Halloween Costume ideas 2015

Kristuvuluku Howsadamulu Nishedhama?

క్రైస్తవులకు ఔషధములు నిషేదమా??

క్రైస్తవులకు ఔషధములు నిషేదమా?
ప్రభువు నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయాజేస్తున్నాను.
1) పొగత్రాగుట నిషేధము ,మద్యపానం సేవించుట నిషేధము, అనుమతి లేనిదే ప్రవేశం నిషేధం, ఈ దారిలో భారి వాహనములకు ప్రవేశం నిషేదించబడినది అని ఇలాంటి బోర్డులు మనం ప్రతి నిత్యం ఏదో ఒక ప్రభుత్వ కార్యాలయంలో గానీ,ఆయా పరిసర ప్రాంతాలలో గానీ మనం గమనిస్ “నిషేధము” అన్న పదానికి చేయకుడానిది అను అర్థము.ఈ పదాన్ని మనం తరచుగా ఆరోగ్యానికి హానికరమైనవి (సిగరెట్టు,మద్యం,గుట్క)వాటిని తీసికోనకూడదు అనేందుకు ఉపయోగిస్తాం.అలానే కొంతమంది క్రైస్తవులు నిషేదించిన వాటిలో ఔషధములు ప్రాముఖ్యమైనది . ఔషధములు అనగా మందులు.అనగా రోగాన్ని తగ్గించే గుణాలున్న పదార్ధాలు. అనగా ఇందులో పసరు,పలు రకాల కాషాయాలు,లేపనాలు ఉంటాయి. ఇప్పుడు వీటి రూపం,నామం మర్చి టాబ్లెట్స్(tablets),ఇంజేక్షన్(injections),సిరప్స్(టానిక్స్),ఆయింట్ మెంట్స్(ointments) అంటున్నారు.

2) క్రైస్తవులు మేడిసిన్స్(మందులు) వాడకూడదు అని మరియు ఇది దైవ విరుద్ద కార్యమని,ఒక పాపంగా అనుకుంటున్నారు.క్రైస్తవ భోదకులలో చాలా మంది దీనిని సమర్దిస్తూ వైద్యం చేయించుకోవడం పాపకర్యంగా చాటిస్తూ ఎంతో మంది క్రైస్తవుల జీవితాలతో ఆడుకుంటున్నారు.నిజముగా bibleలో దేవుడు మందులు(ఔషధములు) వాడకూడదని,అవి క్రైస్తవులకు నిషేధమని అజ్ఞాగా ఇచ్చాడా?? అని పరిశోధనాత్మకంగా bibleను ఆలోచిస్తే అర్థం అవుతుంది.మనిషి పుట్టుక నుండి వారి ప్రాంతపు వాతావరణ పరిస్థితుల బట్టి,ఆహారపు అలవాట్ల బట్టి అనారోగ్య కారణాలు బయటపడటం జీవన విధానంలో సర్వసాధారణమైన విషయం. పరిపూర్ణ ఆరోగ్యవంతుడు ఎవ్వరూ భూమి పై లేరని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(ప్రపంచ ఆరోగ్య సంస్థ) సర్వేలో వెల్లడించింది. 3) ఏదో ఒక చిన్నపాటి రోగం ఉన్నవారు మొదలుకొని కుదరని రోగాలతో జీవనం సాగిస్తున్న వారు లేకపోలేదు.ఈ సామాన్య బలహీనతను క్రైస్తవులలో కొందరు బలంగా మార్చుకుని తమ స్వప్రయోజనాల కోసం త్రిప్పుకున్నారు. ఔషధాలు ఎక్కడివి?

4) ముందుగా ఔషధములు వాడకూడదని bibleలోని 66 పుస్తకాలలో ఎక్కడ లేదు కానీ మందులను వాడకూడదని ఎందుకు అంటున్నారో అర్థం కావడం లేదు. “ఔషధములు పుట్టినిల్లు ఈ ప్రకృతి”. సాదారణంగా మనం ఆలోచిస్తే వైద్య శాస్త్రంలో ఉపయోగించే మందులన్నీ ప్రకృతి నుండి తీయబడ్డాయి. ఔషధములు వెతి నుండి తయారు చేస్తారో గమనిస్తే తలనొప్పికి మన వాడుతున్న అమృతాoజాన్ మెంధోప్లస్(amruthanjan mentho plus) లాంటి మందులపై తులసి ఆకులు,తైలపు ఆకులు ముద్రించడం చూడవచ్చు.అంటే పై మందులను ఈ తైలపు ఆకుల నుండి తయారు చేసారు. ఇలా మందులన్నీ ప్రకృతిలో చెట్లకున్న ఆకులు,వ్రేళ్ళు,పూతలు,పిందెలు,పండ్లు,బెరడు,విత్తనాలు లాంటివి ఉపయోగించి తయారు చేస్తారు. ప్రకృతి నుండి ఔషధములు ఉత్పత్తి జరుగుతున్నప్పుడు ఈ ప్రకృతిని కలుగజేసినదేవరు??? దేవుడా?????? దెయ్యమా?

5) హెబ్రీ 11:3, ఆదికాండ 1:29- ఇదిగో భూమి మీదనున్న విత్తనములిచ్చు,వృక్ష ఫలము గల ప్రతీ వృక్షమును నేను ఇచ్చాను అని దేవుడు అంటున్నాడు.నరులను ప్రేమించి ప్రకృతిని అందులోని సకలమును దేవుడు మనకిస్తే, ఆ ప్రకృతి నుండి తీయబడిన పదార్ధాన్ని “”ఔషధoగా” ఎందుకు స్వీకరించడం లేదు?? మనిషికి సర్వసాధారణంగా వచ్చే రోగాలను ప్రకృతిలో దేవుడు కలిగించిన ముడి పదార్ధం ఉపయోగించి నయం చేయుటకు ఔషధాలు వచ్చాయి. వీటిని ఎలా ఉపయోగించాలో సూత్రాలు చెప్పే “వైద్యం”” క్రమక్రమ౦గా ప్రారంభమైనది. ఒకవేళ ఈ ఔషధాలు ప్రత్యేకముగా తీసుకోనప్పటికీ మనం అను నిత్యం తీసుకుంటున్న ఆహారంలో ఇవి ఉండనే ఉంటున్నాయి.

6) ఆహారములో కూరగాయలు,పండ్లు,ఆకూ కూరలు ఉండగా, ఔషధo(మందు)గా వీటి రూపం మర్చి ఇస్తున్నారు. మనం తింటున్న భోజనంలో ఇవే పదార్ధాలుoడగా , ఔషధాలలో కూడ ఇవే ఉపయోగిస్తూoడగా భోజనాన్ని అనుమతించి , ఔషధాన్ని నిషేదించడం విరుద్దంగా,వ్యతిరేకముగా ,అన్యాయంగా కనిపిస్తుంది. ఇది అర్థం చేసుకుంటే భోజనం ముందు కుర్చుని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలా పుచ్చుకుంటారో అలాగే మరో రూపంలో ఉన్న ఔషధాన్ని,ఆరోగ్యాన్నిచ్చే మందులను కూడ ప్రకృతిలో ఉంచిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకోవాలి.ఇది పాపకార్యం ఎలా అవుతుందో ఆలోచించండి.

7) ప్రకృతి నుండి వచ్చిన శరీరం రోగం బారిన పడగా,అదే ప్రకృతి నుండి పుట్టిన ఔషధాలు వాడటంలో కొంచమైన అనుమాన పడాల్సిన అవసరం లేదు. bibleలో ప్రస్తావించబడిన ఔషధాలు
a) ఆకులు- చెట్ల ఆకులలోని ఔషధ గుణాలు అనారోగ్య కారకాలకు స్వస్తి చెబుతుందని తెలుసు. ఉదా:: తులసి ఆకులు,తైలపు ఆకులు...... ఎహేస్కెలు47:12-చెట్ల ఆకులు ఔషధమునకు వినియోగించెను . ఇక్కడ దేవుడు ఆకులను ఔషధానికి వినియోగించండి అని అంటున్నాడా లేక నిషేదించండి అని అంటున్నాడా???? వినియోగించండి అని అంటున్నాడు.
b) పండ్లు,కాయలు – ఆదికాండ 30:14- ఇక్కడ పుత్ర దాత వృక్షపు పండ్లుఅన్న ఔషధాన్ని దేవుడు రాయించాడు. ఈ ఫలాలలోని సారం దేవుడు ఏర్పరచినదే.ఈ ఫలం ను ఔషధముగా ఉపయోగించడం వలన లేయాకు గర్భాఫలం కలిగింది. అనగా రుబేను లేయాకు తెచ్చి ఇచ్చిన ఔషధ ఫలం వాళ్ళ దేవుని సహాయంతో ఆమె గర్భాఫలం పొందింది.
c) గుగ్గిలము-యీర్మియా8:22, యీర్మియా 5:18 చదవండి. గుగ్గిలం అన్న ఔషధము నొప్పిని తగ్గించేదిగా bibleలో వ్రాయబడింది.కనుక ఈ గుగ్గిలము అను ఔషధoను పోలిన ఎన్నో మందులు నేడు లబిస్తున్నాయి.
d) మూలికలు(చెట్ల వేర్లు)-యోబు 30:4-తంగేడు వేర్లు వారికీ ఆహారమై యున్నవి.దంత సంభంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి కూడ ఈ వేరు ఉపయోగపడుతుంది.
e) తైలము- యాకోబు 5:14-రోగికి నునే రాసి అతని కొరకు ప్రార్ధన చేయవలెను. యెషయ 1:6 చదవండి
8) దేవుడు bibleలో రాయించిన అద్బుతమైన సందర్భాలను ఆలోచించగా రకరకాల ఔషధాలను అను నిత్యం మన దైనందిన జీవితంలో ఉపయోగించమన్నట్లు గోచరిస్తుంది. దేవుని మాటకు విలువనిస్తారో లేక దయ్యముల భోద అయిన కొందరు భోదకుల(అబద్దికుల) మాటకు విలువిస్తారో మిరే నిర్ణయించుకోండి.

క్రీస్తు స్వస్థపరిచిన విధానం
9) మత్తయి 9:12- “ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర లేదు” అని వదిలెయ్యలేదు కానీ రోగులకే గానీ అన్న పదం ముందు పలికాడు. అనగా ఆరోగ్యవంతునికి వైద్యుని అవసరం లేదు. రోగికి వైద్యుని అవసరత ఉంది అని అర్థం. అంటే క్రీస్తు స్వయంగా ఒక ఉపమానంగా వైద్యుని ప్రస్తావన తీసుకురావడం జరిగింది. స్వస్థత ఇచ్చేది దేవుడే.దేవుని సహాయం లేకుండా స్వస్థత జరగదు. డాక్టర్ వాళ్ళ కాదు. ఎందుకంటే డాక్టర్ మందుల చీటి మాత్రమే రాసి ఇవ్వగలదు తప్ప ఆ మందులను సృష్టించలేడు.దేవుడు ప్రకృతిలో ఉంచిన మందులను వాడమని సలహా ఇచ్చేవాడే వైద్యుడు. ఇందులో వైద్యుని గొప్పతనం ఏమి లేదు.

10) క్రీస్తును అనుసరించిన వారు కూడా వైద్యాన్ని పాటించిన వారున్నారు. క్రీస్తును అనుసరించిన అనేక మంది శిష్యులలో ఒకరు “” వైద్యుడు””” అతనే లూకా. పౌలు గారు కూడ లూకా గారిని సంభోదిస్తూ “మన పరియుడైన లూకా అను వైద్యుడు అనడం గమనించవచ్చు(కొలస్సి 4:14).నిజముగా క్రైస్తువునికి ఔషధo,వైద్యం నిషేధమే అయితే “ అసహ్యుడైన వైద్యుడైన లూకా అని అనాలి.

ఔషధాలు నిషేధము అన్నవారికి అడిగే ప్రశ్నలు
11)
((a)) పుట్టిన పిల్లలకు టీకాలు వేయించలేదా? పోలియో చుక్కలు వేయించలేదా??? ఫై ఇవి ఔషధాలు కావా?? కేవలం tablets,injectons,taniks మొదలైనవి మాత్రమే ఔషధాలా?? ఆలోచించండి.
((b)) నిద్రలేవగానే దంతాలు శుభ్రం చేసుకోవడానికి ఉపయోగిస్తున్న tooth paste మందు కాదా???tooth paste అనేది మన పళ్ళపాచి,దుర్వాసనను తొలగించడానికి ఉపయోగించే “ఔషధo”.
((c))స్నానం చేసేటప్పుడు మన శరీరానికి అంటుకున్న మురికిని,క్రిములను చంపటానికి ఉపయోగించే ఔషధo “సబ్బు” ఔషధo కాదా???
((d)) మల మూత్ర విసర్జన తర్వాత రోగ కారిక క్రిములను చంపుటకు చేతులను శుభ్రం చేయుటలో ఉపయోగించే dettol ఒక ఔషధo కాదా???
((e)) కురకాయలు తరిగేటప్పుడు చేతివేలు కోసుకుంటే వెంటనే వేసే టీంక్చర్ ఒక ఔషధo కాదా???
((f)) చెయ్యి విరిగితే మరలా ఎముకులు కట్టుకోవడానికి “పుత్తూరు కట్టు” పేరుతో ఆకుల పసరుతో చికిత్స పొందుకోవడం లేదా?? ఇది వైద్యం కాదా?
12) కాబట్టి దేవుడిచ్చిన ఔషధాలను వాడి రోగం నయం చేసుకుని ,స్వస్థపరచిన తండ్రిని ఘన పరచి, తిరిగి సువార్త కార్యక్రమాలలో ,సత్య వాక్యపు క్రియలలో కొనసాగండి. ఒక వేల త్రివమైన రోగాల భారిన పడినా ,కదల్చబడక ప్రభువు నందు స్థిరులై అంతం వరకు సహిస్తే, మరణకరమైన రోగమైన మన సత్ క్రియల వాళ్ళ మనం ప్రభువు చెంతకు చేరగలమన్న నిరీక్షణతో సువార్త యాత్రలో సాగిపొండి.






Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget