Halloween Costume ideas 2015

World Today

. అస్సలు దేవుని ప్రణాళిక నీ,నా పట్ల ఏమైయున్నదో ఆలోచించరా ఒక్కసారి?

మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
నేడు ప్రపంచములో జరుగుచున్నవి ఒక్కసారి ఆలోచిస్తే భయం కలుగుతుంది. నేటికి ఎంతో మంది వరదలు వల్లనో, వ్యాధుల వల్లనో ,ప్రకృతి వైపరిత్యాల వల్లనో ఈ దినము చూడకుండా,అనుభవించకుండా మరణించియున్నారు కానీ నేటికి నీవు ,నేను సజీవముగా బ్రతికియున్నామంటే కారణం ఆలోచిస్తే దేవుని ప్రణాళిక మన పట్ల ఉంది కనుక. అస్సలు దేవుని ప్రణాళిక నీ,నా పట్ల ఏమైయున్నదో ఆలోచించరా ఒక్కసారి? మనం ఈ భూమి మీద ఉండగానే యేసును స్వరక్షకుడిగా అంగికరించి మరుమనస్సు నిమిత్తము బాప్తీస్మం పొందకుండా మరణిస్తే చివరికి నరకానికే వెళ్తాము.
ప్రకటన 20:15-ఎవరి పేరైనను జీవ గ్రంధమందు వ్రాయబడినట్టు కనబడని యడల వాడు అగ్ని గుండములో పడ వేయబడును. నా పేరు జీవ గ్రంధములో వ్రాయబడింది అని ధైర్యముగా చెప్పగలవా?? ఒక్కసారి మన ఆత్మీయ స్థితిని పరిక్షించుకుంటే ధైర్యంగా న పేరు జీవ గ్రంధమందు వ్రాయబడింది అని చెప్పలేము.
ఎందుకంటే మన చీకటి పాపపు క్రియలు మనకు సాక్షం పలుకుతున్నాయి కాబట్టి. నేడు అనేక మంది మదిలో మెదిలే ఆలోచనలు చూస్తే మన దేవుడు ప్రేమమయుడు అండి,మన దేవుడు శాంతి ప్రధాత అండి కనుక మనం ఎన్ని తెలిసి తెలిసి తప్పులు చేసి దేవుని యెడల ఒప్పుకుంటే క్షమించి వదిలి వేస్తాడు కదా అన్న భ్రమ కలిగి బ్రతుకుచున్నారు. దేవుడు మనలను తన చేతులతో ఎంతో ఇష్టంగా నిర్మించుకున్నాడన్న విషయం ఆలోచించండి. కానీ అయన పిల్లలమైన మనము ఆయనకు విరుద్ధముగా జివించుచున్నాము. దేవుడు మనల్ని బట్టి ఎంత భాదపడుతున్నడో తన మాటలలో చూస్తే యెషయ 1:2- యెహోవా మాటలడుచున్నాడు.. ఆకాశమా ఆలకించుము,భూమి చెవియోగ్గుము. నేను పిల్లలను పెంచి గోప్పవారినిగా చేసితిని కానీ వారు నామీద తిరగబడియున్నారు.. ఇలా దేవుడు ఆకాశముతో,భూమితో చెప్పుకుని భాదపడుతున్నాడు. మనల్ని బట్టి మన దేవుడు ప్రతి దినము కోపం పడుతున్నాడు. కీర్తనలు 7:11-న్యాయమును బట్టి అయన తీర్పు తీర్చును. అయన ప్రతి దినము కోపపడు దేవుడు.. దేవుడు ప్రతి దినము కోపపడుతున్నాడు కాబట్టే ప్రతి రోజు కొన్ని వేల మంది చనిపోవుచున్నారు. 1983లో ఎక్కడో ఉన్న ఆఫ్రికాలో ఎయిడ్స్ మొదలైనది కానీ ఇప్పుడు ప్రపంచమంతట వ్యాపించడం ద్వారా నేటికి కొన్ని లక్షలమంది చనిపోయారు. ఇప్పుడు ఎబోలా వ్యాధి వచ్చేసింది. ఎవరికో వచ్చింది కదా అని,ఎక్కడో వచ్చింది కదా నేను క్షేమముగా ఉన్నాను కదా అని తలంచుచున్నావా?
నీవు ఉన్న స్థలముకు ఈ వ్యాధి ఒకవేళ వస్తే, ఈ వ్యాధి మనకు అంటుకుని ఒక దినాన చనిపోతే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అర్థంతరముగా మనం చనిపోతే మన ఆత్మ ఎక్కడి పోతుందో ఆలోచించరా? ప్రకటన 3:1-నీ క్రియలను నేను ఎరుగుదును .జీవించుచున్నావన్న పేరు మాత్రము ఉన్నదీ కానీ నీవు మృతుడవే.... కనుక దేవుని కొరకు క్రియలు లేని విశ్వాసంతో జీవిస్తే చచ్చిన వారితో సమానమని చెప్పుచున్నాడు. వాస్తవముగా యేసుక్రీస్తు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అయన రాక ముందే అయన రాకడ సూచనలు అన్ని జరుగుతున్నాయి అనుటలో సందేహం లేదు. చివరికి యేసుక్రీస్తు రాకడ మిగిలింది. ఒకవేళ అయన రాకడ మరు క్షణమే కావొచ్చేమో?
కనుక ఇప్పటికైన ఈ తాత్కాలికమైన లోకనుసారముగా ఎందుకు జీవిస్తున్నానని ఆలోచించండి. నా పితరుల వాలే నేను నా జీవిత విధానాన్ని ఎందుకు మార్చుకోకుడదు అని ఆలోచించండి. ఒక పౌలుగా క్రీస్తు నిమ్మితము ఎందుకు జివించకూడదు ? నేను అయన రాకడలో ఎత్తబడాలని, నా పేరు జీవ గ్రంధమందు వ్రాయబడాలి అని, అయన కొరకు నిలబడి నీతి క్రియలు జరిగించాలి అని ఇప్పుడే ఎందుకు నిర్ణయించకూడదు???? ఎప్పుడు ఏ క్షణములో ఏమి జరుగుతుందో తెలియని ఈ రోజుల్లో మనం దేవుని కోసం జీవిస్తూ,అయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉండాలి.అప్పుడు దేవుడు మన నిమిత్తము ఆనందిస్తాడు. 111యోహాను 1:4- నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకోనుచున్నారని వినుటకంటే నాకు ఎక్కువైనా సంతోషం లేదు అని అమన్ నిమిత్తమై ఆనందిస్తాడు.

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget