Halloween Costume ideas 2015

Manishi Janma Enduku?

మనిషి జన్మ ఎందుకు?
జన్మించిన వాటన్నింటిలోకెల్లా మనవ జన్మ అముల్యమైనది,
అపురూపమైనది,విలువైనది. మన కళ్ళముందు ఎన్నోజన్మించి జీవిస్తుండగా వాటన్నింటికంటే వేరుగా వివేకాన్ని కలిగి , వాటన్నింటికంటే ఎక్కువ జ్ఞానము కలిగిన మనిషికి ఈ ప్రకృతిలో ఈ జన్మనే ఎందుకు కలిగి ఉండాలి? ఇలా జన్మించడానికి గల కారణo ఆలోచించవలసిన విషయము. ప్రకృతి కూడా మానవునికి ఎందుకు అనుకూలముగా ఇంత చక్కగా ఎందుకు ఉన్నదో ఆలోచించాలి. ఇలా ఆలోచించక ఈ జన్మను అనుభవిస్తూ ,ఈ జన్మ భార్య భర్త కోసము అని ,భర్త భార్య కోసము అని,రాజకీయ నాయకుడు దేశము కోసము అని ఇలా ఈ జన్మను వర్గికరించుకొని వారి కోసము బ్రతుకుచున్న వారు కొందరైతే ,అస్సలు ఈ జన్మ ఎందుకో తెలియక గాలికి పుట్టామనుకుంటున్నారు.మనవ జన్మ పరమార్ధము అర్థము కాక ఈ అపురూపమైన జన్మను ఆత్మహత్యల పేరట అంతమొందించు కుంటున్నారు. ఇలా జరగుతున్న పరిస్థితులు గమనిస్తే మనిషి జన్మ ఎందుకో సరిగ్గా తెలియకపోవటం వలననే తాము అనుకున్నది నిజము అనుకుని చాలా మంది భ్రమతో బ్రతుకుచున్నారు. ఆయా ధనిక దేశాల్లోని కుటుంబాల్లో పుట్టలేదని తమ జన్మను నిందించుకుంటున్నారు. అస్సలు ఎక్కడ పుట్టాము అని కాక ఎందుకు పుట్టమో తెలిస్తేనే మనిషి తనకున్న భ్రమలో నుండి భయటకు రాగలడు. 2) ఈ లోకములో మనిషి ఏది తాయారు చేసుకున్న కారణముంటుంది.అలాంటప్పుడు ఈ విశాల ప్రకృతి పుట్టికకు కారణo ఉండి తీరాలి.ఈ కారణాన్ని మనకు దీనిని కలగజేసిన దేవుడే చెప్పాలి. ఆదికాండము 1:26,28-దేవుడు మన స్వరుపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ది పొంది విస్తరించి భూమిని నిండించి...... దానిని లోబరుచుకోనుడి. కీర్తనలు 8:6,8-నీ(దేవుని) చేతి పనులు మీద వానికి(మనిషికి) అధికారము ఇచ్చియున్నావు.. పై రెండు వక్యభాగాలను గమనిస్తే దేవుడు 6 days కష్ట ఫలితముగా ఏర్పడిన ఈ ప్రకృతి మీద అధీకారము మనిషికి ఇచ్చాడు. దినిని బట్టి మనకోసమే ప్రకృతిని కలిగించాడు.
మన గురించి ఆలోచన దేవునికి ఉన్నది కాబట్టి మన అవసరతలను తెలుసుకుని మనము అడగక మునుపే మన కొరకు చేసి ఆ తర్వాత మనలను భూమి మీద కన్నాడు( మత్తయి 6:8). earth, air, sun, moon, water, fruits, vegetables, non veg ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ మన కోసమే. ఇన్ని దేవుడు కలిగించాడంటే మన మీద దేవునికి ఉన్న ప్రేమయే.ఇంకా ఆలోచిస్తే earth earth కోసము కాదు, air air కోసము కాదు,sun sun కోసము కాదు , అందుకే air ఏనాడైనా airని పిల్చిందా?? sun తన వెలుగును ఏనాడైనా అనుభవించాడా?? fruits ఇచ్చే tree ఏనాడు తన fruitsను ఆశించలేదు. ఇలా ప్రతిదీ తన కోసము కాకుండా ,దేవుని కోసము కాకుండా మనిషి కోసమే ఉన్నవి. ఈ ప్రకృతిలో లెక్కించలేని వస్తువులు ఉన్నవి. అది గ్రహించిన david గారు కీర్తనలు 40:5- మా యడల నీకున్న తలంపులు బహువిస్తారములు ,వాటిని వివరించి చెప్పెదనను కొంటిన అవి లెక్కకు మించి యున్నవి. దినిని బట్టి మనుషుని గూర్చి దేవుడు తలంచాడు గనుకనే విస్తారమైన వస్తువులను ప్రకృతిలో పెట్టాడని అర్థము చేసుకోగలము. example:: ఆహారానికి fruits,vegetables, మాంసముఉన్నాయి..మళ్ళి వీటిలో types చూద్దాము.
a) fruits-జామ.మామిడి,సపోటా, etc.
b) vegetables- బెండకాయ,దొండకాయ etc. క) మాంసము-కోడి,మేక,చేపలు etc. ఇలా ఎన్నో మన కోసమే కలిగించాడు దేవుడు.కీర్తనలు 115:16- అయన(దేవుడు) భూమిని కలుగజేసి సిద్దపరచి,స్థిరపరచెను.

3)ఇలా మనిషి కోసమే జన్మించిన ప్రకృతి దానిలో ప్రతిదీ తనకోసము కాకుండా తమ జన్మను మనిషికి అంకితము చేస్తున్నాయి. example::: చెట్లను గురించి ఆలోచిస్తే కొన్ని మొక్కలు కుండీలో ఉండి అందాన్ని ఇస్తే,కొన్ని పెరిగి పెద్దయాక నీడను,కాయలు,పండ్లను ఇలా బ్రతికినంత కాలము ఇచ్చి తన చివరి దశలో వంట చెరుకుగా మారుతుంది.తరువాత బొగ్గుగా బుదిడగా కూడా use అవుతుంది. ఇలా ప్రతి దశలో తన జన్మను, జీవితాన్ని తన కోసము కాకుండా మనకోసము త్యాగము చేస్తుంది. అలానే కోడి జీవితాన్ని ఆలోచించండి. ప్రకృతి మనకోసమే అయితే వాటి కంటే ఉన్నత జన్మ కలిగిన మనిషి ఎవరి కోసము??? ప్రకృతిలో పుట్టిన ప్రతిదీ తన కోసము కానప్పుడు మనిషి కూడా తన కోసము కాదు. మరి మనిషి ఎవరి కోసమో మనిషిని పుట్టించిన దేవునిని అడుగుదాo. ఎఫేసి 1:4-6లో (దేవుడు) తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసు ద్వార తనకు కుమారులనుగా స్వికరించుటకై మనలను ముందుగా తన కోసము( దేవుని) నిర్ణయించుకొనేను. కీర్తనలు 139:16లో తల్లి గర్భములో ఉన్నపుడు దేవుడు మనలను చూస్తున్నాడు.ఇలా ఆకారము రాక ముందు నుండే దేవుడు మనలను చుస్తున్నాడంటే మనము అయన కోసమని మన పైన ఇంత పర్య వేక్షణ ప్రారంభములోనే కలిగిఉన్నాడు. మనిషికి అవసరమని సర్వ ప్రకృతిని సిద్దము చేసి నీ కోసము అన్నాడు. కానీ మనిషిని మాత్రము తన ( దేవుని)కోసమని ముందుగా నిర్ణయించుకున్నాడు.ఉన్నవాన్ని మనకోసమే కానీ మనిషి ఉన్నది దేవుని కొసమే!!.

4) ఒక్కసారి ఆలోచించండి.దేవుడున్నది ఎవరి కోసము?? నేను అబ్రహాము,ఇస్సాకు,యకోబుల దేవుడను(అపోకార్య 7:32) ఇలా దేవుడు కూడా మనుష్యుల కోసమని అంటున్నప్పుడు మనుష్యులమైన మనము ఎవరి కోసము??? దేవుడంతటి గొప్పవాడే మనుష్యులు కోసం అయినప్పుడు మనిషి జన్మ దేవుని కోసము కాదా?? మనిషి జీవితములో ప్రతి దశలో దేవుని కోసమే బ్రతకాలి.మనిషి జన్మ దేవుని కోసమే అంకితము కావాలి.ఎందుకంటే మనిషి జన్మనే దేవుడు తన కోసమే ప్రత్యేకపరచుకున్నాడు.ఈ జన్మ దేవుని కోసేమేనని గ్రహించి దేవుని కోసము బ్రతకుతారా???????/ మన కోసమే ఈ జన్మ అనుకుని జీవము గల దేవునిని విడిచి పోతారా???? ఆలోచించండి.



Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget