Halloween Costume ideas 2015

Last Judgment

అంత్య దినములు ప్రారంభమైనవా?? లోకము అంటున్న అంత్యక్రీస్తు వచ్చాడా ? వస్తాడాఅంత్య తీర్పు ఎప్పుడు జరుగుతుంది??

: justify;">అంత్య దినములు ప్రారంభమైనవా?? లోకము అంటున్న అంత్యక్రీస్తు వచ్చాడా ? వస్తాడా?
అంత్య తీర్పు ఎప్పుడు జరుగుతుంది??
ప్రభువు ప్రియ రక్షకుడైన యేసు నామములో మీకు శుభములు తెలయజేస్తున్నాను. నేటి క్రైస్తవ సమాజములో ఎక్కువ మందికి సందేహము ఈ అంత్య దినాలకు పైనే. ఈ యొక్క post లో మూడు భాగాలుగా విభాగించబడినది.
(1) అంత్య దినములు గూర్చి
(2) లోకము అంటున్న అంత్య క్రీస్తు and క్రీస్తు విరోధి గూర్చి
(3) అంత్య తీర్పు గూర్చి.
(1) (a) ఇప్పుడు మొదటి భాగమైన అంత్య దినముల గూర్చి bible లోతులోకి వెళ్లి చూద్దాము.. అంత్య దినాలు అనేవి ఈ మధ్య కాలములో start అయ్యాయి అన్నట్లుగా అనుకుంటున్నారు. వాక్యము దగ్గరకు రాగానే ఏ వ్యక్తిని నమ్మక, ఏ వ్యక్తిపై ఆధారపడక కేవలము వాక్యముపై ఆధారపడి, వాక్యాన్ని మాత్రమే నమ్మి ఈ సమాజములో సత్యము పక్షాన నిలబడాలి. ఇంతకు అంత్య దినములు start అయ్యాయా???? ఒక వేళ start అయితే ఈ మధ్యకాలములో ప్రారంభమైనవా??? అప్పుడప్పుడు మనము కూడా భారి తుఫాను, సునామి, భూకంపాలు వచ్చినప్పుడు వెంటనే మనము అంత్య దినాలలో ఉన్నామని అనుకుంటున్నాము. ఇవి రాకపోతే మాములుగా ఉన్నాము అని అనుకుంటున్నాము. తుఫాను హెచ్చరికలు జారి అయిన వెంటనే అమ్మో!! అంత్య దినాలు start అయ్యాయి అని అనుకుంటాము. ఏదో ప్రకృతిలో సంభవించిన ఒక వైపరిత్యాన్ని బట్టి, ప్రకృతిలో జరుగుతున్న ప్రమాదాలను బట్టి అప్పుడే అంత్యదినాలు start అయ్యాయి అని అనుకుంటున్నారు. (b) bibleలో వెళ్లి దిని గురించి పరిశిలించినట్లు అయితే అస్సలు అంత్య దినాలు ఎప్పుడు ప్రారంభమైనాయి అనే విషయమును చూస్తే హెబ్రీ 1:1- ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలడెను. సుమారు క్రి.శ 65 timeలో పౌలు హేబ్రియులకు ఈ పత్రిక రాసాడు. సుమారు క్రి.శ 65 timeలో పౌలు రాసిన ఈ మాటలో ఈ దినములు అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడేను. అనగా అప్పుడు యేసు మాటలాడిన దినాలే అంత్యదినాలుగా ఇక్కడ పౌలు అంటున్నాడు. యేసు మాటలాడిన దినాలే అంత్యదినాలుగా ఈ మాటలో అర్థమవుతుంది. యేసు మాటలాడి 2000 years అయింది. ఈ లోకానికి వచ్చి నోరు విప్పి మాట్లాడి ఇప్పటికి సుమారు 2000 years అయింది. అయన మాటలాడిన దినాలు అంత్యదినాలు అయితే ఇప్పటికి అంత్య దినాలు ప్రారంభము అయ్యి 2000 years అని అర్థము. యేసు మాటలాడిన ఆ కాలమే అంత్యకాలము. ఎపుడో యేసు 2000 years క్రితము మాటలాడిన దినాలు అంత్యదినాలు అయితే మనము ఈ మధ్యలో start అయ్యాయి అని మాటలాడుకోవడము అన్నది bibleకు భిన్నమా?? కాదా??? అంత్య దినాలు మొదటి శతాబ్దములో start అయ్యాయి. యేసు రాకనే అత్యదినలు జరిగింది.

(c) 1 పేతురు 1:21-అయన( యేసు)......... కడవరి కాలమందు అయన ప్రత్యక్షపరచబడెను. కడవరి కాలము అనగా అంత్య కాలము.యేసు ప్రత్యక్షపరచబడిన కాలమే అంత్య కాలము.యేసు వచ్చింది చివరి గడియలో. యేసు రాకడ కడవరి గడియలో జరిగింది. యేసు పుట్టుకతో అంత్యదినాలు start అయ్యాయి అన్న విషయాన్ని ఇక్కడ పేతురు మాటలాడిన మాటను బట్టి అర్థమవుతుంది. పై pointలో యేసు మాటలాడిన దినాలు అంత్య దినాలు అన్నాడు. ఇక్కడ పేతురు కూడా యేసు వచ్చిన కాలమే కడవరి కాలము అన్నాడు.చెప్పింది వేరే వ్యక్తులు అయిన చెప్పింది మాత్రము ఒక్కటే. ఎందుకు ఒక్కటే ఉంది అంటే చెప్పించిన పరిశుదాత్ముడు ఒక్కడే గనుక.

(d) హెబ్రీ 9:26- అయన(యేసు) యుగముల సమాప్తి యందు..... ప్రత్యక్షబడెను. అనగా యేసు అంతములో ప్రత్యక్షబడెను.యేసు వచ్చింది అంత్యదినములలో. మనము ఈ రోజు ఉన్నది కూడా అంత్యదినాలలో యేసు వచ్చింది చివరి గడియలో. మనము ఉన్నది చివరి గడియలో ఉన్నాము.
(e) 1కోరంది10:11- యుగాంతుమందున్న మనకు బుద్ది కలుగుటకు వ్రాయబడింది. అనగా పౌలు గారు కోరంది సంఘమునకు పత్రిక రాసేటప్పటికి యుగంతమందున్నాము మనము అని అంటున్నాడు. అనగా అంత్య దినాలలో ఉన్నామని. యుగాంతము అనగా అంత్య దినాలు అని. యేసు మొదట రాకడలో అంత్య దినాలు start అయ్యాయి.
(f) 1 john 2:18- ఇది కడవరి గడియ. ఇది అంటున్నాడు. పై వివరణ బట్టి పౌలు చెప్పిన, పేతురు చెప్పిన, john చెప్పిన మాటలలో అంత్య దినాలు అన్నది యేసు రాకడతోనే అంత్యదినాలు start అయినట్లు అర్థమవుతుంది.

(2) (a) లోకము అంటున్న అంత్యక్రీస్తు గూర్చి చూద్దాము. నేడు అంత్యక్రీస్తు పొప్(pope) అంటున్నారు. అంత్యక్రీస్తు అను మాట ఆదికాండము నుండి ప్రకటన వరకు ఎక్కడ లేదు. అంత్యక్రీస్తు అన్న పదము bibleలో ఎక్కడ కనిపించదు. అంత్యక్రీస్తు అస్సలు భయటకు ఎలా వచ్చింది అంటే englishలో ANTICHRIST అంటారు. antichrist అన్న దానిని మన వాళ్ళు అంత్యక్రీస్తుగా మాటలాడుకుంటున్నారు. antichrist అనగా క్రీస్తు విరోధి. bible లో క్రీస్తు విరోధి అన్న విషయము చెప్పబడింది తప్ప అంత్యక్రీస్తు గూర్చి చెప్పబడలేదు.ఒక వేళ వీరు అన్నట్లుగా అంత్యక్రీస్తు అను పదము సరియైన పదము అని అనుకుంటే అంత్యకాలములో వచ్చిన వాడిని అంత్యక్రీస్తు అనాలి. అంత్యకాలములో ఎవరు వచ్చారు??? క్రీస్తు వచ్చిన కాలము అంత్య కాలము. యేసు అంత్యకాలములో వచ్చాడు గనుక అంత్య క్రీస్తు యేసు క్రీస్తు అవుతాడు.

(b) క్రీస్తు విరోధి వచ్చాడా?? రాబోతున్నాడా??? 1 john 2:18- క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి గదా ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు.. అనేకులైన క్రీస్తు విరోధులు అంటున్నాడు..ఒక్కడు అనేక మందిగా మారిపోయాడు. భయలదేరుదురు అనకుండా already బయలుదేరియున్నారు అన్నాడు. అంత్య దినాలలోనే క్రీస్తు విరోధులు అనేకులుగా బయలుదేరునట్టు మనకు అర్థమవుతుంది. ప్రపంచము అనుకుంటున్న క్రీస్తు విరోధి already వచ్చాడు. వచ్చినవాడు అనేకులైన మార్చేసాడు. క్రీస్తు విరోధి వస్తాడు అనుకోవడము తప్పు. already వచ్చి అనేకమందిని మార్చేసాడు. అస్సలు క్రీస్తువిరోధి ఎవరో 2john 1:7 లో చూడొచ్చు. మొదటి శతాబ్దములో అంత్యదినలు start అయ్యాయి.లోకము అనుకుంటున్నా క్రీస్తు విరోధి అంత్య దినాలోనే ఉన్నారు.

(3) (a) చివరిగా అంత్య తీర్పు గూర్చి చూద్దాము. ముందుగా తీర్పు అనగా ఏంటి and అంత్య తీర్పు అనగా ఏంటి????? చనిపోగానే తీర్పు జరిగింది అనుటకు luke 16:22 లో ధనవంతుడు-లాజరు situation లో తెలుస్తుంది. చనిపోగానే ధనవంతుడు పాతలములో ఉన్న వెధనకరమైన స్థలములోకి వెళ్ళాడు. లాజరు పాతలములో ఉన్న పరదైసుకు వెళ్ళాడు. అంటే చనిపోయిన వెంటనే తీర్పు జరిగినట్టుగా తెలుస్తుంది. అంత్య తీర్పు (final judgement) అనగా చివరిగా జరిగే తీర్పు. example:: నేరము చేసిన వ్యక్తిని వెంటనే police వచ్చి arrest చేసి తీసుకెళ్తారు. ఇదే తీర్పు నా?? కాదు. తర్వాత ఖైదిని courtలో ప్రవేశపెట్టాలి. సాక్ష్యాధారాలు అన్ని పరిశిలించాక అప్పుడు శిక్ష వేస్తారు. ఇదే అంత్య తీర్పు( final judgement).
(b) ప్రస్తుతము తీర్పు జరుగుతుంది. దేవుని కొరకు,దేవునికి ఇష్టముగా బ్రతికితే పరదైసుకు వెళ్తారు and దేవుని కొరకు,దేవునికి ఇష్టముగా బ్రతకకపోతే శిక్షకు వెళ్తారు.అంత్య తీర్పు యేసు రెండవ రాకడలో జరుగుతుంది. john 5:29, మత్తాయి 25:31,41లో వివరణ ఉన్నది. రెండవ రాకడగా ప్రపంచమునకు యేసు వచ్చినప్పుడు జరిగేదే అంత్య తీర్పు. చివరిగా అంత్య దినాలు యేసు వచ్చినప్పుడే start అయ్యాయి. అంత్యక్రీస్తు అను పదము bibleలో లేదు కాని antichrist అని ఉంది. క్రీస్తు విరోధి ఎప్పుడో వచ్చేసాడు. అంత్య తీర్పు యేసు రెండవ రాకడ ద్వార జరుగుతుంది.

(4) ఎవరి మాటలు మనము నమ్మక కేవలము bibleపై ఆధారపడి , bibleలో ఉన్నవాటినే నమ్మి మన బ్రతుకును సరి చేసుకుంటూ దిన దినము మన ఆత్మీయ జీవితాన్ని నూతన పరుచుకుంటూ దేవుడు ఉన్న ఆ పరలోకానికి చేరే ప్రయత్నము చేద్దాము... దేవుడు ఇచ్చిన ఈ దినాలలో కనీసము కొన్ని దినాలైన దేవుడిచ్చు వాక్యముతో గడపక పోతే ఆ జీవితానికి అర్థము అంటూ ఉండదు. ఆయుష్షు,ఆరోగ్యము, అవయవాలు అన్ని ఇచ్చిన దేవుడి కోసము కనీసము కొన్ని దినాలు అయిన దేవుని కొరకు గడిపిన దినాలు లేకపోతే అది న్యాయమా?? అన్యాయమా అనేది ఆలోచించుదాము. సమస్తాన్ని ఇచ్చిన దేవుడికి సమస్తములో కొంతైనా ఇవ్వకపోతే ఇంకా మనము ఏం పిల్లలము?????????? అయన మన కోసము చేసినవి గుర్తుతెచ్చుకుంటే మనము అయన కొరకు చేసేది,ఇచ్చేది చాలా చిన్నది.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget