Halloween Costume ideas 2015

EE kalam lo Devudu thana pani koraku Sevakulanu Pilechuna?

ఈ కాలములో దేవుడు తన పని కొరకు సేవకులను పిలుచునా?

పాత నిబంధనలో సౌలును పిలిచాడు కదా, దావీదును పిలిచాడు కదా,మోషేను పిలిచాడు కదా అన్నసందర్భాలను జ్ఞ్యాపకము పెట్టుకున్నారు.దేవుడు పిలుపు ఇస్తాడు,పిలుపు వచ్చేంత వరకు సేవ చేయకూడదు అని అంటున్నారు.అనేక మంది దేవుని పని చేస్తాను అని ముందుకు వచ్చిన, దేవుడు పిలుపు కోసము ఎదురు చూడు అని చెప్పుతున్నారు.అనేక మంది మీరు దేవుని సేవకు వెళ్తున్నారు కదా పిలుపు ఉందా అని అడుగుతున్నారు. ఇలా అనేక మంది పిలుపు అన్న మాటకు అర్థము తెలియక దేవుని పని చేయటము మానేసారు... మోషే ను పిలిచినా దేవుడు నిన్ను పిలవడా అని ఎవరైనా అంటే మోషే చేత సముద్రాన్ని పాయలు చేయించిన దేవుడు నీ చేత చేయిస్తాడా అని బంగాళాకతము సముద్రానికి తీసుకెళ్ళాలి. మోషే చేత అద్బుతము చేయించిన దేవుడు నీతో ఎందుకు చేపించడు అంటే silent గా ఉంటారు.

ప్రారంబములో అలా పిలిచినా దేవుడు ,యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత తన సేవ కొరకు ఎలా పిలుస్తున్నాడని తెలిస్తే ఈ రోజు వీరు అనుకున్నట్టుగా పిలవటం లేదు అని అర్థము అవుచున్నది. అనేక మంది గదిలో ప్రార్ధన చేస్తున్నప్పుడు చల్లని ,మెల్లని స్వరముతో కుమారుడా నీవూ నెల్లూరు వెళ్ళు అని వినపడిందని చెప్పుతున్నారు. నెల్లూరుకు వెళ్ళమని దేవుడు ఇతనికి చెప్తే నెల్లూరు వాళ్ళకి దేవుడు ఇతడు వస్తున్నాడు మీ దగ్గరకు అని చెప్పొచ్చుగా?
1) ఈ కాలములో దేవుడు పిలుస్తానని వ్రాశాడా? పిలిచానని వ్రాశాడా? ఒక వేళా పిలిస్తే ఎలా పిలుస్తున్నాడో bibleలో అనేకమైన సందర్భములను చూద్దాము. ఈ పిలుపును గురించి ఎలా పౌలుగారు పత్రికలలో చక్కగా యేసు మరణించి తిరిగి వెళ్ళిన తర్వాత ఎన్ని సందర్బాలను తీసుకుని రాస్తున్నాడో చూద్దాము.
1 కొరంది:1:8,9-మన ప్రభువైన యేసు అను తన కుమారుని సహవసమునకు “మిమ్మును పిలిచిన దేవుడు” నమ్మదగినవాడు. నిన్ను పిలవబోయే దేవుడు నమ్మదగినవాడు అని చెప్పడము లేదు. పిలిచినా అంటే పిలిచేసాడని అర్థము. ఎప్పుడు,ఎలా,ఎందుకు పిలిచాడో ఇప్పుడ్డు మనము తెలుసుకోవాలి. 1 పేతురు2:9- అయితే మీరు చీకటి(పాపము) నుండి ఆచర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినా వాని గునాతిసయములను ప్రచురము(ప్రకటన) చేయు నిమిత్తము.. అంటే ఈ రోజు మనము వాక్యములోనికి వచ్చాము.ఒక్కప్పుడు చీకటిలో(పాపములో) ఉంటున్న మనల్ని దేవుడు ఈ వాక్యములోనికి పిలిచాడు. పై వచనములో పిలిచినా అంటే పిలిచేసాడని అర్థము. ఎప్పుడు పిలిచాడో చూస్తే మత్తయి 11:28-ప్రయాసము మోయుచున్న నా జనులారా, నా యొద్దకు రండి. ఇది పిలుపు. యేసు ప్రపంచాన్ని ఉద్దేశించి చెప్పిన మాట ఇది.చీకటి( పాపము) లో ఉన్నారు.వెలుగులోనికి రండి అని పిలుస్తున్నాడు.వాక్యము విని మనము దేవునిలోకి వచ్చాము. దావీదును పిలిచాడు కదా అంటే దావీదు కాలము వేరు మన కాలము వేరు. దావీదు కాలము-దేవుని కొరకు యుద్దము చేసే కాలము.మన కాలము- ఒక చెంపపై కొడితే రెండో చెంప చూపాలి. పాత నిబంధన లో పాపక్షమాపణ-గొర్రెల రక్తము,ఎడ్ల రక్తము అర్పిస్తే సరిపోతుంది మరి ఈ కాలము యేసు రక్తము ద్వార పాపక్షమాపణ.ఇది తేడా. “””” యేసుక్రీస్తు భూమిమీదకు వచ్చాక తన మాటల ద్వార సమాజాన్ని పిలుస్తున్నాడు””””.ఆ పిలుపుకు లోబడి మనము వచ్చాము. అయన గునాతిసయములను ప్రకటించడానికి పిలిచాడు. బాప్తీస్మం తీసుకుని వెలుగులోనికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని గురించి ప్రకటించాలని అర్థం అవుతుంది.

2) 11 తేస్సా 2:14- అయన మా సువార్త వలన మిమ్మును “పిలిచెను”. సువార్త ద్వార పిలుస్తున్నాడు.సువార్త ఎంతమందికి అర్థమైనాదో అంత మందిని పిలుస్తున్నాడు. సువార్త ఎంతమందికి అందుతుందో వారికీ దేవుని పిలుపు అందుతుంది.సువార్త అందింది అంటే దేవుడు పిలిచేసాడని. దేవుడు వాక్యము ద్వారా అందరిని పిలుస్తున్నాడని సంగతి తెలియక ఎప్పుడో ప్రారంభములో మోషే, సౌలు,దావీదులను ఒక్కటే పిలిచాడు కదా అని ఇదే మనస్సులో పెట్టుకున్నారు. 1 తేస్సా 11:4- సువార్త వలన పిలిచాడు అంటే మాటలతో కాదు.
3) 1 తేస్సా 4:7,8- పరిశుద్దులగుటకే దేవుడు మనలను “పిలిచెను”. యేసు రక్తములో కడగబడినవారు పిలవబడినవారే. ఇప్పుడు దేవుడు పిలిచాడు అన్న మాట అయిన అబద్దము అయ్యి ఉండాలి లేక పిలవలేదు అని అనేవారు మాట అన్న అబద్దము అయ్యి ఉండాలి. దేవుడు అబద్దము ఆడుతాడా? మనిషి అబద్దము ఆడుతాడా?
4) రోమ1:7-మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తువారుగా ఉండుటకు “పిలువబడున్నారు”.
11 తిమోతి1:10- మనలను రక్షించిపరిశుద్దమైన పిలుపుతో అయన మనలను “పిలిచెను”.
11 పేతురు1:10:”మీ పిలుపును”,ఏర్పాటును నిర్చయము చేసికొనుటకు జగ్రతపడుడి.
1 కొరంది1:9-మిమ్మును “పిలిచినా” దేవుడు నమ్మదగిన వాడు.
1 కొరంది1:26-మిమ్మును “పిలిచినా” పిలుపును చూడుడి.
1 పేతురు 2:9-మిమ్మును “పిలిచిన” వాని గునాతిసయములను.
ఇలా పై ఉన్న references లో పిలిచెను గా కనపడుతున్నాయి కానీ పిలుస్తాడు గా లేదు
5) తితు 2:14- సత్ క్రియల యెందాసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని.......అలానే తితు3:8- విశ్వసముంచిన ప్రతివారు సత్ క్రియలను శ్రద్దగా చేయుట యెందును మనస్సుంచాలి. అంటే విశ్వసులు చేయవలసిన పని సత్ క్రియలు చేయడము. దేవునిని నమ్ముకున్న ప్రతి విశ్వాసి దేవుని పని చేయాలి. విలువైన సమయమును దేవుని సేవకు ఉస్ చేయకుండా ప్రార్ధనలో దేవ నన్ను పిలువు అంటే ఎలా?? ఆలోచించండి. వాక్యము మనకు అందింది అంటే దేవుడు పిలిచినట్లే.అంటే దేవుడు already పిలిచేసాడు.
6) conclusion: దేవుడు ఈ కాలములో తన సేవ కొరకు మల్లి ప్రత్యేకముగా పిలవతము అంటూ ఏమి లేదు .already దేవుడు తన వాక్యము ద్వార అందరిని పిలిచేసాడు.మనిషిగా పుట్టినవాడు తినాలని rule ఎలా ఉందో బాప్తీస్మం ద్వరా పుట్టిన ప్రతి వాడు ప్రకటించాలి

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget