Halloween Costume ideas 2015

The Seventh Word

యేసుక్రీస్తు సిలువపై పలికిన చివరి 7వ మాటలో నేర్చుకొనవలసిన సారంశము

యేసుక్రీస్తు సిలువపై పలికిన చివరి 7వ మాటలో నేర్చుకొనవలసిన సారంశము.
ముందుగా ప్రభుయైన యేసుక్రీస్తు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు యేసుక్రీస్తు సిలువపై పలికిన 6 మాటలను చక్కటి వివరణతో పొందుపరిచాను. చూసినవారు మీకు తెలిసినవారికి share చేయండి. చూడని వారు అందులో ఉన్న పరమార్ధాన్నిగమనించి చదవండి.
1) luke 23:46-అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి-తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకోనుచున్నాననేను.అయన ఇలాగు చెప్పి ప్రాణమును విడిచెను. చాల అమైన మాటే ఈ ముగింపు మాటయైన ఏడవ మాట. ఇదే మాటను stephen అనుట అపోకార్య 7:59: ప్రభువును గూర్చి మొర్రపెట్టుచు –యేసు ప్రభువా ,నా ఆత్మను చేర్చుకోనుమని స్తేఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి.... కన్ను మూసే లోపు నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి అని అటు యేసు అనగా,ఇటు స్తేఫెను అనగా చూస్తున్నాము. 2) nithin అనగా శరీరము కాదు ఆత్మ. ఉదాహరణకు nithin సజీవముగా ఉన్నప్పుడు అందరు nithin అని పిలుస్తారు..nithin చనిపోయాక సమాధిలో పెట్టాక శరీరము ఉన్నప్పటికీ అందరు nithin ఇక లేడు అని అంటారు. రెండిటికి difference గమనించండి. nithin అనగా ఆత్మ. మనమందరము ఆత్మలు. nithin చెయ్యి, nithin కాలు, nithin ముఖము, nithin mobile, nithin laptop అనగా nithin వేరు nithin చెయ్యి,కాలు,ముఖము,mobile,laptop వేరు అని అర్థము.
శరీరముతో ఉన్న నేను ‘నేను’ కాదు . నేను ఒక ఆత్మను. అలానే యహేస్కేలు 3:19-అయితే నీవూ దుర్మార్గుని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మర్గత నుండి ,దుష్ క్రియలనుండియు మరలని యెడల అతడు తన దోషము బట్టి మరనమవును గాని నీవూ(ఆత్మను) తప్పించుకొందువు.. యహేస్కేలు 3:21-నీ మట్టుకు నీవును ( ఆత్మను) తప్పించుకొందువు.. పై రెండు వచనములో నీవూ అనగా ఆత్మ అని అర్థమయింది. మనమందరము కూడా అత్మలము. అత్మలమైన మనము ఎక్కడి నుంచి వచ్చాము?
దేవుని లో నుండి వచ్చిన వారము. ఇంతకు దేవుడు ఎవరు???యోహాను 4:24-దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను,సత్యముతోను ఆరాధింపవలెననేను. దేవుడు అనగా ఆత్మ.అనగా దేవుడు ఆత్మ and మనము కూడా ఆత్మనే.మనమందరిది ఆత్మల జాతి. దేహముతో ఉన్నంతవరకు నరజాతిలో ఉన్నట్లు and ఈ దేహమునీ విడిస్తే మనమందరము అత్మజతిగా ఉంటాము. ఆత్మ అయిన మనము ఆత్మయైన దేవునిలో నుండి వచ్చాము. ఆత్మయైన మనము తిరిగి ఆత్మయైన దేవుని యొద్దకు వెళ్లిపోవాలి.ఎక్కడి నుంచి వచ్చామో మరలా తిరిగి అక్కడికే వెళ్ళాలి. కన్నా తండ్రి యెద్ద నుంచి వచ్చిన మనము తిరిగి తండ్రి యొద్దకు వెళ్ళాలనే ఆలోచన ఉండాలి. ఈ లోకానికి ఒక పని నిమ్మితము వచ్చామని 6వ మాటలో తెలుసుకున్నాము. ఈ పనిని పూర్తి చేసి ఎవరి దగ్గర నుండి వచ్చామో ఆ తండ్రికి యేసులా మనము కూడా ఆత్మను అప్పగించుకోవాలి.
3) యేసు ఏ విధముగా పని పూర్తి చేసి ఆత్మను అప్పగించుకొన్నాడో అలాగే మనము పని చేసి మన ఆత్మను అప్పగించుకోవాలి. యేసు పని పూర్తి చేయకుండా ఆత్మను అప్పగించుకున్నాడా లేక సమాప్తమైనధీ అని పని పూర్తి చేసి ఆత్మను అప్పగించాడా???? పనిని complete చేసి తన ఆత్మను అప్పగించుకున్నాడు తండ్రికి.
4) పై వివరణలో మనము తెలుసుకొనవలసిన పరమార్ధము –మన ఆత్మను అప్పగించే ముందు దేవుని పనిని పూర్తి చేయాలి. ఒక యేసుక్రీస్తు,స్తేఫెనునే కాదు ఆత్మను అప్పగించవలసినదిఇది చదువుతున్న మనము అనగా ప్రతి ఒక్కరు ఆత్మను తిరిగి మన సృష్టికర్తయైన కన్నా తండ్రికి అప్పగించాలన్న rule ఒకటి ఉందని bibleలో చూడగలము. 1 పేతురు 4:19-కాబట్టి దేవుని చిత్త ప్రకారము భాదపడువారు సత్ ప్రవర్తన గలవారై ,నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోనవలెను.
5) చివరిగా ఈ మాటలో మనము తెలుసుకోనవలసినది,నేర్చుకోనవలసింది- ఈ రీతిగా స్తేఫెను , యేసు తండ్రి పనిని ముగించి ఆత్మను అప్పగించారో అలానే మనము కూడా ఈ చిన్నపాటి జీవితములో దేవుని చిత్తమను ఎరిగి తగు రీతిగా జీవించి ప్రాణము విడిచి ఆత్మను తండ్రికి అప్పజేద్డాము.
Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget