Halloween Costume ideas 2015

What is the great power to move the man?

మనిషిని కదిలించే మహా శక్తీ ఏది?


శరీరధారిగా ఈ లోకానికి వచ్చి నరకము నుండిమనల్ని రక్షించిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) ఇప్పటి వరకు ఏందరో చనిపోయిన, ఇప్పటికే ఏందరో మన కళ్ళముందే చనిపోయిన నేటి వరకు మనల్ని కంటికి రెప్పలా దేవుడు కాపాడుటలో ఒకఉద్దేశ్యము ఉందనే విషయాన్ని మనం మరచిపోకూడదు.సత్యం(వాక్యం) తెలుసుకోవాలని, సత్యానికి(వాక్యానికి) దగ్గరవ్వాలని, సత్యాన్ని(వాక్యాన్ని) పరిశోధన చేసి మనస్పూర్తిగా అంగికరించి విశ్వసించి తన కొరకు బ్రతుకుతావానే ఉద్దేశ్యం మన పట్ల కలిగియున్నాడు కాబట్టి నేటికి సజీవముగా ఉన్నాము.తింటున్న భోజనము బట్టి, ఆరోగ్యసంభంధమైన జాగ్రతలు తీసుకొనుట వలననే మేము నేటికిబ్రతికేయున్నాము అనికొందరు తలంచుచున్నారు. ఇలా అనుకోవడం వారి అవివేకమనే చెప్పాలి. తన యొద్దకు రావాలని, తన మాటలను వినాలని, తన మాటలను ఆలోచన చేసి ఆలాగు నడిచి ఆనందపెట్టాలని దేవుడు దినదినాన్ని మన జీవితములో పోడిగిస్తున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మన బ్రతుకును వాక్యప్రకరముగా సరిదిద్దుకుని దేవుని కొరకు జీవిస్తామనిదినదినముగా అవకాశాన్ని ఇస్తున్నాడు. 2) మనిషి పుట్టినది మొదలు మరణించే వరకు ఉన్న జీవిత కాలములో ఏదైనా ఈ లోకములో సాధించాలనే తపన ఉందే తప్ప తన గురించిన ఆలోచనలు లేకుండానే సమాధికి వెళ్ళిపోతున్నాడు. కళ్ళ ముందు కనిపించే ప్రతి దానిని క్షుణ్ణముగా అధ్యాయనం చేసే మనిషి తనను గురించి ఏ మాత్రం, ఏంతమాత్రము ఆలోచించుట లేదు. నేను ఎలా పుట్టాను, ఎందుకు పుట్టాను, ఎవరి వలన పుట్టాను, ఎవరి కొరకు బ్రతకాలి, చావు-మరణాలు ఏంటి, మరణం తర్వాత ఉండే జీవితం ఏంటి, పుట్టుక-చావుల మధ్య ఉండే ఈ ఆయుష్షు కాలాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఇంత అందమైన ఆకారాన్ని చేసినది ఎవరు అనే ఆలోచనలు మనిషికి లేవనే చెప్పాలి. మేధావాలు,శాస్త్రవేత్తలు అని చెప్పుకుంటున్న వారి సైతం మనిషినీ గురించి సరియైన అవగాహన లేకుండా ఉన్నారు.కళ్ళముందు కనబడే జంతువుల గురించి, పక్షుల గురించి, పురుగుల గురించి చెప్పరే కానీ మనిషి జీవితం గురించి ఎవ్వరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. పాఠశాల స్థాయి మొదలు విశ్వ విద్యాలయాల వరకు ఉన్న పాఠంలో మనిషి జీవితం గూర్చి గొప్పగా వ్రాసినట్టుగా ఏదియు లేదు.
3) మనిషి కదులుతున్నాడు కనుక మనిషిని కదిలించే ఒక మహా శక్తీ ఏదో ఉందని ఒప్పుకోకతప్పదు. శవానికి కానీ , బ్రతికియున్న మనిషికి కానీ అవయవాలు ఒక్కటిగానే ఉంటాయనే సంగతి మనకు తెలుసు.ఇరువురిలోఅవయవాలు ఒక్కటిగా ఉన్న బ్రతికియున్న మనిషి కదులుతున్నాడు కానీ శవం మాత్రం కదులుట లేదు. ఏంటి ఈ తేడా? అనగా శవంలో ఏదో మహా శక్తీ లేదని ,బ్రతికియున్న మనిషిలో ఏదో మహా శక్తీ ఉందనే విషయం స్పష్టముగా అర్థమవుతుంది. ఏంటి ఆ మహా శక్తీ?? నేడు ప్రకృతిలో కొన్ని శక్తులు ఉన్నట్టుగా మనకు తెలుసు. అవేమనగా విద్యుత్తు శక్తీ అని, ఇంధన శక్తీ అని, వాయువు శక్తీ అని, సౌర శక్తీ. మనిషిని కదిలించే మహా శక్తులు ఇవేనా లేక మరేదైనా ఉన్నదా?? ఒక్కొక్కటిగా చూద్దాము.
a) విద్యుత్తు శక్తీ:: విద్యుత్తు అనేది ఒక శక్తీ అని మనకు తెలిసిందే.మన అనుదిన జీవితములో విద్యుత్తు శక్తీతోఎంతటి పనులు జరుగుతున్నాయో మనకు తెలుసు. నిజముగా విద్యుత్తు లేని ప్రపంచాన్ని ఉహించుట చాల కష్టం. అంటే ప్రతి పని విద్యుత్తుతో ముడిపడి ఉంటుంది. మన ఇంట్లో చూస్తున్న లైట్ , తిరుగుతున్న ఫ్యాన్, చూస్తున్న tv బట్టి విద్యుత్తు యొక్కశక్తీ మనకు తెలుస్తుంది. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో కొన్ని వేల కేజీ బరువు ఉన్న యంత్రాలనువిద్యుత్తు శక్తీ కదిలిస్తుంది. కొన్ని వేల కేజీ బరువు ఉన్న యంత్రాలను కదిలిస్తున్న ఈ విద్యుత్తు శక్తీ ఆరవైకేజీ బరువున్న మనిషిని కదిలిస్తుందా? మనిషినికదిలిస్తున్న మహా శక్తీ విద్యుత్తా? పై ప్రశ్నకు గల జవాబు దొరకాలంటే చనిపోయిన శవం దగ్గరకు వెళ్లి ప్రయోగం చేయాల్సిందే. రెండు వైరులు తెచ్చి ఒకటి విద్యుత్తు ప్లగ్ లో, మరొకటి శవానికి పెట్టామనుకోండి. ఒక వేళ మనిషిని కదిలించేది విద్యుత్తు అయితే శవానికి విద్యుత్తు అందించగానేలేసి కూర్చోవాలి. కానీ ఇలా జరుగుతుందంటారా? లేదు. శవం బూడిద అవ్వుతుందే కానీ శవం లేసి కూర్చోదు.
కొన్ని వేల కేజీ బరువున్న యంత్రాలను కదిలించేవిద్యుత్తు శక్తీఆరవైకేజీ బరువున్న మనిషినిఎందుకు కదిలించలేకపోయింది? చివరికి చనిపోయిన శవాన్ని ఈ విద్యుత్తు శక్తీ కదిలించలేక పోయిందంటే మనిషిని కదిలించే మహా శక్తీ విద్యుత్తు శక్తీ కాదని ఏదో మహా శక్తీ ఉందని అర్థమయ్యింది.
b) ఇంధన శక్తీ:: ఈఇంధన శక్తీ కూడ చాలా బరువున్న వాటిని కదిలిస్తుంది. రెండు చక్రాల బండి కానీ, నాలుగు చక్రాల బండి కానీ చివరికి అంతరిక్షములో ప్రయాణిస్తున్న విమానము కాని, సముద్రములో ప్రయాణిస్తున్న నౌక కానీ కదులుతున్నాయి అంటే ఇంధన శక్తీ ఆవసరం. అలానేమనిషిని కూడ ఈ ఇంధన శక్తీ కదిలిస్తుందా?? పై ప్రశ్నకు గల జవాబు దొరకాలంటేమళ్ళి చనిపోయిన శవం దగ్గరకు వెళ్లి ప్రయోగం చేయాల్సిందే. శవాన్ని పెట్రోల్ బంకు దగ్గరకు తీసికెళ్ళి బండికి పెట్రోల్ కొట్టించినట్టుగా శవానికి లీటర్ కొట్టి చూస్తే లేచి కూర్చుంటాడా? లేదు.చివరికి చనిపోయిన శవాన్ని ఈఇంధన శక్తీ కదిలించలేక పోయిందంటే మనిషిని కదిలించే మహా శక్తీ ఇంధన శక్తీ కాదని ఏదో మహా శక్తీ ఉందని అర్థమయ్యింది.
c) వాయువు శక్తీ:: మన బండి ప్రయాణిస్తుంది అంటే టైర్లోని గాలి వలననే చెప్పాలి. గాలి నింపుట వలన కదులుతుంది. తుఫాను వచ్చినప్పుడు కానీ, సుడిగాలులు వచ్చినప్పుడు గాలికి ఎంతటి శక్తీ ఉందో మనకు అర్థమవుతుంది. ఈ భయంకరమైన పెనుగాలులకు భావనలు కూలిపోయిన సందర్భాలు కూడ ఉన్నాయి. వీటినేహర్రికేన్స్ అంటారు. అనగా దృఢమైన కట్టడాలను కదిలించే, పడగొట్టే సామర్ధత ఈవాయువు శక్తీకి ఉంది.అలానే మనిషిని కూడ ఈ వాయువు శక్తీకదిలిస్తుందా?? పై ప్రశ్నకు గల జవాబు దొరకాలంటేమళ్ళి చనిపోయిన శవం దగ్గరకు వెళ్లి ప్రయోగం చేయాల్సిందే. శవానికి బలమైన శక్తితో గాలిని నింపితే లేచి కూర్చుంటాడా?లేదు.చివరికి చనిపోయిన శవాన్ని ఈవాయువు శక్తీ కదిలించలేక పోయిందంటే మనిషిని కదిలించే మహా శక్తీ వాయువు శక్తీకాదని ఏదో మహా శక్తీ ఉందని అర్థమయ్యింది.
d) సౌర శక్తీ:: ఒక వేళ సౌర శక్తీ మనిషిని కదిలిస్తుంది అని అనుకుంటే శవాన్ని ఎండలో పెడితే లేచి కూర్చోవాలి. అలా జరగటం లేదు అంటే సౌర శక్తీ మనిషిని కదిలించలేదని, మనిషిని కదిలించే మహాశక్తి సౌర శక్తీ కాదని అర్థమవుతుంది.
4) ఈ ప్రకృతిలో ఉన్న ఏ శక్తీ కూడ మనిషిని కదిలించలేవని, కదిలించుట లేదని పై వివరణ బట్టి తెలిపోయింది. అయితే ప్రకృతిలో ఉన్న ఏ శక్తీ మనిషిని కదిలించకపోతే మరి మనిషిని కదిలించే ఆ శక్తీ మహా గొప్పదై ఉండాలి. ఇంతకు ఏంటి ఆ మహా శక్తీ? ప్రకృతిలో ఉన్నదీ ఏది కానప్పుడు మరి ఏ శక్తీ? 2000వేల సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ఆ మహా శక్తీ ఏంటో చెప్పారు. ఆ మాటను చూస్తే యోహాను 6:63- ఆత్మయే జివింపజేస్తుంది; శరీరము కేవలము నిష్ప్రయోజనము. జివింపజేసేది ఆత్మ అంటున్నాడు. అంటే మనిషినీ కదిలించే మహా శక్తీ ఆత్మయే అని యేసు చెప్పుచున్నాడు. ఆత్మనే మనుష్యులను కదిలిస్తున్నదని, నడిపిస్తున్నదనియేసు చెప్పాడు.
5) ఒక్కసారి వెలుగుతున్న లైట్ ఆగిపోతే విద్యుత్తు పోయిందని ,తిరుగుతున్న ఫ్యాన్ ఆగిపోతే విద్యుత్తు పోయిందని అనుకుంటాము. అంటే పని చేస్తున్నవి ఒక్కసారిగా ఆగిపోయేసరికి వెంటనే మనకు కలుగుచున్న ఆలోచన వీటినన్నిటి నడిపించే విద్యుతు శక్తీ ఆగిపోయిందని నిర్చయించుకుంటాము. అలానే అప్పటివరకు కదులుతున్న మనిషి ఒక్కసారిగా కదలని స్థితికి వెళ్ళాడంటే అప్పటివరకు కదిలించే మహా శక్తీ వెళ్ళిపోయిందని తెలుస్తుంది. మనిషినుండి వెళ్ళిపోయే శక్తీ ఆత్మ అని యేసు చెప్పాడు. మనిషినిజివింపజేసే ఆత్మ ఒక్కసారిగా వెళ్ళిపోతే శవంగా మారుతాడు. జివింపజేసే మహా శక్తీయైన అత్మలేనప్పుడు శరీరము నిష్ ప్రయోజనమను యేసు మాట సత్యమే.
6) ఒకవేళ శరీరము నిష్ ప్రయోజనం అనేది సత్యమని అర్థమైతే ఈ శరీరాన్ని ఎలా సుఖపెట్టాలని ఆలోచించము కానీ శరీరాన్ని దేవుని పనికి ఎలా ఖర్చు చెయ్యాలో ఆలోచిస్తాము. ఇప్పటివరకు పై వివరణ బట్టి మనల్ని కదిలిస్తున్న మహా శక్తీ ఆత్మ అనే విషయం తెలిపోయింది.
7) మనల్ని కదిలించుటకు ఆత్మ ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది??ఎందుకుకొరకు వచ్చింది? ఆత్మ ఎలా వచ్చిందో అనే విషయం తెలియాలంటే ప్రారంభానికి వెళ్ళక తప్పదు. యోహాను 4:24లో దేవుడు కూడ ఆత్మ అని తెలియజేయబడింది.దేవుడు కూడ ఆత్మ అయితే అయన కూడ ఒక మహా శక్తీ అని అర్థమయింది.ఆ ఆత్మ మనలోనికి ఎలా వచ్చింది? దేవుడైనఆత్మ నుండి ఎలా విడిపోయాము?ఎప్పుడు విడిపోయాము? ప్రారంభములో దేవుడు ఈ సృష్టినంతటిని కలిగించి ఆ తర్వాత ఆరవ దినము ముగింపులో ఆదామును కనట్టుగా మనము చూస్తున్నాము. ఆదికాండ 2:7-దేవుడైన యెహోవా(ఆత్మ) నేలమంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఉదగా నరుడు జీవాత్మ ఆయెను. మొదటమట్టిని తీసి మట్టి బొమ్మగా చేసాడు. నాలో ఉన్న ఆత్మ లేదా నేనైనా ఆత్మ లేదా నాలో నుండి విడిపోయి అందులోకి వెళితే తప్ప బొమ్మకు జీవం ఉండదని అలోచించి నాసిక రంధ్రం గుండా జీవ వాయువును పెట్టాడు. అంటే తనలో ఉన్న ఆత్మను ఆదాముకు పెట్టినట్టుగా అర్థమయింది.
8) ఆదాముకు దేవునిలో నుండి ఆత్మ ప్రవేశం జరిగింది. మరి హవ్వకు ఆత్మ ఏలా వచ్చింది? అదాములో నుండి ఆత్మ హవ్వకు వచ్చింది. మరి కయ్యినుకి ఆత్మ ఎలా వచ్చింది? ఆదాము-హవ్వలు కలవటం వలన వచ్చింది. కయ్యినుకి ఆత్మ ఆదాము-హవ్వలలో నుండి వచ్చింది. అలానే ఈ ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరికి మొదట మానవుడైన ఆదాము నుండి ఆత్మ వచ్చింది. ప్రారంభములో దేవుడు ఆత్మను ఆదాములో పెట్టాడు. అదాములో ఉన్న ఆత్మ విభజింపబడుతూ, విభజింపబడుతూ ప్రపంచములో ఉన్న మనుష్యులందరిలోకి వచ్చింది. అపోకార్య 17:26- మరియు యావద్భుమి మీద కాపురముండుటకు అయన యొకని నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి...మనమందరిలోఉన్నదీ దేవుని ఆత్మనే. మనమందరిలోనున్న ఆత్మ ఆదాము నుండి వచ్చింది. చివరికి మనమందరిలో ఉన్నదీ దేవుని ఆత్మనే అని తెలిపోయింది.
9) మనలో ఉన్న ఆత్మ ఆయనలోని భాగమే. అందరిలో ఉన్న ఆత్మ దేవునిలోనిదే,దేవునిదే. ఆ మహా శక్తీయైన ఆత్మ మన శరీరంలో ఉండటం బట్టి శరీరం కదులుతుంది. ఆ మహాశక్తియైన ఆత్మ మనలో ఉండటం బట్టి అవయవాల కదలికలు వస్తున్నాయి.ప్రపంచములో ఉన్న ఏ శక్తీ మనిషిని కదిలించుట లేదు కానీ ఒక మహా శక్తీయైన ఆత్మ వలనే కదులుతుంది. ఈ శరీరముతన కొరకు ఉపయోగపడాలని ఆత్మను పెట్టి ఈ లోకానికి కొద్ది కాలము వరకు మనల్ని దేవుడు పంపాడు. ఆత్మమనలో ఉన్నంతకాలం శరీరంతో దేవుని పనులు జరుగనప్పుడు మన శరీరంలోనున్న ఆత్మను ఎందుకు ఉంచాలి? మన ప్రతి కదలిక అయన కోసం ఉండాలనుకున్నాడు కానీ మన ప్రతి కదలిక మన శరీర కోసమే కదిలిస్తున్నాము. ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకునే వరకు కదలికలే.దేవుని కోసము ఏవి కదలికలు? ఇంటి నుండి కాలు తీసి బయటకు పెట్టామంటే శరీరం కోసమే కదులుతున్నామే తప్ప శరీరంలోని ఆత్మను పెట్టిన దేవుని కోసం ఏది?
10) మనలో ఉన్న ఈ మహా శక్తీ ఉన్నత వరకు ఈ శరీరముతో దేవునినీ ఇష్టపెట్టు క్రియలు చేస్తే పరలోకమునకుదేవుడు అనుమతిస్తాడు లేదామనఇష్టానుసారముగా జీవించి మరణిస్తే పాతాలానికి చేరువైపోతాము.

...............



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget