Halloween Costume ideas 2015

Yesukristu

యేసుక్రీస్తు వివాహితుడు కాడా?ముమ్మాటికి కాడు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});
(ధీ లాస్ట్గాస్పెల్- ఒక వేస్ట్ గాస్పెల్)
మన ఆత్మలను రక్షించుటకు సిలువపై ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ప్రపంచములో ఉంటున్న ఎక్కువ మందిని ప్రభావితం చేసిన ప్రభావశిలిగా పేరున్నది ఒక్క యేసుక్రీస్తు అనే చెప్పాలి. ప్రపంచ జనాభా సుమారు700 కోట్లుఉంటే అందులో ఎక్కువ శాతం మంది యేసును రక్షకుడిగా,ప్రభువుగా విశ్వసిస్తున్నారు. నీ గురించి ఎవరైనా ఒక తప్పుడు మాట అన్నాడని వింటేనే భాదపడి కోపపడిపోతావు. నీ కుటుంబములోని నీ రక్త సంభందికులను, భందువులను గూర్చి ఎవరైనా ఏ ఒక్క తప్పుడు మాటన్న పౌరుషముతో రగిలిపోతావు. మరి నిన్ను కన్నవాడు, నీ కొరకు మహా సృష్టిని కలిగించినవాడు,తల్లి గర్భములోనే నీకు చక్కటి ఆకర రూపాన్ని ఇచ్చిన వాడు, అనుక్షణం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతున్న ఆ దేవుని గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నప్పుడుఒకక్రైస్తవుడిగాభాదతో, పౌరుషముతో బుద్ది చెప్పాలి.1 పేతురు 2:15-అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము.

2) దేవుడు లేడనే వాడు, బైబిల్ తప్పు అని మాట్లాడుతున్న వాడు, యేసుక్రీస్తు ఇండియాకు వచ్చాడని అనేవాడు, యేసుక్రీస్తుకు మగ్దలేనె మరియకు అక్రమ సంభందాన్ని అంతకట్టుతున్న వీళ్ళు మూర్ఖులు. దేవుడుఅలాంటి అజ్ఞానులకు, బుద్దిహినులకు, అమాయకులకు బుద్ది చెప్పమన్నాడు, నోరు మూయించమన్నాడు. యేసుక్రీస్తుముందు,యేసుక్రీస్తువెనుక ఎందరో చక్రవర్తులు, మేధావులు పుట్టిన ఏ ఒక్కడిని శక పురుషుడు అని అనక కేవలం ఒక్క యేసుక్రీస్తును మాత్రం ఎందుకు గుర్తించారో ఈ ప్రపంచములోని ప్రతి ఒక్కరు ఆలోచించాలి. అయన ఈ లోక రాకడతో కాలాన్ని రెండుగా విభజించారు( క్రిశ& క్రిపు). ఈ ప్రపంచములోని ఎంతటివారైన,ఎవరైనా తేదీలు లెక్కించాలంటే యేసును మధ్యవర్తిగా పెట్టి లెక్కిస్తున్నారంటే కారణం ఈ ప్రపంచములో ఎవ్వరూ చేయలేని గొప్ప కార్యాన్ని తన జీవితములో చేసి చూపించాడు. అందుకే శకపురుషుడిగా,యుగపురుషుడిగా పిలువబడ్డాడు. 3) మనపాపములను మాఫీ చేసిమరణము తర్వాత నరకమునకు వెళ్లబోయే మన ఆత్మలను రక్షించుటయే యేసు రాకడ యొక్కపరమార్ధము.తన కంటూ ఏది ఈ భూమి మీద సంపాదించుకోలేదు కానీ అనుక్షణం ప్రజల మధ్యకు వెళ్లి దేవుని మాటలు చెప్పాడు, ప్రజలతో ఉన్నాడు, రోగాలను నయం చేసాడు &చివరికి తన ప్రాణం మన కొరకు పెట్టుటకు కూడ వెనుతిరుగ లేదు. ఆయన పలికిన ప్రతి మాట అద్భుతమైన మాట. ఆయన నోట నుండి వచ్చిన ప్రతి మాట ఆణిముత్యం లాంటివి.

4) లూకా 2:34-సుమెయోను వారిని( యేసేపు& కన్య మరియ) దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలు పడునట్లు ,ఇశ్రాయేలులోఅనేకులు పడుటకును,తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గురుతుగా ఈయన(యేసు) నియమింపబడియున్నాడు. నాటి నుండి నేటి వరకు యేసుక్రీస్తు వివాదాలు ఎదుర్కుంటూనే ఉన్నాడు. అయన పుట్టుక &మరణం ఒక వివాదమే. కన్యక కనగలదా అని, కన్యక పిల్లలను కనగలదా అని, మరణించిన మూడవ దినాన ఎలా లేస్తాడు అని ఇలా అనేక వివాదాలకు తలెత్తుతూనే ఉన్నాయి.

5) ప్రపంచములో ఎక్కువ మంది తమ రక్షకుడిగా, దేవుని కుమారుడిగా, దేవునిగా భావించి విశ్వసించి ,అయన మాటలానుసారముగా నడుస్తున్న వారు ఎందరో ఉన్నారు. ఇంత మంది మనోభావాలను దేబ్బదిస్తూ వ్రాసిన పుస్తకమే ధీ లాస్ట్ గాస్పెల్(THE LAST GOSPEL). ఈ పుస్తకమును రచించిన అజ్ఞానులు “బార్రి విల్సన్ & సించ జాకోబోవీచి. ఈ పుస్తకములో యేసుకు మగ్దలేనే మరియతో వివాహం అయ్యినట్టుగా, వారికీ ఇద్దరు పిల్లలు పుట్టినట్టుగా చిత్రీకరించి ఉహించి వ్రాసారు. యేసుక్రీస్తు వివాహితుడు అనే తప్పుడు కధనాన్ని అనేక తెలుగు, ఇంగ్లీష్ వార్త పత్రికలలో ప్రచురం చేసినట్టుగా మనకు తెలుసు. ఐదవ శతాబ్దములో దొరికిన చిన్న ముక్కలో ఉన్న మాటలను బట్టి క్రీస్తు మగ్దలేనే మరియతో అక్రమ సంభందాన్ని అంటకట్టారు. వాస్తవముగా యేసు జీవించిన జీవిత కాలము మొదటి శతాబ్దము. వీరికి దొరికిన పత్రిక ఐదవ శతాబ్దములోనిది. అంటే యేసు మరణించిన ఐదు వందల సంవత్సరాలకు దొరికిన పేపర్ ముక్కను చూసి యేసుకు వివాహం అయ్యింది అని ఉహించి వ్రాసిన నేడు వ్రాసిన ధీ లాస్ట్ గాస్పెల్ పుస్తకముముమ్మాటికి అసత్యమే..

6) పరలోకపు తండ్రి యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకు వివాహం అయ్యినట్టుగా బైబిల్లో వ్రాయబడిందా? లేదు. సుమారు 40మందితో 1600సంవత్సరాల కాలములో పరిశుదాత్మ ప్రేరణతో వ్రాయించిన దేవుని గ్రంధమే ధీ బైబిల్(THE BIBLE). లూకా 24:44- అంతట అయన(యేసు) మోషే ధర్మశాస్త్రములోను ,ప్రవక్తల గ్రంధములోను, కిర్తనలోను నన్ను గూర్చి వ్రాయబడినవన్నియు......... అంటే తన గుర్చిన విషయాలు ఒక్క లేఖనాలలోనే (బైబిల్)ఉన్నాయని యేసుక్రీస్తు పై వచనములో అంటున్నాడు.

7) బైబిల్లోని నూతన నిబంధనలో ఉన్నవాళ్ళు యేసుతో కలసి తిరిగిన వాళ్ళగా,కలసి భోజనం తిన్నవాళ్ళుగా, కలిసి పరిచర్య చేసేనవాళ్ళుగా, అయన అడుగు జాడలలో నడిచేవారన్న విషయము మనకు తెలుసు. వీళ్ళు వ్రాసిన మాటలే బైబిల్లో ఉంటాయి.అనగావాళ్ళ కళ్ళతో చూసిన దృశ్యాలను, వినిన మాటలను బైబిల్లో వ్రాసారు.అయితేయేసుపునరుర్ధానమైన ఐదు వందల సంవత్సరాల తర్వాత దొరికిన ముక్కను చూసిన మాటలనువీరు ఉహించి, కల్పించి ధీ లాస్ట్ గాస్పెల్ అనే పుస్తకమును వ్రాసారు. ప్రజా కోర్టులో మన కళ్ళతో చూచిన సాక్షాలే చెల్లుతాయని, చూడని వాడి సాక్షం చెప్తే చెల్లదన్న విషయము మనకు తెలుసు. మరి చూడని వాడి సాక్షం చెప్తే చెల్లనప్పుడు మరి యేసును చూడని వాని సాక్షం చెప్తే ఎలా చెల్లుతుంది?చెల్లదు.ధీ లాస్ట్ గాస్పెల్ అను పుస్తకము వ్రాసిన బార్రి విల్సన్(1940లో పుట్టాడు)& సించ జాకోబోవీచి(1953లో పుట్టాడు) అనుఇద్దరు యేసుక్రీస్తు(మొదటి 100 సంవత్సరాలకు చెందినవాడు) ఉన్నప్పుడు లేరు. యేసును, మగ్దలేనే మరియను కూడ చూడని వారు కానీ ఉహించి ,కల్పించి తప్పుడుగా చిత్రీకరించి యేసు వివాహితుడు అని వారి పుస్తకములో వ్రాసుకుని 2014 లో విడుదల చేసారు.చూడని వాడి సాక్షం చెల్లదన్న విషయం మనకు తెలిస్తే వీరు ఇద్దరు వ్రాసిన తప్పుడు పుస్తకములోని తప్పుడు మాటలు కూడ అసత్యం అనే చెప్పాలి.

8) ఉదా:: రోడ్డులో ఒక హత్య జరిగింది. కేసు కోర్టు దాకా వచ్చింది. ఒకడుకోర్టుకు వచ్చి ఫలానా వ్యక్తి హత్య చేశాడని న్యాయమూర్తికి చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తిమొట్ట మొదటి ప్రశ్నగా నువ్వు చూసావా అని అడుగుతాడు. లేదండి, హత్య జరిగిన వారం తర్వాత సంఘటన స్థలమునకు వెళ్లి పరిశీలించి , ఉహించి ఇతనే చేసి ఉంటాడని అంచనా వేసి మీకు చెప్పానని జవాబు ఇస్తాడు. అయితే కోర్టు వీడిసాక్ష్యం నమ్ముతుందా? వీడిమాటలు నమ్ముతుందా? ముమ్మాటికినమ్మదు. చూసిన వారు వచ్చి చెప్పిన సాక్షాలే కోర్టులో చెల్లుతాయి .

9) ఇప్పుడు యేసుతో కలసి జీవించిన వారి మాటలను బైబిల్ నుండి పరిశిలిద్దాం. బైబిల్లో నూతన నిబంధనలో చెప్పిన వాళ్ళు యేసుతో జీవించిన వాళ్ళని( మత్తాయి, యోహాను,పేతురు)మనము తెలుసుకోవాలి. 1 యోహాను 4:14- తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి, సాక్షామిచ్చుచున్నాము. మత్తయి 13:53 నుండి- యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత అయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి, సమాజ మందిరములో వారికీ భోదించుచుండెను. అందువలన వారు ఆర్చర్యపడి- ఈ జ్ఞానమును,ఈ అద్భుతములును ఇతనికి ఎక్కడ నుండివచ్చినవి? ఇతడు వడ్లవాని కుమారుడు కాడా?ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు,యేసేపు, సిమోనుయూదాయను వారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరిమనులందరు మనతోనేయున్నారు కారా? క్రీస్తు కుటుంబము ఎవరో వారి గూర్చి పై వచనములో చెప్పబడింది. ఒక వేళ యేసుకు మగ్దలేనే మరియతో వివాహం జరిగిఉంటే ఇతని భార్య మగ్దలేనే మరియ కాదా అను మాట ప్రస్తావించబడేది కానీ లేదు. సమాజములో ఆయనంటే పడని వారు చెబుతున్న మాటలను మత్తయి వ్రాసాడు.

10) ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మత్తయి మాటలను నమ్మాలా లేక ఇప్పుడు వచ్చిన వాడు అంటున్న మాటలు నమ్మాలా అన్నది మిరే ఆలోచించండి.మత్తయి 13:53లోవివాహం గూర్చి కానీ, పిల్లలు గూర్చి కానీ చెప్పబడలేదు. అనగా బైబిల్లో యేసుతో జీవించిన ఏ ఒక్కరు కూడ భార్య, పిల్లల ప్రస్తావన చెప్పలేదు,వ్రాయలేదు.. అపోకర్య 5:32- మేమును, దేవుడు తనకు విదేయులైన వారికీ అనుగ్రహించిన పరిశుదాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి.

11) పై వివరణలో మనము తెలుసుకున్నది ఏమనగా యేసుక్రీస్తుతో జీవించిన వారు వ్రాసిన మాటలే సత్యం అని తెలుసుకున్నాము. యేసుతో జీవించిన వారి మాటల సాక్ష్యంలో ఎక్కడను కూడ వివాహము గూర్చి ప్రస్తావన జరగలేదని తెలుసుకున్నాము. యేసు పునరుర్ధానము అయ్యి కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసు వివాహితుడు అని కల్పించి ఉహించి వ్రాసిన పుస్తకము పచ్చి అబద్దము అని తెలుసుకున్నాము.

12) ఇప్పుడుక్లుప్తముగా యేసు వివాహితుడు కాదని, వారి పుస్తకము తప్పని నీరూపణతో కూడిన కొన్ని వచనాలను చూద్దాము:::: ((a)) యోహాను 19:27- అయన తల్లియు, అయన తల్లి సహోదరియు, క్లోపా భార్యయైన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువ యెద్ద నిలుచుండిరి. యేసుతన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచియుండుట చూచి- అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యున్ని చూచి-ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఒకవేళ యేసు మగ్దలేనే మరియను వివాహం చేసుకుని ఉంటే ఇదిగో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి అని యేసు వారికీ చెప్పేవాడు. కనుక యేసు వివాహితుడు కాదు. కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((b)) 1 కోరంది 9:5-తక్కిన అపోస్తుల వలెను ,ప్రభువు యొక్క సహోదరుల వలెను, కేఫా వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా? ఒక వేళ యేసుకువివాహం జరిగియుంటే పౌలు ప్రస్తావన చేసేవాడు.కానీ చేయలేదు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((c)) బైబిల్ అంతటిలో మనం పరిశిలిస్తే యేసు ఒక్కటిగానే ఉన్నాడని లేఖనాలు చెబుతుంది. యేసుకు భార్య ఉన్నదని నూతన నిబంధలో కూడా ఎక్కడ లేదు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((d))మగ్దలేనే మరియను తన భార్యగా యేసు ఎక్కడ చెప్పలేదు. యేసు పరిచర్యలో ఒక స్త్రీగా ఉంది. యోహాను 20:16- ఆమె అయన వైపు తిరిగి హెబ్రీ భాషలో రాబ్బుని(భోదకుడా) అని పలికెను. ఒక వేళ యేసుతో వివాహం అయ్యి ఉంటె రబ్బుని అనే మాట కాక భర్త అని అనేది.కానీ అలా చెప్పలేదు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((e))ఒక వేళ యేసు ఆమెను వివాహం చేసుకుని ఉంటేబైబిల్లో ఆమె పేరు క్రీస్తుకు భార్యయైన మరియ అని ఉంటుంది కానీమగ్దలేనే మరియ అని చెప్పబడదు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((f) యోహాను 8:46- నా యందు పాపమున్నదని మిలో ఎవడు స్థాపించును? ఒక వేళ యేసు మనలాగే వివాహము చేసుకుని పిల్లలను కంటే ధైర్యముగా ఈ మాటను చెప్పేవాడు కాదు. వివాహం జరగలేదు కనుక ఇలా అన్నాడు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

((g)) యోహాను 20:14-యేసు- అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవనినివెదకుచున్నావు అని ఆమెను(మగ్దలేనే మరియ) అడుగగా...... ఒక వేళ యేసుకుమగ్దలేనే మరియతో వివాహం జరిగితే భార్య అంటాడే కానీ అమ్మా అని అనడు. కానీ అన్నాడు అంటే వివాహం జరగలేదు.కనుక యేసు వివాహితుడు కాదు &కల్పిత పుస్తకమును రచించిన వారి మాటలు అబద్దమే.

ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వందల వచనాలు యేసుకు వివాహం కానట్టుగా, ఒక పరిశుద్దుడుగా కనబడుతుంది.
13) మగ్దలేనే మరియ ఎవరు? యేసుతో ఆమెకు ఏటువంటి సంభంధం ఉంది అను ప్రశ్నలకు బైబిల్ ఏమి చెబుతుందో తన గురంచి కొన్ని మాటలు చూద్దాము.::::
((a)మగ్దలేనే మరియ అనగానే యేసుతో పాటు ఉన్న స్త్రీలలో భక్తి గలిగిన స్త్రీగా క్రైస్తవ సమాజానికి తెలుసు కానీ మిగిలిన లోకపు వారికీ మగ్దలేనే మరియ అనగానే యేసుకు భార్య అని మాట్లాడుకోవడం విచారకరం.లూకా 8:1,2,3-ఈ వచనాలను చూస్తే యేసు పరిచర్యలో మగ్దలేనే మరియ కొనసాగినట్టుగా కనబడుతుంది. గ్రామగ్రామానికి,పట్టణపట్టణానికి కాలి నడకన వెళ్తున్న వారిలో శిష్యులు, కొంత మంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరికీ ఉపచారము(సేవ) చేయాలి కదా. అనగా వారి ఆకలిని తీర్చాలి, వాళ్ళకు కావాల్సినవన్నీ అందించాలి. ఇవన్ని మనమే చేయాలి అని పరిచర్య కొరకు ముందుకు వచ్చిన వారిలో మగ్దలేనే మరియ కనపడుతుంది.లూకా 8:1,2,3లో ఏడు దయ్యములు వదిలిపోయినమగ్దలేనే అనబడినమరియయు అని ప్రస్తావించబడింది. యేసును తెలుసుకోననప్పుడు ఏడు దయ్యములతో పట్టినట్టుగా మనకు తెలుస్తుంది. యేసు ద్వారా తన బ్రతుకును దయ్యముల బారి నుండి బయటకు వచ్చి జీవితమును మార్చుకుంది. అప్పటి నుండి యేసును వెంబడించింది. సమాధి దగ్గరకు వచ్చిన వారిలో మొదటిగా మగ్దలేనే మరియ కనబడుతుంది(యోహాను 20:1). తన జీవితాన్ని మార్చిన యేసుకు ఎంతగా కృతజ్ఞత కలిగిందో, ఎంతగా స్వచ్చమైన ప్రేమతో యేసును ప్రేమించిందో అని మగ్దలేనే మరియ ద్వార మనము బైబిల్ నందు తెలుసుకుంటున్నాము..

14) ఒక క్రైస్తవుడిగా నువ్వు రోషంతో మీసం మేలి వేసి నిలబడితే క్రీస్తు గూర్చి తప్పుడుగా ఎవడు మాట్లాడుతాడు? క్రీస్తు కొరకు నేను ఉన్నానని రొమ్ము విరుచుకుని నిలబడి సత్యాన్ని సమాజంలో ప్రకటిస్తే ఎవ్వరు క్రీస్తు గురించి ఆవాస్తవాలు ప్రకటించారు. మనంసత్యముగా ఉంటూ, క్రీస్తు గురించి సత్యాన్ని ప్రకటిస్తుంటే ,రోషం కలిగిన క్రైస్తవుడిగా నిలబడితే ప్రపంచములో ఉన్న ఎవ్వడు క్రీస్తు మీద బురద చల్లడు. క్రైస్తవులుగా సత్యాన్ని చేత బట్టి అందరు ఒకే భావంతో ఒక్కటిగా, కలసికట్టుగా ఉంటె ఎవ్వడును క్రీస్తును అవమానపరుచుటకు ముందుకు రాడు. ఒక వేళ క్రీస్తు అవమానపరచబడుతున్నాడు అంటే కారణము మనమే.( 1 పేతురు 2:16).

15) కనుక ఇలాంటి తప్పుడు వార్తలు ఎన్ని వచ్చిన చెల్లని నోటు కాగితాలు అని ప్రకన్న తిసిపరేయండి. రేపు ఎవరైనా ఇలాంటి వార్తలు తీసుకుని వచ్చి ఈనాడులో చెప్పినట్టుగా మీ యేసుకు పెళ్లి అయ్యింది కదా అని అంటే మీరు అనవలసిన మాట వీళ్ళు చూసిన వాళ్ళ లేక చూడని వాళ్ళా? చూడని వారి వార్తలు వేసారు కనుక చెల్లవు అని చెప్పoడి. విశ్వాసం ఉండి ఈ మాటల ద్వార ఎప్పుడు బలహినపడకండి. బలహీన పడేవారిని ఈ సందేశాన్ని చెప్పి బలపరచండి...





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget