Halloween Costume ideas 2015

Kristunu Dharinchadam Ante Emiti?

క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి?

క్రీస్తును ధరించుకోవడం అంటే ఏమిటి?
ముందుగా యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను.
1) దేవుని పిల్లలుగా బ్రతుకుతున్న మనకి దేవుని కొరకు బ్రతకవలసిన భాద్యత ,దేవుని కొరకు ఈ లోకంలో ఆయనకు ఇష్టమైనట్టుగా బ్రతకవలసిన భాద్యత కలిగిన వారము మనము. అందుకే bibleలో ఉంటున్న అనేకమైన సంగతులు నేర్చుకోవాలి .శరీరం బలహీనం కాకుండా ఎలా ఆహారాన్ని తీసుకుంటామో అలాగే మనం ఆత్మీయ జీవితం బలపడడానికి శక్తివంతమైన దేవుని మాటలు మనకు కావాలి. నీరశిoచి పోయినప్పుడు ఏ పని కూడా ఎలా చేయ్యమో అలాగే దేవుని వాక్యము లేకపోతే మనం కూడా నశించిపోతాము. మన ఆత్మీయ అభివృద్దికి ఆటంకము జరుగుతుంది. ఎప్పుడైతే నిరాశకు లోనవుతమో అప్పుడు దేవుని కొరకు ముందు వెళ్ళాలన్న ఆలోచనను కోల్పోతాము. క్రమము తప్పకుండా ఆహార నియమాలను ఎలా పాటిస్తున్నమో అలానే మన ఆత్మీయ జీవితంలో దేవుని మహా జ్ఞానాన్ని నేర్చుకోవడం చాలా అవసరం.

2) అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఈ 66 పుస్తకాలలో అనేకమైన మాటలన్నీ మన కొరకు వ్రాయించాడు. లేఖనాలను జాగ్రతగా చదువుకుంటూ వాటిని అర్థం చేసుకోనగలిగే పరిస్థితి పరిశోదన వాళ్ళ మాత్రమే కలుగుతుంది. bibleను అర్థం చేసుకోవటం అంటే లేఖనాలలో దేవుడు మన కొరకు ఏమి మాట్లాడుకుంటూన్నాడో ఆ అంతర్యాన్ని గ్రహించడం. 3) గలతీ 3:26-యేసుక్రీస్తు నందు మీరందరు విశ్వాసము వలన దేవుని కుమారులైయున్నారు. క్రీస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు..గలతీ పట్టణములో ఉన్న దేవుని పిల్లలకు రాస్తూ క్రిస్తులోనికి మీరు వచ్చిన తర్వాత దేవుని పిల్లలు అయ్యే మహా భాగ్యాన్ని పొందుకున్నారు అని అంటున్నాడు. అదేంటి ఈ భూమి మీదకు దేవుని పిల్లలుగానే వచ్చాము కదా మళ్ళి దేవునికి పిల్లలు అవ్వటం ఏంటి అనే సందేహము రావొచ్చు. దేవుడు తనకు పిల్లలుగానే ఈ భూమి మీద పుట్టించాడు కానీ మనిషి పాపం చేసి దేవునికి దూరమై దేవుని పిల్లలుగా అనుకునే అర్హతను కోల్పోయాడు. ఒక ఉద్యోగి dutyకీ సరిగా హాజరు కాకపోతే ఎలా suspend అవ్వుతాడో మనిషి కూడా దేవుడు నియమించిన ఆజ్ఞలను. దేవుని మాటకు వేదేయుడు కాకపోవటం వల్ల కుమారుడు/కుమార్తెగా ఉండే మహా భాగ్యాన్ని కోల్పోయాడు. ఆ కోల్పోయిన దానిని యేసు భూమి మీదకు రావడం వల్ల ,అయన తన విలువైన రక్తాన్ని దారపోయటం వల్ల ,అయన మరణ,సమాధి,పునరుర్దాముల సాదృశ్యమైన బాప్తీస్మంలోనికి మరలా మన రావటం వలన కోల్పోయిన మహా భాగ్యాన్ని దక్కించుకున్నాము. బాప్తీస్మం ద్వారా క్రీస్తును ధరించుకున్నాము.

4) అస్సలు క్రీస్తును ధరించుకోవటము ఏంటి? క్రీస్తును ధరించుకున్న మనం ఎలా ఉండాలి??? యేసునీ ధరించుకోవడం అంటే ఆయనలాగా వస్త్రదారణ వేసుకోవటమా లేక యేసు బ్రతికినట్టుగా మనం కూడా ఆ బ్రతుకును సంపాదించుకోవటమా అన్న సంగతిని ఆలోచిస్తే దేవుడు మనిషికి వాక్యాన్ని నేర్పించడానికి చాలా కష్టపడ్డాడని అనిపిస్తుంది.

5) నిర్గమ 28:1 నుండి 3 వరకు చదవండి. ఇందులో ఒక ప్రత్యక్ష గుడారమును నిర్మించమన్నాడు. ఎరుషలేము దేవాలయము కంటే ముందు దేవుని సన్నిది అనగానే ప్రత్యక్ష గుడారం జ్ఞాపకం వస్తుంది.ఆ ప్రత్యక్ష గుడారం ఎలా ఉండాలి,దాని కొలతలు ,దాని తెరలు,మందసము ,నిర్మాణాలు ఇవన్ని నిర్గమ 28 లో వ్రాయించాడు. ఈ ప్రత్యక్ష గుడారం తర్వాతనే ఎరుషలేము దేవాలయము కట్టబడింది. అప్పటికి ఇశ్ర్యాయేలియులు అరణ్యంలో ప్రమాణం చేస్తున్న కాలం. ఆ ప్రయాణంలో ఉంటున్నప్పుడు దేవుని సన్నిధి తమతో కూడా ఉండాలని ,వారు ఎక్కడ నిలుచున్నా ఈ ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేసుకుని అందులో సేవకుడిగా దేవుడు యాజకత్వం జరిగించాలని ఆహారోనునీ నియమించాడు. పరలోకమందున్న దేవునికి and ఇశ్ర్యాయేలియులుకీ మధ్యవర్తిగా ఒక యాజకుడిగా ఆహారోను ఉన్నాడు. యాజకుడిగా యాజకత్వం జరిగించడానికి ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించినప్పుడు ఒక వస్త్రాన్ని(ఎఫోదు) ధరించుకోవాలి.. అనగా దేవుని పని చేసే యాజకులు యజకత్వము చేయుటకు ఒక వస్త్రాన్ని దరించమన్నాడు.

6) అప్పటివరకు పాపక్షమాపణ కొరకు పశువుల రక్తం కానీ యేసు భూమి మీదకు వచ్చిన తర్వాత అయన రక్తమే పాపక్షమాపణ. అప్పటి వరకు దేవాలయం అనగానే కట్టడం కానీ యేసు తన శరీరమే దేవాలయము అన్నాడు. అక్కడ యాజకుడు ప్రజలకు &దేవునికి మధ్యవర్తిగా ఉండాలి,యజకత్వం జరిగించాలి. ఇక్కడి రాగానే ప్రజలకు & దేవునికి మధ్యవర్తిగా ఒక యేసుక్రీస్తు కనపడుతున్నాడు. ఈ కాలములో యాజకత్వం అనగానే,యాజకులు అనగానే దేవుని పని చేస్తున్న వారు. ఒకనాడు ఇశ్ర్యాయేలియుల కాలములో సువార్తను ప్రకటించడం అనేది లేదు. దేవుని మాటలు ఉన్న ధర్మశాస్త్రమును చెప్పి ఇలా ఉండాలి, ఇలా చేయాలి,ఇలా చేయకూడదు అని వాళ్ళకు చెప్పేవారు ఇప్పుడు మాత్రం సర్వలోకనికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి.

7) అంటే పాత నిబంధన నుంచి క్రొత్త నిబంధనకు రాగానే లేవియులే సేవ చేయాలనీ rule లేదు. అందరు సేవ చేయాలి. 1 పేతురు 2:9 చదివితే మనము దేవుని పనికై ఏర్పర్చబడినాము. ఒకప్పుడు లేవియులు ఏర్పాటు చేయబడ్డారు and ఇప్పుడు మిరందురు ఏర్పాటు చేయబడ్డారు అని అంటున్నాడు. ఆ రోజు సున్నతి ద్వారా దేవునికి పిల్లలమయ్యే మహా భాగ్యము పాత నిబంధనలో ఉంటే క్రొత్త నిబంధనకి రాగానే సున్నతి స్థానములో బాప్తీస్మం వచ్చింది. బాప్తీస్మం ద్వారా దేవునికి పిల్లలు అయ్యే మహా భాగ్యాన్ని ఇచ్చాడు. బాప్తీస్మం తీసుకుంటే దేవుని కుమారులు/కుమార్తెలు అవుతారు. బాప్తీస్మం తీసుకున్నాక సమాజములో యేసు గురించి చెప్పవలసిన భాద్యత మన మీద ఉన్నది. ఈ వెలుగు ప్రాముఖ్యత చీకటిలో ఉన్నవారకి చెప్పటమే. అందరు పని చేయాలి. పాత నిబంధనలో ఎఫోదు(యాజకులు వేసుకునే వస్త్రo)నీ ధరించుకోమన్నాడు and క్రొత్త నిబంధన లో క్రీస్తును ధరించుకొమన్నాడు.

8) పాత నిబంధనలో ఒక వస్త్రాన్ని ధరించమని చెప్పాడు. క్రొత్త నిబంధనకు రాగానే యేసును ధరించుకోమన్నాడు.పాత నిబంధనలో వస్త్రం ఇలా ఉండాలి అన్నాడు and క్రొత్త నిబంధనలో రాగానే నువ్వు నేను ఎలా ఉండాలి అని చెప్తున్నాడు.

9) వాస్తవముగా క్రీస్తును ధరించుకోవడము చాలా కష్టం. యేసు అనగానే ఒక సామాన్యమైన మనిషిగా ఊహలలో రాకూడదు. యేసు అనగానే సమాజాన్ని కదిలించిన మహా శక్తీ స్వరూపుడు అనుకోవాలి. యేసుక్రీస్తు బ్రతికిన కాలము 33 ½ years. ఈ చిన్ని కాలములో ప్రపంచాన్ని ఇప్పటివరకు కదిలిస్తున్న మహా శక్తీ. ఆయనలో ఉన్న ఏ లక్షణాలు ఈ రోజు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయో ఆ లక్షణాలు మనలోకి రావాలి. ఒక వ్యక్తి మరణించి 2014 years అయిన ఇప్పటికి యేసు మాటలు ప్రపంచాన్ని కదిలిస్తున్నాయి అంటే కారణం ఆయనలో ఉన్న లక్షణాలను బట్టి.

10) పాత నిబంధనలో ఎఫోదు నీ ధరించుకుంటే చాలు కానీ ఈ క్రొత్త నిబంధనలో బాప్తీస్మం పొందిన తర్వాత క్రిస్తునే ధరించుకోవాలి. బాప్తీస్మం తీసుకున్నాక క్రైస్తవుడి/క్రైస్తవురాలుగా పిలుస్తున్నాడు. పిల్లలు డబ్భులు అడుక్కోవడానికి గాంధీ వేషం వేసుకుని భయత మనకు కనిపిస్తారు. ఆ పిల్లవాని పేరు ఏంటో తెలియదు కానీ పిల్లవాడిని చూడగానే గాంధీ జ్ఞాపకం వస్తాడు. తనను తను మరుగు చేసుకుని గాంధీని జ్ఞాపకం తెచ్చే విధంగా తయారు అయ్యాడు. గాంధీ వేషం వేసుకున్నాడు.. అప్పుడప్పుడు పండగలలో పులి వేషం వేసుకుంటారు. తనను తను మరుగు చేసుకొని అడవిలో తిరిగే పులిలా కనబడేటట్టు చేశాడు. వేషం వేసుకున్న వాడు వేషానికి న్యాయం చేస్తున్నాడు . పులి వేషం వేసుకున్న వాడు పులిలా, గాంధీ వేషం వేసుకున్నవాడు గాంధీలానే కనబడుతున్నాడు.

11) బాప్తీస్మం పొందిన తర్వాత మనం యేసును వేషం వేసుకోలేదు కానీ ధరించుకున్నాము. తీసుకున్న బాప్తీస్మం కీ అర్థం ఈ రోజు నుంచి యేసు లానే నేను సమాజంలో బ్రతుకుతాను అని. bible పట్టుకున్నది,బాప్తీస్మం తీసుకున్నది నిన్ను నీవు కను మరుగు చేసుకుంటూ నీలో యేసును సమాజానికి చూపించడానికి. క్రీస్తును ధరించుకోవడము అంటే యేసు లక్షణాలు మనలో కనిపించాలి. అయన లక్షణాలు ఏంటో,ఆ లక్షణాలు మనలోనికి ఏవి రావాలో కొలస్సి 3:12-మీరు జాలిగల మనస్సును,దయాళుత్వమును,వినయమును,సత్వికమును, దీర్గశాంతమును ధరించుకోనుడి....... క్రీస్తును ధరించుకోనమని చెప్పిన పౌలు క్రీస్తును ధరించుకోవడము అంటే ఏంటో ఈ వచనములో చెప్పాడు. యేసు ఉన్న లక్షణాలు ఇవే. 12) క్రీస్తును ధరించుకోవటం అంటే ఈ లక్షణాలను పెంపొందిoచుకోవటం. ఈ లక్షణాలు మనలో సమాజానికి కనిపించాలి. క్రీస్తును ధరించుకోవటం అంటే మనలో జాలిగల మనస్సును,దయాళుత్వమును,వినయమును,సత్వికమును, దీర్గశాంతమను లక్షణలు కనపడాలి. కనుక ఇప్పుడే ఇప్పటి నుండే మన జీవితములో ఈ ఐదు లక్షణాలను కలిగిఉండుటకు మొదలు పెడదాము.






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget