Halloween Costume ideas 2015

Chikati Velugulu Lokaniki Avasarama?

చీకటి-వెలుగులు లోకానికి అవసరమా??
.
చీకటి-వెలుగులు లోకానికి అవసరమా?
మన రక్షకుడైన యేసు నామములో మీకు శుభములు తెలియజేస్తున్నాను. మన బ్రతుకును దేవుని వైపు మళ్ళించుకొనుటకు ఇచ్చిన ఈ దినమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను.దేవుడు ఇచ్చన ఈ దినములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము.
1) వెలుగు-చీకటిల పరిపాలనలో మానవుని మనుగడ సాగిపోతూ ఉన్నది. మన ప్రమేయం ఏమి లేకపోయినా సృష్టికార్యములు జరిగిపోతూనే యున్నవి. మనకు మనముగా మండుచున్న సూర్యున్ని ఆపివేసి చీకటిని రప్పించి పొందలేము. మనకు మనముగా సూర్యున్ని రప్పించి ఉదయాన్ని పొందలేము. భూమి మీద జీవరాసులు వాటికవే పుట్టలేదు.దేనిని ఎప్పుడు కలిగించాలో, దేనిని ఎలా ఉంచాలో బాగా తెలిసినవాడై ఆకాశములో పక్షులను, సముద్రాల్లో చేపలను, భూమి మీద జంతువులను దేవుడే కల్గించాడు. కానీ మనిషి మాత్రము చీకటిలో నిద్రపోతూ, వెలుగులో పని చేసుకుంటూన్నాడు. వెలుగు-చీకటిల అవసరతను ఎంతవరకు మనిషి గుర్తించాడో ఆలోచిద్దాము.
2) మానవుని జీవితము భూమిపై సుఖముగా సాగిపోవాలంటే మిగిలిన జీవరాశులు కూడా తగినన్ని ఉండటం ఎంతైనా అవసరమై ఉంది . ఈనాడు జీవిరాశులు అంతరించి పోతున్నాయని ప్రభుత్వాలు వన్య ప్రాణుల సంరక్షణా క్రేంద్రమునుఏర్పాటు చేసి జంతువులను,పక్షులను భద్రపరుస్తున్నారు.నేటి ప్రభుత్వాలు కంటే ముందుగా దేవుడు జంతువుల పట్ల శ్రద్ద తీసుకున్నాడు. భూమి మీద వీటి యొక్క అవసరత ఉన్నదని దేవునికి ముందుగానే తెలుసు.అందుకే నోవాహు జలప్రలయములో జంతువులను, పక్షులను ఎలా భద్రపరిచాడో bibleలో ఆదికాండ 7:13,14లో చూడగలరు 3) మానవుల మనుగడ కొరకు దేవుడు తీసుకుంటున్న భద్రత ఎంత గొప్పదో నేటికైన గమనించగలరు. 1869 లో హెకెల్ అనే scientist “ఆవరణ శాస్త్రము” అనే శాస్త్రమును రూపొందించాడు. ఆహారము కొరకు “జీవరాశులు ఒకదానిపై మరొకటి ఆధారిపడి జీవించుట” ను ఇతను గుర్తించాడు. మొక్కలను ఆహారముగా తీసుకునే చిన్న చిన్న జీవులు, ఈ చిన్న చిన్న జీవులను ఆహారముగా తీసుకునే పెద్ద జీవులు ,ఈ పెద్ద జీవులను ఆహారముగా తీసుకునే మరి పెద్ద జీవులు ఇలా ఈ విధముగా ఒకదానిపై మరొకటి ఆహారము కోసము ఆధారపడే ఈ క్రమాన్ని” ఆహారపు గొలుసు(ECOLOGICAL PYRAMID) అంటారు.
4) ఈ శాస్త్రాన్ని కనుగొన్నది scientist అయితే వీటి మధ్య ఈ క్రమాన్ని ఏర్పరచింది దేవుడే. మొక్కలు కలుగును గాక ,జంతువులు కలుగును గాక అని దేవుడే పిలిచి వాటి మధ్య ఇట్టి క్రమమును ఏర్పరచి కొన్ని వేల years క్రితమే జరిగిపోయింది. మన నిమిత్తము దేవుడు జీవరాశులను ఎంత చక్కగా పోషించి కాపాడుచున్నాడో గమనించారా???? కీర్తనలు 36:6-యెహోవా నరులను,జంతువులను రక్షించువాడవు నీవే.. ఈ విధముగా జంతువులను, నరులను దేవుడు రక్షిస్తూ మనకను కాపాడాలనే అయన ఆలోచనలో పుట్టినదే “వెలుగు-చీకటి”ల గమనాలు.
5) రాత్రి పుట భోజనము చేయగానే సాధారణముగా నిద్ర ముంచుకొస్తుంది.దీనికి కారణము ఎవరైనా చెప్పగలరా??తెల్లవారే సరికి నిద్ర నుండి మేల్కొని మన కార్యక్రమాలలో నిమగ్నమవుతూ ఉంటాము.ఈ విధముగా రాత్రి పుట మనలను నిద్రపుచ్చి మరలా పగటి కాలములో ప్రవేశపెడుతున్నది దేవుడే అని వాక్యమును చదివి గమనించగలరు. ప్రపంచములో నిజము అనేది ఏదైనా ఉంటె అది bible మాత్రమేనని చెప్పాలి. అనగా bible చెప్పే దేవుని మాటలు మాత్రమే నిజము. bible నందు లేనిది కానీ, తెలియనిదంటు ఏమి ఉండదు. అందుకే నిజము అను మాటకు అర్థమే “”BIBLE”” ఈ bible చెప్పే నిజాన్ని ఒక్కసారి చూద్దాము. కీర్తన104:20-23లో నీవు చీకటిని కలుగజేయగా రాత్రి అగుచున్నది. అప్పుడు అడవి జంతువులన్నియు తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేటకోరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకోనజూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలో పండుకోనును. సాయం కాలము వరకు పాటుపడి తమ పనులను జరుపుకోనుటకై మనుష్యులు బయలవేళ్ళుదురు.

6) పై వాక్యాలను జాగ్రతగా ఆలోచిస్తే దేవుని యొక్క ప్రణాళిక అర్థమవుతుంది. జీవరాశులకును, మనవులకును మధ్య ఉన్న జీవన విధానము అతి ప్రముఖ్యమైనధిగా మరియు నోవాహు జలప్రలయము నుండి నోవాహు familyతో పాటు జంతువులను ,పక్షులను దేవుడు ఎందుకు కాపాడివలసివచ్చిందో తేటగ అర్థమవుతుంది.ఇటు జంతువులను గానీ,అటు మనుష్యులను గానీ అంతరించిపోకుండా ఇరువురిని కాపాడుటకు దేవుడు చేసినదే ఈ “”వెలుగు-చీకటి””.పై వాక్యమును జాగ్రతగా చదివితే పగటి కాలములో మన పని పాట్లు చేసుకుని ,రాత్రి కాలములో నిద్రపోవాలి. మనలను రాత్రి కాలములో దేవుడు నిద్రపుచ్చి అదే రాత్రిలో జీవరాశులను తమ తమ గుహలలో నుండి వెలుపలికి రప్పించి ఆహారము కొరకు తిరుగులాడేతట్లు దేవుడే చేసాడు.జంతువులను వేటాడేవారు దీపాలను తీసుకుని రాత్రిపూట వేటకు వెళ్ళడము మనకు తెలిసిన విషయము. ఎందుకంటే ఎక్కువుగా జంతువులన్నీ రాత్రి పుటే తిరుగుతాయి.

7) జంతువులు సంచరించినట్లుగా మనుషులు మెలుకువగా నుండి వారు కూడా రాత్రి కాలములో సంచరిస్తే మనుష్యుల వలన జంతువులకు and జంతువుల వలన మనుష్యులకు హాని జరుగుతుంది.అందువలన పగటి కాలములో మనము ఆహారము సంపాదించుటకు తిరుగులాడాలి.రాత్రి కాలములో జంతువులు సంచరించాలి. అనగా రాత్రి కాలము జంతువులకు,పగటి కాలము మనుష్యులకును దేవుడే కలుగజేస్తే ఈ రోజు మనిషి దేవుని ప్రణాళికను, తన క్షేమమును మరచి overtime పేరుతో రాత్రి ,పగలు తేడ లేక నిరంతరము పని చేసుకుంటూ ఎంతో మంది నష్టపోవుచున్నారు. చాల మంది వాహనాలను నడిపేవారు రాత్రంతా నిద్రపోకుండా దినమంతా వాహనాన్ని నడుపుతూ క్షణములోనే ప్రమాదానికి గురై ప్రాణాల్ని పోగొట్టుకుంటున్నారు.

8) దేవుడు పెట్టిన ఈ క్రమాన్ని మానవుడు అర్థము చేసుకోలేక ఎన్నో నేరాలు ,ఘోరాలు ,దొంగతనాలు ,వ్యభిచార క్రియలన్నీ రాత్రి కాలములోనే ఎక్కువుగా జరిగిస్తున్నారు.. దేవుని ఆలోచనలు మనము ఎరుగకపోతే మనిషిని మనిషి హత మార్చుకోనుటయే కాదు, తమకు సహకరులైన జీవరాశులను కూడా తమ అజ్ఞానము వలన నశించిపోవుచున్నవి. రాత్రిని దేవుడు ఎందుకు కలుగజేస్తున్నాడో గమనించక చీకటిలో అనేక దుష్క్రియలు చేయుచున్న వారిని చూసి తన పిల్లలు ఏ విధముగా జీవించాలో చెబుతున్న మాటలు చూద్దాము.. 1 తేస్సలోనిక 5:5 నుంచి-మీరందరు వెలుగు సంభందులును పగటి సంభందులై యున్నారు. సృష్టిలో వెలుగు-చీకటిలను ఉంచిన దేవుడు తన పిల్లల హృదయాలలో మాత్రము చీకటి ఉండకూడదు అనుకున్నాడు.

9) సూర్యుడు, చంద్రుడు ,భూమి వీటి గమనా గమనాల వలన అమావాస్య పొర్ణమి ఏర్పడుతున్నాయి. సూర్యునికి ,భూమికి మధ్యలో చంద్రుడు అడ్డుగా రావటము వలన సూర్యగ్రహణము ఏర్పడుతుంది. ఏది ప్రకృతిలో జరుగుచున్న దేవుని చేత పని. కాని మనిషికి సూర్యగ్రహణము ,చంద్రగ్రహణము దేవుడు ఇస్తే మనిషికి దేవునికి మధ్యలో పాపము ప్రవేశించి ,దేవుని వాక్యపు వెలుగు ప్రకాశిoచకుండా మానవునికి పాపగ్రహణము పట్టింది. యెషయ 59:1- మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను..

10) భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన రాత్రి పగళ్ళు ఏర్పడుచున్నవి అని మాత్రమే మనము లోక పాఠములలో చదువుకున్నాము. బ్రహ్మాండ మంతటికి వెలుగైయున్న దేవుడు ఎప్పుడు వెలుగు కలగాలో,ఎప్పుడు చీకటి కలగాలో తన మేధాశక్తీతో అలోచించి కలిగించాడు.లోకము దేవునిని తప్పించి, అయన చేసిన వాటిని గూర్చి తమ సొంత జ్ఞానముగా పుస్తకాలు వ్రాసుకుని ఒప్పొంగుచున్నారు. మన జీవిత గాధ వెనుకల సృష్టి పనిని కలిగియున్నదని మరచి, రాత్రి పగలు తేడాను గమనించక పని చేసుకుని సుఖపడడానికే మనము పరిమితము అయిపోతే జంతువులకు, మనిషికి తేడా ఏముంటుందో మిరే చెప్పండి. పని చేసుకోవద్దు అని చెప్పటము లేదు.మీ పనిలో ఆ దేవుని కోసము చేసే పని ఏదైనా ఉందా?? అందువలననే యేసు ఏమంటున్నాడో ఒక్కసారి bible లో చూస్తే యోహాను 9:4- పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను.రాత్రి వచ్చుచున్నది.అప్పుడేవాడును పని చేయలేడు.

11) కాబట్టి పగటి కాలములో మనము ఆహారము సంపాదించుకొనుటకు మనము పని చేసుకోవాలి.రాత్రి కాలములో జంతువులు ఆహారమును సంపాదించుకోవాలి. మనిషి రోడ్డు నిబంధనలను పాటిస్తున్నాడు, ఉల్లంగిస్తున్నాడు.కాని దేవుని నిభంధనలను పాటించక ఉల్ల౦గిస్తున్నాడు. అందు చేత ఎంతగానో నష్టపోవుచున్నాడు. చీకటి- వెలుగుల అవసరత ఎంత ఉన్నదో నేటికైన గమనించి దేవుని గొప్పతనమును లోకానికి తెలియజేయగలరు. లోకమునకు తెలియని దేవుని నూతన అధ్యాయమును అయన మహా జ్ఞానమును అనేకులకు తెలియజేస్తూ మీ వంతు భాద్యతను గుర్తించగలరు.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget