Halloween Costume ideas 2015

Pasuyula Pakalo Yesu Puttena

యేసు పశువుల పాకలో పుట్టేనా?
1)సహజముగా క్రైస్తవ calendarలో గాని, greetingsలో గాని చూసినప్పుడు యేసు పాకలో పుట్టినట్టుగా బొమ్మలు వేయుట ఆనవాయితీ అయినది. అలవాటులో పొరపాటు అన్నట్లుగా చిన్న భోదకులు మొదలుకుని అతి పెద్ద భోదకుల వరకూ యేసు పశువుల పాకలోనే పుట్టేనని నేటి కాలములో భోదించుచున్నారు. విచిత్రము ఏమిటంటే అయన పశువుల పాకలో జన్మించినట్లుగా క్రొత్త నిబంధనలో ఎక్కడ అధరాలు లేవు. bible క్రైస్తవుల ప్రమాణ గ్రంధమైతే అందు వ్రాయబడిన ప్రతి అంశము విషయమై క్రైస్తవులు తగు జాగ్రత్త తీసుకొనవలెను. యేసు జనన వివరములను సువార్తలలో మత్తయి, లూకా గార్ల మాత్రమే వ్రాసియున్నారు.

2) మత్తయి 2:9-11-తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువుండిన చోటుకు మీదుగా వచ్చి నిలుచు వరకూ వారికీ ముందుగా నడిచేను. జ్ఞానులు ఆ నక్షత్రమును చూచి ,అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి, తల్లియైన మరియను , ఆ శిశువును చూసి సాగిలపడి ,ఆయనను పూజించి, తమ కానుకలు ఆయనకు సమర్పించిరి 3) పై వచనములో యేసు పశువుల పాకలో పుట్టేనను సంగతి ప్రస్తావించబడలేదని గమనించగలరు. అదే విధముగా లూకా 2:6,7-యేసేపు మరియలు యూదయ లోని బెత్లేహేములో ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలి చూలు కుమారుని కని, పొత్తి గుడ్డలతో చుట్టి సత్రములో వారికీ స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టెను. ఆ వచనములో యేసు బెత్లేహేములో పుట్టియున్నాడని వ్రాయబడినదే గానీ పశువుల పాకలో పుట్టి యున్నాడని సంగతి వ్రాయబడలేదు. తన కుమారుని కని సత్రములో స్థలము లేనందున చివరికి పశువుల తొట్టెలో పరుండ బెట్టేనని bible చెప్పుచున్నది.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget