Halloween Costume ideas 2015

Strini Devudu Enduku Itchadu?

స్త్రీని దేవుడు ఎందుకు ఇచ్చాడు?

స్త్రీని దేవుడు ఎందుకు ఇచ్చాడు?
ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలియజేస్తున్నాను. 1) నేటి క్రైస్తవ సమాజములో దేవుని కొరకు బ్రతుకుటలో కానీ , దైవ సంభంధమైన కార్యక్రమాలలో కానీ మహిళల పాత్ర ఏ పాటిదో, వారి పాత్రను గురించి దేవుడు చెప్పినది ఏంటన్న ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకొనుట అవసరం. దేవుని పని అనగా ఇది ఏదో పురుషులకు సంభందించిందిగా, స్త్రీ అనగానే కేవలం ఇంటి ,వంట భాద్యతకే సంభందించందిగా ఈ రోజు క్రైస్తవ సమాజం వారు చెప్పుకొనుట మనం చూస్తున్నాం, వింటున్నాం.

2) నేటి ప్రపంచ పరిస్థితులను మనం ఆలోచిస్తే స్త్రీలు అన్ని రంగాలలో చొచ్చుకుని వెళ్ళుతున్నారు. ఒకప్పుడు ఈ పని కేవలం పురుషుడు మాత్రమే చేయాలి అనే వారు కానీ ఇప్పుడు స్త్రీలు అన్ని పనులు చేయువారిగా,అన్ని రంగంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం.స్త్రీల సమాజము కూడ నేడు పోరాటాలు చేస్తుండడం మనం చూస్తున్నాం. ఇకపోతే నేటి క్రైస్తవ సమాజ పరిస్థితులను మనం ఆలోచిస్తే దేవుని పని కేవలము పురుషులదేనా ?మేము చేయకుడదా అని అడిగే వారు బహు కొద్ది మంది ఉన్నారు. ప్రతి మనిషి యెడల దేవుని సంకల్పం ఏంటి? ప్రపంచంలో పుట్టిన ,పుట్టటానికి సిద్దముగా ఉన్న,ముందు తరాలలో పుట్టబోయే మనుషుల అందరి విషయమై పరమందున్న దేవుని సంకల్పాన్ని ఆలోచిస్తే ఎఫేసి 1:4,6- తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలుగునట్లు,తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున,యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వికరించుటకై, మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొనియున్నాడు. 3) స్త్రీగా పుట్టుట,పురుషుడిగా పుట్టుట దేవుని చిత్తము. అనగా స్త్రీగా పుట్టటమైన,పురుషుడిగా పుట్టటమైన ఇది దేవుని చిత్తానుసారముగా జరిగింది. మా పుట్టుకలో దేవుని చిత్తము,దేవుని ఇష్టం లేదని అనటానికి వీలు లేదు.ప్రతి ఒక్కరి పుట్టుక లేదా జన్మలో దేవుని చిత్తమే తప్ప మన చిత్తము ఏమి లేదు.పై వచనములో మనలను అని braketలో కేవలము పురుషులను అని అనలేదు. మనలను అనగా స్త్రీలను,పురుషులను. ఇది అందరికి సంభందించిన మాటే కానీ కొందరికి సంభందించంది కాదు. ప్రపంచములో మనిషిగా పుట్టిన ప్రతి మనిషిని గూర్చి పై వచనపు మాట చెప్పబడినది. స్త్రిలనైనను,పురుషులలైనాను దేవుని కొరకు నిర్ణయించుకున్నాడు. అనగా స్త్రీగా పుట్టిన దేవుని కోసమే.పురుషుడిగా పుట్టిన దేవుని కోసమే. పుట్ట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు దేవుని కొరకే పుట్టారన్న సంగతి ఈ సందర్భ వచనములో అర్థమైనది.

4) అందరు దేవుని కోసం పుట్టినప్పుడు మేము దేవుని పనికి కాదు కానీ పురుషులే దేవుని పనికి అర్హులు అని స్త్రీలు అనుకొనుట correct అంటారా?? దేవుని పని మాదే ఇక స్త్రీలుగా మిది కాదు అని పురుషులుస్త్రీలతో అనుట correct అంటారా??? correct కాదు. ప్రారంభానికి వెళితే దేవుడు సృష్టి కార్యక్రమాన్ని ముగించి ఆదామును కనే పనిలో ఉన్నాడు.మట్టిని తీసి,బొమ్మగా చేసి,తనలోని ఆత్మను మట్టి బొమ్మలో పెట్టినప్పుడు ఆదాముగా తన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత అదేను తోటలో ఆదామును పెట్టాడు. అప్పటి వరకు ఆదాము భంధము దేవునితో చాలా గొప్పదిగా ఉంది. ఆదామునీ పిలిచి నీ దగ్గరకు అనేక పక్షులు,జంతువులు వస్తాయి నీవు వాటికీ పేరు పెట్టమన్నాడు. దేవుడు ఏది అయితే చెప్పాడో అది ఆదాము జరిగిస్తున్నాడు. అన్ని పక్షలు,జంతువులు ఆదాము ముందుకు వరుసలో రావటం and ఆదాము వాటికీ పేరులు పెట్టటం జరిగింది. అంటే దేవుని పనిలో ఉన్నాడు ఆదాము. తన పనిలో ఉన్న ఆదామును దేవుడు అలోచించి ఆదాము ఒంటరిగా నా పనిలో ఉన్నాడని,తోడు ఉంటె ఇంకా నా పని బాగా జరుగుతుందని ఆలోచించి ఆదాముకు గాడా నిద్ర కలుగజేసాడు. ఒక ప్రక్కటేముకను తీసి స్త్రీని నిర్మించాడు. ఆ స్త్రీని దేవుడు ఆదాము ముందుకు తీసుకొచ్చాడు.

5) అస్సలు స్త్రీని చేయాలని దేవునికి ఆలోచన ఎందుకు కలిగింది?? దేనిని బట్టి కలిగింది??ఆదికాండ 2:18-మరియు దేవుడైన యెహోవా-నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు;వణికి సాటియైన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను.సహాయము అనునది పని ఉన్నప్పుడే కలుగుతుంది. పని లేనప్పుడు సహాయo అవసరత లేదు. ఆదాము దేవుని పనిలో ఉన్నాడు. దేవుని పనిలో ఉన్న ఆదాముకు దేవుని పనిలో తోడుగా,సహకారిగా ఉండాలని స్త్రీని నియమించాడు. అంటే స్త్రీ పురుషుడు ఇరువురిని కలిసి ఉండవలసినది దేవుని పనిలో .ఇద్దరినీ తన పనిలో ఉండాలనుకున్నాడు కానీ స్త్రీని ఇంటిలో ఉండి వంట కొరకు,పురుషుడిని బయటకు వెళ్లి job చేయుట కొరకు నిర్మించలేదు. పరలోకం నుండి ఈ భూమి మీదకు పంపింది ఇంటి పని,వంట పని చేసుకోడానికా?????????? ఇది చేసుకోడానికి దేవుడు జన్మను ఇచ్చాడా???లేద కానీ ఇరువురు కలిసి దేవుని పనిలో ఉండాలని. దేవుని కార్యక్రమములో ఉన్న భర్తకు తోడుగా,సహాయకురాలిగా ఉండాలని చేసాడు. ఇద్దరినీ కన్నది దేవుడు తన కోసమే.

6) మనలను ముందుగా దేవుడు తన కోసమే నిర్ణయించుకొని అన్న ఆ మాటను ఎపేసి 1:4,6లో చదువుకున్నాము. చివరిగా ఇంతవరకు మనకు తెలిసిన సత్యమైన విషయాలు చూస్తే “””ప్రతి మనిషి దేవుని కోసమే పుట్టిన వాడు.అందులో స్త్రీ అని,పురుషుడు అని భేదము లేదు.ప్రతి ఒక్కరు దేవుని కోసము పుట్టిన వారు. దేవుని పని కొరకు పుట్టిన వారు. దేవుని పని కొరకు బ్రతుకు వారమై ఉన్నాము.కనుక స్త్రీ అనగానే కేవలం ఇంటికి పరిమితం అవాలన్న ఆలోచన మంచిది కాదు.”””””” .ఇంకా ఒక వేళ దేవుని పని చేయటానికి వీలు లేదన్న ఆలోచన మిలో ఉంటె bibleలో మీ ఆలోచనకు అన్ని బిన్నముగానే ఉంటాయి.కారణం అనేకమంది స్త్రీలు దేవుని పని జరిగిగించినట్టుగా,దేవుని పనిలో ఉన్నవారికి సహాయకురాలిగా ఉన్నట్టుగా అనేకమైన సందర్భాలు కనబడుతాయి. కీర్తనలు 68:11-ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు.దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు.

7) అన్ని రంగాలలో స్త్రీలు ముందుగా ఉంటున్నప్పుడు మరి దేవుని పని విషయములో ???????దేవుని పనికి రావడానికి,చేయడానికి,వీలు లేదు అని చెప్పుట బట్టి అనేకమైన స్త్రీలు దేవుని పని చేయుట లేదు. ఈ రోజు స్త్రీ దేవుని పనిలో సహకరించుపోవుటకు గల కారణములు చూస్తే దేవుని పని లేదు అని చెప్పుట వలనే. చేయవలసిన దేవుని పనిని చేయకయున్నారు.సమస్యలలో చిక్కుకుంటున్నారు.ఎవడు దేవుడు పని చేస్తే వారికే పరలోకం. ఎవరు పని చేస్తే వారికే జీతం. భర్త పని చేసాడని భార్యకు,భార్య పని చేసిందని భర్తకు లేదు. పరలోక విషయములో ఎవరు కష్టపడితే వారికే లాభం.ఎవరు కష్టపడితే వారికే జీతం. అందుకే పాత నిబంధనలో కానీ,క్రొత్త నిబంధనలో కానీ అనేకమంది స్త్రీలు దేవుని పనిలో ఉంటూ,దేవుని పని విషయములో ఎంతో జాగ్రతగా,ఎంతో ఓర్పుతో,సహనంతో దేవుని పనులు జరిగించినట్లుగా మనం చూస్తున్నాము.

8) (a) క్రొత్త నిబంధనలో ఆకుల ప్రిస్కిల్ల కుటుంబమును చూస్తాము. అపోకర్య 18:24-26-ప్రిస్కిల్ల అకులయు విని,అతనిని చేర్చుకుని దేవుని మార్గమును మరి పూర్తిగా అతనికి విసదపరిచిరి. ఇరువురు అపోల్లోను కూర్చోబెట్టుకుని దేవుని వాక్యాన్ని వివరించిరి.(b) సమరియ స్త్రీ .యోహాను 4:28 నుంచి- ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఉరులోనికి వెళ్లి-మీరు వచ్చి ,నేను చేసినవన్నియు నాతో చెప్పిన మనుష్యుని చూడుడి. ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరు వారితో చెప్పింది. అనగ యేసు గురించి ఆ ఊరు వారికీ చెప్పి వారిని యేసు దగ్గరికి నడిపించింది. (c) luke24:9-సమాధి యెద్ద నుండి తిరిగి వెళ్లి ఆ సంగతులన్నియు పదునోకండుగురు శిష్యులకును తక్కినవారందరికీ తెలియజేసిరి.సువార్తను మొట్టమొదట శిష్యుల యొద్దకు తీసుకెళ్ళింది స్త్రీలు.

9) ఎవరో ఒకరు దేవుని పని చేయొద్దు అని చెప్తే పని చేయకుండా ఉంటారా??పని చేస్తే కానీ కడుపు నిండదు అని తెలిస్తే మరి పరలోకం మాత్రం పని చేయకుండా దేవుడు ఇస్తాడని అనుకొనుట ఎంత అవివేకం???? పని చేసిన వారికే పరలోకం. దేవుడు ఇచ్చిన ఈ ప్రకృతిని అంతా అందరు సమానముగా ఉపయోగిస్తూనప్పుడు అయన పని మాత్రం కేవలం పురుషులకే మాకు కాదు అనే ఆలోచనతో ఉన్న స్త్రీలు ఆలోచించండి...... అయన కష్టాన్ని అందరు సమానంగా అనుభవిస్తున్నాము గనుక అయన పనిని అంత సమానముగా చేయాలి.

10) స్త్రీ అని,పురుషుడు అన్న భేదము శరీరానికే కానీ ఆత్మకు ఏమి లేదు. స్త్రీలో ఉన్నది అయన పోలిక. పురుషుడిలో ఉన్నదీ అయన పోలికే. అత్మలముగా మనం అంత ఒక్కటే .మన అందరిలో ఉన్నదీ దేవుని పోలికనే. శారిరాలలోకి రాగానే స్త్రీ అని,పురుషుడు అని విభాగించియున్నారు. బాప్తీస్మం తీసుకున్న ప్రతి స్త్రీ,పురుషుడు పని ఒక్కటే. ఎప్పుడైతే బాప్తీస్మం తీసుకోవటం జరిగిందో అప్పుడు భాద్యత(దేవుని పని చేపట్టుట) కలిగినవరమై ఉన్నాము. బాప్తీస్మం అనగానే దేవుని పని యొక్క భాద్యత తీసుకోవడం. బాప్తీస్మం తీసుకున్నాక నాకు ఇక ఏ పని లేదు అని అనుకొనుట తప్పు.

1 కోరంది11:26-మీరు ఈ రొట్టెను తిని,యీ పాత్రలోనిది త్రాగునప్పుడెల్ల ప్రభువు వచ్చు వరకు అయన మరణమును ప్రచురించుదురు...బాప్తీస్మం తీసుకున్న ప్రతి వారు యేసు మరణమును(సువార్తను) ప్రచురము చేయాలి.అందరు దేవుని పనిలో ఉండాలి.ఫిల్లిపు 4:3- ఇందులో పౌలు స్త్రీలు నాతో కూడా ప్రయాస పడ్డారని చెబుతున్నాడు.

11) ఇప్పుడు చెప్పండి స్త్రీలు దేవుని పని చేయోద్డా??? చేయాలి. కోత బహు విస్తారముగా ఉన్నది కానీ కోసేడి వారు బహు కొద్ది మంది ఉన్నారు. వాక్యం తెలియని,నిజ దేవునిని తెలియని ఎంతో మంది మన పల్లెలలో,మన గ్రామాలలో,మన మండలాలలో,మన పట్టణములో ఎంత మంది లేరు????? వాక్యం అనే కొడవలి పట్టుకుని కోత కొయాలి . స్త్రీకి కానీ,పురుషుడికి కానీ దేవుని పని ఉన్నదీ. ఆ పనియే నశించిపోతున్న ఆత్మలను రక్షించుటయే.





Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget