Halloween Costume ideas 2015

Bible prakaram manussyulu Thirpu Thirchavatcha?

బైబిల్ ప్రకారముగా మనుష్యులకు తీర్పు తీర్చవచ్చా?

అనేక మంది హృదయాలలో చోటు సంపాదించుకున్న మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున

మీకు శుభములు తెలియజేస్తున్నాను.

1) యేసుక్రీస్తుఈ లోకానికి వచ్చి నేటికి సుమారు 2000 సం దాటిపోయింది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఎన్నో భోదనలు చేసాడు. 2000సం దాటిపోయిన ఈ రోజు ప్రపంచములో ఎక్కువ మందిని ప్రభావితం చేసి ,ఎక్కువ మంది హృదయాలలో చీరస్థాయిగా యేసుక్రీస్తు చోటు సంపాదించాడంటే కేవలము అయన మాటలలోనున్నగొప్పతనమే అని చెప్పక తప్పదు.నేటి వరకు మన కళ్ళ ముందు ఎంతో రాజకీయ నాయకులు, పెద్దవారుమనల్ని పరిపాలించి చివరికి మరణం పేరుతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఇలా వీరు ఈ లోకాన్ని వదిలి కనీసం 20సం కాకముందే వారిని మర్చిపోయే దాఖలు ఉన్నాయి.  అనగా మన కళ్ళముందు తిరిగిన వ్యక్తి, ప్రతి రోజు మీడియా వార్తలలో కనుబడు వ్యక్తి ఒక సంవత్సరం పాటు కనబడకపోతే మర్చిపోతాం. అయితే యేసుక్రీస్తు ఏ మీడియా వార్తలలో కనబడలేదు కానీ ఈ రోజు అనేక లక్షల, కోట్ల మంది హృదయాలలో అయన చోటు సంపాదించడంటే ఇంక అయన మాటలు ఎంత గొప్పవో ప్రతి ఒక్కరు గుర్తించుకోవాలి.

2) మహనీయుడైన యేసుక్రీస్తు మాటలలో ఒక అంశమును చూస్తే మత్తయి 7:1- మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు.మనక్రైస్తవు సమాజానికి ఈ వచనమంటే బాగా గుర్తుండేఉంటుంది కానీ ఈ మాటలో ఉన్న పరిపూర్ణ సారాన్ని అర్థం చేసుకొనుటలో మాత్రం విఫలమయ్యారనే చెప్పాలి. వ్యక్తిగత విషయాలలో ఘోరమైన తప్పిదమునుఅవతలి వారికీ తెలియజేసి సరిచేసుకోమని చెప్పినప్పుడు వెనువెంటనే వారి నోట నుండి వచ్చే మాటే మత్తయి 7:1. బైబిలుకు వ్యతిరేకమైన భోదన చేస్తూ ,వాక్యాన్ని వక్రికరిస్తూ, వాక్యమును తప్పుగా చెబుతున్నప్పుడుమనం సత్యమైన వాక్యము చెప్పి మీరు చెప్పింది తప్పు అని చెప్పినప్పుడు వెనువెంటనేవారి నోట నుండి వచ్చే మాటే మత్తయి 7:1.

3) క్రైస్తవుడైన ప్రతి ఒక్కరు మొట్టమొదట మత్తయి 7:1 నుండి 5 వరకు యేసు పలికిన భోదనలో ఎవరిని దృష్టిలో పెట్టుకుని, ఎవరి గూర్చి ,ఎందుకు చెప్పారో తెలుసుకోవాలి. ఇది ఇలా ఉంచి 1 కోరంది 6:2,3 చూస్తే పరిశుద్దుల లోకమునకు తీర్పు తీర్చుదురని మిరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరుగవలసియుండగా ,మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తిర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవ దూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? ఈ జీవన సంభంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యముగా తీర్పు తిర్చవచ్చును గదా? మత్తయి 7:1 లో తీర్పు తీర్చకుడి అని మాట అంటే 1 కోరంది6:2,3 లో తీర్పు తీర్చమని చెబుతున్నాడు. కనుక మనం పై మాటలను ఎలా అర్థం చేసుకోవాలి? చూద్దాము.

4) బైబిలలో ఆదికాండము మొదలుకుని ప్రకటన గ్రంధము వరకు గల 66 పుస్తకాలలో మనకు ముఖ్యముగా రెండు తీర్పులు కనబడుతున్నాయి. A) దేవుని తీర్పులు B) మనుష్యుల తీర్పులు. అయితే మత్తయి 7:1 నుండి 5లో, 1కోరంది6:2,3లోచెప్పబడినది మనుష్యుల తీర్పు గూర్చి అని తెలుసుకోవాలి. ఈ పాఠమును భాగాలుగా విడదీసి వివరించుకుంటే చక్కగా అర్థమవుతుంది.(1) దేవునికి నచ్చని మనుష్యునితీర్పులు (2) దేవునికి నచ్చే మనుష్యుని తీర్పులు. మత్తయి 7:1 నుండి 5 వరకు చెప్పబడిన మాటలు దేవునికి నచ్చని మనుష్యుల తీర్పులకు సంభంధం ఉంటే 1 కోరంది 6:2,3,లో చెప్పబడిన మాటలు దేవునికి నచ్చే మనుష్యుల తీర్పులకు సంభంధం ఉందని తెలుసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క భాగమును విడగొట్టుకుంటూ ధ్యానించుటలో ముందుకు సాగుదాం. దేవునికి నచ్చని మనుష్యుల తీర్పులు

A) మత్తయి 7:1 నుండి 5వరకు-మీరు తీర్పు తీర్చకుడి. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గుర్చియు తీర్పు తీర్చబడును,మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును చూచుట యేలా?నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని చెప్పనేల? వేషధారి, మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసికొనుము,అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఇది వాక్యములోని మాటలు.

B) పై వచనములో దూలము అనగా మనిషిలోనున్న బలహీనత లేక తప్పు లేక పాపము. ఇక వచన వివరణలోకి వెళ్తే అవతలివారిలోనున్న నలుసును గుర్తించిన నీవు నీ కంటిలోనున్న దులాన్ని మొదట గుర్తుంచుకోవాలి అని చెబుతున్నాడు. అనగా అవతలి వాళ్ళ బలహీనతలపై ఎల్లప్పుడూ శ్రద్ద చూపుట కంటే మొట్ట మొదట మన బలహీనతల గూర్చి చూసుకోవాలి అని చెబుతున్నాడు. 24 గంటలు అవతలి వాడిలో ఉన్న బలహీనతలు ఆలోచిస్తూ తమకు తాములో ఉన్న ఘోరమైన బలహీనతలను ఆలోచించకుండా అవతలి వారు చేయు తీర్పు దేవునికి నచ్చని తీర్పు కనుక ఇట్టి తీర్పు తీర్చకుడి అని అంటున్నాడు.

C)ఏ రోజు కూడనీ జీవితాన్ని వాక్యముతో పరిశిలించుకొనక, చెడ్డవాడిననితెలిసి సిగ్గుపడక ,నిన్ను నీవు విమర్శించుకొనకుండా ,నీకు నీవు తీర్పు తిర్చుకోనక ఎల్లప్పుడూ అవతలి వాడికి తీర్చుతున్న తీర్పులు దేవునికి నచ్చని తీర్పులు. నీబలహీనతలు ఏనాడు పట్టించుకొనక ఎప్పుడు అవతలివాడి గురించి తీర్పు తీర్చుతున్న నీవు చేసేది దేవునికి నచ్చని తీర్పులు కనుక మత్తయి 7:1 నుండి 5లో తీర్పు తీర్చకుడి అని చెప్పాడు. లూకా 18:9 నుండి 14లో తమకు తామేనీతిమంతులమని ఇతరులను తృణికరించువారితో పరిసయ్యుడు-సుంకరి గూర్చి చెబుతున్న సందర్భపు మాటలను ఒక్కసారి ధ్యానించండి.

D) మత్తయి 7:1 నుండి 5లో అవతలి వాడిలో బలహీనతలు ఉంటె వాటిని తీసేసే ప్రయత్నం మీరు ఎప్పుడు చేయకండి అని యేసు చెప్పలేదు కానీ తీసి వేసే ముందుగా నీలోనున్న దూలము(ఘోరమైన తప్పిదములు) తెలుసుకుని సరిచేసుకోమని చెబుతున్నాడు. రోమా 2:1నుండి చూస్తే కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవైయున్నావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తిర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తిర్చుకోనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా?.....అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా,నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకుందువా? అనగా అవతలి వాళ్ళను తప్పు అని తీర్పు తీర్చుతున్న వారు ఆ తప్పునే వీరు చేస్తున్నప్పుడు ఇట్టివారు దేవుని తీర్పును తప్పించుకోలేడని పై వచనములో అర్థమవుతుంది

E) మత్తయి 7:1నుండి 5, లూకా 18:9, రోమా 2:1 నుండి 5 ఈ మూడు వచనాలలో మనకు అర్థమైన విషయమేమనగాఅవతలి వారి తప్పిదములను బట్టి తీర్పు తిర్చవద్దు అని చెప్పలేదు కానీ తీర్పు తీర్చుతున్న వాడు మొట్టమొదట తనను తాను తీర్పు తీర్చుకోవాలని చెబుతున్నాడు. తనను తాను సరిచేసుకోకుండా అవతలి వాళ్ళకి తప్పు అని తీర్పు తీర్చుతు ఆ తప్పునే వీరుచేస్తూ ఇచ్చే తీర్పు దేవునికి నచ్చని తీర్పు .అవతలి వాడి యొక్క బలహీనతలు బట్టి తీర్పు తీర్చే ముందు ఒక్కసారి తమకు తాము ఆలోచించుకోవాలి. 1 కోరంది11:28-ప్రతి మనుష్యుడు తన్ను తాను పరిక్షించుకోనవలెను.....31-మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పొందుము.

F) అను దినము వాక్యముతో జీవితాన్ని పరిశిలించుకుంటూ, విమర్శించుకుంటూ, సరి చేసుకుంటూ ఈ అనుభవంతో అవతలివారిని దారిలో తెచ్చే అవకాశం ఉంటుంది కానీ తమకు తాము మంచివారిగా,నీతిమంతులుగా తీర్చుకుంటూ ఎప్పుడు అవతలి వారి మీద వెలు ఎత్తేస్వభావముతో తీర్పు తీర్చితే అట్టి తీర్పు దేవునికి నచ్చే తీర్పు కాదు కనుక మత్తయి 7:1లో తీర్పుతీర్చకుడి అన్నాడు. దేవునికి నచ్చే మనుష్యుల తీర్పులు

A) ఇంతవరకు పై వివరణలో దేవునికి నచ్చని మనుష్యుల తీర్పుల గూర్చి తెలుసుకున్నాము. అయితే దేవునికి నచ్చే మనుష్యుని తీర్పులు గూర్చి ఇప్పుడు ఆలోచిద్దాము. వాస్తవానికి సహోదరులమైన మనం ఒక బలహీనత ఒకరిలో ఉందని తెలిసినప్పుడు ఆ బలహీనత గురించి ప్రస్తావించి మంచి దారికి తీసుకుని రావొచ్చా?? అయితే గలతీ 6:1- సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకోనినయెడల ఆత్మ సంభందులైన మిలో ప్రతి వాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసుకుని రావలెను. ఆవతలి వారిని దారిలో తీసుకునివచ్చుటకు దేవుడు నియమ నిభంధనలతో గలతీ 6:1 ద్వార మనకు తెలియజేసాడు.

B)ఎవరైనా ఏ బలహినతలోనైన ,నేరములో’నైన, పాపములోనైన, తప్పిదములోనైన పడిపోతే తాను ఒక దినాన ఆదేబలహినతలో ,నేరములో’, పాపములో, తప్పిదములో శోధింపబడుదునేమో అని తన విషయమై తాను చూచుకోనుచు సాత్వికముతో తననుమంచి దారికి తీసుకుని రావాలి. ఇది దేవునికి నచ్చే తీర్పు. అనగా మనల్ని మనం సరి చేసుకుని అవతలి వారి తప్పులను ఎత్తి వారిని నిందించకుండా, హేళనచేయక, గడ్డించక సాత్వికమైన మనస్సుతో తాను చేసినది తప్పు అని తెలియజేసి మంచి దారికి తీసుకుని వచ్చే తీర్పు దేవునికి నచ్చే తీర్పుగా మనం గలతీ 6:1 ద్వార తెలుసుకుంటూన్నాము. C)ఒక వ్యక్తిని మంచి దారికి తీసుకుని వచ్చే ముందు మొదట తప్పు అని అతనికి తెలియజేయాలి. తప్పు అని చెప్పకపోతే అది తప్పు అని తెలుసుకునే ఆవకాశం రాదు కనుక ఆ తప్పు బట్టే నరకములో పడుట ప్రమాదం ఉన్నదీ. అనగా అవతలి వారి వ్యక్తి గత విషయములో దేవునికి వ్యతిరేకముగా తప్పిదము చేస్తున్నప్పుడు మొదట ఆ తప్పు మనలో ఉన్నదో అని పరిశిలించుకుని సరి చేసుకుని సాత్వికమైన మనస్సుతో అవతలి వారికి తప్పును తెలియజేసి మంచి దారికి తీసుకుని వచ్చే క్రియే దేవునికి నచ్చే తీర్పు.

D)అయితే తీర్పు తీర్చుట విషయములో దేవుడు మన నుండి ఆశించేది ఏది? ఈ లోకంలోనున్న న్యాయాధిపతుల వలె మనం తీర్పు తీర్చకూడదు కానీ ఆ తీర్పు అవతలి వారిని దేవునికి దగ్గర చేసేటట్టు ఉండాలి. నీతి గల దేవునికి పిల్లలమైన మనం కూడ నీతిమంతులుగా బ్రతకమన్నాడు. ఆనీతినే ఖచ్చితముగా తీర్పులో పెట్టమన్నాడు. న్యాయమైన తీర్పు తీర్చవచ్చని లేవికండము 19:15,17,18 లో దేవుడు చెప్పాడు.

E)అయితే న్యాయమైన దేవునికి నచ్చే తీర్పు తీర్చు విధానమును మత్తయి 18:15 నుంచి చూడవచ్చు చివరిగా 1.అవతలి వారిలో ఉండు బలహీనత బట్టి తీర్పు తీర్చక ముందు ఆ బలహీనత నీలో ఉన్నదేమో పరిశిలించుకుని ఆవకాశం దొరికింది అని పెత్తనం చేయక సాత్వికమైన మనస్సుతో ఒంటరిగానున్నప్పుడు అతినికి చెప్పాలి. 2. మీ మాట వినని యెడల ఇద్దరు ముగ్గురితో చెప్పించాలి. 3. ఇంకను వినకపోతే సంఘమునకు తెలియచెప్పాలి. 4. ఇంకా వినక పోతే ఇంక వాడిని అన్యుడిగా ఎంచుకోవాలి. 5. వెలి వేసాక ఏదో ఒక రోజున తప్పు తెలుసుకుని మార్పు చెందితే వెంటనే మనలోకి చేర్చుకోవాలి.

3. అవతలి వారు వాక్యమును తప్పుగా చెబుతుంటే సత్యమేదో చెప్పి వారిని తీర్పు తీర్చమన్నాడా??? ఇప్పటికి వరకు దేవునికి నచ్చే ,నచ్చనివ్యక్తిగత తీర్పుల గూర్చితెలుసుకున్నాము. ఇక అవతలి వాడు భిన్నమైన భోద, అసత్యమైన భోద చేస్తున్నప్పుడు ఖచ్చితముగా మనం సత్యం చెప్పి సరి చేయవలసిన భాద్యత మనకు ఉన్నదీ. అవతలి వాడు చెబుతున్న భోద ఆలాగు ఉన్నదో లేదో అని బైబిల్ లోని మాటలను పరిశీలించి తీర్పు తీర్చాలి. అనగా తప్పుడు భోదన చేయువాడు తనను తాను నరకానికి చేర్చుకుంటూ వింటున్న వారిని నరకానికి చేరవేస్తాడు కనుక సత్యము చెప్పి అబద్ద భోదకుడిని సరిచేయమన్నాడు. అబద్ద భోదకుల నుండి జాగ్రతగా ఉండమని, భోద విషయములో జాగ్రత్తగా ఉండమని ఎన్నో హెచ్చరికలు బైబిల్ ద్వార దేవుడుమనకు తెలియజేసాడు.( మత్తయి 7:15,మత్తయి 24: 4,5,24, గలతీ 1:6,7,8, ఎఫేసి 5:6,7,11, 1 తేస్సా 5:12,11 తేస్సా 3:6,11 తిమోతి 3:16,17,తితు 2:15....)బైబిలుకు వ్యతిరేకమైన భోదన చేస్తూ ,వాక్యాన్ని వక్రికరిస్తూ, వాక్యమును తప్పుగా చెబుతున్నప్పుడుమనం సత్యమైన వాక్యము చెప్పి సరి చేయాలి.
 

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget