Halloween Costume ideas 2015

The Fifth word

యేసుక్రీస్తు సిలువపై పలికిన ఐదవ మాట ద్వార మనము నేర్చుకొనవలసిన వివరణ
యేసుక్రీస్తు సిలువపై పలికిన ఐదవ మాట ద్వార మనము నేర్చుకొనవలసిన వివరణ
ముందుగా ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు వందనములు. యేసుక్రీస్తు సిలువ పై పలికిన ఐదవ మాటలో మనము తెలుసుకొనవలసిన,నేర్చుకొనవలసిన అంశములోకి వెళ్దాము.. john 19:28- అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి,లేఖనము నెరవేరునట్లు-నేను దప్పిగోనుచున్నాననెను... ఇది ఒక ప్రవచనము . కీర్తనలు 69:21- వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి.నాకు దప్పియైనప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. కీర్తనలలో చెప్పబడిన ప్రవచనమును యేసుక్రీస్తు నేరవేరుస్తున్నాడు... ఈ ఐదవ మాటలో ముఖ్యముగా రెండు విషయములు తెలుసుకోవాలి.

1) కన్ను మూసేలోపు యేసు చేస్తున్న అద్బుత విషయమే లేఖన నెరవేర్పు. నా గురించి లేఖనములలో వ్రాయబడినదని,కన్ను మూసే లోపు వ్రాయబడినవి అన్ని నెరవేర్చాలన్న ఆలోచనతో ఉన్నాడు. bibleలో ప్రత్యేకించి పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ఎన్నో వ్రాయబడ్డాయి. ముప్పై మూడున్నర years గల చిన్న జీవితములో యేసుక్రీస్తు గూర్చి రాసిన లేఖనాలన్ని నేరవేరుస్తున్నాడు. పాపులను రక్షంచడానికి ఈ లోకానికి వచ్చాడు అన్నది లేఖనాలలో వ్రాయబడింది and నెరవేర్చాడు, ధర్మ శాస్త్రము చేర నుండి విడుదల అన్నది లేఖనాలలో వ్రాయబడింది and నెరవేర్చాడు, తండ్రిని ఈ లోకానికి భయలుపరచుట అన్నది లేఖనాలలో వ్రాయబడింది and నెరవేర్చాడు. లేఖనలలో యేసు గురించి ఏ విషయమైతే చెప్పబడినదో కన్ను మూసే లోపు వాటినన్నిటిని పూర్తి చేసాడు.ఇలా ఆలోచించుకుంటూ పోతే ప్రభువు గురించి లేఖనలలో ఏ విషయాలు అయితే వ్రాయబడ్డాయో కన్ను మూసే లోపు తన చిన్న జీవితములో లేఖనములలో వ్రాయబడిన అన్ని నెరవేరుస్తూ,నెరవేర్చి కన్నుముస్తున్నాడు. (a)అస్సలు లేఖనలలో ప్రభువు గురించి వ్రాయబడిందా లేక మన గురించి కూడా వ్రాయబడిందా????? ఎఫేసి 1:4 to 6-మనము తన ఎదుట పరిశుద్దులమును, నిర్దోషులమునై యుండవలెనని జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ చేత అయన క్రిస్తులో మనలను ఏర్పరుచుకునెను... మన గురించి వ్రాసిన ,చేయవలసిన లేఖనము. అనగా పరిశుద్దులుగా and నిర్దోషులుగా ఉండాలి. మనము పుట్టింది దేవుని కోసమని ,బ్రతికినంత కాలము అయన ఎదుట మనము పరిశుద్దులుగా and నిర్దోషులుగా బ్రతకాలన్నది లేఖనాలలో మన గురించి వ్రాయబడినది.
b)యేసు గూర్చి వ్రాయబడిన అన్ని లేఖనాలు నెరవేర్చి కన్ను మూసాడు. మన గురించి వ్రాయబడిన ఈ లేఖనమును నెరవేర్చి కన్ను ముయాలా లేక నేరవేర్చకుండానే ముయాలా????? మనము కూడా యేసులా నెరవేర్చి కన్ను మూయాలి. అయన ఎదుట మనము పరిశుద్దులుగా and నిర్దోషులుగా బ్రతకాలన్నది లేఖనాలలో మన గురించి వ్రాయబడినది. మనము అన్ని విషయాలలో పరిశుద్దతను కాపాడుకుంటున్నామా???????ఒక్కసారి అలోచిచండి. హెబ్రీ 12:14-పరిశుద్దత లేకుండా ఎవడును ప్రభువును చూడడు..... పరిశుద్దత మన హృదయానికి ఉండాలి. మనం హృదయాన్ని పరిశుద్దముగా పెట్టుకుంటున్నామా?????మన హృదయము గూర్చి యేసు చెప్పుచున్న మాటలను చూస్తే mark7:21-bibleలో చుడండి ఈ వచనమును. ఈ వచనములో ఉన్న listలోఏన్ని మనలో ఉన్నాయో పరిక్షించుకుందాము...పరిశుద్దత లేకుండా పరలోకములో దేవుని చూడలేము వేల్లలేము.. మన గురించి లేఖనము ఇంత చెప్పుచుండగా కన్ను మూసే లోపు నేరవేరుస్తామా?
2) ఈ మాటలో దప్పికోనుచున్నాము అని ఎందుకు అన్నాడు?? రాత్రి నుండి యేసుకు రక్తము కారిపోతుంది. దేహము నుండి రక్తము దారాలాగ వెళ్లిపోతునప్పుడు అయన నిఅజముగా శరీరముతో ఉన్నాడు గనుక ఆయనకు దాహాము వేసింది కనుక దాహము అని అడిగాడు. మరొక చోట దాహము అను పదమును గూర్చి చూస్తే మత్తాయి 25:35,40 లో ఇది ఏ దాహము??????ఈ న సహోదరులలో ఒక్కరికి చేస్తే నాకు చేసినట్లే అంటున్నాడు. ఇంతకు ఎవరు ఆ సహోదరులు??? పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారము చేయువారు నా సహోదరులు అని యేసు అంటున్నాడు. తండ్రి పని అంటే ఏంటి?????? ఆత్మలు రక్షించే పని.ఈ లోకములో ఆత్మల భారము కలిగి పని చేస్తున్న సేవకుల సేవలో మనము పాత్రను పోషించాలి.
(a) ఎసుక్రిస్తుకు ఆత్మల రక్షణ అనే దాహము ఉంది. ఈ రోజుకి కూడా యేసుక్రీస్తు దాహముగా ఉన్నాడా లేదా????ఈ రోజు నాశనము అయ్యిపోతున్న ప్రపంచాన్ని చూసి ఆత్మల రక్షణ అనే దాహముతో ఉన్న ప్రభువు యొక్క దాహమును ఎవరు తీర్చాలి??? మనము తిరుస్తున్నామా??? ఆ రోజు యేసుకు దాహము అయితే నీరు ఇవ్వనందుకు వాళ్ళు ద్రోహులైతే ఆత్మల రక్షణ అనే దాహముతో ఉన్న ప్రభువు యొక్క దాహమును తీర్చకపోతే మనము ఏమి అవుతాము?

Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget