Halloween Costume ideas 2015

The sixth word

యేసు క్రీస్తు సిలువపై పలికిన ఆరవ మాటలో మనము తెలుసుకొనవలసిన వివరణ
యేసు క్రీస్తు సిలువపై పలికిన ఆరవ మాటలో మనము తెలుసుకొనవలసిన వివరణ
ముందుగా మన ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను. యోహాను19:30- యేసు ఆ చిరక పుచ్చుకొని-సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
సమాజములో bible పై వ్యతిరేకులు అనగా క్రైస్తవ వ్యతిరేకులు కొంత మంది ఉన్నారు . వాళ్ళు అంటున్న మాట యేసు సిలువపై అస్సలు చనిపోలేదు మరియు దీనికి సాక్షిగా ఈ ఆరవ మాటను చూపిస్తున్నారు. ఇందులో యోహాను17:4-చేయుటకు నీవూ నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని.. ఈ వచనమును వాళ్ళకి అర్థమయ్యే రీతిగా అర్థము చేసుకుని యేసు సిలువ పై అస్సలు చనిపోలేదు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చెప్పుచున్న మాటలలోకి వెళ్దాము. పై వచనములో సంపూర్ణముగా నెరవేర్చి అని అంటున్నాడు అనగా already నేరవేర్చేసాడు ఇంకా యోహాను19:30లో ఉన్న వచనమును మీరు సృష్టించుకున్నారు అని అంటున్నారు. పని పూర్తి అయ్యినదని యోహాను17:4లో చెప్తే మళ్ళి యోహాను19:30లో సిలువ వేయబడ్డాడు అని ఎలా చెప్తారు అని అంటున్నారు. అస్సలు యోహాను19:30లో సమాప్తమైనదని అనడము ఏంటి ? యోహాను17వ అధ్యాయముకే యోహాను సువార్త complete అయ్యింది and యోహాను 19 అధ్యాయము మీరు కల్పించి యేసు సిలువపై మరణించాడు అని చెప్పుచున్నారు అని అంటున్నారు. క్రైస్తవులమైన మనము వారికీ జవాబు చెప్పవలసిన భాద్యత ఉందని bible చెప్పుచున్నది. phillipu 2:14,16- అట్టి జనము మధ్య మీరు జివ వాక్యమును చేత పట్టుకుని ,లోకమందు జ్యోతులవలె కనబడుచున్నారు. 1 పేతురు 2:15- అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. 1) ఇప్పుడు యోహానులో ప్రస్తావించిన రెండు పనుల గూర్చి చూద్దాము. మొదటగా యోహాను 17వ అధ్యాయము, 19 వ అద్యాయములో ఉన్న చెప్పబడిన పనులు వేరు వేరు. యేసుక్రీస్తు ఈ లోకానికి చాలా కారణాలతో వచ్చాడు. యేసు ఈ లోకానికి వచ్చుటకు 7 ప్రధానమైన కారణాలు. a) తండ్రిని భయలుపరచబాడడానికి b) దేవుని రాజ్యమును స్థాపించుటకు ,దెయ్యము రాజ్యము చూపుటకు. c)పాపులను రక్షించుటకు d) అన్యజనులను israelsతో సహాపౌరులుగా చేయటకు. e) ధర్మశాస్త్రము అను చేరలో ఉన్నవారిని విడిపించి కొత్త నిబంధన క్రిందకు తీసుకురాడానికి వచ్చాడు. f) శరీరముతో ఉన్న మచ్చ లేకుండా జీవించవచ్చు అని రుజువు చేయడానికి g) అంత్యదినములను ప్రారంబించడానికి.
2) మొదట యోహాను17:4లో చెప్పబడిన పని వాక్యమును ప్రకటించుట .mark1:38-అయన( యేసు) ఇతర సమీప గ్రమములోను నేను ప్రకటించునట్లు వెళ్ళుదము రండి;యిందు నిమిత్తమే గదా నేను బయలదేరి వచ్చితినని వారితో చెప్పెను. అనగా వాక్యము or సువార్తను ప్రకటించడానికి వచ్చాడు. ఇది ఒక పని...... రెండవదిగా యోహాను19:30లో చెప్పబడిన పని ప్రాణము పెట్టట. యోహాను 10:17-నేను దాని మరలా తిసికోనునట్లు నా ప్రాణము పెట్టుచున్నాను;ఇందు వలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. యేసు క్రీస్తుకు ఉన్న మరో పని ప్రాణము పెట్టుట. పై రెండు పనులు అనగా ప్రకటించే పని and ప్రాణము పెట్టె పని.
3) యోహాను17:4లో ఏ పనికి సంబందించినదో చూస్తే ప్రకటించే పని. ఈ వచనములో ప్రకటించే పని పూర్తి అయింది. ఇంక balance యోహాను19:30లో అనేక మంది పాపాల కొరకు అయన ప్రాణము పెట్టె పని. కన్ను మూసే లోపు పని పూర్తి చేసాడు యేసుక్రీస్తు. యేసు ఆయుష్షును ,పనిని ఏ విధముగా పూర్తి చేసాడో అలాగే మనము ఈ రెండు పనులు పూర్తి చేయాలి. మన చేయవలసిన పని ఏంటో చూస్తే ఎఫేసి2:10-దేవుడు ముందుగా సిద్దపరచిన సత్ క్రియలు చేయుటకై ,మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడినవారమై అయన చేసిన పనియైయున్నాము. మనము ఆలోచించవలసింది కేవలము ఆయుష్షును పూర్తి చేస్తున్నామా లేక దేవుని పనిని కూడా పూర్తి చేస్తున్నామా?
రోమా14:12-మనలో ప్రతివాడును తనను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను..... మనము చనిపోయాక మనము జీవించిన జీవితము బట్టి దేవునికి లెక్క అప్పగింపవలెను..... ఈ లోకములో ఉన్నంతవరకు మనము చేయవలసిన పని మనలని మనము రక్షించుకుంటూ అనేకమందికి వాక్యమును ప్రకటించి రక్షించి పని పూర్తి చేయాలి. అలా కాకుండా కేవలము ఆయుష్షును పూర్తి చేసి పని చేయకుండా దేవుని ఎదుట దోషిగా నిలబడాల్సివస్తుంది.
Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget