Halloween Costume ideas 2015

God's mind

దేవుని మనస్సు

మన ప్రారంభాన్ని గూర్చియే.మన ప్రారంభము ఎక్కడ జరిగిందో ,ఎలా జరిగిందో ఆలోచిస్తే 

దేవుడు మనస్సుకలిగిన వాడు.. మనస్సు మనిషికే కాక మన అందరిని కలుగజేసిన పరలోకమందున్న కన్న తండ్రి కూడా మనస్సు ఉందని and ఆ మనస్సులో మనిషి గురించి ఎన్నో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నవని మనకు తెలుసు. పరలోకమందున్న కన్న తండ్రి మనల్ని కని ఈ భూమి మీద పెంచి గొప్పవారినిగా చేసిన తర్వాత ఏనాటికైనా మన గురించి ,దేవుని గురించి ఆలోచన వస్తుందని తెలిసి ఈ 66 పుస్తకాల మహా జ్ఞాన గ్రంధము వ్రాయించి మన కళ్ళముందు పెట్టాడు.మనిషి జ్ఞాపకాలలో దేవుని గూర్చి కానీ ,దేవుని కోసము బ్రతకదామనే ఆలోచన లేదు.
1) ఏదో భూమి మీద పుట్టానని,పుట్టాను కనుక బ్రతకాలని ,బ్రతుకుతున్న వారందరు చావాలి గనుక ఒక రోజు నేను చావాలి అని జీవితము పట్ల నిర్లక్షము కలిగి ఏదో బ్రతుకును విడిచేవారే తప్ప కన్న తండ్రి ఏమి అలోచించి నన్ను ఈ భూమి మీదకు పంపాడన్నఆలోచన మనిషికి లేదు.గతాన్ని మరిచిపోయిన మనిషికి ప్రారంభము నుంచి పాఠాలు చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది.మన పుట్టుక గురించి కానీ,మన పుట్టుక లో దేవుని కష్టము గురించి కానీ తెలియదు.కనుక మనిషికి గతాన్ని గుర్తుచేసి మళ్ళి తన కోసము బ్రతికించుకోవాలన్న దేవుని కోరికను bibleలో చూస్తున్నాము. యెషయ 44:1,2- నిన్ను సృష్టించి,గర్భములో నిన్ను నిర్మించి ,నీకు సహాయము చేయువాడైన యెహోవ .......... అస్సలు దేవుడు తన గురించి ఇంత వివరముగా చెప్పవలసిన అవసరత ఎందుకు ?
సృష్టించి,గర్భములో నిర్మించి , సహాయము చేయువాడైన యెహోవ నేనే అని ఇంతగా ఎందుకు చెప్పుచున్నాడంటే మనిషి తన గతము మరిచిపోయాడు గనుక.మరిచిపోయిన మనిషికి తను పరిచయము చేసుకుంటున్నాడు. ఈ వచనములో సృష్టించడము అంటే ఏమిటి?గర్భములో ఎలా మనల్ని నిర్మించాడు?ఎలా మనకు సహాయము చేసాడు అన్న విషయాల గురించి మనకు తెలిస్తే అప్పుడు అయన మనస్సు ఏంటో మనకు అర్థమవుతుంది
2) 11timothy 2:15-సత్య వాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవూ దేవునికి కనపరచుకోనుటకు జగ్రతపడుము.... ఈ వచనములో సత్యవక్యమును సరిగా విభజించాలి అని అంటున్నాడు. అలానే దేవుని మనస్సు ఏంటో తెలుసుకోడానికి యెషయ 44:1,2ను విభజించి సత్యాన్ని తెలుసుకోవాలి. 3) అస్సలు సృష్టించడము అంటే దేవుడు దేని గురించి మాట్లాడుతున్నాడు?? మన ప్రారంభాన్ని గూర్చియే.మన ప్రారంభము ఎక్కడ జరిగిందో ,ఎలా జరిగిందో ఆలోచిస్తే ఇంతకంటే mystery మరొకటి ఉండదు. నిజముగా చాలా అపుర్వమైనది మన ప్రారంభము. ఎవరు మనల్ని సృష్టించారని చూస్తే గలతీ 1:15- దేవుడే నన్ను సృష్టించాడని,తల్లి గర్భములో పడినది మొదలుకొని నన్ను ప్రతేకపరుచుకొన్నాడని paulగారు చెప్పుచున్న మాటను మనము చూస్తున్నాము........తండ్రి యొక్క వేల,లక్ష,కోట్ల కణాలు తల్లిలోకి వెళితే ఆ వెళ్ళిన కణాలలో ఒకటి(నువ్వు) తల్లి అండముతో కలిసిన రోజే మనము ప్రత్యేకింపబడ్డాము.దేవుని దయవలన ,ఆలోచన వలన కొన్ని వేల,లక్ష,కోట్ల కణాలలో నిన్నేతల్లి గర్భములో అండముతో ఫలదీకరణము చెందించి నిన్ను సృష్టించి ఆ రోజు ఆకారము నియ్యడము మొదలు పెట్టాడు..

4) సృష్టించిన తర్వాత అక్కడ నుంచి 9 months వరకు మన కొరకు కష్టపడడానికి దేవుడు ఇష్టపడ్డాడు.తల్లి గర్భములో 9 months మనల్ని నిర్మించాడు. మనవ నిర్మాణానికి దేవునికి పట్టిన కాలము 9 months .ఏ నెలలలో ఏ నిర్మాణము అవుతుందో తెలుస్తుంది కానీ,ఎలా ఏర్పడుతున్నాయో మాత్రము ఎవ్వరికి తెలియదు.పుట్టబోయే బిడ్డ బాబు or పాప అను విషయము 4 months వరకు తెలియదు.అప్పుడప్పుడు కవల పిల్లలు పుట్టడము మనము చూస్తుంటాము.వారిలో తలలు కలిసి పుట్టడము,చాతి భాగము కలిసి పుట్టడము జరుగుతుంది. అందులో వీణ-వాణి ల పరిస్థితి ఒకటి.కలిసి ఉన్న వారిని వేరు చేయటము మహా కష్టమైతే తల్లి గర్భములో లేని అవయవాలను నిర్మాణము ఎంత కష్టము?ఎంత అర్చర్యము.?హెబ్రీ 10:6-నాకొక శరీరము అమర్చితివి.......... అవయవాలను కలిగించాలి and కలిగించిన అవయవాలు అన్ని శరీరానికి అమర్చాలి. చేతు ఉండే చోట చేతులు,కాళ్ళు ఉండే చోట కాళ్ళు, ముక్కు ఉండే చోట ముక్కు, మూతి ఉండే చోట మూతి ఇలా ప్రతిదీ అమర్చాలి. 700 కోట్ల మంది భూమి మీద ఉన్నప్పుడు ఒకరికి ఒకరు వేరు వేరు పోలికతో అమర్చాడు దేవుడు.

5) దేవుడు సహాయము చేస్తేనే మనము ఈ భూమి మీదకు వచ్చాము. కీర్తన 22:10-గర్భావాసి అయినది మొదలికొని నాకు ఆధారము నీవే,తల్లి గర్భములో ఉన్న మనకి ఆహారము,నీరు,గాలి కావాలి.ఇవన్ని కావాలి అంటే అందించేది ఎవరు?? ఆ తండ్రి మనకు సహాయము చేసాడు.తల్లి గర్భము నుండి భయటకు వచ్చిన అప్పటినుంచి ఇప్పటివరకు దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు.

6) ఎందుకు నన్ను కన్నాడు,కాపాడుతున్నాడు,నేనే ఎందుకు కావాలనుకున్నాడు,నా గురించి అయన మనస్సులో ఏమి ఉంది అని మనము ఆలోచించాలి.అయన మనసులో ఏమి లేకపోతే ఎందుకు మనల్ని అను నిత్యము కాపాడాలి??ఎందుకు సృష్టించాలి?ఎందుకు చక్కటి నిర్మాణము ఇవ్వాలి?ఎందుకు సహాయము చేయాలి?భూమి మీద మనిషిగా వచ్చిన తర్వాత అయన మనస్సు తెలుసుకుని తగు రీతిగా ప్రవర్తించే భాద్యత ఎంతగానో ఉన్నది.యేసు క్రీస్తు తండ్రి యొక్క మనస్సు తెలుసుకున్న యేసు క్రీస్తు ఈ భూమి మీద ఏమి చేసాడో చూస్తే హెబ్రీ 10:7- దేవ నీ చిత్తము నెరవేర్చటానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను.john 4:34-నన్ను పంపిన వాని చిత్తము నేరవేర్చుటయు ,అయన పని తుది ముట్టించేవరకు నాకు ఆహారమైఉన్నది.... john 6:38,john 8:29... ఇలా పై references చూస్తే యేసు తండ్రి ఇష్టాన్ని,చిత్తాన్ని నేరవేరుస్తున్నాడు,నెరవేర్చుటకు వచ్చాడన్నా సనగ్తి తెలుస్తింది. వాక్యము ప్రకటించే కార్యక్రము,పాపి మరే ప్రతి ప్రయత్నముతో కూడిన ఈ పని కూడా అది దేవుని మనస్సు,చిత్తము,ఇష్టము, ఒక పాపి మారితే తండ్రికి సంతోషము అయితే పాపి మారడము కోసము ఎదన్న చేయాలి.

7) దేవుని మనస్సు తెలిసిన దేవుని బిడ్డలైన మనము దేవుని కోసము ఏమి చేస్తున్నాము? చేసాము? దేవుని మనస్సు లో ఉన్న కోరిక తిరుస్తున్నామా అని పరిక్షించుకొని మార్పు చెంది దేవునికి ఇష్టులుగా ఉండాలి.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget