Halloween Costume ideas 2015

There is only one god?

ఒక్కడే దేవుడా వ్యక్తికొక దేవుడా??


ఒక్కడే దేవుడా ? వ్యక్తికొక దేవుడా?
ప్రభువునామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. ప్రపంచములోపుట్టినప్రతి వ్యక్తి తన జీవితములో తెలుసుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన మూల పాఠమే ఇది. కనుక క్రింద చేప్పబడబోవుతున్న ప్రతి మాటలో ఉన్న పరమార్ధాన్ని గ్రహించగలరని నా మనవి.
ప్రపంచములో ఉన్న ప్రతి మనిషి తన కోసమే బ్రతుకుతాడు కానీ దేవుని కోసము బ్రతుకుట ఆరుదు.మనం అనుకున్నది దేవుడు అనుకున్నాడంటే పొరపాటు కానీ దేవుడు అనుకున్నది మనం అనుకోవాలి. నేడు సమాజానికి దేవుడు ఎవరో అని పరిశోదాత్మకముగా తెలుసుకోలేదు గనుక నేడు అనేక మందికి ఒక్కడే దేవుడా ,వ్యక్తికి ఒక దేవుడా,నీకొక దేవుడా,నాకొక దేవుడా,మీకొక దేవుడా,మాకొక దేవుడా అని సందేహపడుతూ ఉన్నారు. ఇలాంటి సందేహముతో ఉన్న వారి మనో నేత్రాలు తెరవబడుటకే ఈ పాఠం యొక్కముఖ్య ఉద్దేశం.
1) ప్రపంచములోఉన్నప్రతి మనిషి పరిశోదన చేసి దేవుని గురించి తెలుసుకొని,నముకున్న వారు బహు కొద్ది మందే. ప్రపంచములో ఉన్న ప్రతి దానిని పరిశోదన చేసి తెలుసుకుంటున్న మనిషి ఈ లోకమును కలిగించిన ఆ దేవుడు ఎవరు అని ,ఆ దేవుడు ఒక్కడాలేదా ఇద్దరా లేదా ముగ్గురా లేదా ముక్కోటి మందా అని తెలుసుకోవటం లేదు.మన కళ్ళ ముందు ఉన్న ఆకాశాన్ని,భూమిని,సూర్యుడిని,చంద్రుడిని,నక్షత్రాలని,పువ్వులను,కాయలను,గాలిని,నీరును కలిగించిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఎవరన్న విషయాన్నిఆలోచించుట లేదు ఈ మనిషి. ఒక tv కొన్నా, లేక ఏది కొన్నకొన్న వస్తువు ఎవరు చేసారో,ఎప్పుడు చేసారో తెలిసిపోతుంది. ప్రపంచములో అన్నిటిని తెలుసుకుంటున్న మనిషి ఈ ప్రకృతిని కలిగించిన దేవుడు ఎవరు అని తెలుసుకోకపోవడం లేదు. 2) ఒకతల్లితండ్రులకు నలుగురు పిల్లలు ఉన్నారనుకోండి.ఆ నలుగురిని కన్నది ఆ తల్లితండ్రులే అనుకోండి. మా నలుగురుకి ఆయనే మా నాన్న అని అంటారే కానీ మా నలుగురికి నాలుగు నాన్నలు అని చెప్పరు. అనగా ఒక family లో ఎంత మంది పిల్లలు ఉన్నను కూడా వాళ్ళకి ఒక తండ్రి ఉంటాడే కానీ ఒక్కొక్కరికి ఒక్కొక తండ్రి ఉండడు.నలుగురుపిల్లలు ఉండొచ్చు కానీ ఈ నలుగురికి తండ్రి ఒక్కడే. నలుగురు వ్యక్తులు ఉండొచ్చు and ఆ నలుగురు వ్యక్తులకు తండ్రి ఒక్కడే అవుతాడన్న విషయం అర్థమైతే ప్రపంచములో ఉన్నటువంటి మానవులందరికీ ఎంత మంది దేవుళ్ళుఉన్నారు? ఒక్కడా లేక అంతకంటే ఎక్కువనా? దేవుడు ఎవరో తెలుసుకోవాలంటే ముందు మనం ఎవరు,ఎక్కడి నుండి వచ్చామో ,ఎలా వచ్చామో తెలుసుకోవాలి.

3) మనం ఎవరో మనకు అర్థమైతే దేవుడు ఎవరో మనకు అర్థమవుతాడు. నేను, మీరు, మనమందరము ఎక్కడ నుండి ,ఎవరి నుండివచ్చాము? నేను,మీరు మనమంతా మన తండ్రి ద్వారామన తల్లి గర్భము నుండి వచ్చాము.ఉదా:: nithin అను నేను నా తల్లి గర్భము నుండే వచ్చాను. నా తండ్రి నుండే నా తల్లి గర్భములోకి నేను వచ్చాను. నా తండ్రి వాళ్ళ తండ్రిలో నుండి వచ్చాడు.వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తండ్రి నుండి వచ్చాడు. వాళ్ళ తండ్రి వాళ్ళ తండ్రి తండ్రి తండ్రిలో నుండి వచ్చాడు. అనగా ఇలా చెప్పుకుంటూపోతూ పోతూ ఉంటే ప్రారంభములో మొదట ఎవరో ఇద్దరు ఉండాలి, ఉంటారు. నీకు,నాకు,మనకు తల్లితండ్రులు ఉన్నారని ఒప్పుకుంటే, నువ్వు,నేను,మనము వచ్చింది మన తల్లి తండ్రుల నుండే అని ఒప్పుకుంటే మన తల్లి తండ్రులు రావడానికి ముందు ఎవరు ఉంటారు?? ఎవరో మొదట ఇద్దరు తల్లితండ్రులు ఉండాలి.

4) మనం ఎవరో తెలుసుకోవాలంటే ప్రారంభాoలోనికి వెళ్ళాలి.ఏ విషయము గుర్చియైన తెలుసుకోవాలంటే దాని ముందుకు వెళ్ళాలి,మూలం తెలియాలి.ముందు మూలం,ప్రారంభం తెలిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి కానీ మధ్యలో తెలిస్తే ఏమి అర్థం కాదు.ఉదా:: సినిమాకు interval నుండి వెళితే అర్థం కాదు కానీ మొదట పేర్లు start అయ్యినప్పుడు కూర్చుంటే story అంతా అర్థం అవుతుంది కదా... మనము కూడ intervalలో పుట్టాము. intervalలోపుట్టే timeకి దేవుళ్ళు అనేక మంది వచ్చేసారు.అనగా ఇంతమంది దేవుళ్ళు మధ్య పుట్టాము కనుక దేవుడు ఎవరో తెలుసుకోవడం చాలా కష్టమైన పని. intervalలో వచ్చిన మనకి ఎలా తెలుస్తుంది,ఏమి తెలుస్తుంది? కనుక ఏ విషయమైన తెలియాలి అంటే దాని ప్రారంభానికి వెళ్ళాలి,మూలంకు వెళ్ళాలి.

5) నేను నా తండ్రి గర్భంలోకి వెళితే, నా తండ్రి నా తండ్రి తండ్రి గర్భంలోకి వెళితే ఇలా చిట్టచివరిగా మొట్ట మొదటగా తల్లితండ్రి ఎవరో ఉన్నారని తెలుస్తుంది. ఇంతకు ఈ మొదటి తల్లితండ్రులు ఎవరు? ఎలా పుట్టారు?? ఎలా జన్మించారు??? వీళ్ళనుపుట్టించినది,జన్మనిచ్చింది ఎవరు?? ఇదే ప్రశ్నను శాస్త్రాన్ని అడిగితే మానవుడు పుట్టింది కోతి నుండి అని అంటున్నాడు. అనగా ప్రారంభ మానవుడు కోతి నుండి వచ్చాడట. ఒక వేళ కోతి నుండి మనిషి వస్తే మనషి నుండి కోతి పుట్టాలి.మనలో ఎవరికైనా కోతి పుట్టిందా?లేదు. ప్రపంచములో ఏ మనిషికైనా మరో మనిషి నుండి కోతి పుట్టిందా అంటే లేదు.ప్రపంచ చరిత్రలో ఏ మనిషి నుండి కోతి రానప్పుడు కోతి నుండి మనిషి వచ్చాడు అని చెబుతున్న శాస్త్రవేత్తల మాటలు నమ్మగలమా? లేదు.

6) నేను ఉన్నాను. నా పేరు nithin. నేను చచ్చిపోయానని అనుకుంటే నా శవమును పెట్టెలో పెడతారు.పెట్టెలో పెట్టగానే అందరు అనే మాట nithin ఇక లేడు అని. అంటే పెట్టెలో నా శవం ఉన్నప్పుడు మీరు మాట్లాడుతున్న మాటలు nithin లేడు,nithin పోయాడు,nithin వెళ్ళిపోయాడు అని. అయితే పెట్టెలో ఉన్నదీ ఎవరు? nithin ధరించుకున్న శారిరమనే శవంపెట్టెలో ఉంది కానీnithinనీ కదిలిస్తున్న ఆత్మ అను శక్తీ వెళ్లిపోయింది. ఉదా:: ఒక్కసారిగా మనం ఇంటిలో ఉన్న bulb ఆగిపోతే bulb అయిన పోవాలి లేక current అయిన పోవాలన్న విషయం తెలుసు. bulb బాగుంది కానీ వెలగడం లేదు అంటే current పోయిందన్న విషయం తెలుసు. nithin యొక్క కాళ్ళు,చేతులు,కళ్ళు,ముక్కు,చెవులు ఇలా అన్ని అవయవాలు ఉన్న ఎందుకు కదలడం లేదు అంటే nithinలో ఉన్న శక్తీ పోయింది .మొదట ఆ శక్తీ nithinలో ఉంది కనుక బ్రతికాడు అన్న విషయం వాస్తవమైతే ప్రపంచములో ప్రతి మనిషిలో ఉన్నదీ అదే శక్తీ. మీ,నా,మన అందరి శరీరంలో ఉన్నదీ ఆ శక్తీ అయితే ఆ శారిరాలన్నీ కూడా మొట్టమొదట మానవుని నుండి వచ్చింది అన్న విషయం నిజమైతే ఆ మొట్టమొదట మనవునిలోనికి ఆ శక్తీ ఎక్కడ నుండి వచ్చింది?

7) ఇప్పుడు నా శరీరంలో ,మీ శరీరంలో ఆ శక్తీ ఉంది కాబట్టి మనం మాట్లాడుతున్నాము,చూస్తున్నాము,వింటున్నాను అనగాఅనుకున్నవన్ని చేస్తున్నాము. ఈ శక్తీ మనలో ఒక 20.30.40,50,60 years వరకు శరీరములో ఉంటుంది. ఆ శక్తీ వెళ్ళిపోవడమే చచ్చిపోయాడని అని అర్థం.వెళ్ళిపోతున్న ఆశక్తీ ఈశరీరంలోకి రాకముందు నీ తండ్రిలో నుండి నీలోకి వచ్చింది. నీ తండ్రికి వాళ్ళ తండ్రిలో నుండి వచ్చింది. అలా వెనుక నుండి ఆలోచిస్తే ప్రారంభికుడు ఒక్కడు ఉన్నాడని తెలుస్తుంది. ఎవరు ఈ మొట్టమొదట మానవుడు?ఎలా పుట్టాడు?ఆ మనవుడిలోనికి ఆ శక్తీ ఎలా వచ్చింది??? ప్రపంచములో ఉన్న ఏ పుస్తకములో కూడా ఆ మొదటి మనవునిలోనికి ఆ శక్తీ ఎక్కడ నుండి వచ్చిందనీ, ఈ సృష్టిని సృష్టించిన దేవుడు ఎవరన్న విషయాలు చెప్పబడలేదు, చెప్పబడలేరు. ప్రపంచములో ఏ పాఠ పుస్తకాలలో దేవుడు గురించి కానీ,మానవుని గురించి కానీ చెప్పబడలేదు కానీ ఒకే ఒక్క పుస్తకములో సమస్తము చెప్పబడింది.అదే “”” THE BIBLE””. అస్సలు bibleనే ఎందుకు నమ్మలన్న ప్రశ్న రావొచ్చు.అందులో ఉన్న చారిత్రక,భౌగోలిక ఆధారాలను బట్టి నమ్మవలసి వస్తుంది. ఈ bibleలో యేసుక్రీస్తు అనే ఒకాయన కనబడుతున్నాడు.

8) అయితే ఎవరు ఈ యేసుక్రీస్తు? సామాన్య వ్యక్తినా ? ప్రపంచములో ఈ రోజు ప్రతి వ్యక్తి తేది వేస్తున్నాదంటే యేసుక్రీస్తు పుట్టి 2013 years అయిందని,ఆ యేసుక్రీస్తు ఉన్నాడని,పుట్టాడని తెలుస్తుంది.కాలం లెక్కించుటకు శకపురుషుడిగా ఆయననే ప్రపంచం గుర్తించింది గనుక మనం ఒప్పుకోవాలి. యేసును ఈ ప్రపంచం ఒప్పుకుంది కనుక మనం కూడా ఒప్పుకోవాలి. ఇప్పటి వరకు ప్రపంచములో ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. ప్రపంచములో నేటి వరకు ముద్రించిన ఎన్నో పుస్తకాలు ఉన్నా ఆ పుస్తకాలన్నీటిలో ముద్రణ యంత్రం కనుకొన్న తర్వాత ముద్రించిన తొలి పుస్తకమే “”THE BIBLE””. ఈతొలి bibleలో ఉన్న మాటలు చదివితే 1) ఈభూమి మీద ఉన్న ప్రతి మానవుడు మరో మానవుని నుండి రావడానికి ప్రారంభ మానవుడు ఒకడు ఉన్నాడని, ఆ ప్రారంభ మానవుడు ఆదాము అని bibleలో వ్రాయబడింది. మొట్ట మొదట మానవుడైన ఆదాము ఎలా వచ్చాడు?ఎవరు చేసారన్న విషయం ఆలోచిస్తే మిలో ఉన్న శక్తీ,నాలో ఉన్న శక్తీ ఆ ప్రారంభ మానవుడైన ఆదాములో ఉన్న శక్తీనీ పెట్ట్టిన ఒక శక్తీ ఉంది.. ఆ శక్తినే దేవుడు.

9) ప్రకృతిలోకనబడుతున్న ప్రతివాటిని కలుగజేసింది ఆ శక్తీ స్వరూపియైన దేవుడు. మొదటి మానవుడిని దేవుడే చేసాడు. ఆ మానవుని నుండి మరొక మానవుడు ఇలా భూమి మీద 700 కోట్ల మంది వచ్చారు.మొదటి మానవుడు ఆదాము అని,ఇతని నుండి హవ్వ వచ్చింది అని ,వీరు ఇద్దరు ఏకమైనప్పుడు పుట్టిన బిడ్డలు కైయిను,హేబెలు అని చెబుతుంది bible. ఈ నలుగురు నుండి ప్రతి మానవుడు ఈ భూమి మీదకు పుట్టుకొచ్చారు.

10) ఉదా:: చిన్న చింత గింజ ఉంది.ఈ చింత గింజ భూమిలో పడితే మొలక అవుతుంది .ఆ మొలక మొక్క అవుతుంది. ఆ మొక్క చెట్టు అవుతుంది. ఆ చెట్టు చివరికి మహా వృక్షం అవుతుంది.ఆ వృక్షానికి అనేకమైన చింతకాయలు వస్తున్నాయి. అనగా ఒక చింత గింజలో చెట్టు ఉంది,మొక్క ఉంది,మొలక ఉంది. అంటే ఒకే చింత గింజలో అనేక చింతకాయలు కాసే అనేక చింత గింజలు ఉన్నాయన్నది వాస్తవమైతే ,ఒక చింత గింజలో వందల చింత గింజలు ఉన్నాయన్నది నిజమైతే మొట్టమొదటి ప్రారంభ మానవుడైన ఆదాము ఒక్కడు అయితే ఆదే ఒక్కడిన ఆదాము నుండి భూమి మీద ప్రతి మానవుడు వచ్చాడంటారా? లేదంటారా? వచ్చాడు.

11) ఆదాముకు,హవ్వకు దేవుడు ఎలా తెలుసు అని ప్రశ్న రావొచ్చు. ఆదాము,హవ్వకు పుట్టిన కుమారులైన కైయును ,హేబెలు యెహోవాకూ బాలి ఇచ్చారు. అంటేకైయును ,హేబెలు బలి ఇచ్చారు అంటే దేవుడు ఉన్నాడని,ఆ దేవుని గూర్చి ఆదాము హవ్వలు చెప్పారన్న సంగతి అర్థమైనది. అంటే ఈ నలుగురికి ఒకే దేవుడైతే ఆ నలుగురు నుండి వచ్చిన ఈ 700 కోట్ల మందికి ఆదాము నమ్మిన దేవుడే ప్రపంచములో అందరికి దేవుడు అవుతాడు,ఉంటాడు. ఆయనే తండ్రియైన యెహోవా దేవుడు. ప్రారంభ మానవుడికి ఏ దేవుడుంటే నాకు ,నీకు, మన అందరికి కూడా ఆ దేవుడే ఉంటాడే తప్ప ఈ మధ్యలో వచ్చిన దేవుళ్ళు దేవుళ్ళు అవుతారా?

12) శాస్త్రవేత్త చెప్పలేనిది,ప్రభుత్వం చెప్పలేనిది,విశ్వవిద్యాలయంలో చెప్పలేనిది,ప్రాధమిక పాఠశాలలో చెప్పలేనిది,ఎవ్వరూ,ఎప్పుడు,ఎక్కడ చెప్పని ఆ ఒక్క దేవుడి గూర్చి చెప్పుటకు వచ్చాడు యేసుక్రీస్తు.నాకు జన్మనిచ్చిన నా తండ్రిని నేను తండ్రి అయితే మొట్టమొదట మానవుడైన ఆదాముకు జన్మనిచ్చిన ఆ దేవుడు ఆదాముకు తండ్రి అవుతాడు. కనబడని ఆ దేవుని గూర్చిన సంగతులు చెప్పుటకు 2013 years క్రితము ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు చెప్పాడు. యేసుక్రీస్తు ఆ కనబడని దేవుడిని తండ్రి అని చెబితే,ఆదాముకు ఆ దేవుడు తండ్రి అయితే ఆ దేవుడు తండ్రి అని నువ్వు,నేను, ఈ ప్రపంచములో ఉన్నవారందరు చెప్పాలి. నీకొక దేవుడు,నాకొక దేవుడు, నీకొక తండ్రి,నాకొక తండ్రి ,వ్యక్తికి ఒక దేవుడు ఉండడు.

13) ఎఫేసి 4:6- అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. అనగా ఆదాముకు తండ్రి ఆయనే,హవ్వకు తండ్రి ఆయనే,కైయునుకూ,హేబెలుకూ తండ్రి ఆయనే, నీకు,నాకు,మనకందరికీ తండ్రి ఆయనే. ప్రపంచములో ఉన్న700కోట్ల మందికి దేవుడు ఆ తండ్రినే. కనుక ప్రపంచానికి ఒక్కడే దేవుడు తప్ప వ్యక్తికొక దేవుడు కాదు. మనకు తోచిన address రాసి పోస్ట్ చేస్తే అనుకున్న వ్యక్తికి post ఎలా రాదో ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి దేవుని address perfectగా తెలుసుకోవాలి. దేవుని address తెలుసుకోవడానికి దేవుడు మనకు వ్రాయించినది bible. bible దేవుని address.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget