Halloween Costume ideas 2015

Devuni Jnapakalalo Neevu Unnava?

దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా?
మన ఏకైక ఆత్మలకు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ఈ ప్రకృతిలో ఎన్నో లక్షల జీవరాశులు ఉన్నప్పటికీ అన్నిటి కంటే ఎక్కువుగా ఈ సర్వ సృష్టిని సృజించిన మన పరలోకపు కన్న తండ్రి మనల్ని ప్రేమించాడని,ప్రేమిస్తున్నాడని మనకు తెలుసు. దేవుడు మనల్ని ప్రేమించాడనుటకు సాక్షమే మన కళ్ళ ముందు ఉన్న,మన కొరకు కలిగించిన ప్రకృతి. ఆదాము నుండి నేటికి పుట్టిన కోటానుకోట్ల మనుషులు రాబోతున్నారని ముందుగాఅలోచించి పుట్టినది మొదలుకుని చనిపోయే వరకు మనుషులకుఏమి కావాలో,ఎన్నెన్ని కావాలో అని తలచి ప్రకృతిలో కలిగించాడు.ఆదాము తర్వాత ఈ భూమి మీద ఎన్నో తరాలు వెళ్ళిపోయినాకూడాప్రకృతిలో సరిపడిన నిల్వను పెట్టాడు. మన జీవతములో దేవుడు జరిగించిన మేలులు గుర్తుకు వచ్చిన ఒకటో,రెండో విషయాలుచెబుతాము కానీ నిజముగా తల్లి గర్భములో పడినది మొదలుకొని మరణించేంత వరకు ప్రతి క్షణము మనకు సహాయపడుతునే ఉన్నాడన్న విషయం తెలుసుకోవాలి. భూమి మీద జీవిస్తున్నమనల్ని బ్రతికించుకోవాలని దేవుడుప్రతి క్షణము అలోచిస్తునాడు కనుకనేనేడు60, 70 ఏళ్ళు బ్రతకగలుగుతున్నాము.

2) ఇంతగా దేవుడు మనిషి గూర్చి ఆలోచిస్తుంటే మరి భూమి మీద ఉన్న మనిషి దేని గూర్చి ,ఎవరి కొరకు ఆలోచన చేస్తున్నాడు?నేడున్న మనుషులలోనిమనస్సులో దేవుని గుర్చిన ఆలోచనలు, జ్ఞాపకాలు ఉన్నాయంటారా?పుట్టడానికి కారణము దేవుడని, నేటికి బ్రతకడానికి కారణము దేవుడని,తింటున్న ఆహారము పిలుస్తున్న గాలి మరియు అనుభవిస్తున్న ప్రకృతి దేవుడు మనకు ఇచ్చాడన్న జ్ఞాపకాలు ఉన్నాయా? ఈ ప్రకృతిలో జీవిస్తున్న మనషి క్రమ క్రమంగా దేవునిపై గుర్చిన జ్ఞాపకాలు తుడిచివేస్తునాడు. నేను దేవునికి కాక కోతకి పుట్టానని, నా జన్మ వెనుక దేవుడు కాక కోతి ఉంది అని అంటూ దేవునికి పుట్టానన్న జ్ఞాపకాన్ని తుడిచివేస్తున్నాడు. దేవుడు కలిగించిన ఈ ప్రకృతిని అనుభవిస్తూ ప్రకృతి వెనుక , తన జన్మ వెనుక దేవుడే లేడంటూ దేవునిపై గుర్చిన జ్ఞాపకాలు తుడిచివేస్తునాడు. 3) నిజముగా రానున్న కాలములో దేవుని కోసం బ్రతకండి అన్న మాటను మాట్లాడిన వాడిని పిచ్చివాడని పిచ్చి ఆసుపత్రిలో చేర్చిన అర్చర్యపోవాల్సిన అవసరత లేదు. దేవుని మాటలు మా చెవికి వినపడకూడదన్న భయంకరమైన వ్యవస్థ రానున్న కాలములో రానుంది.మనిషి జ్ఞాపకాలలో దేవునిని తుడిచి పెట్టేసి లోకాన్ని గుర్చిన జ్ఞాపకాలు పెట్టుకొనుట వలన నేడు మనిషి దేవుని గూర్చి ఆలోచించలేకపోతున్నాడు. మనిషి జ్ఞాపకాలలో మనుషుల గురించి, దేశాల గురించి, ఆటల గురించి,పాటల గురించి, సినిమాల గురించి, హత్యల గురించి, ప్రమాదాల గురించి,ఇలా తన జ్ఞాపకాలలో పెట్టుకున్నాడు.నిజముగామనిషికే కాక పరలోకమందున్న కన్న తండ్రి కూడ జ్ఞాపకాలు ఉన్నాయి. నీ జ్ఞాపకాలలో దేవుడు లేకపోయిన దేవుని జ్ఞాపకాలలో నీవున్నావని ఆలోచించావాఏరోజైనా ?దేవుని జ్ఞాపకాలలో మనిషి ఉన్నాడా?

4) యిర్మియా 15:6- యెహోవా వాక్కు ఇదే- నీవు నన్ను విసర్జించియున్నావు, వెనుకతీసియున్నావు గనుక నిన్ను నశింపజేయునట్లు నేను నీ మీదికి నా చేతిని చాచియున్నాను.అనగా దేవుని కోసమే బ్రతికే వారిని చేతులు చాచి హక్కున చేర్చుకుంటాడు మరియు దేవునిని విసర్జించి ,పట్టించుకోకపోతే దేవుడు మనల్ని పట్టించుకోడు. మన జ్ఞాపకాలలో దేవుడు లేకపోతే అయన జ్ఞాపకాలలో మనము ఉండము. నీ జ్ఞాపకాలలో దేవుడు లేకపోతే, నీవుదేవుని గురించి ఆలోచించకపోతే, దేవుని కొరకు ఈ భూమిపై బ్రతకకపోతే అయన నీ గురించి ఎందుకు ఆలోచించాలి? ఒక్కసారి ఆలోచించండి.

5) మరి ఎలాంటి వారు ఆయనను జ్ఞాపకాలలో ఉంటారోఅన్న విషయాలు బైబిల్ నందు కొన్ని అద్భుతమైన సంగతులు చూస్తే మనకు అర్చర్యం కలుగుతుంది. యెహోషువా 2:1 నుండి24గల సందర్భమును ఆలోచిస్తే యెహోషువా నాయకత్వంలో ఇశ్రాయేలియులు పాలస్తీనా దేశాన్ని ఆక్రమించుకోవడానికి సిద్దపడుతున్నప్పుడు అప్పటికే ఆ ప్రదేశంలో ఉంటున్న అన్యజనులను వెళ్ళగొట్టడానికి అక్కడి పరిస్థితులను తెలుసుకొనుటకు వేగులవారైన ఇద్దరిని పంపటం జరిగింది. వీరురాహబను వేశ్యఇంట చేరియున్నారని యోరికో రాజునకు తెలిసినప్పుడురాజు పంపిన మనుష్యులతో వీరు ఎక్కడికి పోయిరో తెలియదు అని చెప్పింది.ఐగుప్తు దేశము నుండి వచ్చినప్పుడు మీ యెదుట యెహోవ యెర్ర సముద్రపు నీరును విభజించి రక్షించాడన్న సంగతి అన్యజనురాలైన రాహబ విన్నది. అంటే ఇశ్రాయేలియులలో జరిగిన అద్బుత కార్యాన్ని యోరికోలో ఉంటున్న అన్యజనురాలైన వేశ్య రాహబ విని తన జ్ఞాపకాల్లో పెట్టుకుంది. వీరిని దాచిపెట్టి కాపాడితే విరి దేవుడు నాకు కూడ మేలు చేస్తాడని అలోచించి యోరికో రాజుకు వర్తమానం చెప్పలేదు. ఈ వచనాలసందర్భంలో మనం అలోచంచవలసిన విషయం చూస్తే ఇశ్రాయేలియులలో జరిగిన అద్బుత కార్యాన్ని యోరికోలో ఉంటున్న అన్యజనురాలైన వేశ్య రాహబ విని తన జ్ఞాపకాల్లో పెట్టుకుంది గనుక దేవుడు రహబను తన జ్ఞాపకాలలో పెట్టుకున్నాడు కనుకనే వీరి కుటుంబమును తప్పించి రక్షించాడు.

6) దేవుని జ్ఞాపకాలలో ఎవరు ఉంటారో పై సందర్భము నుండి ఆలోచిస్తే భూమి మీద దేవుని కొరకు కష్టపడుతున్నవారిని , దేవుని కొరకు ఆలోచిస్తున్నవారిని, దేవుని కార్యక్రమాలలో ఉన్నవారిని అయన తన జ్ఞాపకాలలో పెట్టుకుంటాడు. అలానే అపోకర్య 10:1 నుండి 4- అందుకు దూత నీ ప్రార్ధనలను ,నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్ధముగా చేరినవి. ఈ వచన సందర్బాన్ని ఆలోచిస్తే అన్యుడైన కోర్నేలి దేవుని కోసం బ్రతకాలన్న ఆశ, దేవుని జ్ఞాపకాలలో ఉండాలన్న ఆలోచన కలిగిచేస్తున్న కార్యక్రమాలను చూచి సంతోషించిన పరలోకపు తండ్రి దేవదూతను పంపించి తెలియజేసాడు. దీని బట్టి అలోచోస్తే ఈ భూమి మీద దేవుని కొరకు చేస్తున్న కార్యక్రమాలే ఆయనకు జ్ఞాపకాలలో ఉంటాయి.

7) మనిషికి మేలు చేస్తే కొద్ది రోజులకు మరచిపోతాడు. మనిషి కోసం మీరు ఏమి చేసిన చేసినప్పుడు ఒకలా మరియు సహాయం పొందాక మరోలా ఉంటాడు కానీ నీవు చేస్తున్న దేవుని పనులను జ్ఞాపకర్ధముగా ఒక గ్రంధములో దేవుడు వ్రాసిపెట్టుకుంటున్నాడు. మాలకి 3:16-యహోవా యందు భయభక్తులు కలిగి అయన నామమున స్మరించుచు ఉండువారికి జ్ఞాపకర్ధముగా ఒక గ్రంధము అయన సముఖము నందు వ్రాయబడెను.ఈ భూమి మీద అయన కొరకు కష్టపడిన వారు అయన జ్ఞాపకాలలో ఉంటారు. దేవునిలో ఉన్నానని చెప్పుచున్న నీవు ఎంతగా అయన జ్ఞాపకాలలో ఉన్నావు? దేవునిలో ఉన్నానని చెప్పుచున్న నీవు ఎంతగా అయన కార్యక్రమాలు చేయుచున్నావు?ఏ స్థితిలో ఉన్నామో ఒక్కసారి పరిశిలించుకొ .

8) దేవునిలోలేనివాడు దేవుడంటే ఎక్కువ భయపడుతున్నట్లుగా చూస్తున్నాం కానీ దేవునిలో ఉన్నవాడు ఏమి ఉందిలే అనే చులకన భావంతో ఉన్నాడు. దేవుని గూర్చి తెలుసుకొనక ముందు భయం భయం ఉంటుంది కానీ దేవునిలోకి వచ్చి తెలుసుకున్నాక ఏమి ఉందిలే అని ఇష్టానుసారముగా బ్రతుకుతున్నాడు.ప్రతి నిత్యం దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు అని అనుకుంటే మరి అయన గురించి నేను ఏమి చేస్తున్నాను అని ఆలోచించవా?? దేవుడు కోసం బ్రతుకుతావని అలోచించి నిన్ను ఈ భూమి మీదకు పంపితే ఈ 60 ఏళ్ల జీవితాన్ని ప్రేమించి నీకు ఇష్టంవచ్చినట్లుగా బ్రతకడానికి అలవాటు పడితే దేవుడు మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి?సమాజం పాడైపోతుందని, నాశనమైపోతుందని తెలుసు, వారిని రక్షిస్తే దేవుడు పరలోకాన్ని ఇస్తాడన్న సంగతి తెలుసు. ఇన్ని తెలిసిన నీవు దేవుని పని కోసం ముందుకు వస్తున్నావా?

9) ఫిలిప్పు 4:3లో చూస్తే సువార్త పనిలో సహకరులుగా ఉన్న వారి పేరులు జీవ గ్రంధమందు వ్రాయబడి ఉంటుంది. అనగా దేవుడు కొరకు ఈ భూమి మీద కష్టపడి పని చేస్తున్న వారి పేరు జీవ గ్రంధమందు రాసుకుని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు . దేవుని వాక్యం వినిపించే పనిలో సహకరులుగా ఉండాలి. సువార్త పనిలో ఉండి జీవ గ్రంధములో పేరు వ్రాయబడాలన్న ఆశతో ఆలాగు జీవించాలి. దేవునిని సంతోషపెట్టే ప్రతి పనిని దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. నీకు జీవితాన్ని ఇచ్చి, నిన్ను కాపాడి, నిన్ను నిలబెట్టి, నీకు కావలసినవి అన్ని ఇస్తున్న నీ పరలోకపు తండ్రికి నీవు చేస్తున్నది ఏంటి??? దేవుని కొరకు ఏ చిన్న పని చేసిన నీవు దేవుని జ్ఞాపకాలలో నిలిచిపోతావు. దేవుని జ్ఞాపకాలలో నీవు ఉన్నావా లేవా అనిఒకసారి నీ జీవిత విధానమును పరిశీలించుకో. దేవుని జ్ఞాపకాలలో ఉండాలని ఆశ పడితేదేవుని కొరకు నీ శక్తీ కొలది అనేక కార్యక్రమాలు చేయాలి.

10) దేవుని జ్ఞాపకాలలో ఉండాలని,జీవ గ్రంధము నందు పేరు ఉండాలని పట్టుదలతో దేవుని కొరకు పని చేస్తావో లేక దేవుని జ్ఞాపకాలలో ఉండకజీవ గ్రంధమందు పేరు లేక నరకానికి వెళ్తావో నిర్ణయం నీ చేతిలో ఉన్నదీ.

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget