిన నీతిమంతులు ఈ ఒక్కరు యేసు తప్ప పరలోకానికి వెళ్ళలేదు. నీతిమంతులు పాతాలములోని నెమ్మది స్థలములో(పరదైసు) లో ఉన్నారు. అనీతిమంతులు పాతాలములోని వేధనకరమైన స్థలము న ఉన్నారు. కనుక మనము ఈ బహుము పై ఉన్నంతవరకు దేవుని పనిలో ఉండి మరణించిన తర్వాత ఉండే పరదైసులో ఉండడానికి ప్రయత్నము చేద్దాము.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget