Halloween Costume ideas 2015

Need

ఏ విధమైన ప్రార్ధన దేవుడు ఆలకిస్తాడు?క్రై స్తవులకు ప్రార్ధన గోపురాల(prayer towers) అవసరత ఉన్నదా?

ఏ విధమైన ప్రార్ధన దేవుడు ఆలకిస్తాడు?క్రైస్తవులకు ప్రార్ధన గోపురాల(prayer towers) అవసరత ఉన్నదా?
ముందుగా ప్రభువు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ప్రార్ధన గోపురం(prayer towers) అను పదం మనకు కొత్త కాదు. సమాజంలో బాగా అందరికి తెలిసిన పదం.ఈ ప్రార్ధన గోపురంలో (prayer towersలో) ఏమి జరుగుతుంది అంటే ప్రార్ధన జరుగుతుంది. ఎంత సేపు జరుగుతుంది అంటే 24 గంటలు. 24 గంటలు ప్రార్ధన గోపురంలో(prayer towersలో) ఉంది ప్రార్ధన చేసేవారిని ప్రార్ధన యోధులు(prayer warriors) అంటారు.దీనికి సంబంధించి bibleలో గల వివరణ మనం ఆలోచించాలి.

2) ఒక వ్యక్తిని బట్టి వాక్యమును ఎప్పుడు గ్రుడ్డిగా నమ్మకూడదు. ఫలానా వ్యక్తి చెబుతున్నాడు గనుక ఎందుకు correct అవ్వదు అని అనుకోకూడదు. మొదటి శతాబ్దములో ఉన్న బెరయ సంఘము వారు పౌలు సిలల వంటి అతి పెద్ద భోదకులు వాక్యం చెబుతుంటే వారు చెబుతున్నవి ఆలాగు ఉన్నవో,లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోదించుచు వస్తే ఆ క్రైస్తవులను దేవుడు గనులు అన్నాడు. మన తరంలో చూస్తున్న సేవకులలో పౌలుకీ మించిన భోదకులు ఎవ్వరు లేరు. అంత పెద్దవాడైన పౌలు వాక్యం చెబుతున్నప్పుడు కుర్చుని వింటున్న వారు ఆలాగు ఉన్నవో లేవో అని పరిశోదించుచు వస్తే ఈ రోజు వక్తిని బట్టి వాక్యమును ఎందుకు గ్రుడ్డిగా నమ్మాలి?????? వ్యక్తిని బట్టి గాక వాక్యాన్ని బట్టి వాస్తవాన్ని అంగికరించే మనస్సు కలిగి ఉండాలి. 3) ప్రార్ధన గోపురం(prayer towers) అను పదంలో మనకు కనపడుతున్నది ప్రార్ధన. ఈ ప్రార్ధన గురించి bible ఏమి చెప్పిందో చూద్దాము...... 1 తేస్సలోనిక 5:15-యెడ తెగక ప్రార్ధన చేయుడి.. అపోకార్య2:42-వారు అపోస్తుల భోదయందును ,సహావాసమందును,రొట్టె విరుచుటయందును ,ప్రార్ధన చేయుట యందును ఎడ తెగక యుండిరి. అంటే bible ప్రార్ధన చేయమని చెబుతుంది.మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఏమి చేసారో నేడు ఈ 21 శతాబ్దపు క్రైస్తవులైన మనము అదే చేయాలి. అనగా వాళ్ళు prayer చేశారు కనుక మనం కూడా ప్రార్ధన చేయాలి.

4) దేవుడు ప్రార్ధన ఎడతెగక చేయమన్నాడు అని నేడు ప్రార్ధన గోపురం వారు (prayer towers వారు) ఎప్పుడు ప్రార్ధనలో ఉన్నారు. ముందుగా ఎడతెగక ప్రార్ధన చేయుడి అను పదాన్ని మన వాడుక భాషలో మారిస్తే continuesగా ప్రార్ధన చేయుడి అని అర్థం. ఉదా:: మీకు ఆరోగ్యం భాగాలేకపోతే doctor దగ్గరకు వెళ్తారు.doctor మందులు వ్రాసి మన చేతికి ఇచ్చి వీటిని continuesగా వేసుకోండి అని చెబుతాడు.ఇప్పుడు మనం వీటిని ఎలా వేసుకుంటాం???అన ్ని పనులు మానేసి కేవలము నీరు and మందులు continuesగా వేసుకుంటామా??????? doctor ఎడతెగక మందులు వాడుడి అంటే time ప్రకారం వేసుకోవాలని అనే విషయము మనకు తెలుసు. doctor ఎడతెగక మందులు వాడుడి అన్న మాటకు అర్థం timeకి వేసుకోండి అని. అంతేకాని 24 hours వేసుకోమని అర్థం కాదు.

5) దేవుడు మనలను ఎడ తెగక ప్రార్ధన చేయమన్నాడు అంటే అన్ని పనులు మానేసి కేవలం మోకాళ్ళు వంగి ప్రార్ధన చేయమని కాదు.... “”” దేవుని పనిలో నీవు ఉన్నప్పుడు ప్రార్ధనను ప్రక్రన్న పెట్టక ప్రార్ధన సహాయంతో దేవుని పని చేయాలనీ.

6) ఇప్పటివరకు వివరణలో దేవుడు ప్రార్ధించాలి అని చెప్పాడు. ప్రార్ధించమని చెప్పిన దేవుడు ఎవరి ప్రార్ధన అలకించడో అను విషయమును చూద్దాము. యోహాను 9:31- దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవ భక్తుడై యుండి అయన చిత్తము చొప్పున జరిగించిన యెడల అయన వాని మనవి ఆలకించును .ప్రార్ధన చేయమన్న దేవుడు పాపుల మనవి ఆలకించను అని అంటున్నాడు.దేవుడు పాపుల మనవి ఆలకించను అని అన్నాడు అంటే పాపుల కూడా ప్రార్ధన చేస్తారని అర్థమవుతుంది.

పై వచనము ద్వారా దేవుడు ఎవరి ప్రార్ధన ఆలకిస్తాడో,ఎవరి ప్రార్ధన అలకించడో అన్న వివరణ మనకు తెలిసింది.మరి ఎవరి ప్రార్ధన వింటాడు?? ఎవడైనను దేవ భక్తుడై యుండి అయన చిత్తము చొప్పున జరిగించిన యెడల అయన వాని మనవి ఆలకించును అన్నాడు. దేవుడు ఒక వ్యక్తి యొక్క మనవి ఆలకించాలంటే అతడు దైవ భక్తుడై ఉండాలి. ఎవరు దైవ భక్తులు??? అయన చిత్తమును జరిగించేవాడు దైవ భక్తులు. మరి దేవుని చిత్తము ఏంటి?

7) యోహాను 6:38-నా ఇష్టము నెరవేర్చుకొనుటక ు నేను రాలేదు;నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చితిని... యేసుక్రీస్తు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు వచ్చాడు. luke 19:10-నశించిపోయే ఆత్మలను రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. అంటే నశించిపోయే ఆత్మలను రక్షించుటకు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆత్మలను రక్షించాలంటే ఆత్మకు వాక్యం అందించాలి. (యాకో బు 1:21- మీ ఆత్మలను రక్షించుటకు శక్తీ గల వాక్యమును సాత్వికముతో అంగికరించుడి.) ఆత్మలను రక్షించుటకు శక్తీ గల వాక్యం అయితే,యేసు వచ్చింది నశించిపోయే ఆత్మలను రక్షించుటకు అయితే , నశించిపోయే ఆత్మలకు యేసు వాక్యం చెప్పి రక్షించాడు. అంటే యేసు ఈ లోకానికి వచ్చింది వాక్యం అందించి ఆత్మలను రక్షించుటకు( 1 తిమోతి 1:15). “”””” పాపులను రక్షించుటయే తండ్రి చిత్తము”””””. పాపులను రక్షించాలంటే మనం ఆత్మలను రక్షించగలిగే వాక్యాన్ని వారికీ అందించాలి. యేసు ఆ వాక్యాన్ని అందించుటకు కష్టపడ్డాడు.(మార్క్ 1:38). ఈ లోకంలో వాక్యం ప్రకటించుటకు యేసు వచ్చాడు.

8) luke 15:7-అటు వాలే మారు మనస్సు అక్కరలేని తొంబది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. luke 15:10-అటు వాలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల యెదుట సంతోష కలుగునని మీతో చెప్పుచున్నాను........దేవుని యొక్క సంతోషం,ఆనందము ఇక్కడ చెప్పబడింది. ఒక పాపి రక్షింపబడితే ఆనందము అన్నాడు. ఒక పాపి రక్షింపబడాలి యేసు ఏమి చేసాడో మనం అదే చేయాలి. యేసు వాక్యాన్ని అందించాడు.””””వ ాక్యమును అందించి పాపులను రక్షించుటయే దేవుని చిత్తము””””.ఇప్పుడు యోహాను 9:31 కి వెళ్తే దేవ భక్తుడు అనగా దేవుని పనిలో ఉన్నవాడు అని. దేవుని పని అనగా వాక్యము అందించి పాపులను రక్షించుటయే. దేవుడు ఎవరి ప్రార్ధన అలకిస్తాడు అంటే దేవుని పని చేసి వచ్చి ప్రార్ధించే వాడి ప్రార్ధన వింటాడు. పై 7th,8th points ద్వార దేవుని చిత్తమును తెలుసుకున్నాము. ఇంతవరకు దేవుడు ఎవరి ప్రార్ధన వింటాడు,ఎవరి ప్రార్ధన వినడో చూసాము.

9) ఇప్పుడు ప్రార్ధన గోపురంలో(prayer towersలో) ఏమి జరుగుతుంది???? రోజుకి 24 గంటలు ప్రార్ధన జరుగుతుంది. అంటే 24 గంటలు ఇందులో ఉన్నవారు ప్రార్ధన చేస్తారు. ఒక రోజులో ఉన్న 24 గంటలు ప్రార్ధన చేస్తే మరి దేవుని పని ఎప్పుడు చేస్తారు??????? దేవుని పని చేయకుండా ప్రార్ధన చేస్తే దేవుడు ప్రార్ధన వింటాడా?????????? వినడు. ప్రార్ధన గోపురంలో (prayer towersలో) 24 గంటలు ప్రార్ధన చేస్తే వింటాడా?

10) దేవుడు పాపుల మనవి ఆలకించడు. దేవుడు దేవ భక్తుల మనవి అలకిస్తాడు. దేవ భక్తుడు అనగా ఆయన పని చేసేవాడు. అయన పని-వాక్యం అందించి పాపులను రక్షించడం. ఆ పని చేసి వచ్చి ప్రార్ధన చేయాలి. ఆ పనిలో ఉండగా ప్రార్ధన చేయాలి. పనిలో లేకుండా, పని చేయకుండా ప్రార్ధన చేయకూడదు. ప్రార్ధన చేయడం ఒక్కటే దేవుని పని కాదు.

11) ప్రారంబం నుంచి ప్రార్ధన చేసినవారి పట్ల దేవుని స్పందన ఎలా ఉందో bibleలో మన కొరకు వ్రాయబడిన సంగతులు ఒక్కొక్కటిగా చూద్దాము.
(a) ద్వితియ 1:42 నుంచి 45- egypt నుంచి కనానుకి ఇశ్రాయేలియులను నడిపిస్తున్న రోజులు అవి. అప్పుడు వీరి కోసం మార్గమధ్యములో దేవుడు ఎన్నో అద్బుతాలు చేసాడు.ఎర్ర సముద్రాన్ని చీల్చి మరి వారిని నడిపించుకొని వెళ్ళాడు. దారిలో వీరికి ఎదురైనా ఎన్నో రాజ్యాలను దేవుడు వారిని తప్పించి నడిపించాడు. అలా నడిపిస్తున్నపుడు అమ్మోరియులు రాజ్యం ఒకటి అడ్డుపడింది. ఆ అమ్మోరియులతో యుద్దము చేయండి and నేను మీతో తోడుగా ఉంటాను అని దేవుడు చెప్పాడు. కానీ ఇశ్రాయేలియులు దేవుని మాటను ప్రక్కన పెట్టారు. అప్పుడు దేవుడు కోపడ్డాడు.చివరిగా ఇశ్రాయేలియులు కన్నీటి ప్రార్ధన చేసిన దేవుడు వారి మనవి అలకించలేదు. దేవుడు అప్పగించిన పని చేయకుండా, చెప్పిన పని చేయకుండా చివరికి కన్నీటి ప్రార్ధన చేసిన దేవుడు వారి ప్రార్ధనను వినలేదు.
(b) ద్వితి3:23-26లో మోషే గారు ప్రార్ధన చేసిన కూడా వినలేదు. బండతో నువ్వు మాట్లాడు అంటే బండను కొట్టాడు.. చేయవద్దు అన్న పని చేసి ప్రార్ధించగా దేవుడు మనవి అలకించలేదు. ఒక సరి ఈ వచనమును చదవండి. దేవుడు ప్రార్ధన విషయములో ఇశ్రాయేలియులు కన్నీటి ప్రార్ధన చేసిన వినలేదు. మోషే అంతటి వాడు పని సరిగా చేయకుండా వచ్చి ప్రార్ధన చేస్తే వినలేదు. దేవుడు ప్రార్ధన విషయములో ఎంత strictగా ఉన్నదో అర్థమవుతుంది.
(c) 11 సముయేలు2:16 నుంచి.. ఏడు రోజులు నిద్రాహారాలు మాని తన బిడ్డను బ్రతికింపమని ఉపవాస ప్రార్ధన చేసినాను వినలేదు. చివరికి చనిపోయాడు. కారణం దేవునికి వ్యతిరేకముగా పని చేసాడు కనుక.
(d) 1 రాజులు 3:10- సోలమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను. అనగా ఇక్కడ దేవుడు చెప్పినట్టుగా సోలమోను చేసాడు కనుక విన్నాడు. 1 యోహాను 3:22లో దేవునికి ఇష్టమైనవి చేస్తే దేవుడు మన ప్రార్ధన వింటాడు అట.1 యోహాను 5:14- అయన చిత్తనుసారముగా మన ప్రార్ధన చేయాలి.
(e) పనిలో ఉంది ప్రార్ధన చేయాలి . పని కొరకు ప్రార్ధన చేయాలి. యేసు ఇలానే చేసాడు. ప్రార్ధన చేయాలంటే దేవుని పనిలో ఉండాలి. దేవుని పనిలో ఉన్నవాడే ప్రార్ధన చేయాలి. దేవుని పనిలో ఉన్నవాడు పని గురించే ప్రార్ధన చేయాలి. luke:18:10 నుంచి- ఇందులో పాపియైన సుంకరి ప్రార్ధన దేవుడు ఆలకించాడు కదా అని doubt రావొచ్చు. ఇక్కడ సుంకరి పాపపు ఒప్పుకోలు ప్రార్ధన చేసాడు. పాపుల మనవి ఆలకించాడు కానీ పాపి చేసే పాపపు ఒప్పుకోలు ప్రార్ధన వింటాడు. ఇప్పుడు చెప్పండి prayer towers అవసరత ఉన్నదా??? లేదు. దేవుడు పని చేసి,పని కొరకు ప్రార్ధన చేసి దేవునిని ఆనందపరచండి.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget