Halloween Costume ideas 2015
Articles by "Imp Facts"
Bible Facts Imp Facts

యేసుక్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధిలో ఉన్నాడా
.

మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు మరియు మీ కుటుంబమునకు శుభములు తెలయజేస్తున్నాను. నేడు క్రీస్తు గురించి ,అయన మరణ సమాధి పునరుర్ధానము గూర్చి క్రీస్తు విరోధులు వేస్తున్న నిందలు చెప్పలేనివి. యేసుక్రీస్తు బాల్యము నుండి పెరుగుతున్నప్పుడు , సువార్త ప్రకటిస్తున్నప్పుడు ,సిలువ ఎక్కినప్పుడు ,సమాధి చేయబడినప్పుడు,తిరిగి లేచి పరలోకానికి వెళ్లి సుమారు 2000 years గడిచిన అయన మీద ఇంకా నిందలు  ఉన్నాయంటే అయన వలన ఈ ప్రపంచానికి ఎలాంటి రక్షణ,ఎలాంటి పరిస్థితులు అయన రెండవ రాకడలో జరగబోతుందో ఆలోచించవచ్చు.
1) యేసుక్రీస్తు పలికిన కొన్ని మాటలను బట్టి నేడు క్రీస్తు విరోధులు(muslims) క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను సమాజములో పుట్టించారు.ముందుగా bibleలో ప్రశ్నలు అనేవి లేవు .కేవలము సమాధానాలే ఉంటాయి. bibleలో వ్రాయబడిన సంగతులు మనిషికి అర్థము కాక అపార్ధము చేసుకుని ప్రశ్నలుగా ఈ రోజు సమాజములో పుట్టిస్తున్నారు. మత్తయి 12:40లో యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భుగర్భములో ఉండును. యేసు పలికిన ఈ మాటను పట్టి క్రీస్తు విరోధులు ముఖ్యముగా muslim వారు క్రీస్తు మూడు రాత్రింబగళ్ళు సమాధి లో ఉన్నాడా అను ప్రశ్నను ప్రపంచానికి వేసి అమాయకులైన క్రైస్తవులను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నము చేసారు,చేస్తున్నారు... 2) bibleను తప్పు పట్టాలని , క్రీస్తు మరణ సమాధి పునరుర్ధానములు అబద్దము అని చెప్పడానికి వారు పడుతున్న ప్రయాస వివరించలేనిది. bible ప్రకారముగా వాస్తవముగా యేసుక్రీస్తు విశ్రాంతి దినమున ముందటి రోజు అనగా friday మధ్యాహానము మూడు గంటలకు అయన సిలువలో చనిపోయాడని and మరలా sunday early morning లేచాడని మనకు తెలుసు. ఇప్పుడు క్రీస్తు విరోధులు ఏమి అడుగుతున్నారంటే friday దినమున ఒక పగలు ,ఒక రాత్రి వచ్చింది ,saturday ఒక పగలు ఒక రాత్రి వచ్చింది and sunday రాత్రి ఎక్కడ అయింది అనగా యేసు మాటలలో వాస్తవము లేదు and 2 రాత్రులు, 2 పగలు వస్తున్నాయే తప్ప మూడు రాత్రులు మూడు పగలు ఎక్కడ ఉన్నాయని ప్రపంచానికి ప్రశ్న వేసే సరికి అమాయక క్రైస్తవులు అవును నిజమే కదా యేసు మాటలలో తప్పు ఉంది అని అనుకుని చివరికి bible తప్పు అని declare అయ్యి islamగా మారిపోతున్నారు. bibleలో ఎన్నో తప్పులు ఉన్నాయని అమాయక క్రైస్తవుల దగ్గరకు వెళ్లి తప్పుడు ప్రచారము చేసి ఎన్నో వందల familiesను muslimsగా మారుస్తున్నారు. వాళ్ళ మత గ్రంధము అయిన quranలోనివి christians చెప్తే నమ్మరు అని మన గ్రంధమైన bibleలోని కొన్ని వచనాలను తప్పు పట్టి ఈ రోజు అమాయక క్రైస్తవులను తప్పు దోవ పట్టిస్తున్నారు. క్రీస్తు విరోధుల యొక్క ఈ ప్రశ్నకు మన christiansలో కొంత మంది ఎలాగన్నా జవాబు ఇవ్వాలని యేసుక్రీస్తు friday కాదు చనిపోయింది thursday అని బదులు ఇస్తున్నారు.

3) ఈ ప్రపంచములో తప్పు అనేది లేని ఏకైక మహా జ్ఞాన గ్రంధ రాజు bible.. bibleలో అర్థము కానీ విషయము అర్థము అవ్వాలంటే సరిగా విభజించి,విభజించినది అన్ని విధాలుగా ఆలోచించాలి ( 2 timothy2:15,కొలాసి 3:16). mark 8:31లోని మాటను చూపించి ఈ మాటలో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది కనుక thursday లేచాడు అని తప్పుడు జవాబు ఇస్తున్నారు. ఇలాంటి తప్పుడు జవాబులు ఇచ్చి క్రీస్తు విరోధులకు అవకాసము ఇస్తున్నారు.

4) మూడవ దినమున లేస్తాను అని అన్నాడా లేక మూడు దినములైన తర్వాత లేస్తాను అని అన్నాడా??? మత్తాయి16:21-మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా......... మూడవ దినమున లేస్తాను అని మత్తాయిలో వ్రాయబడింది. మరి mark 8:31లో యేసు మూడు దినములైన తర్వాత లేస్తాడని ఉంది.. ఈ mark 8:31, మత్తాయి16:21,మూడు రాత్రింబగళ్ళు తర్వాత లేచుట ఏది వాస్తవము???? ఇంత గంధరగోలములో ఏది వాస్తవము అంటారు??? ఆ మూడు సందర్భాలలో యేసునే మాట్లాడాడు. ఇప్పుడు మనము తెలుసుకోవలసింది ౩ రోజుల తర్వాత లేచాడా లేక మూడవ దినమున లేచాడా లేక మూడు రాత్రి మూడు పగలు ముగిసిన తర్వాత లేచాడా?

5) ఇప్పుడు వివరణలోకి వెళ్దాము.. 2 దినవృత్త 10:4 లో అతడు- మీరు మూడు దినములు తాళి(ఆగి) మరలా నా యొద్దకు రండని చెప్పెను గనుక జనులు వెళ్ళిపోయిరి. ఇక్కడ మూడు దినములు అయిన తర్వాత రండని చెప్పచున్న సందర్భము.. 2 దినవృత్త 10:12లో మూడవ దినమందు నా యొద్దకు తిరిగి రండని రాజు చెప్పిన ప్రకారము...... పైన 4వ వచనములో3 days తర్వాత రండి అని రాజు చెప్పాడు and 12వ వచనములో ముడువ దినము నందు రండి అని రాజు చెప్పాడు.. అనగా మూడు దినముల తర్వాత అన్న ,మూడవ దినము అన్న ఒక్కటే భావము... 1సముయేలు30:11- వాడు మూడు రాత్రింబగళ్ళు అన్నపానము లేమియు పుచ్చుకొనలేదని తెలుసుకుని.... 1సముయేలు30:13-మూడు దినముల క్రిందట నేను కాయిలా పడగా.....పై వివరణ బట్టి చివరగా అనగా మూడు దినములైన తర్వాత అన్న ,మూడవ దినమున అన్న , మూడు రాత్రింబగళ్ళు అన్న ఒక్కటే భావము అర్థము.. యేసు మూడు దినములైన తర్వాత తిరిగి లేస్తాడని markలో ఉన్నట్టు చూసాము., ముడువ దినమున లేస్తాడని మత్తాయిలో ఉన్నట్టు చూసాము, మూడు రాత్రింబగళ్ళు అయన తర్వత లేస్తాడు అను మాటను మత్తాయిలో ఉన్నట్టు చూసాము. ఈ మూడు సందర్భాలలో భావము- నేను మూడవ దినము తిరిగి లేస్తాను అని అర్థము....

6) అపోకార్య 10:40-దేవుడు ఆయనను మూడవ దినమున లేపి..... అంటే యేసు మూడవ దినమున లేచాడని అపోస్తులలు సాక్ష్యము ఇస్తున్నారు. luke 24:21- ఇశ్రాఎలును విమోచించుబోవువాడు ఈయనే అని మేము నిరీక్షించియుంటిమి. ఇదిగాక యీ సంగతులు జరిగి నేటికి మూడు దినములు ఆయెను..... అంటే కచ్చితముగా మూడవ దినమున తిరిగి లేచాడు..

7) మత్తాయి 12:38 నుంచి 41-వాళ్ళు సూచక క్రియ అడిగినప్పుడు యోన సూచక క్రియే మీకు అనుగ్రహిoపబడును అని యేసు అన్నాడు. ఇందులో ఆలోచించాల్సింది బ్రతుకున్నవాడు భయటపడడము గొప్ప లేక బ్రతుకున్న వాడు చనిపోయి తిరిగి లేవడము గొప్ప????? యేసు చనిపోయి లేచాడు గనుక యోన కంటే గొప్పవాడు. luke 11:30- ఇందులో తిమింగలము time చూసుకుని మ్రింగిందా లేక time చూసుకుని కక్కిందా??????? example:: 16-4-14న nithin అనే నేను ఉదయము 9 గంటలకు officeకి వెళ్ళాను. వెళ్ళిన నేను ఆ రోజు పూర్తి చేయాలంటే మరలా రేపు ఉదయము 9 వరకు ఉండాలా???? 12am వస్తే 17date వస్తుంది.

8) time చూసుకుని సమాధిలోకి వెళ్ళవలసిన అవసరత, time చూసుకొని లేవవలసిన అవసరత లేదు. మనకు తిరిగి లేవడము ముఖ్యము కానీ ఎన్ని రోజులకు లేచాడన్న విషయము ముఖ్యము కాదు. సమాధిని గెలవడము ముఖ్యము. విశ్రాంతి దినమున ఎప్పుడు ప్రారంభమైనదో చూస్తే లేవియు 23:32- సాయంకాలము మొదలుకొని మరుసటి సాయంకాలము వరకు మీరు విశ్రాంతి దినముగా ఆచరింపవలెను..అంటే ముందటిరోజు evening 6 నుంచి తర్వాత రోజు 6 pm వరకు అని అర్థము. friday దినమున 6pm దాటితే విశ్రాంతి దినము start అవుతుంది. john19:31- ఆ దేహములు విశ్రాంతి దినమున సిలువ మిద ఉండకుండునట్లు.. .... అనగా విశ్రాంతి దినమున సిలువపై శవము వ్రేలడకుడదు.. friday 3pm సమీపములో అరిమతయ ఎసుపు పిలాతు దగ్గరకు వెళ్లి deadbody కోసము permission అడిగి సమాధి చేసాడు,..

9) ఎందుకు లేవాలి మూడవ దినమున?? అయన తిరిగి sunday దినాన లేవలేకపోతే permanentగా మట్టిలో పాతిపెట్టేవారు. పాతి వేస్తే అయన దేహము కుళ్ళు పడుతుంది. నీ పరిశుద్దుని కుళ్ళు పట్టనియ్యవు అను ప్రవచనము ఉంది గనుక sunday లేచాడు. అయన లేవడము ముఖ్యమా ? ముందు క్రైస్తవుడిగా ఆలోచించవలసినది time కాదు లేవడము ముఖ్యము. మూడు రాత్రింబగళ్ళు ఎలాగో చూద్దాము... a)మొదటి దినము(ఒక పగలు,ఒక రాత్రి)- ఇది friday-afternoo n 3 నుంచి 6 pm వరకు పగలు ,6 pm నుంచి 12am వరకు ఒక రాత్రి. b) రెండవ దినము( ఒక పగలు ,ఒక రాత్రి)-ఇది saturday- 12 am నుంచి 6pm వరకు పగలు, 6 pm నుంచి 12 am వరకు రాత్రి. c) మూడవ దినము ( ఒక పగలు ఒక రాత్రి)-ఇది sunday -12 am నుండి 6 వరకు రాత్రి ,సూర్యోదయము అవుతుండగా లేచాడంటే పగలు వచ్చింది..

10) 1 కోరంధీ 15:3- లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను,సమాధి చేయబడెను,లేకహనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను..మూడవ లేవుట అనునది లేఖనాల నెరవేర్పు.. చివరగా యేసుక్రీస్తు friday చనిపోయినది, సమాధి చేయబడడము వాస్తవము and తిరిగి మూడవ దినమైన sunday లేవడము వాస్తవము. time correctగా ఉంటె రక్షణ రాదు కానీ తిరిగి లేస్తేనే రక్షణ.

రూతు గ్రంథం
అధ్యాయాలు: 4, వచనాలు:85

గ్రంథ కర్త: సమూయేలు ప్రవక్త

రచించిన తేది: దాదాపు 450 నుండి 425 సం. క్రీ.పూ.

మూల వాక్యము: “నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను, నివు నివసించుచోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు;” రూతు 1:16

ఉపోద్ఘాతం: రూతు గ్రంథం బైబిలులో చిన్న పుస్తకం. కేవలం నాలుగు అధ్యాయాలు ఉన్నప్పటికీ ఈ గ్రంథానికి చాలా ప్రాముఖ్యత ఉంది. బైబిలు గ్రంథములో స్త్రీ పేరుతొ ఉన్న గ్రంథాలలో ఒకటి ఎస్తేరు మరియొకటి రూతు. రూతు అన్న మాటకు అర్ధం “స్నేహితురాలు” మరియు “కనికరము”. రూతు మోయాబియురాలు అయినప్పటికీ క్రైస్తవ పరంపర లో ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంది. సాధారణంగా మన నిజ జీవితంలో ఉండే విశ్వాసము, దయ, కరుణ, కనికరము, ఓపిక, అణుకువ, నమ్రత, ప్రయాస మరియు ప్రేమ ఈ గ్రంథంలో మనం చక్కటి ఉదాహరణాలుగా గమనించవచ్చు. అంతేకాకుండా మన జీవితంలో జరిగే చిన్న చిన్న విషయాల్లో కుడా దేవుడు మన పట్ల కలిగిన శ్రద్ధ మనలను విశ్వాసంలో ఇంకా బలపరుస్తుంది. ఈ గ్రంథం మనకు చాలా అందముగా కనబడవచ్చు అంతే కాకుండా మన నిజ జీవితంలో సహజమైన ప్రత్యామ్నాయముగా ఉంటుంది. మరియు జరిగిన సంగతులను తెలుసుకోవాలనే ఇచ్చ కలిగించే విధంగా ఉంటుంది మరియు దేవుడు తన ప్రజలకు విడుదల కలిగించిన ప్రణాళిక ఈ రూతు గ్రంథం తెలియజేస్తుంది. రూతు గ్రంథం ఒక నవల వలె ఉంటుంది అని బైబిలు పండితులు అంటారు. రూతు గ్రంథం అనేకమైన జీవిత అధ్యాత్మిక సత్యాలను మరియు చారిత్రాత్మిక సంగతులను తెలియజేస్తుంది. రూతు గ్రంథం మొత్తం ఈ గ్రంథంలో ఉన్న వ్యక్తుల పేర్లకు ఉన్న అర్ధాలను బట్టి రచించబడింది.

ఇశ్రాయేలునకు రాజు లేని దినాలలో న్యాయాధిపతులు పరిపాలించే వారు. అ దినాలలో ఆ రాజ్యామంతటా కరువు సంభవించింది. ఇశ్రాయేలు కుటుంబానికి చెందిన ఎలిమేలేకు, ఆయన భార్యయైన నయోమి, వారిద్దరి కుమారులు మహ్లోను, కిల్యోను ను వెంటబెట్టుకొని బెత్లెహేము నుండి ప్రయాణమై మోయాబు దేశమున కాపురముండుకు బయలుదేరిరి. వ్యాకులం చెందిన ఇంటి యజమాని, విధిలేని పరిస్తితిలో మోయాబు దేశమునకు తన కుటుంబముతో వచ్చి తన కుమారులైన మహ్లోనుకు రూతు, కిల్యోను కు ఒర్పా అను మోయాబు స్త్రీలతో వివాహముచేసి అక్కడ కాపురముండిరి. మోయాబు దేశంలో ఎలిమేలేకు మరియు ఆయన కుమారులు చనిపోయిన తరువాత, ఆ దుఃఖకరమైన  స్థితిలో వారు ఆహారము లేని వారాయెను. కరువు తీవ్రత తట్టుకోలేక మేలుకువగల అత్తగా తన ఇద్దరు కోడండ్రను జాగ్రత్తగా చూచుకొనుటకు తిరిగి తాము వదిలి వచ్చిన దేశానికి ప్రయాణమైరి. అయితే ఓర్పా అయిష్టముగా తన అత్తను మార్గము మధ్యలో వదిలి వెళ్లిపోయింది కాని రూతు తన అత్తను హత్తుకొని “ నా వెంబడి రావద్దనియు నన్ను విడిచి పెట్టుమనియు నన్ను బతిమాలుకొనవద్దు. నివు వెళ్ళు చోటికే నేను వచ్చెదను. నివు నివసించు చోటనే నేను నివసించెదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి బొందు చోటనే నేను మృతి బొందెదను, అక్కడనే పాతి పెట్ట బడెదను. మరణము తప్ప మరి ఎదైనను నిన్ను నన్ను ప్రత్యేకించినయెడల యెహోవా నాకు ఎంత కీడైన చేయునుగాక” (రూతు 1:16-17) అని తీర్మానించుకొని తన అత్తతో బెత్లెహేమునకు ప్రయాణమైరి. అప్పుడు బెత్లెహేమునందు యవల కోత కాలమున రూతు తన అత్తకు ఆధారముగా నుండుటకు పరిగె ఏరుకొందునని, అత్త వద్ద సెలవు తీసుకోని ఎలిమేలేకు వంశపువాడైన బోయజు పొలములోనికి వచ్చి చేను కోయు వారి పొలములో ఏరుకొనెను. బోయజు పేరున్న యూదయ న్యాయాధిపతి. బోయజు అను మాటకు అర్ధం “బలవంతుడు”. బోయజు రూతునకు ఉన్న యదార్థతను మరియు సత్ ప్రవర్తనను గ్రహించి ఆమెను బంధుధర్మము చొప్పున వివాహము చేసుకొనెను. యెహోవా బోయజును రూతును ఆశీర్వదించి వారికి కుమారుని అనుగ్రహించెను. అతని పేరు ఓబేదు. ఓబేదు అనగా “దాసుడు లేదా సేవకుడు” అని అర్ధం. ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను.

సారాంశము: రూతు గ్రంథంలోని అనేక విషయాలు మన నిజ జీవితంలో కార్యసిద్ధి కలుగజేసే విధంగా ఉంటుంది. దేవునితో విశ్వాసంలో స్తిరపడే బంధుత్వము ఒక ఉదాహరనముగా కనబడుతుంది మరియు పరస్పర అంకిత భావాన్ని విశదీకరిస్తుంది. దేవుని పట్ల శ్రద్ద, భక్తి, వినయము, విధేయత రూతు జీవితం నుండి మనం నేర్చుకోవచ్చు అంతే కాకుండా నిజ జీవితంలో ఏది ఉత్తమమైనదో దాన్ని ఎంచుకునే విషయంలో మనకు ఈ గ్రంథం దోహదపడుతుంది. నిరాశపూర్వకమైన పరిస్తితులలో కుడా నిస్వార్ధమైన జీవతం జీవించడానికి నేర్పిస్తుంది ఈ గ్రంథం.

రూతు మోయాబియురాలు అనగా దేవునికి అయిష్టమైన జనాగం నుండి వచ్చిన స్త్రీ అయినప్పటికి ఆమెకు దేవుని పట్ల ఉన్న ఆసక్తి, వ్యక్తిగతంగా ఆమె గుణ లక్షణాలు ఆమెను క్రీస్తు వంశావళిలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునేలా చేసింది. మన కిర్తి ప్రతిష్టలు మనం జివించే విధానాన్ని అధారంచేసుకొని ఉంటాయి. ఎలాంటి కష్ట సమయాల్లో కుడా మనం ఓర్పు సహనం కలిగి ఉంటే ఉన్నతమైనవాటిని చేరుకునే అవకాశం ఉంటుంది.

దేవుడు మనకు చూపించే కృప ఎంతో అధికం. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అయన మనలను ప్రేమించేవాడిగా ఉంటాడు. విధేయత వలన ఆశీర్వాదం మరియు దేవుని యొక్క ప్రణాళికలో ఒక చక్కటి స్థానాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది.

బాప్తీస్మం అనగా ఏమి

ఎందుకు తీసుకోవాలి? తీసుకోవడము వలన ఏమి జరురుగుతుంది? ఎలా

 తీసుకోవాలి? ఎప్పుడు తీసుకోవాలి? చిన్న పిల్లలకు బాప్తీస్మం 

ఇవ్వవచ్చా?
ఈ యొక్క అంశములో బాప్తీస్మం అనగా ఏమి? ఎందుకు తీసుకోవాలి?
తీసుకోవడము వలన ఏమి జరురుగుతుంది? ఎలా తీసుకోవాలి?
ఎప్పుడు తీసుకోవాలి? చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వవచ్చా??
అను సందేహాలకు జవాబులను పొందుపరిచాను.
1) మనము దేవుని పనికి ఉపయోగపడాలంటే ముందు :
a) వాక్యము నేర్చుకోవాలి.అప్పుడు subject అంతా mindలోకి పోతుంది. దీనిని “receive” అంటారు
b) నేర్చుకున్న వాక్యమును పంపాలి. దీనిని “production” అంటారు. అంటే వాక్యమును నేర్చుకున్నవాడు వాక్యము చెప్పాలి and వాక్యము చెప్పేవాడు ముందు వాక్యము నేర్చుకోవాలి. 3 ½ years వరకు యేసు శిష్యులకు training ఇచ్చాడు. శిష్యులు వాక్యము చెప్పేముందు యేసు దగ్గర వాక్యమును నేర్చుకున్నారు. యేసు కూడా తండ్రి దగ్గర నేర్చుకుని వచ్చాడు. john 8:26లో “ నేను అయన( తండ్రి) యెద్ద వినిన సంగతులే లోకమునకు భోదించుచున్నాను అని చెప్పెను.john 8:28 లో తండ్రి నాకు నేర్పినట్లు ఈ సంగతులు నేను మాట్లాడుచున్నాను.(ప్రైస్ ద లార్డ్ బ్రదర్స్ క్రింద ఉన్న యాడ్స్ ని క్లిక్ చెయ్యండి) అంటే యేసు ఈ లోకానికి రాక ముందు తండ్రి దగ్గర వాక్యము విని ,నేర్చుకుని చెప్పాడు. ఈ రోజు భోదకులు చాలా మంది పరిశుద్దత్ముడే మా చేత మాట్లాడిస్తున్నాడు అని అంటున్నారు. మత్తయి10:18to20, john 16:13 లో పరిశుద్దత్ముడు కూడా వేటిని వినెనో అవే చెప్పుతున్నాడు.

బాప్తీస్మం అనగా ఏమి?
1) బాప్తీస్మం అను పదము greek భాష నుండి baptiso అను పదము ద్వార derive చేయబడింది.baptiso అనగా సమాధి చేయుట,పాతి పెట్టుట,ముంచుట. బాప్తీస్మం గురించి roma 6:3 లో యేసు లోనికి బాప్తీస్మం పొందిన మనమందరము “అయన మరణములోనికి” బాప్తీస్మం పొందితిరని మీరు ఎరుగరా?? roma 6:4 లో మనము బాప్తీస్మం వలన మరణములో పాలుపొందుటకై ఆయనతో కూడా “పాతిపెట్టబడితిమి”. ఇది బాప్తీస్మం యొక్క అర్థము. బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. యేసు క్రీస్తు యొక్క మరణానికి సాదృశ్యముగా మనమందరము బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడుతున్నాము. ఎందుకు తీసుకోవాలి?తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది? 2) సమాజములో బాప్తీస్మం ఎందుకు తీసుకుంటున్నారో చూస్తే సంఘములో సబ్యత్వం కొరకు, సమాధి స్థలము కొరకు పెళ్లి కొరకు,caste certificate కొరకు, ఇలా ఎన్నో...... bible చెప్పిన కారణాలు ద్వార తీసుకునే బాప్తీస్మం అసలైన బాప్తీస్మం. బాప్తీస్మం తీసుకుంటే ప్రధానముగా 3 విషయాలు జరుగుతాయి.
a) అపోకార్య 22:16- బాప్తీస్మం పొంది నీ పాపములను కడిగివేసుకోనమని చెప్పెను. “బాప్తీస్మం తీసుకోవడము వలన మొట్టమొదట పాపాలు కడగబడుతాయి”. బాప్తీస్మం తీసుకొనేవాడు పాపాలు కడిగివేసుకోవటానికి తీసుకోవాలి. నేను పాపి అని ఒప్పుకొని, మారు మనస్సు పొంది, ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంబిస్తాను అని నిర్ణయించుకుని పాపాలు ఒప్పుకొనక పోతే కుదరదు. అపోకార్య 2:38-మీరు మరుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు బాప్తీస్మం పొందుడి.
b) mark 16:16- నమ్మి బాప్తీస్మం పొందువాడు రక్షింపబడును.బాప్తీస్మం తీసుకోవడము ద్వార రక్షణ అనే ఓడలోకి వస్తాము. బాప్తీస్మం తీసుకోవడము వలన ఏమి జరుగుతుంది అంటే మొట్టమొదట పాపక్షమాపణ కలిగి,రక్షణ అనే ఓడలోనికి వచ్చినట్లు అర్థము.రక్షణ పొందాలంటే ముందు బాప్తీస్మం తీసుకోవాలి.

ఎందుకు బాప్తీస్మం తీసుకోవడము అంటే పరిశుధాత్మ అను వారము పొందుతాము( అపోకార్య2:38,39). ఎలా తీసుకోవాలి?
3) బాప్తీస్మం ఎలా తీసుకోవాలో అన్న విషయము పై ఒకరు చిలకరింపుగానా,జెండా క్రింద దూరడముగానా, అస్సలు అవసరము లేదు అంటున్నారు నేటి వారు. john 3:23- నీళ్ళు విస్తారముగా ఉండెను గనుక యాహోను కూడా అక్కడ బాప్తీస్మం ఇచ్చుచుండెను. నీళ్ళు విస్తారముగా ఉన్నందున............ అపోకార్య 8:36to38-phillippu-నపుంసకుడు సన్నివేశము- నీళ్ళులోనికి దిగిరి... దినిని బట్టి బాప్తీస్మం నీళ్ళలో మునిగి తీసుకోవాలని అర్థము.పాతిపెట్టబడడము అంటే మునగాలి.

ఎప్పుడు తీసుకోవాలి ?
4) ఏ రోజు అయితే మనస్సులో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నావో,పాపి అని ఎప్పుడు ఒప్పుకొంటున్నావో అప్పుడు immediateగా పాపాలు ఒప్పుకొని బాప్తీస్మం తీసుకోవచ్చు. అపోకార్య22:16-నీవు తడువు(ఆలస్యము) చేయుట ఎందుకు.... , అపోకర్య8:36to38- phillippu-నపుంసకుడు సన్నివేశము-వారు త్రోవలోవెళ్ళుచుండగా బాప్తీస్మం జరిగింది. అపోకార్య 16:33-paul- చెరసాల నాయకుడు సన్నివేశము-midnight బాప్తీస్మం పొందారు. ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చు.

5) బాప్తీస్మం పాపక్షమాపణ కొరకు తీసుకోవాలి. పసి పిల్లలు పాపము చేస్తారా? చిన్ని పిల్లలకు పాపము,మంచి,చెడు,విశ్వాసము,యేసు ,పునర్ధానము అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. 1 peter2:1to3- క్రొత్తగా జన్మించిన “శిశువులను” పోలి ఉండాలి , మత్తయి18:3-మీరు మార్పు నొంది “బిడ్డలు” వంటి వారు అయితే పరలోక రాజ్యములో ప్రవేస్తారు, మత్తయి 19:14- “చిన్నపిల్లలను” ఆటంకాపరచనియ్యకుడి. దేవుడు పిల్లలను గూర్చి చెప్పుతున్నాడు.

6) గలతీ3:27- క్రిస్తులోనికి బాప్తీస్మం పొందిన మీరందరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. christian అనగా క్రీస్తును ధరించినవాడు.

7) conclusion::: బాప్తీస్మం లేకుండా రక్షణ కలగదు అని, అది తీసుకుంటే పాపక్షమాపణ, రక్షణ ,పరిశుదత్మ అను వరము వస్తుందని,ఈ రోజు అయితే ఏ గడియ అయితే నీ పాపాలు ఒప్పుకొని,ఎందుకు బాప్తీస్మం తీసుకోవాలన్న కారణాలు నేర్చుకుని విస్వసిస్తే ఆ గడియలోనే బాప్తీస్మం పొందవచ్చని, మునిగితేనే బాప్తీస్మం తిసుకోనట్లు లెక్క అని,చిన్న పిల్లలకు బాప్తీస్మం ఇవ్వకూడదని తెలుస్తుంది.

8) important point:::: బాప్తీస్మం తీసుకున్న వారికీ పరలోఖము వస్తుందా? రాదు. ఇది తీసుకుంటే పని అయిపోయినట్లు కాదు కానీ దేవుని పని ప్రారంభమైనట్టు. యేసు బాప్తీస్మం తీసుకుని దేవుని పని మొదలుపెట్టాడు. బాప్తీస్మం తీసుకున్న వాడు దేవుని పనిలోనికి వెళ్ళాలి.ఆపనిలోఉండగాకష్టాలు,శ్రమలు,అవమానాలు,ఆటంకాలు,వస్తాయి. వీటి అంతటిని సహించాలి అంతము వరకు. అప్పుడు రక్షి౦పబడుతాము. ఈ రోజు నుంచి క్రీస్తు రాజ్య సువార్త ప్రకటించి, అయన రాజ్య వ్యాప్తి కొరకు పని చేస్తానని వాగ్ధానము చేసినట్టు బాప్తీస్మం అనగానే.

పాపపు ప్రపంచముపై దేవుని ప్రణాళిక

మన ఆత్మలకు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను.
1) నేడు పేపర్లో వస్తున్న వార్తలను బట్టి, టివిలో చూపిస్తున్న వార్తలను బట్టి, మన కళ్ళ ముందు కనబడుతున్న దృశ్యాలను బట్టి సమాజం నాటి నుండి నేటి వరకు ఎంత భయంకరముగా చెడిపోయిందో మనకు అర్థమవుతుంది. పరలోకమందున్న దేవుడు ఈ సమాజాన్ని ఇలా చూడాలనుకున్నడా? ఆదియందు దేవునికి మనిషి పట్ల ఉన్న ప్రణాళిక వేరన్న విషయము బైబిల్ లోని మాటల ద్వార అర్థమవుతుంది.

2) పుట్టబోయే బిడ్డ పట్ల తల్లితండ్రులు ఎన్నో కలలు కంటారు. వాడు పెరిగి పెద్ద వాడయ్యాక చెడు స్నేహాల వలన చెడిపోయి చివరికి కన్న తల్లితండ్రులను నిందించేవాడిగా ఉన్నప్పుడు వాళ్ళు అనే మాట “మేము వీడిని గూర్చి అనుకున్నది వేరు జరిగింది వేరు అని భాదపడుతూ ఉంటారు”. అనగా భూమి మీద రాక మునుపు తల్లితండ్రులు మనల్ని బట్టి ఎంతో ఆనందముగా ఉండేవారు. భూమి మీదకు వచ్చి ఒక ఆకారమును ధరించుకుని , పెరిగి పెద్దయాక చెడు ప్రవర్తన బట్టి తల్లితండ్రుల ఆనందం అవిరి అవుతుంది.  చెడు చేష్టల వలన ప్రతి రోజు వాడు ఏమి చేస్తాడా అని కంటి మీద కునుకు లేకుండా వాళ్ళ భవిష్యత్తును గురించి వాపోతున్న తల్లితండ్రులు ఎంతో మంది నేడు మనకు కనబడుతున్నారు. వాడినైతే కనగలము కానీ వాడి భవిష్యత్తును కనగలమా అని, వాడిని గొప్పవాడిగా చుడాలనుకున్నాము కానీ ఇలా చూస్తామని అనుకోలేదని తల్లితండ్రులు భాదపడుతూ ఉంటారు.

3) పై సందర్భము చక్కగా అర్థమైతే పరలోకమందున్న మనల్ని కన్నతండ్రికి కూడ మనం కలుగనప్పుడు ఉన్న ఆలోచన వేరు. అనగా ఈ భూమి మీదకు మనం రాక ముందు తండ్రికి మన యెడల ఉన్న ఉద్దేశం వేరు. కానీ ఆదాము ద్వారా అందరు భూమి మీదకు వచ్చిన తర్వాత మనిషిని ఎలా అయితే చూడకూడదని దేవుడు అనుకున్నాడో అలానే చూడవలసిన పరిస్థితి ఏర్పడిందన్న విషయం ఈ సమాజన్ని బట్టి మనకు తెలుసు. నా పిల్లలు రాబోతున్నారని ,నా కోసం భూమి మీద బ్రతుకుతారని ఆరు దినాల మహా కష్టాన్ని అనుభవంచి కలుగును గాక అని అనకుండా ఆదామును మట్టితో ఆకారమును నిర్మించి, తనలో ఉన్న ఆత్మను మట్టి ఆకరాములోకి ప్రవేశపెట్టి ఎంతగానో ఆనందపడ్డాడు. 4) కష్టము అంటే ఏంటో తెలియనియ్యకుండా, కష్టించి పని చేసి సంపాదించుకోవలసిన అవసరం లేకుండా, ఆకలే లేకుండా ఇక చివరికి కనబడుతున్న ఆహార పదార్ధాలను తింటూ దేవుడు కలిగించిన ప్రకృతిని అనుభవించే మంచి జీవితాన్ని మనిషికి దేవుడు ప్రారంభించాడు . ఆదాము ఏదేనులో ఉంటున్నప్పుడు దేవుడు మనిషికి ఇచ్చిన జీవితాన్ని చూస్తే ఎలాంటి మంచి పరిస్థితుల మధ్య పెట్టాడో అర్థమవుతుంది.తన తొలి కుమారుడు భూమి మీద పుట్టాడని ఆనందముతో పొంగిపోతూ కోటాను కోట్ల పిల్లలతో తండ్రిగా నేనే కొలవబడాలని ఆలోచన కల్గిన పరలోకపు తండ్రికి భాద అంటే ఏంటో మనిషి రూచి చూపించాడు. ఈ ప్రకృతిని దేవుడు తన కొరకు కలిగించుకోనక మానవులైన మనము ఉండడానికి కలిగించాడన్నది సత్యం. తోట మధ్యన ఉన్న ఒక్క ఫలం తప్పితే సమస్తమును భుజించమని చెప్పాడు. ఏ ఫలం తినకూడదో చెప్పాడు, తినవద్దన్న ఫలం ఎక్కడ ఉందో చెప్పాడు, ఎందుకు తినకూడదో చెప్పాడు,తింటే జీవితం ఏమైపోతుందో అన్న విషయాలు చెప్పిన్నప్పటికి ఏదైతే వొద్దు అన్నాడో అదే ఆదాము హవ్వలు చేసారు.

5) మనిషి తినుచు, త్రాగుచు, సంపాదనే ద్యేయంగా పెట్టుకని ఇష్టానుసారముగా బ్రతుకుతూ ఆ తర్వాత చివరికి మరణానికి చేరువైపోతున్నాడు నేటి మనిషి. ఏదేను తోటలో ఎన్నో జాగ్రతలు చెప్పి తినవోద్దని చెప్పిన ఆ ఒక్క పండు కోసం పరమ తండ్రి మాటను ప్రకన్న పెట్టి పాపాన్ని ఆహ్వానించి ఈ రోజు పరలోకపు తండ్రికి కంట నీరు కలిగిస్తున్న సమాజమును చూస్తే అర్థమవుతుంది. ఆదాము పాపానికి ప్రారంభోస్తవం చేస్తే ఆ తర్వాత వచ్చిన ప్రతి మనిషి పాపంలో మునికి చివరికి మంచిలేని సమాజముగా మార్చేసారు.

6) పాపానికి చోటు లేకుండా మొదట ఈ ప్రపంచాన్ని నిర్మిస్తే మనిషి భూమి మీదకు వచ్చిన తర్వాత మంచికి చోటు లేనిగా దేవుడు చూస్తున్నాడు. ఏదైతే పరలోకము తండ్రికి ఇష్టం లేదో దానితో(పాపం) మనిషి భూమిని నింపేశాడు. ఏదైతే వద్దన్నాడో అదే చేస్తున్నాడు. ఏదైతే మానేయ్యమన్నాడో అదే చేస్తున్నాడు. అయన కోసం బ్రతకాలనే ఆలోచనలు నేటి మనిషికి లేదనే చెప్పాలి. ఆదికాండ 3:9-దేవుడైన యెహోవా ఆదామును పిలిచి- నీవు ఎక్కడ ఉన్నవనేను. అందుకతడు-నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిననేను. తప్పు చేసిన ఆదాము భయపడినట్టుగా పై వచనము బట్టి అర్థమవుతుంది.ఈ రోజు తప్పు చేసిన కూడ దేవునికి భయపడక ధైర్యముగా ఉంటున్నాడు. తప్పు చేస్తున్న భయం లేదంటే దృడమైన మనస్సాక్షి కలిగిన వారై దేవునికి ఎదురు తిరగడానికి అలవాటుపడ్డారు. మనిషి తప్పు చేస్తున్న భయపడటం లేదంటే మానవ జీవితాలు ఎంత భయంకరముగా మారాయే ఆలోచించండి.

7) వాస్తవముగా మొదట దేవుడంటే మనిషికి కావాల్సింది భయము ఆ తర్వాత భక్తి రావాలి( హెబ్రీ 5:7) . ముందు మనిషికి దేవుడంటే భయం ఉంటె వణుకుతూ ఒంట్లో భక్తి పుడుతుంది. మనిషికి దేవుని యెడల భయమే లేకుంటే భక్తి ఎలా ఉంటుంది? దేవునికి ఇష్టంలేని నిర్ణయాలతో పరలోకమందున్న కన్న తండ్రి కన్న కలలు కన్నీరు అయిపోయిన ఈ కాలములో మనిషికి ఎలాంటి మాటలు కావాలి? మానవత్వం మంట కలిపి మనిషే మృగం అయిపోయి సమాజమే అరణ్యము అయిపోతే మనిషికి దేవుని మాటలు ఎలా ఉండాలి? మనిషి మనస్సు బండైతే దేవుని మాట సూత్తే కావాలి. మనిషి హృదయాలు బండలైతే ఆ బండలు బద్దలు కొట్టడానికి దేవుని వాక్యం సుత్తిలా ఉండాలి.మనిషి కృర మృగం అయితే ఆ కృర మృగాన్ని చీల్చి చెండాడే కత్తిలాంటి వాక్యం ఈ రోజు సమాజనికి కావాలి. అలంటి భోదలు నేడున్న సమాజానికి వస్తే కాస్తంత భయం దేవునిపై ఉంటుంది.

8) అన్ని భయాలు కోల్పోయిన మనిషి గురించి దేవుడు ఏమి ఆలోచిస్తున్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? పాడైపోయిన ఈ సమాజాన్ని చూచి అస్సలు పరలోకమందున్న కన్న తండ్రి ఆలోచన ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా?? దేవుడికే భయపడని ఈ కాలములో ఉన్నవారిని దేవుడు ఏమి చేయాలి? అయన తీసుకున్న నిర్ణయాలు ఏంటో, దేవుడు ఎంత భికరుడో, దేవుడు ఎలా దహించు అగ్నిగా ఉన్నాడో, అయన విశ్వరూపం ఏంటో, అయన కోసం బ్రతకకపోతే మానవ బ్రతుకులు ఎలా నాశనం అవుతాయో అన్న ప్రాముఖ్యమైన సంగతులు ప్రతి మనిషికి తెలియాలి.

9) పరలోకం నుండి ఈ చెడిపోయిన సమాజమును చూసి, పరలోకం నుండి భయపడని మనిషిని చూసి, ఎన్ని సార్లు దేవుని మాటలు విన్న భయం లేని మనిషిని, తినీ త్రాగి వ్యబిచరించడం ఆలవాటుగా మార్చుకున్న మనిషిని, సంపాదనే ద్యేయముగా మారిన వారిని దేవుడు ఏమి చేస్తున్నాడో చూస్తే కీర్తనలు 7:11,12,13- న్యాయమును బట్టి అయన తీర్పు తీర్చును.అయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఒకడును మళ్ళని యెడల ,అయన తన ఖడ్గమును పదును పెట్టును.తన విల్లు ఎక్కు పెట్టి దానిని సిద్దపరచియున్నాడు.”వాని కొరకు మరణ సాధనములను సిద్దపరచియున్నాడు”.

10) బ్రతుకు మార్చుకొనుటకు ఎన్ని అవకాశాలు ఇచ్చిన దేవునిని ప్రక్కన పెట్టి తన ఇష్టానుసారముగా జీవిస్తున్న వారి కొరకు మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడని పై వచనము ద్వారా అర్థం అవుతుంది. జీవితములో కలుగు కష్టమైన,నష్టమైన,భాదనైన,వ్యాదినైన ఏదైనా ఉన్నను అయన కోసము బ్రతికితే నిన్ను కాపాడుకుని పర సంభంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇస్తాడు. అవసరాల కోసమే దేవునిని నమ్ముకుంటూ బ్రతుకుని మార్చుకొనక ,బైబిల్ లోని మహా జ్ఞానమును నేర్చుకోనక జివిస్తుంటే అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు కాక మరణ సాధనములు సిద్దపరుస్తున్నాడు.

11) ఈ ప్రకృతిలో దేవుడు ప్రతి దానికి అజ్ఞాపించాడు & ఆజ్ఞాపించిన ప్రకారముగా ఈ ప్రకృతి అంత పరుగెడుతుంది.దేవుని మాటను కాదంటే,దేవుని మాటకు ఎదురు తిరిగితే,దేవునితో ఎదురాడితే చివరికి నష్టపోయేది మనిషే. ఈ ప్రకృతి దేవుని చేతిలో ఒక ఆయుధం. పైనుండి దేవుడు మనల్ని శిక్షించడానికి రానవసరం లేదు కానీ ప్రకృతికి ఆజ్ఞాపిస్తే చాలు.

12) దేవునికి మనం లోబడి ,భయభక్తులతో వాక్యనుసారముగా జీవిస్తే ఈ ప్రకృతి మన మాట ఉంటుంది. ఒక వేళ దేవునిని కాదని బ్రతికితే ఈ ప్రకృతి మన పతనాన్ని చూస్తుంది, ప్రాణమును తీస్తుంది. దేవుడు ఆజ్ఞాపిస్తే ఈ ప్రకృతి మనల్ని కాపాడుతుంది లేక ప్రాణమును తీసేస్తుంది. కనుక ఈ పాపపు ప్రపంచము పై శిక్షించుటకు దేవుడు గొప్ప ప్రణాళికను ప్రకృతి ద్వార సిద్దం చేస్తున్నాడు. ఓ మనిషి బైబిల్ నేర్చుకో! మనస్సు మార్చుకో!! ఆత్మను రక్షించుకో!

దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను వివాహమాడినరా?
పరలోకములో ఉన్న దేవుని కుమారులు స్త్రీ వ్యామోహములో పడి భూమి 

మీదకు వచ్చి వివాహమాడినారని 
దేవదూతలు దేవుని కుమారులు కాదనియూ ,కేవలము పరిచారకులు మాత్రమేనని తెలియబడుచున్నది. జగత్తు పునాది వేయబడిన తర్వాత ఆదాము సంతతి మాత్రమే నాటి నుండి నేటి వరకు ఈ సృష్టిలో ఉన్నారని మనకు తెలుసు. ఆదాము నుండి నేటి వరకు మరణించిన వారిలో పరలోకము నుండి దిగివచ్చిన యేసుక్రీస్తు తప్ప మరెవ్వరును అక్కడికి పోలేదని మనకు తెలుసు ( john 3:13). అలగైనప్పుడు ఈ క్రింది వాక్య భావమును తీవ్రముగా ఆలోచించగలరు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరు తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి ( ఆదికాండము 6:2). అనేకులైన క్రీస్తు విరోధులు లోకములోనికి భయలువెళ్లి

1) పరలోకములో ఉన్న దేవుని కుమారులు స్త్రీ వ్యామోహములో పడి భూమి మీదకు వచ్చి వివాహమాడినారని కొన్ని english bibleలో ఆదికాండము 6వ అధ్యయము నందు బోమ్మలు వేసి ప్రచురించుట విశేషము.
2) మరికొందరు-ఆదాముకు ముందున్న సృష్టిలో నరులు పుట్టిరని, అందు ఉత్తములైన వారు దేవుని కుమారులుగా పరలోకమునకు వెళ్లి అక్కడ నుండి ఆదాము సంతతిలోని అనగా రెండవ సృష్టిలో ఉన్న నరుని కుమార్తెలను చక్కని వారిని చూసి భూమికి దిగివచ్చి వివాహమాడినారని విడ్డురముగా భోదించుచున్నారు.. వాక్యములో వ్రాయబడినది ఉన్నది ఉన్నట్లుగా చెప్పక జనములను మోసము చేస్తున్నారు. bible కు bible సమాధానము చెప్పాలి కానీ మనుష్య జ్ఞ్యానంతో కలిపి చెరిపేడి కల్పితాలను జోడించి రుజువు చేయకూడదు.
ఈ క్రింది వాక్యములను పరిశిలిస్తే- 1) యేసు- ఈ లోకపు జనులు( ఈ యుగపు కుమారులు) పెండ్లి చేసుకుందురు, పెండ్లికియబడుదురు గాని పరమును మృతుల పునరుర్థానము పొందుటకు యోగ్యులని ఎంచాబడినవారు(పునరుర్­ థానపు కుమారులు) పెండ్లి చేసుకోనరు. పెండ్లికియబడురు( లుక 20:28-36).
2) యేసు-లేఖనములను గాని, దేవుని శక్తీ గాని ఎరుగక మీరు పోరబడుచున్నారు. పునరుర్థానమందు ఎవ్వరును పెండ్లి చేసుకోనరు, పెండ్లికియబడరు. వారు పరలోకమందు మట్టి శరీరములు లేని ఆత్మలుగా దూతలు వలె ఉందురు(mathew 22:24-30). పరలోకములో ఉండబోవు ఆత్మలకు శరీరము లేదు కనుక శరీరసంబంధమైన కోరికలు ఉండవు. అందును బట్టి నేత్రశ, శరీరయిచ్చ, జివపుడంబాబు అనునవి లోకమందున్న సాతాను వలన మానవుల నుండి పుట్టినవే కానీ లోకము విడిచిన తర్వాత ఆత్మలకు పుట్టునవి కావు. ఒక వేళా పరలోకములో ఆత్మలకు కూడా ఈ దుస్టస్థితి పడితే దానిని పరలోకము అని పిలుచుట నేరమే అవుతుంది.ఇంతకు అడికండము 6 వ అద్యయములోని దేవుని కుమారులు ఎవరు??? నరుల కుమార్తెలు ఎవరు??? దేవుడైన యెహోవ నేల మంటితో నరుని నిర్మించెను. పిమ్మట అతనికి గడ నిద్ర కలుగజేసి అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి స్త్రీగా నిర్మించెను.
అప్పుడు ఆదాము- ఇది నరునిలో నుండి తీయబడినది కనుక నారి అని పిలిచెను (ఆదికాండము2:7,21-23). స్త్రీ అనునది పురుషుని నుండి,పురుషుని వలన కలిగినదినియు ,పురుషునికి పుట్టినది అనికూడా అనవచ్చు. luka 3:38లో ఆదాము దేవునికి కుమారుడు కాగా ఆదికాండము 6:2 ప్రకారము హవ్వ నరుని కుమార్తెగా ఉన్నది.స్త్రీ పురుషుని నుండి కలిగెను కానీ పురుషుడు స్త్రి నుండి కలుగలేదు. పురుషుడైతే దేవుని పోలికయు,మహిమయునైయున్నాడు.తండ్రి తన జీవాన్ని ఇచ్చి పురుషుని కనగా పురుషుడు తన శరీరము నుండి స్త్రీని కనియున్నాడు.(1 కోరంతి 11:7-9) . అందువలన పురుషులైన వారు దేవుని కుమారులు కాగా నరుని నుండి కలిగిన స్త్రీలు నరుల కుమార్తెలను వాక్యము చెప్పుచున్నది.పురుషు­ ల నుండి పురుషుల కొరకు నరుల కుమార్తెలు పుట్టియున్నారని వక్యమందు తేటతేల్లమగుచున్నది. జీవమను కృపవారములో భార్యలు పురుషులతో పాలివారైయున్నారు(1peter3:7).

అందువలన నరుని కుమార్తెలు దేవుని కుమారులైన నరులకు మహిమైయున్నారు. దేవుని కుమారులు అనగానే పరలోకములో ఉన్నవారిని వారు కూడా కోరికలకు బానిసులై శరీరము లేనప్పిటికి అత్మలై భుమిమిదకు వచ్చి శరీరముతో ఉన్న స్త్రీలను వివాహం అడిరని కొత్త అర్థము చెప్పడము విచిత్రముగా ఉంది కదూ.......
హిందువులలోని వేదపండితులు అక్కడ దేవుళ్ళకి పెళ్లి చేస్తుంటే క్రైస్తవలోని కొందరు భోదకులు ఇక్కడ దివి, భువి లోని వారికీ పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు

దేవుడు ఎవరు?
ఒక విషయాన్ని సామాన్యుడు చెబితే ప్రపంచము పట్టించుకోదు
ప్రభువు నామములో మీకు శుభములు.
ప్రపంచములో రెండు తెగలు వారు ఉన్నారు
1) దేవుడు ఉన్నదని నమ్ముతున్న వారు.( Thiests)
2) దేవుడు లేడు అని నమ్ముతున్న వారు( ATHIESTS). ఈ రెండవ తెగలో ఎక్కువ మంది పండితులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు ఉన్నారు. వీరికి ప్రతిదీ కారణము తో కావాలి. నాన్నను, అమ్మను,అక్కను, చెల్లిని, తమ్ముడును చూపించమంటే చూపించచ్చు కానీ, దేవుడిని చూపించడము కష్టము. కారణము అయన కనపడదు. అదృశ్యుడు అన్నది అయన లక్షణము లేక గుణము. కనిపించని దేవునిని సమాజానికి చూపించవలసిన భాద్యత christians అయిన మనకు ఎంతగానో ఉన్నది.
1) ముందుగా దేవుడు లేడు అని అంటున్నవారి దగ్గర ఉన్న విషయము ఏంటో ఇప్పుడు చూద్దాము. ఒక విషయాన్ని సామాన్యుడు చెబితే ప్రపంచము పట్టించుకోదు. అదే విషయాన్నీ scientists చెబితే వింటారు.scientists కు ఉండే బలము శాస్త్రము (science). ఈ శాస్త్రానికి పుట్టిన ఇల్లు ప్రకృతి. ఈ ప్రకృతిని శాస్త్రవేత్తలు చదివారు. చదివి అందులోనించి శాస్త్రాలను పుట్టించారు. భూమి మీద ఉంటున్నారు కనుక భూమిని చదివి భూగోళ శాస్త్రము ( GEOGRAPHY) అను పేరు పెట్టారు, భుగర్బoని చదివి భుగర్బo శాస్త్రము(GEOLOGY) అను పేరు పెట్టారు. భూమి మీద ఉన్న చెట్లను చదివి వృక్ష శాస్త్రము( BOTONY) అను పేరు పెట్టారు.జంతువులను చదివి జంతు శాస్త్రము( ZOOLOGY),పక్షులు చదివి పక్షి శాస్త్రము(ORNITHOLOGY),పండ్లు చదివి పండ్ల శాస్త్రము ( CORPOLOGY) పెట్టారు. కంటికి కనపడుతున్న వాటిని చదివారు. కనపడుతున్నాయి గనుక చదివారు. చదివి అర్థము చేసుకున్న దానికి పేరు పెట్టారు. “ కంటికి కనపడే ఒక వస్తువు అలోచించి దాని గురించి వీళ్ళకు ఏమి అర్థము అయిందో ఆ subject ని ఒక subject గా పిలిచి దానికి ఒక పేరు పెట్టారు. bible లో ఉన్న వాక్యాన్ని భట్టి మనుష్యులను ఆకర్శించువాడే christian...

2) స్వయానా scientists యొక్క మాటలను మనకు ఆలోచిస్తే ‘” ఈ 100% ప్రకృతి లో 30% పదార్ధము( matter) ఉంది అని చెప్పారు. మిగతా 70 percent ఏమి ఉందొ మాకు తెలియదు అంటున్నారు. తెలియని దానికి dark energy అను పేరు పెట్టారు. ఈ 30% లో మాకు తెలిసింది 5% మాత్రమే. మిగిలిన 25% పదార్ధములో ఏమి,ఎలా అయ్యిఉంటుందో మాకు తెలియదు అంటున్నారు. మొత్తం మీద వీరికి తెలిసింది 5% మాత్రమే. వాళ్ళకు తెలిసిన దాంట్లో కొంచెము books రాసారు. ఆ books దిగుమతి అయ్యి ఇప్పుడు university, college లో భోదిస్తున్నారు. 3) ఇప్పుడు bible ఏమి చెబుతుందో చూద్దాము.. యోబు 26:14- మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము. దేవుడు చేసిన కార్యాలలో తెలుసుకున్నది కొంచమే అంటున్నాడు యోబు. ఈ మధ్య శాస్త్రవేత్తలు ఈ ప్రకృతి పెద్ద శబ్దము ద్వార పుట్టిందని,దానికి big bang theory అని అంటున్నారు. శబ్దము వలన ప్రకృతి పుట్టినదని 25 years పూర్వము చెప్పారు శాస్త్రవేత్తలు. మరి శబ్దము ఏంటి, ఎక్కడ నుంచి వచ్చింది అంటే మాకు తెలియదు అంటున్నారు. శబ్దము అనగా మాట. ఆదికాండము 1:13-వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. ఇలా ఆదికాండము 1:3,6,9,11,12 లో దేవుడు పలుకగా నిర్మింపబడ్డయి. దేవుని మాట అనగా శబ్దము. ఈ ప్రకృతి ఎలా నిర్మాణము అయ్యాయి అని bible ను అడిగితే దేవుని మాట అని అంటుంది. హెబ్రే 11:3- దేవుని వాక్యము వలన నిర్మాణమయ్యాయి. అంటే ప్రకృతి దేవుని వాక్యము ద్వార ఏర్పడ్డయి.
a) క్రీ శ 1648 లో issac newton భూమి సున్యములో వేలడుతుందని చెప్పాడు. యెబు 26:7 లో శూన్యము పైని భూమి వ్రేలాడ చేసెను. క్రీపు 1400 లో యెబు చెప్పాడు. క్రీ శ 3000 పూర్వము bible చెప్పింది.
b) క్రీ శ 1543 లో nicolus copernicus భూమి కదులుతుంది అందుకే కాలాలు మారుతుంది అని చెప్పాడు. యెబు 9:6లో భూమిని కదిలించువాడు ఆయనే. కీర్తనలు 74:16,17 లో సూర్యచంద్రులను నీవే నిర్మించితివి. వేసవి, చలి కాలము నీవే కలుగజేసితివి. క్రీపు 700 లో యెబు చెప్పాడు. క్రీ శ 2300 years పూర్వము bible చెప్పింది.
c) క్రీ శ 1610 లో galileo galile telescope invented. చంద్రునికి స్వయము ప్రకాశ శక్తీ లేదని, సూర్యుడు ఉంటేనే చంద్రుడు ప్రకాసిస్తాడాని చెప్పాడు. యోబు 25:5, యోబు 13:10 లోయోబు చెప్పేసాడు. క్రి పు 740 లో bible చెప్పింది. క్రీ శ 2754 years పూర్వము bible చెప్పింది
d) క్రీ శ 1662 లో robert boyle గాలికి భారువు ఉందని చెప్పాడు. యోబు 28:25లో గాలికి ఇంత బరువు ఉండవలసిన అయన నియమించెను. క్రీపు 1400 bible చెప్పింది. క్రీ శ 3004 years పూర్వము bible చెప్పింది.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంగతులు శస్త్రవేత్తలు చెప్పక ముందే bible చెప్పింది. మొన్న మొన్న ఈ విషయాలు చెప్పిన శాస్త్రవేత్తలు గోప్పవారా? లేక కొన్ని వెల years క్రితము చెప్పిన bible గొప్పదా?
conclusion:: ప్రకృతి ని కలిగించిన దేవుడు, తన ప్రియ కుమారుడిని పంపిన దేవుడు, క్రీస్తు ఈ లోకానికి వచ్చి చూపిన దేవుడే దేవుడు. .

జెకర్యా గ్రంథం

ఇశ్రాయేలు అష్షూరు సైన్యములకు లొంగిపోయి బాబులోను దాస్యములో 70 సం||లు

రచించిన ఉద్ధేశం: యెహోవా దేవుడు తాను నియమించిన ప్రవక్తలద్వారా తాను ఏర్పరచుకొనిన ప్రజలకు బోధించుటకు, హెచ్చరించుటకు, చక్కదిద్దుటకు వాడుకుంటాడు అని జెకర్యా ప్రవక్త తెలియజేస్తున్నాడు. అయితే ఆ ప్రజలే గైకొనలేని వారుగా ఉంటున్నారు. ఆ అవిధేయతవలననే వారు శిక్షకు పాత్రులైరి. అయితే కొన్ని సందర్భాల్లో కూడా ప్రవచనం అవినీతికి పాల్పడుతుంది అని కూడా ఈ గ్రంథం లో నిక్షిప్తమైనది. నిబంధన కాలముల మధ్యలో ప్రవచనాలు యూదులకు ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో యే ప్రవక్త కూడా దేవుని వాక్కు తెలియ జేయడానికి లేడు అని చరిత్ర చెబుతుంది.
ఉపోద్ఘాతం: దాదాపు క్రీ.పూ. 722లో ఉత్తర రాజ్యామైన ఇశ్రాయేలు అష్షూరు సైన్యములకు లొంగిపోయి బాబులోను దాస్యములో 70 సం||లు నుండిరి. తరువాత దాదాపు క్రీ.పూ. 586లో పారశీక మహా సామ్రాజ్యము బాబులోనును జయించి, పారశీక సామ్రాజ్యపు నూతన విదేశీ విధానము మూలమున యుదులు స్వదేశమునకు మరలవలెనని, రాజైన నెబుకద్నేజరు నాశనము చేసిన దేవాలయములను పునర్నిర్మాణాలు-గావించవలెనని కోరేషు ఆజ్ఞ వెలువడెను.
ఆ దేశపు అధికారియైన జెరుబ్బాబేలు మరియు యాజకుడైన యెహోషువ యొక్క న్యాయకత్వంలో సుమారు 50,000 మంది యూదాకు తిరిగివచ్చిరి వారిలో జెకర్యా ఒకడు. వారు తిరిగి వచ్చిన వెంటనే పూర్వప్రకారంగా బలిపీఠమును కట్టి దేవునికి బలి అర్పించిరి మరియు రెండవ సంవత్సరమున దేవాలయమునకు పునాది వేసిరి (ఎజ్రా 3:1-6, 8-13,5:16) కాని వెలుపటి ఆటంకములు, లోపటి సమస్యల మూలముగాను దేవాలపు నిర్మాణము 16 సం. లు ఆటంకపరచబడింది. అటు తరువాత దాదాపు క్రీ.పూ. 522-586లో పారసిక దేశపు రాజైన దర్యావేషు పాలనలో దేవాలయ నిర్మాణం ప్రారంభమయింది. దర్యావేషు పాలనలో రెండవ సంవత్సరమున క్రీ.పూ. 520లో యెహోవా హగ్గయిని దేవాలయ పనుల నిర్మాణమునకు ప్రోత్సాహించెను. హగ్గయి నాలుగు నెలల వ్యవధిలో నాలుగు వర్తమానములను అందించి తన పరిచర్యను ముగించుకొనెను. హగ్గయి తరువాత జెకర్యా పనిని చేపట్టెను. జెకర్యా అను పేరునకు “యెహోవా జ్ఞాపకము చేసుకొనెను” అని అర్ధము. జెకర్యా గ్రంధమంతా ఇదే భావముగల సందేశము. యెహోవా, తాను ఏర్పరచుకొన్న ప్రజల యెడల బహుగా కోపగించుకొనెనని మరియు వారు తమ దుష్క్రియలను మాని తమ నడతలను శుద్ధిచేసుకొనవలెనని ప్రవక్తయైన జెకర్యా ద్వారా వర్తమానము అందించెను. ఇశ్రాయేలీయుల మూల పితరులతో తాను చేసిన నిబంధనలను యెహోవా ఇప్పుడు జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. దీనిని బట్టి వారు ఆశీర్వదింపబడిన వారుగా నందురు.

రక్షణ అందరికి కలుగుతుంది అని జెకర్యా గ్రంధం యొక్క ముఖ్య ఉద్ధేశం. భూదిగంతములనుండి అనేకులు దేవుని ఆరాధించుదురు అనియు ఆయనను వెంబడించుదురు అని జెకర్యా ఆఖరి అధ్యాయాల ప్రకారం మనం గమనించగలం. అనగా అందరూ రక్షణ పొందుదురు “ఎందుకంటే అది దేవుని స్వభావం కాబట్టి” అనే సార్వత్రిక వాదం కాదు గాని జాతి మత కుల బేధాలు లేకుండా అందరూ రక్షింపబడాలి అని దేవుని యొక్క ముఖ్య ఉద్ధేశం. అయితే దేవుడొక్కడే సార్వభౌమాధికారం గలవాడు ఆయనకు విరోధమైనది ఏదీ అయన ముందు నిలువదు అని జెకర్యా ప్రవచించాడు. అయితే దేవుడు తాను చేయబోయే సంగతులను దర్శన రూపంలో జెకర్యా ద్వారా తెలియజేసి తాను లోకానికి ప్రకటించబోయే సంగతులను ఈ ప్రవక్త ద్వారా వివరించాడు. అంతేకాకుండా ఈ లోకము దాని సరిహద్దులు దేవుని అధీనములో ఉన్నవి అని చివరి అధ్యాయాలలో గమనించవచ్చు. సారాంశం: పరిశుద్ధుడైన దేవుడు కేవలం నిష్కపటమైన ఆరాధనను మరియు మంచి నడవడిని మననుండి కోరుతున్నాడు. ఆయన యొక్క సత్య సువార్తను మనం ఇతరులకు తెలియజేయుటలో ఒక పనిముట్టు వలే పనిచేయవలెనని గ్రహించాలి..

ఎస్తేరు గ్రంథం
ఎస్తేరు గ్రంథం;-----అధ్యాయాలు : 10, వచనములు : 167
గ్రంథకర్త : మొర్దెకైగా (9:29) (రచనా శైలిని తీసికొని ఈ పుస్తకమును ఎజ్రాయో, నెహెమ్యాయో వ్రాసి యుండవచ్చు) రచించిన తేది : దాదాపు 133 సం. క్రీ.పూ
మూల వాక్యాలు : 4:14 “నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న యెడల యూదులకు సహాయమును విడుదలయు మరియొక దిక్కునుండి వచ్చును గాని, నీవును నీ తండ్రి యింటివారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పుమనెను”.
రచించిన ఉద్ధేశం: దేవుని సార్వభౌమాధికారాన్ని తెలియజేసి తన ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ, సంరక్షణ ఎంత గొప్పదో, మహా మేధావులను సహితం తన స్వాధీనంలో ఉంచుకొని ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవలీలగా మార్చగల దేవుని శక్తి సామర్ధ్యాలను లోకానికి ప్రత్యక్షం చేయడమే ఈ గ్రంథం ముఖ్య ఉద్దేశం. ఈ పుస్తకంలో ఎక్కడ కూడా దేవుడు, ధర్మశాస్త్రము, యెరుషలేము, ప్రార్థన అనే మాటలు కనిపించవు. కాని ప్రతీ సందర్భంలో పరోక్షంగా దేవుని హస్తం, దేవుని ప్రేమ, దేవుని బిడ్డల ప్రార్ధన, దేవుని కాపుదల కనిపిస్తాయి. ప్రత్యేకంగా మన దేశం పేరు ఈ గ్రంధంలోనే హిందూ దేశము అని ప్రాయబడడం విశేషం.

ఉపోద్ఘాతం: స్త్రీల పేర్లలో కనబడు గ్రంథములలో ఇది ఒకటి. ఆదిమ హెబ్రీ బాషలో ఎస్తేర్తు గ్రంథం “మెగిల్లాహ్” అని ప్రాముఖ్యముగా యూదుల పూరీము పండుగ వేడుకల్లో పర్ణశాలలో బిగ్గరగా చదువబడిన గ్రంథం. ప్రపంచ చరిత్రను, తన ప్రజలైన ఇశ్రాయేలీయులను తన హస్తాల్లో ఉంచుకొన్న దేవుడు, కొంత మంది వ్యక్తులను మరుగున ఉంచి, తన స్వంత సమయములో తన మహిమార్ధం పనిచేసేలా వారి హస్తాలను కదిలించాడు. అలాంటి వారిలో ఎస్తేరు ఒకటి. పరిశుధ్ధ గ్రంథంలో నేహేమ్యా తరువాత ఎస్తేరు గ్రంథం వచ్చినప్పటికిని నేహెమ్యా కార్యక్రమ-ములకు 30సం||లకు ముందే ఎస్తేరు కార్యక్రమములు జరిగినవి. ఈ కార్యములు జరిగిన స్థలము పారసీక సామ్రాజ్యము యొక్క రాజధానియైన షూషనులోను, చక్రవర్తి అంతఃపురములో జరిగినవి. పర్షియా మహా సామ్రాజ్యానికి దర్యావేషు కుమారుడైన అహశ్వేరోషు చక్రవర్తిగా ఉన్నాడు. ఇతని సామ్రాజ్యం హిందూ దేశము నుండి కూషు దేశం వరకు 127 సంస్థానములు. పారసీక, మాదీయ దేశాల పరాక్రమశాలులను, సంస్థానాధి-పతులనందరినీ ఆహ్వానించి దాదాపు ఆరు మాసములు తన రాజ్య ప్రభావైశ్వర్యాలను, మహాత్యాతిశయ ఘనతలను ప్రదర్శిస్తూ వచ్చాడు. ఏడురోజుల విందు తరువాత తన భార్య అయిన వష్తీ రాణి అందాన్ని చూపించాలనుకున్నాడు. కాని అవిధేయురాలైన వష్తీ రాణి యొక్క మొండితనము వల్ల రాజు కోపగించుకొని తనను రాణి పదవి నుండి తొలగించాడు. అంతేగాక ప్రతీ యింటిలోను స్త్రీలు పురుషులకు లోబడాలని దేశమంతటా చాటించాడు. తరువాత యుద్ధములలో ఓడిపోయి నాలుగు సంవత్సరములు గడిచినపిమ్మట ఒకనాడు అనేక మంది కన్యకలలో ఒకతిగా ప్రత్యేకించబడి ఎన్నుకొనబడింది యూదురాలైన “హదస్సా”. హదస్సా అనగా గొంజి చెట్టు. గొంజి చెట్టు అన్ని వృక్ష జాతులలో చిన్నది. గొంజి చెట్టు లాంటి సామాన్య అనాధ బాలికయైన హదస్సను దేవుడు ఎస్తేరు అనగా నక్షత్రంగా మార్చి దుఃఖాంధ-కారంలో మునిగిపోయిన ప్రజలమధ్య ప్రకాశింపజేసాడు.
రాజు దగ్గర ఎంచబడిన స్త్రీలంతా ఉపపత్నులుగా ఎంచబడ్డారు కాని ఎస్తేరు జీవితం పట్ల దేవునికి గల ఉన్నతమైన ఉద్దేశం ప్రకారం అహశ్వేరోషు ఆమె పట్ల ప్రేమను, దయను కలిగించాడు. ఈ విధంగా దేవుని నిర్ణయం చొప్పున ఆమె రాణిగా చేయబడింది. ఆమె గుణ లక్షణాలు అందుకు దోహదపడ్డాయని చెప్పవచ్చు.
ఎస్తేరు చిన్న నాటినుండి సంరక్షకునిగా ఉన్న మొర్దెకైకి సంపూర్ణ విధేయత చూపించింది. దేవుని సహాయం కొరకు చూస్తూ మొర్దెకై సలహా ప్రకారం పని జరిగించేందుకు తన ప్రాణాన్ని సహితం లెక్కచేయలేదు. తరువాత అహశ్వేరోషు రెండవ సంస్థానములో ఉన్న ప్రధాన మంత్రి, అమలేకీయుల హగగు వంశాస్తుడైన హామాను యూదులను నాశనము చేయవలెనని తాకీదులు వ్రాయించు కొనవలెనని పనిన పన్నాగ-మును దేవుడు ఎస్తేరు ద్వారా తన ప్రజలను రక్షిస్తాడు. అధికార దుర్విని-యోగామునకు పాల్పడిన హామాను ఆతని కుటుంబమంతా ఉరితీయించబడ్డారు. తరువాత మొర్దెకై ఆ దేశములో రెండవ మానవుడిగా హెచ్చింపబడ్డాడు. ఆయన యూదుల యొక్క సంరక్షకునిగా మార్చబడడం ఈ గ్రంథం ముగింపులో గమనించగలం.
సారాంశం: మన జీవితాల్లో కొన్ని పర్యాయములు ఎన్నిక లేనివిగా, అల్పమైనవిగా కనిపించవచ్చు. మన జీవితంపట్ల దేవుని ప్రణాళిక ఎట్టిదో, మన ద్వారా ఆయన ఏ సంకల్పమైతే నేరవేర్చుకొనబోతున్నాడో మనకు అర్ధం కాదు. కాని దేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతీ పరిస్థితిని సంతోషంగా స్వీకరిస్తే, హదస్సాను ఎస్తేరుగా మార్చిన దేవుడు ఎందుకూ పనికిరాము అని అనుకుంటున్నా మనలను దేవుడు అనేకులకు దీవెనకరంగా చేస్తాడు. కనుక అన్ని విషయాల్లో దేవుని పట్ల విధేయత చూపించే వారముగా నడచుటకు ప్రయత్నిద్దాం.

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget