Halloween Costume ideas 2015

Devudu Manishini Sikstada?

అందుకే ఆదామును ఏదేను తోట నుండి వెళ్ళగొట్టాడు
దేవుడు మనిషిని శిక్షిస్తాడా??? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) తల్లితండ్రులు తన పిల్లలను అప్పుడప్పుడు ప్రేమించక ఎప్పుడును ప్రేమిస్తారు. కానీ అప్పుడప్పుడు శిక్షించవలసిన, దండించవలసిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. పిల్లలను ప్రేమించటానికి కారణము లేకపోవచ్చేమో కానీ, పిల్లలను శిక్షించుటకు మాత్రము కారణము ఉండి తీరుతుంది. సరిగ్గా చదవకపోతేనో, మాట వినకపోతేనో ఇలా ఏదో ఒక కారణము బట్టి పిల్లలను దండించాలన్న ఆలోచన తల్లితండ్రులుకీ ఎలా కలుగుతుందో అలానే పరలోకమందున్న కన్న తండ్రి తన పిల్లలను శిక్షించవలసిన పరిస్థితి ఏర్పడిందే తప్ప మనిషిని శిక్షించవలసిన అవసరత దేవుడికి లేదు. లేదు అని ఏలా చెప్పాలంటే జగత్తు పునాది వేయబడక ముందు ప్రేమ చేత మన కొరకు సృష్టిని చేసి, తన కోసము బ్రతకాలన్న ఆలోచనతో మానవ జన్మను ఆ భూమి మీద మనకు ప్రసాదించాడు(ఎఫేసి 1:4).

2) వాస్తవముగా ప్రారంభము నుండి ఇప్పటివరకు జరిగిన ,జరుగుతున్న పరిస్థితులను గమనిస్తే దేవుడు శిక్షించవలసిన పరిస్థితిని మనిషినే తెచ్చుకున్నాడు. అప్పటి నుండి భూమి మీద శిక్షలు అమలు అవుతూనే ఉన్నాయి . మనిషి చేసిన తప్పుకు ప్రారంభపు శిక్షను చూస్తే ఆదికాండ3:23- దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తియబడేనో దాని సేద్యపరుచుటకు ఏదేను తోటలో నుండి అతని పంపివేసెను. అప్పుడాయన ఆదామును వెళ్ళగొట్టి........ అంటే ఏది అయితే తినవద్దు అన్నాడో ఆ పండునే తిని పాపమూ చేశాడు. అస్సలు మనిషి పాపమూ చేయకపోతే శిక్ష అవసరత లేదు.అందుకే ఆదామును ఏదేను తోట నుండి వెళ్ళగొట్టాడు.ఇలా భూమి మీద మనిషిని శిక్షించడము మొదలు పెట్టిన తర్వాత ప్రేమించడము తగ్గిపోయి శిక్షించడం ఎక్కువైపోయింది. 3) ఆదాము తప్పు అయిన కొద్ది రోజులకు మరలా కాయిను హేబెలును చంపాడు. మళ్ళి కాయినును వెళ్ళగొట్టాడు. తప్పు జరిగినప్పుడు దేవుని నుండి శిక్ష అమలు ఆవుతున్నాయి కానీ ఆ శిక్షను బట్టి శిక్షణ(dicipline) రావటము లేదు. దేవుడు శిక్షిస్తూన్నప్పుడు శిక్షకు భయపడి ప్రతి శిక్ష మనిషికి ఒక శిక్షణగా మారితే దేవుని కోసము మనిషి బ్రతికే వాడు. ఆదాము,కాయిను తర్వాత నోవాహు జల ప్రళయము. ఆదికాండ 6:13- దేవుడు నోవహుతో-సమస్త శరీర మూలముగా భూమి బలత్కారముతో నిండియున్నది గనుక నా సన్నిధి వారి అంతము వచ్చియున్నది;ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును..అప్పటి సమయములో ఒక్క నోవాహు ఫ్యామిలీ తప్ప అందరు దేవునికి విరోధముగా జీవించినవారే.ప్రేమించవలసినదేవుడు ఎందుకు శిక్షించవలసిన పరిస్థతి ఏర్పడుతుందో ఆలోచిస్తే ప్రతి శిక్ష ఒక శిక్షణగా అమలుకావాలని దేవుడు కోరుకుంటే మనిషి మాత్రము లెక్కచేయడము లేదు.

4) ఏది జరిగిన కొన్ని రోజులకు మరలా సోదోమా-గోమార్రా నాశనము. పూర్తిగా పాడైన ఈ రెండు నగరాలను అగ్ని గందకాలతో నాశనము చేయాలన్న decision తీసుకున్నాడు.రాను రాను శిక్ష తీవ్రత పెరిగిపోతుంది. భూమి మీద శిక్షించవలసి సరి చేయాలనుకున్న దేవుడు సరి కానీ మనిషిని పాతాళలోకములో పడెయ్యాలనుకున్నాడు. ప్రకటన 20:15-ఎవని పేరైనను జీవ గ్రంధమందు వ్రాయబడినట్టు కనబడని యెడల వాడు అగ్ని గుండములో పడవేయబడెను.శిక్షించి భూమి మీద సరి చేయాలనుకున్నాడు. అందుకే ఆదాము నీ వెళ్ళగొట్టాడు కానీ భూమి మీద ఉంచాడు. శిక్ష యొక్క ఉద్దేశము మారాలని. పాత నిబంధనలో శిక్షణ(dicipline) రావాలని శిక్షించాడు.

5) దేవుడు తాను విదించిన శిక్షను గురించి సమాజానికి తెలుపుతున్న కూడా మనిషి మారక మరింతగా చెడిపోయాడు. హోషయ 4: 8,9-నా జనుల పాపములను ఆహారముగా చేసికొందురు గనుక జనులు మరి అధికముగా పాపమూ చేయవలెనని వారు కోరుదురు.కాబట్టి జనులకు ఏలాగు.... వారి క్రియలను బట్టి వారికీ ప్రతికారము చేతును. వారి క్రియలను బట్టి ప్రతికారము చేతును అని అంటున్నాడు దేవుడు. పాపమూ ఆకాశమే సరిహద్దుగా కనబడుతున్న ఈ ప్రస్తుత కాలములో మరి దేవుడు నిర్ణయము తీసుకోడా? ఇంతవరకు మనిషిని భూమి మీద శిక్షిస్తే మారుతాడని అనుకున్నాడు కానీ, ఇక చివరికి శిక్ష భూమి మీద కాక నరకములోనే అని అనుకున్నాడు. ఇక మనిషి మారడు అనుకున్నాడు దేవుడు.

6) దిన దినము పాపము విస్తరిస్తున్నది కనుక కంటికి కనిపించని నరకములో అగ్ని గుండాన్ని ఏర్పాటు చేశాడు. ఎందుకంటే భూమి మీద దేవుని కొరకు బ్రతకని వారిని అక్కడ కోట్ల years శిక్షించాలి అని అనుకున్నాడు. కోట్ల years శిక్షించాలి అనే నిర్ణయమునకు దేవుడు వచ్చాడంటే మనిషి దేవుడిని ఎంత భాద పెట్టారో ఆలోచించండి. ఆత్మలను శిక్షించడానికి దేవుడు నరకమని క భయంకరమైన స్థలములో ఏర్పాటు చేస్తున్న పరిస్థితులను ఆలోచిస్తే ఇక్కడ నుంచు మనిషిని అక్కడ పడవేయాలనుకున్నాడు.

7) దానియేలు3:17- రాజుల కాలములో శిక్షను భూమి మీదనే అగ్ని గుండాన్ని ఉంచారన్న సంగతి అర్థమవుతుంది. రాజుల కాల చరిత్రలో మనుషులను కొరడాలతో శిక్షించేవారు. నేబెక్నేజేరు తన మాట వినకపోతే అగ్ని గుండాన్ని అవసరమైతే భూమి మీదనే చేసి అందులో వేసి శిక్షించాలనుకున్నాడు.ఇది శిక్షగా భూమి మీదనే జరిగినట్టుగా మనకు అర్థమైతే ఇదే దేవుడు చేస్తాడంటే నమ్మలేకపోతున్నాము. మనిషి చేయగలిగినది దేవుడు చేయలేడా???(దానియేలు 3:19 నుంచి చుడండి)

8) ఒక మాట వినకపోతే ఒక రాజైన నేబెక్నేజరు ఇంతగా కోపము వస్తే మరి 60 years జీవితాన్ని, జీవమును ఇచ్చి భూమి మీద నిన్ను, నన్ను పెట్టి 60 years వరకు అయన మాట వినకపోతే దేవుడికి ఇంకెంత కోపము రావాలి? నేడు ఎక్కడో తుఫాను పట్టుకుంటే ఇక్కడ మనము వనకాలి. ఎక్కడో భూకంపము కలిగితే భయముతో మనలో మార్పు రావాలి. ఎవరికో ఏదో జరిగినది అని ,ఎవరో చనిపోయారని విషయము రాగానే భయపడాలి. మనిషిని శిక్షించే సర్వ హక్కులు దేవుడికే సొంతము. ఎందుకంటే ప్రేమించటంలోను ,కాపాడటంలోను ఆయనకు మించిన వారు ఎవ్వరు లేరు.

9) ఈ భూమి మీద ఒక చనిపోయిన మనిషి శవం కాలుతుంటే చూసి తట్టుకోలేము,చూడలేము. అలా అని కలుస్తూ ఉన్నది మనల్ని కాదు. అలా అని కాలుస్తున్న శవానికి ఎమన్నా భాద ఉందా?? లేదు. శవానికి భాద లేదు. భాద లేని శవము కాలుతూ ఉంటేనే మనము చూడలేకపోతే దేవుని కోసము బ్రతకపోతే నేను కాలాలి కొన్ని కోట్ల years అని ఆలోచిస్తే భాద ఎంత భయంకరముగా ఉంటుందో అర్థమవుతుంది.సామెతలు 15:24-క్రిందనున్న పాతళమును తప్పించుకోనవాలేనని భుద్దిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకోనును. క్రింద నున్న పాతాళంను తప్పించుకోవాలంటే భూమి మీద మనిషి భుద్దిమంతుడిగా మారి పరలోకము కొరకు గూరి కలిగి దేవునికి ఇష్టముగ జీవించాలి. పాతాళం తప్పించుకోవాలి అంటే భూమి మీద బ్రతుకుతున్న మనము దేవుని పనుల్లో ఉండడము.. భూమి మీద దేవుని గురించి ఆలోచించడము. భూమి మీద ఉన్న మనము దేవుడు ఇచ్చిన శరీరాన్ని దేవుని పనిలో పెట్టాలి. దేవుని కోసము బ్రతకకపోతే మనిషిని దేవుడు పాతాలలోకములోని నరకములో శిక్ష విదిస్తాడు.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget