Halloween Costume ideas 2015

Devudu Kumarulu Manussu Kumarthelanu Vivaham adira?


దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను వివాహమాడినరా?
పరలోకములో ఉన్న దేవుని కుమారులు స్త్రీ వ్యామోహములో పడి భూమి 

మీదకు వచ్చి వివాహమాడినారని 
దేవదూతలు దేవుని కుమారులు కాదనియూ ,కేవలము పరిచారకులు మాత్రమేనని తెలియబడుచున్నది. జగత్తు పునాది వేయబడిన తర్వాత ఆదాము సంతతి మాత్రమే నాటి నుండి నేటి వరకు ఈ సృష్టిలో ఉన్నారని మనకు తెలుసు. ఆదాము నుండి నేటి వరకు మరణించిన వారిలో పరలోకము నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు తప్ప మరెవ్వరును అక్కడికి పోలేదని మనకు తెలుసు ( john 3:13). అలగైనప్పుడు ఈ క్రింది వాక్య భావమును తీవ్రముగా ఆలోచించగలరు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరు తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి ( ఆదికాండము 6:2). అనేకులైన క్రీస్తు విరోధులు లోకములోనికి భయలువెళ్లి

1) పరలోకములో ఉన్న దేవుని కుమారులు స్త్రీ వ్యామోహములో పడి భూమి మీదకు వచ్చి వివాహమాడినారని కొన్ని english bibleలో ఆదికాండము 6వ అధ్యయము నందు బోమ్మలు వేసి ప్రచురించుట విశేషము.
2) మరికొందరు-ఆదాముకు ముందున్న సృష్టిలో నరులు పుట్టిరని, అందు ఉత్తములైన వారు దేవుని కుమారులుగా పరలోకమునకు వెళ్లి అక్కడ నుండి ఆదాము సంతతిలోని అనగా రెండవ సృష్టిలో ఉన్న నరుని కుమార్తెలను చక్కని వారిని చూసి భూమికి దిగివచ్చి వివాహమాడినారని విడ్డురముగా భోదించుచున్నారు.. వాక్యములో వ్రాయబడినది ఉన్నది ఉన్నట్లుగా చెప్పక జనములను మోసము చేస్తున్నారు. bible కు bible సమాధానము చెప్పాలి కానీ మనుష్య జ్ఞ్యానంతో కలిపి చెరిపేడి కల్పితాలను జోడించి రుజువు చేయకూడదు.
ఈ క్రింది వాక్యములను పరిశిలిస్తే- 1) యేసు- ఈ లోకపు జనులు( ఈ యుగపు కుమారులు) పెండ్లి చేసుకుందురు, పెండ్లికియబడుదురు గాని పరమును మృతుల పునరుర్థానము పొందుటకు యోగ్యులని ఎంచాబడినవారు(పునరుర్­ థానపు కుమారులు) పెండ్లి చేసుకోనరు. పెండ్లికియబడురు( లుక 20:28-36).
2) యేసు-లేఖనములను గాని, దేవుని శక్తీ గాని ఎరుగక మీరు పోరబడుచున్నారు. పునరుర్థానమందు ఎవ్వరును పెండ్లి చేసుకోనరు, పెండ్లికియబడరు. వారు పరలోకమందు మట్టి శరీరములు లేని ఆత్మలుగా దూతలు వలె ఉందురు(mathew 22:24-30). పరలోకములో ఉండబోవు ఆత్మలకు శరీరము లేదు కనుక శరీరసంబంధమైన కోరికలు ఉండవు. అందును బట్టి నేత్రశ, శరీరయిచ్చ, జివపుడంబాబు అనునవి లోకమందున్న సాతాను వలన మానవుల నుండి పుట్టినవే కానీ లోకము విడిచిన తర్వాత ఆత్మలకు పుట్టునవి కావు. ఒక వేళా పరలోకములో ఆత్మలకు కూడా ఈ దుస్టస్థితి పడితే దానిని పరలోకము అని పిలుచుట నేరమే అవుతుంది.ఇంతకు అడికండము 6 వ అద్యయములోని దేవుని కుమారులు ఎవరు??? నరుల కుమార్తెలు ఎవరు??? దేవుడైన యెహోవ నేల మంటితో నరుని నిర్మించెను. పిమ్మట అతనికి గడ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించెను.
అప్పుడు ఆదాము- ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని పిలిచెను (ఆదికాండము2:7,21-23). స్త్రీ అనునది పురుషుని నుండి,పురుషుని వలన కలిగినదినియు ,పురుషునికి పుట్టినది అనికూడా అనవచ్చు. luka 3:38లో ఆదాము దేవునికి కుమారుడు కాగా ఆదికాండము 6:2 ప్రకారము హవ్వ నరుని కుమార్తెగా ఉన్నది.స్త్రీ పురుషుని నుండి కలిగెను కానీ పురుషుడు స్త్రి నుండి కలుగలేదు. పురుషుడైతే దేవుని పోలికయు,మహిమయునైయున్నాడు.తండ్రి తన జీవాన్ని ఇచ్చి పురుషుని కనగా పురుషుడు తన శరీరము నుండి స్త్రీని కనియున్నాడు.(1 కోరంతి 11:7-9) . అందువలన పురుషులైన వారు దేవుని కుమారులు కాగా నరుని నుండి కలిగిన స్త్రీలు నరుల కుమార్తెలను వాక్యము చెప్పుచున్నది.పురుషు­ ల నుండి పురుషుల కొరకు నరుల కుమార్తెలు పుట్టియున్నారని వక్యమందు తేటతేల్లమగుచున్నది. జీవమను కృపవారములో భార్యలు పురుషులతో పాలివారైయున్నారు(1peter3:7).

అందువలన నరుని కుమార్తెలు దేవుని కుమారులైన నరులకు మహిమైయున్నారు. దేవుని కుమారులు అనగానే పరలోకములో ఉన్నవారిని వారు కూడా కోరికలకు బానిసులై శరీరము లేనప్పిటికి అత్మలై భుమిమిదకు వచ్చి శరీరముతో ఉన్న స్త్రీలను వివాహం అడిరని కొత్త అర్థము చెప్పడము విచిత్రముగా ఉంది కదూ.......
హిందువులలోని వేదపండితులు అక్కడ దేవుళ్ళకి పెళ్లి చేస్తుంటే క్రైస్తవలోని కొందరు భోదకులు ఇక్కడ దివి, భువి లోని వారికీ పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు




Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget