Halloween Costume ideas 2015

Prabuvu Balla Paramardamu


ప్రభు బల్ల పరమార్ధము

యేసుక్రీస్తు ఎందుకు దిన్ని ప్రవేశపెట్టాడు? దిని ద్వార ఏమన్న చెప్పాలనుకున్నాడా?ఒక వేళా చెప్పాలనుకుంటే ఏమి చెప్పాలనుకున్నాడు? ఆ చెప్పడానికి ఇది ఎందుకు చేయమన్నాడు అన్న సంగతులు మనము అందరు తెలుసుకోవాల్సిన విషయము.

ప్రభు బల్ల పరమార్ధము.
bible ఒక్కటికిగా ఉన్న christians ఆలోచనలు ఒక్కటిగా లేకపోవడము వలన రకరకాల పద్దతులు,విభిన్నమైన అచారవ్యవహరలతో ఈ రోజు christianity కలుషితము అయిందని చెప్పవచ్చు.
1) యేసుక్రీస్తు ఎందుకు దిన్ని ప్రవేశపెట్టాడు? దిని ద్వార ఏమన్న చెప్పాలనుకున్నాడా?ఒక వేళా చెప్పాలనుకుంటే ఏమి చెప్పాలనుకున్నాడు? ఆ చెప్పడానికి ఇది ఎందుకు చేయమన్నాడు అన్న సంగతులు మనము అందరు తెలుసుకోవాల్సిన విషయము.
2) ఒక తండ్రికి నలుగురు కుమారులు. తన పిల్లలు ఎప్పుడు కలిసి,మెలసి ఉండాలన్నది తండ్రి కోరిక.నిత్యము కొట్లాడుకుంటూ,గొడవలు చేసుకుంటూ ,ఒకరు అంటే ఒకరు పడనివారిగా ఉన్నారని ,తండ్రి ఏలాగన్నా వీరికి పాఠం చెప్పాలి అని అలోచించి నలుగురు కుమారులను పిలిచి ఒక్కొక్క కుమారుడికి ఒక్కొక్క కట్టే (stik) ఇచ్చి విరవమన్నాడు. 4 sons easy గా break చేసేసారు. మళ్ళి 4 sons నీ పిలిచి కొన్ని కట్టెలను తాడుతో కట్టి వారికీ ఇచ్చి break చేయమన్నాడు. ఎంత కష్టపడిన వారు విరవలేకపోయారు. ఇప్పుడు తండ్రి దీని ద్వార ఏమన్న చెప్పలనుకున్నడా లేక కట్టిన కట్టెలను విరిస్తే చుడాలనుకున్నడా?? తండ్రి ఉద్దేశము ఏంటి అంటే మీరు ఒక్కొక్కరుగా ఉంటె ఎవడైనా , ఏదైనా చేస్తాడు కానీ నలుగురు కలిసి,మెలిసి ఉన్నప్పుడు ఎలా కట్టెలను break చేయలేకపోయారో మిమల్ని ఎవడు ఏమి చేయలేడు. ఈ storyలో ఒక సందేశము ఉంది. తండ్రి యొక్క ఆలోచలన చెప్పాలనుకున్నాడు కానీ నోటితో చెప్తే వాళ్ళకి అర్థము కాదని వాళ్ళ కళ్ళముందు ఒక practical ద్వార తాను చెప్పాలనుకున్నది చెప్పడానికి try చేసాడు. ఐకమత్యము గురించి తెలియజేసాడు వాళ్ళకు. 3) యేసుక్రీస్తు కూడా తన మరణానికి ముందు జరిగిన రొట్టె వీరిచే కార్యక్రమము ద్వార ఎమన్నా చెప్పాలనుకున్నడా? ఇది చేసుకుంటూ వెళ్ళిపొండి నేను వచ్చేంతవరకు అన్నాడా? ఇది చేయటములో ఆయనకు ఉన్న ఉద్దేశము ఏంటి?ఒక తండ్రి ఐకమత్యము గురించి చెప్పాలనుకుని ఎలా కర్రలను break చేయమన్నాడో యేసుక్రీస్తు కూడా సమాజానికి ఒక అద్బుతమైన వాక్యసందేశము అందించడానికి శిష్యులు మధ్య ప్రభు బల్లను ప్రవేశపెట్టినట్లుగా మనకు అర్థమవుచున్నది. మనము ఎప్పుడు bible చదివేటప్పుడు దిని ద్వార ఏమి చెప్పాలనుకున్నాడు అని పరమార్ధము గ్రహిస్తే అది దేవుని ఉద్దేశము అయ్యి ఉంటుంది. ఒక తండ్రి తన కుమారులకు ఐకమత్యము నేర్పించడానికి ఎలా కార్యక్రమాన్ని రూపొందిoచాడో, యేసుక్రీస్తు కూడా అయన అప్పగింపబడిన రాత్రి ఒక సందేశాన్ని తరతరాలకు అందించాలన్న ఉద్దేశముతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి మనకు అప్పగించినట్లుగా మనకు కనపడుతుంది.
4) సమాజము లో ప్రభు బల్ల గురించి అడిగే ప్రశ్నలు చూస్తే:
a)ప్రభుబల్ల రోజున grapes కొని తీసుకొచ్చి ఇవ్వమంటారా లేక జ్యూస్ భయట అమ్మేది తెచ్చి ఇవ్వమంటారా?
b) రొట్టె కొనమంటారా లేక తయారుచేయమంటారా లేక రొట్టె ముక్కలుగా ఇవ్వమంటారా ?
c)grapejuice ఒకే glassలో ఇవ్వమంటారా లేక చిన్న చిన్న glassలోపోసి ఇవ్వమంటారా?ఎంత పొయ్యాలి?కొంచెము చేదుగా పోయలా లేక తీపిగా ఉండాలా? వాస్తవముగా ఆలోచించాల్సిన దాని మీద మనస్సు లేదు కానీ అవసరము లేనివాటి గురించి ఆలోచిస్తాడు మనిషి.
5) దేవుడు ఎంత importance ఇచ్చాడో మనము bibleలో చూస్తే మత్తాయి20:20 నుంచి-అప్పుడు జేబెదాయి కుమారులు(యాకోబు,john) తల్లి తన కుమారులతో అయన యొద్దకు వచ్చి నమస్కారము చేసి యొక మనవి చేయబోగా,నీవేమి కోరుచున్నావు అని యేసు అడిగెను.అందుకు ఆమె “ నీ రాజ్యమందు ఈ నా ఇద్దరి కుమారులలో ఒకడు ని కుడివైపునాను,ఒకడు నీ ఎడమవైపును కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను. యేసు రాజ్యములో ఎప్పటికి తన పిల్లలు ఉండాలని కోరిక కలిగింది తల్లి. అందుకు యేసు మత్తాయి20:22లో-మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అన్నాడు. అంటే వారు అడుగుతున్నది వారికీ తెలియదా?కోరికను అడుగుచున్న తల్లిని మీరేమి అడిగుచున్నారో మీకు తెలియదు అన్నాడు. ఇంతకు వాళ్ళకు ఏమి తెలుసు,ఏమి తెలియదు అంటే పరలోకము వెళ్ళాలని సంగతి తెలుసు కానీ పరలోకము వెళ్ళాలంటే భూమి మీద ఏమి చేయాలనీ తెలియదు.పరలోకము అడిగితే వచ్చేది కాదు. salary అడిగితే ఇచ్చేది కాదు కానీ కష్టపడితే వచ్చేది. పరలోకo వెళ్ళడానికి నేను ఏమి చేస్తున్నానో తెలిస్తే అప్పుడు మీరు ఏమి చేయాలో అర్థమవుతుంది అని యేసు జవాబు ఇచ్చాడు. మత్తాయి20:22లో నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా?? అని అడగగా వారు –త్రాగగలమనిరి.
అంటే పరలోకము వెళ్ళాలంటే నాకొక గిన్నె నిర్ణయించబడినది, ఆ గిన్నెలోనిది మీరు త్రాగాలి,మీరు త్రాగితే నేను ఎలా వేల్లగలుగుతున్ననో మీరు కూడా రాగలరు అని అర్థము. కానీ ఇక్కడ శిష్యులకు అర్థము కాక త్రాగగలమనిరి. అస్సలు గిన్నె ఏంటి? గిన్నె లో ఎమీ ఉంది? ఆ గిన్నెలో ఏమి ఉందో ,ఎలా ఉందో ,ఎలా త్రాగలో అను వివరాలకు వెళితే మత్తాయి 26:38 నుంచి- ఇక్కడ సాధ్యమైతే అంటున్నాడంటే యేసు త్రాగాబోయేది సామాన్యమైనది కాదని అర్థము.ఒక వేళ గిన్నె సులువుగా ఉంటె నా యెద్ద నుండి తొలగించమని భాదపడుతూ prayer చేయాల్సిన పని లేదు.ఆ గిన్నెలో యేసు మరణము ఉంది.

6) మత్తాయి26:26లో యేసు ఈ గిన్నె తొలగించమని చేసిన prayerకు ముందు రొట్టె,గిన్నె తీసుకుంటున్నాడు. “” తన శరీరము ఎలా గాయపరచబోతుందో,తన శరీరము ఎలా నలగగోట్టబడుతుందో చూపించడానికి, తన శరీరములో ఉన్న ఆకరి రక్తపు బొట్టు నేలకు అనేకుల కొరకు ఎలా చిందిoపబడుతుందో చెప్పడానికి ఇది యేసు చేసాడు.”” అస్సలు అయన మరణము విషయము ఇలా ఉంటుందని శిష్యులకు చెప్పాలా?? చెప్పాలి.యేసు మరణించాడు అన్న సంగతి తెలియడము ముఖ్యము కాదు కానీ ఎందుకు,ఎలా మరణించాడని తెలుసుకోవడము ముఖ్యము.ఎందుకంటే యేసు అయన కొరకు మరణించలేదు. శిష్యులు దూరముగా ఉంది యేసు మరణము చూసారు తప్ప ఈ విధముగా జరిగిందన్న విషయము వారికీ కూడా తెలియదు. ఆ కాలములో ఉన్నారు గనుక దురము నుంచి చుసిన కొన్ని సంగతులు తెలుస్తాయి కానీ ,శిష్యులు మరణించిన తర్వాత ,ఆ తర్వాత కాలములో యేసుక్రీస్తు ఎలా మరణించాడో సమాజంలో తెలియజేయడానికి యేసు ఇది చేసాడు. ex:bike నేర్చుకునేటప్పుడు పడినప్పుడు దెబ్బ తగిలి తర్వాత మచ్చ ఉంటుంది. ఒక వేళా ఆ మచ్చ లేకుంటే గాయము గూర్చి remember మనకు రాదు.దేహము మీద మచ్చ ఎలా మనిషికి గుర్తుండిపోతుందో ప్రపంచ మానవాళి mindలో మరణ,సమాధి ,పునరుర్ధానము తెలియాలని యేసు ఈ ప్రభు బల్ల కార్యక్రమము చేసాడు.
7) 2000 క్రితము యేసు మరణించాడు.అయన మరణము గురించి,ఎలా మరణించాడో అందరికి తెలియాలి అంటే మరణాన్ని remember చేసుకునే కార్యక్రమము ఉండాలని యేసు ప్రభు బల్ల event చేసాడు.అయన మరణము తరతరాలుగా remember చేసుకోవాలి. ఎందుకంటే అయన కోసము మరణించలేదు గనుక. తరతరాలుగా remember చేసుకోవాలి అంటే remember చేసుకునే event ఉండాలి.అందుకని శరీరాన్ని గూర్చి గుర్తుగా రొట్టె,రక్తాన్ని గూర్చి గుర్తుగా grapejuice చేసాడు. అప్పగింపబడిన రాత్రి ఒక గిన్నె పట్టుకొని ఆ గిన్నె లో grapejuice ఉన్నప్పటికీ దాని అర్థము మీ కొరకు నా రక్తాన్ని ఇలా వలకించబోతున్నాను అని.
8) యేసు ఎలా మరణిస్తున్నాడన్న విషయము important. నా మరణము అయిపోయిన తర్వాత మీరు కూడా నా భాటలోనే ఇలానే ప్రాణాలు పెట్టాలి. రొట్టె ,grapejuice చూసినప్పుడు భాద్యత remind చేసుకోవాలని ప్రభుబల్ల event చేసాడు.
9) 1 కోరంది 11:23 నుంచి- నన్ను remember చేసుకోనుటకై దినిని చేయండి అంటున్నాడు. అస్సలు ఎందుకు remind చేసుకోవాలి??అయన మరణముతో మనకు ఎమన్నా ఋణపడిందా? అంటే ప్రభు బల్ల చేయకపోతే యేసు మరణము మనకు గుర్తు రాదు. “మరణించాడని అనుకుంటామే తప్ప ఎలా మరణించాడన్న సందర్భము కళ్ళకు కట్టినట్లుగా మనకు గుర్తురావాలని remind చేసుకోనుటకై దినిని చేయండి అంటున్నాడు.ఇది చుసిన మనము దేవునికి చేయవలసిన పనిని,దేవుని కొరకు కర్తవ్యమును గుర్తు చేయడానికి చేయమన్నాడు. భాద్యత గుర్తు చేసుకుని దేవుని కోసము బ్రతకాలన్న కర్తవ్యము తెలిఅజేయటానికి ప్రభుబల్ల చేయమన్నాడు.
10) ప్రభుబల్ల event చేస్తున్నపుడు యేసు మరణము కళ్ళముందు కదులుతుంటే నా కొరకు ఇంత త్యాగము అయిపోయాడు కదా,ఇంత త్యాగము అయిన యేసు మరణాన్ని గుర్తుతెచ్చుకున్నప్పుడు నేను కూడా దేవుని కొరకు ఇంత త్యాగము అయిపోవాలి అన్నఆలోచన రేపడానికి,కలిగించడానికి యేసు చేసాడు. యేసు మరణము మన కళ్ళ ముందు ఎందుకు పెట్టాడంటే మనం కూడా స్పూర్తి చెంది,ప్రేరణ కలిగిన వాడిగా దేవుని కొరకు యేసు అంత ఉన్నతముగా బ్రతకడానికి మన ముందు పెట్టాడు.
11) దేవుని సంకల్పము – john 3:16లో మనము సహోదరుల నిమిత్తము ప్రాణాలు పెట్టాలి.
12) ప్రభుబల్ల యొక్క సందేశము- మన కొరకు యేసు ప్రాణము పెట్టాడు. ఆయన రక్తాన్ని ,శరీరాన్ని తీసుకుంటున్న మనము కూడా దేవుని కొరకు ప్రాణము పెట్టాలి. ఈ ఆలోచలను రేపడానికి, కలిగించడానికి.
13) 1 కోరంది 11:26-అయన మరణము ప్రచురించుదురు అను మాట ఉంది.అంటే సువార్త ప్రచురించుదురు అని అర్థము.యేసు మరణ ,సమాధి,పునరుర్ధనము గురించి సమాజానికి ప్రకటన చేయాలి. ఈ ప్రకటన కోసము కష్టపడుతూ ,నీ దేహాన్ని ,రక్తాన్ని చెమటగాభూమి మీద వలికించాలి.ప్రభుబల్ల తీసుకున్నప్పుడు యేసు మరణాన్ని ప్రచిరించాలి అంటున్నాడు(1 కోరంది 11:26).ప్రభువు వచ్చు వరకు ప్రచురించాలి.ప్రభుబల్ల తిసుకుంటున్న ప్రతి వారు దేవుని కొరకు కష్టపడాలని అలోచించి నడవాలి.


Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget