Halloween Costume ideas 2015

The forth word

యేసు క్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట ద్వార మనము నేర్చుకోనవల్సిన సారంశము
యేసు క్రీస్తు సిలువలో పలికిన నాల్గవ మాట ద్వార మనము నేర్చుకోనవల్సిన సారంశము:
1) మత్తాయి 27:45,46,47 and మార్క్ 15:34 లో నా దేవ నా దేవ నన్నేల విడనాడితివి.. పాత నిబంధనలో దావీదు పరిశుదత్ముని ప్రేరణతో పలికిన ప్రవచనాన్ని కీర్తనలు 22:1 and కీర్తనలు 22:18లో చూస్తాము. ఇది యేసుక్రీస్తు గురించిన ప్రవచనము. యేసుక్రిస్తును తన కుటుంబసభ్యులు,శిష్యులు ప్రతియొక్కరు విడిచినను పట్టించుకోకుండా, ఆలోచించకుండా తండ్రి ఎందుకు విడిచిపెట్టావు అని అంటున్నాడు. సృష్టి పుట్టకముందే,జగత్తు పునాది వేయబడకముందే పరలోకములో తండ్రి యెద్ద ఉన్నాడు యేసు. అప్పటినుంచి సిలువ మీదకు వచ్చేంత వరకు తండ్రి ఎప్పుడు యేసును వదలలేదు. ఎప్పుడును యేసు తండ్రిని విడిచిపెట్టిన వాడు కాదు. అందరు విడిచిన పట్టించుకోని యేసు తండ్రి దూరమయ్యే సరికి భాదపడుతున్నాడు.
2) పరిశుద్దుడు అన్నది దేవుని లక్షణము. ఏ రోజైతే తన పిల్లలు పాపము చేస్తారో అప్పుడు వారు దేవుని నుంచి దురము అవుతున్నట్లు అర్థము. ఏ రోజైతే మనిషి తప్పు చేస్తాడో, పాపము చేస్తాడో అప్పటి నుంచి అతనికి,దేవునికి మధ్య దురము అవుతున్నట్లు. దేవునికి దురము అవుతున్న వారిలో మనము ఉన్నముగా? మన మనసాక్షి మనము పరిపుర్ణులు కామని చెప్పుచున్నది. అటువంటప్పుడు మనము దేవునికి దగ్గరగా ఉన్నామా లేక దూరముగా ఉన్నామా??మనము రోజు రోజుకు మన ఆలోచనల బట్టి,తలంపుల బట్టి, చేతల బట్టి, మాటల బట్టి ఇలా దురము అవుతున్నాము. ఏ రోజైన నేను దేవునికి దురమవ్వుతున్నానే అన్న భాద కలిగిందా?? ఇలా ఈ నల్గోవ మాట ద్వార ఆలోచించుదాము.
3) ఎంతో మంది లోకములో యేసుకు దూరమైన పట్టించుకోకుండా తండ్రి దూరమయ్యే సరికి తట్టుకోలేకపోతున్నాడు. ఇప్పుడు మన పరిస్థితి? ఎవరు మనకు దూరమైతే భాదపడుతున్నాము??దేవుడు దురమైతేనా లేక మనుషులు దురమైతేనా? నిజముగా వాస్తవముగా మనుషులు దూరమైతే భాదపడుతాము కానీ దేవుడు దూరమైతే కాదు. భర్త దూరమైతే , భార్య దూరమైతే, పిల్లలు దూరమైతే, తల్లితండ్రులు దూరమైతే, స్నేహితులు దూరమైతే, అభిమానులు దూరమైతే భాదపడుతాము కానీ దేవుడు మన నుంచి దురమవ్వుతున్నాడన్న భాద క్రైస్తవుల మనకు లేకపోతే ఎలా?
4) దేవుని పనిలో,సేవలో ఉన్న దేవుని పిల్లలను దేవుడు వారి జీవితములో ఏదో ఒక దశలో వదిలేసే ఒక కాలము ఉంటుంది. అదే పరీక్షా కాలము. example:: యోబు దేవుని యెదుట యధార్ధవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, భయబక్తులు కలిగిన వాడిగా ఉన్నాడు.యోబు యొక్క గుణ గణాలను సాతనుకు దేవుడు చెప్పుచున్నాడు. అన్ని ఉన్నాయి గనుక యోబు నీకు దగ్గరగా ఉన్నాడు ,ఒక్కసారి యోబు జివితములోకి నన్ను allow చేస్తే నీ సేవకుడో కాదో నిరుపిస్తాను అని దేవునితో సాతాను జవాబు ఇచ్చాడు .దేవుడు సాతానికి యోబును అప్పగించాడు. చివరికి పరిక్షలో యోబు నెగ్గాడు. luke 22:31-సాతాను మిమ్మును పట్టి గోధుముల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనెను. అనగా సాతాను దేవుని శిష్యులను కోరుకుంటుంది,కోరుకుంటాడు filter చేయడానికి. దేవుని పని చేస్తున్నవారిని సాతాను కోరుకుంటాడు. అలాగే సాతాను యేసును తండ్రి యెద్ద కోరుకున్నాడు.
5) యోబు 2:4-సాతాను అంటున్న మాట. ప్రాణానికి,శరీరానికి ఏది జరిగిన నరుడు వదిలేస్తాడు. నమ్మకాన్ని చూపడానికి తండ్రి కుమారుడిని సాతానికి వదిలేసాడు.కానీ చివరికి యేసు నిలబడ్డాడు. నిలబడడము వల్ల సాతానుగాడికి చావు దెబ్బ అయింది.
6) తండ్రి వదిలివేసి సాతనుకు అప్పగించిన ఆ పరీక్షలో మనము నిలబడినప్పుడే తండ్రి మన విషయములో తల ఎత్తుకుంటాడు. దేవుని పనిలో,సేవలో ఉన్నప్పుడు అనుకోని కష్ట సందర్భాలు వస్తాయి. పనిలో ఉన్న నాకు దేవుడు నా పక్షాన లేదా అని కొందరు, దేవుడు నాతో ఉంటె ఈన్ని కష్టాలు ,అవమానాలు,భాదలు అందుకు అని అనుకుంటారు. కానీ మనము గుర్తించకొనవలసినది సాతాను మనల్ని కోరుకున్నప్పుడు దేవుడు ఖచ్చితముగా వాడికి అప్పగిస్తాడు. ఆ సమయములలో మన పక్షాన విజ్ఞాపన చేస్తున్న యేసు మాత్రము ఆయనకు ఎదురు అయ్యిన శోధనలు మనకు రానియ్యకుండా అడ్డుపడి మనము జయించగాలిగెంత శోదనలు మాత్రమే వచ్చేలా చేస్తూ మనల్ని పరీక్షలో పెడుతున్నాడు.మాములుగా పరిక్ష రాస్తేనే మన శక్తీ ,సామర్ధాలు తెలుస్తాయి గనుక మన ఆత్మీయ జిబితములో ప్రతి ఒక్కరికి పరిక్ష ఉండాలి. ఈ పరిక్ష అనగా దేవుడు మనల్ని వదిలి సాతనుకిఅప్పగించే పరిక్ష. ఆ పరీక్షలో మనము నెగ్గాలి .పరీక్షను జయించిన వాడిదే తండ్రి యొక్క సింహాసనము.

conclusion::: దేవుడు దూరమైతే భాదపడుతమా? మనుషులు దూరమైతే భాదపడుతమా?? దేవునికి దూరమైతే అయన రాజ్యమునకు వారసులు కాలేము. ఈ నాల్గవ మాటలో మనము నేర్చుకోనవల్సినది దేవునికి దగ్గరగా ఉండాలి. హృదయములో దేవునికి స్థానము ఇవ్వాలి. అటువంటప్పుడు పరిక్ష కాలము ఎదురవుతుంది. సాతాను నుంచి వచ్చే శోధనలకు మనము నలబడితే తండ్రి సగౌరవముగా అందరిలో నా నిజకుమారుడని అంటారు.

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget