Halloween Costume ideas 2015

Praying the Tabernacle preisthood pattern

దైవప్రత్యక్ష గుడారపు యాజకత్వ ప్రార్ధనా సరళి



దైవప్రత్యక్ష గుడారపు  యాజకత్వ ప్రార్ధనా సరళి 
ప్రార్ధన-జీవపు  సరళి 
మూలము : బెర్న్ జుమ్పనో 




ప్రత్యక్ష గుడారమును గూర్చిన ధ్యానము అత్యంత లోతైన, గూఢమైన అనుభవములోనికి మనల్ని నడిపిస్తుంది. ప్రత్యక్ష గుడారము యొక్క ఉద్దేశము, మనలను అతిపరిశుద్ధ స్థలములొనున్న పరిశుద్ధ దేవుని సన్నిధిలోకి నడిపింపబడుట  ద్వారా మనము దేవునితో సహవాసము కలిగియుండుటయే .అతిపరిశుద్ధ స్థలములొ దేవుని ప్రసన్నత మనము అనుభవించగలము దేవునితో స్థిరమైన, శాశ్వతమైన అనుభవములొకి నడిపించబడతాము .

దేవుని సన్నిధిలో మనము ప్రతిరోజు నిలువబడుట క్రైస్తవ విశ్వాస నడతలో తప్పనిసరి. హెబ్రీ 8:5 "నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్తపడుము". ప్రత్యక్ష గుడారము ద్వారా దేవుడు మనకు ఒక మాదిరి లేక ఒక సరళి ని అనుగ్రహించాడు ఆ సరళిని అనుసరించుట మనకు శ్రేయస్కరము.
ప్రత్యక్ష గుడారములో 8 దశలున్నవి. ప్రతి దశలోను మన ప్రార్ధన జీవపు సరళి ప్రతిఫలించాలి.

(1) Eastern Gate - తూరుపు ద్వారము
(2) Doorway of the Tent of Meeting - దైవప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము
(3) Brazen Laver- ఇత్తడి గంగాళము
(4) Brazen Alter - ఇత్తడి బలిపీఠము
(5) Lamp-stand - దీపస్తంభము
(6) Table of Shew-bread- దర్శనీయాపూపము (7) Alter of Incense - ధూపవేదిక
(8) Holy-of-Holies - అతి పరిశుద్ధ స్థలము
1:- Eastern Gate-తూరుపు ద్వారము:
ప్రభువైన యేసు! నీవు మార్గమైయున్నావు , సత్యమైయున్నావు, జీవమైయున్నావు. నా మార్గము, నా జీవము మరియు నా సత్యము నీవే . కృతజ్ఞతార్పణలు చెల్లించుచు నీ గుమ్మములలో ప్రవేశించుచున్నాను, కీర్తనలు పాడుచు నీ ఆవరణములలో ప్రవేశించుచున్నాను.  నా మర్గాములన్నిటిలో నేడు నేను నిన్ను గుర్తించుచున్నాను మరియు నీకు కృతజ్ఞ్యత, స్తుతి చెల్లించుచున్నాను ఎందుకంటే నా మార్గములను నీవు సరాళము చేయుచున్నావు. నీవే స్తుతికి పాత్రుడవు అర్హుడవు యోగ్యుడవు . నీ విస్వాస్యతను బట్టి నీకు కృతజ్ఞ్యతలు. నా కొరకు జరిగించిన శిలువ యాగమునుబట్టి నేడు నిన్నుకీర్తిస్తున్నాను, స్తుతిస్తున్నాను. ముగించబడిన శిలువ కార్యము ద్వారా నాకనుగ్రహించబడిన పరిత్రాణము స్వస్థత విడుదల మరియు నూతన జీవము నుబట్టి నీకు కృతజ్ఞ్యతలు తెలుపుచున్నాను. నీవనుగ్రహించిన సకల ఆశీర్వాదములకై, నీకు స్తుతులు స్తోత్రములు సమర్పించుచున్నాన.

2:- Doorway of the Tent of Meeting-దైవప్రత్యక్ష గుడారము యొక్క ద్వారము:
ప్రభువా, నా హృదయమును పరిశోదించి నీవు చూచినట్లు నా హృదయములోని మరుగైయున్న దోషములను నాకు చూపుము. నీకు అయాసకరమైన అంగీకారముకాని ఆలోచనలు తలంపులు ఉద్దేశములు నాలో ఉన్నయెడల నాకు బయల్పరచుము. ఈ పాపములు: శరీరాశ, నేత్రాశ , జీవపు డంబము, (పరిశుద్దాత్ముడు చూపిన పాపములను ఒప్పుకోనుడి ) నాలో ఉన్నవి వాటిని నేను ఒప్పుకోనుచున్నాను వాటి కొరకు పశ్చాత్తాప పడుచున్నాను, వాటిని తిరస్కరిస్తున్నాను. ఈ పాపముల నిమిత్తము నాకు మిష లేదు వాటికి బాధ్యుడను నేనే నన్ను నేను విమర్శించుకోనుచు, ఒప్పుకోనుచున్నాను . అవిధేయత వలన నీ పరిశుద్దాత్మను నొప్పించాను వీటన్నిటి మిత్తము యేసు నామములో క్షమార్పణ కోరుచు క్రీస్తుయేసు నందు విశ్వాసముంచుట ద్వారా క్షమార్పణ పొందుచున్నాను. (ఇప్పుడు ప్రార్ధన తైలముతొ నుదుటిమీద అభిశేకించుకొండి లేదా నోటితో పలకండి ).

ప్రభువా, నీవు అనుగ్రహించిన సర్వాంగ కవచమును ధరించుచున్నాను: రక్షణయను శిరస్త్రాణము - నీవే నా పరిత్రాణ కర్తవు; నీతియను మైమరువు-నీవే నా పాపరహితత్వము; నడుముకు సత్యమును దట్టి-నీవే నా సత్యము; పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు- నీవే నా సమాధానము; విశ్వాసమను డాలు-నీవే నా కేడేము, నా విశ్వాసమునకు కర్తవు దానిని కొనసాగించువాడవు; మరియు వాక్యమను ఆత్మ ఖడ్గము- నీవే నా సజీవమైన నిత్యమైన రెండంచులుగల ఖడ్గము.

యేసు, నీ ప్రశస్తమైన రక్తముతో వీరిని కప్పుచున్నాను ( మీ ప్రియుల-పేర్లు వారి పరిస్థితులను వారు కలిగిన వాటిని) మా శరీరములను సజీవ యాగముగా అవయువములు నీతియుక్తములుగా నీకు సమర్పించుకొనుచున్నాను. విశ్వాస నివేదము ద్వారా నేను ప్రార్ధించిన ప్రతిది కలిగియున్నాను అని నమ్ముచున్నాను నీ యందు నమ్మికతో, యేసు నామములో ప్రకటిస్తున్నాను. స్తుతి వస్త్రమును ధరించియున్నాను నీవే స్తుతికి అర్హుడవు, తండ్రితో ఏకమైయున్నపవిత్రాత్ముడవు.

(3) Brazen Laver - ఇత్తడి గంగాళము: ఈ దినమందు నీ వాక్యము యొక్క శక్తిని ఒప్పుకోనుచున్నాను. ఓ ప్రభువా! సాతానును మొదట బంధించుచున్నాను. ప్రధానులను అధికారులను ప్రస్తుత అంధకార సంబధులగు లోకనాథులను ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములను ప్రతి విధమైన చీకటి శక్తులను యేసు నామములో బంధించుచున్నాను. వారికి అప్పగించబడిన నమూనాలు , కుట్ర, పన్నాగం , యోచన లనుండి నేను మా ప్రియులు, మేము మాకు కలిగిన సమస్తమును వాటినుండి విడిపించు కొనున్నాను. వాటిని వాటి సహాయభూతసైన్యమును యేసు నామములో బంధించుచున్నాను. వాటి ప్రయత్నములను వ్యర్ధపరుస్తున్నాను కొట్టివేస్తున్నాను. వాటి ప్రయత్నములు ఎన్నడును వ్యక్తము కాకుండును గాక! నిష్ఫలమగును గాక! అమలు జరపబడకుండును గాక! ప్రతికిప్రతి నిషేదిస్తున్నానని యేసు నామములో ప్రకటిస్తున్నాను.

నీ వాక్యముతో ఎకీభవించుచున్నాను వాక్యము ప్రకటించుచున్నది "నీకు విరోధముగా రూపింపబడిన యే ఆయుధమును వర్ధిల్లదు న్యాయవిమర్శలో నీకు దోషారోపణచేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు యెహోవాయొక్క సేవకుల నీతి నావలన కలుగు చున్నది; ఇది వారి స్వాస్థ్యము " పలపలకబడిన వాక్యమును బట్టి నీకు స్తుతి, కృతజ్ఞ్యత చెల్లిస్తున్నాను ప్రభువా. నీ వాక్యముతో ఎకీభవిస్తున్నాను నేను క్రీస్తుతో మరణించినాను, నా ప్రాచీన స్వభావము నీటి బాప్తీస్మం ద్వారా పాతిపెట్టబడినది. ఆ పాత స్వభావము మరి ఎన్నడును తిరిగి ఎత్తబడదు, రాదు.

(4) Brazen Alter-ఇత్తడి బలిపీఠము: ప్రభువైన యేసు, నీకు ఉన్నతమైన స్తుతి హృదయపూర్వకమైన కృతజ్ఞ్యత చెల్లిస్తున్నాను నేను పొందవలసిన శిలువ మరణము నా బదులు స్వీకరించావు. నీ ప్రశస్తమైన రక్తమును నా పాపము మరియు మా ప్రియుల పాపములకు ప్రాయశ్చిత్త బలిగా అర్పించావు మమ్మల్ని పాపపు శక్తినుండి విమోచించావు. మాతో నూతన నిబంధన స్థాపించావు. నీకు సమస్తమైన మహిమ ఘనత కలుగును గాక.

ప్రభువైన యేసు! నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నన్ను పునీతుణ్నిగా(Justification ) ఎంచినందు బట్టి. నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నాకు ప్రతినిధానము(Substitution ) వహించినావు. నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నీవే తండ్రితో నాకు శాంతి చేసావు (Propitiation ). నీకు స్తుతి, మహిమ, ఘనత , ఆరాధన, కృతజ్ఞ్యత సమర్పిస్తున్నాను నీవే నా అభిజ్ఞానమైయున్నవు (Identification ).

ప్రభువా! నా హృదయములో నీకు అంగీకారముకాని ఆలోచన, మాట, చేత నడత ఉన్నయెడల దానిని తీసివేయుము. నా హృదయమును సున్నతి చేయమని అడుగుచున్నాను. ప్రభువా, నీకు అనుమతినిస్తున్నాను దానిని నాలోనుండి వాక్యమనే ఖడ్గముతో పెరికివేయుము. ముఖ్యముగా (ఈ పాపమును,---) నాలోనుంచి తీసివేయుము. దాని నిమిత్తము నేను పశ్చాత్తాప పడుచున్నాను దానిని తిరస్కరిస్తున్నాను నీ క్షమార్పణ కోరుచున్నాను. నీయందు విస్వాసముంచుట ద్వారా మా పాపములు క్షమించబడియున్నవని నమ్ముచున్నాను.

రోమా 6 ను ఆధారము చేసికోనుచు నా ప్రాచీన పురుషుడు నీతో శిలువ మరణం పొందాడని నీటి బాప్తిస్మము ద్వారా పాతిపెట్టబడ్డాడని, ప్రతిదినము పాపము నిమిత్తము నేను శిలువ మరణంలో పాలు పొందుచున్నాను నన్ను నీకు సమర్పించుకొంటున్నాను. పరిశుద్ధాత్మకు లోబడుచు నీ శిలువ కార్యము నాలో కాపాడుకోనుచున్నాను. నేను ఒప్పుకొనుచున్నాను నేనొక నూతన సృష్టి నాలో పాతవి గతించెను సమస్తము క్రోత్తవి ఆయెనని .

(5) Lamp-stand- దీపస్తంభము : ప్రభువా! నేను నీకు లోబడుచున్నాను. నన్ను నీ పరిశుద్ధాత్మ ద్వారా దైవికముగా లోబర్చుకొనుము నీ కొరకై ప్రత్యేకించి ఉపయోగించుకొనుము. ఆత్మ వరములతో నీ పరిచర్య జరిగించుటకు కృపనిమ్ము వివేచనాత్మ అనుగ్రహించు. విశ్వాస నివేదము ద్వారా నేను ప్రార్ధించిన ప్రతిది యేసు నామములో పొందియున్నాను అని నమ్ముచున్నాను . (ఆత్మలో ప్రార్ధిస్తూ .. గమనించండి .. బుద్ధి వాక్యము, జ్ఞ్యాన వాక్యము , అత్మలవివేచన వరముల కొరకు లేదా ఇతర ఆత్మ వరములు - ప్రవచన, పరిశుద్ధాత్మ బాప్తీస్మం మొ:. అభివ్యక్తమైనవేమో ).

(6) Table of Shew-bread-దర్శనీయాపూపము: ప్రభువా , నీతో నీ నూతన నిబంధనలో పాలుపంచుకుంటున్నాను విస్వాసముద్వారా నీ శరీరమును నీ రక్తమును స్వీకరిస్తున్నాను. (రొట్టె, మరియు ద్రాక్షరసమును స్వీకరించండి పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగితే ). నీ వాక్య ప్రత్యక్షత వెదకుచున్నాను, దేవా! నీ వాక్యము గ్రహించుటకు నా హృదయము వీప్పుమని యేసు నామములో అడుగుచున్నాను.

(7) Alter of Incense-ధూపవేదిక: ప్రభవా! నేను మధ్యవర్తిత్వము వహిస్తూ మనవిచేసుకుంటున్నాను, యేసు నామములో వీరిని( పూర్తి పేర్లు ... ) వారు ఎదుర్కుంటున్న పరిస్థితులను నీకు అప్పగిస్తున్నాను (ఇది వ్యక్తిగత ప్రార్ధన సమయము .. ఆత్మలో ప్రార్ధించండి ) ప్రభూ ! నీకు స్తుతి చెల్లిస్తున్నాను కృతజ్ఞ్యత చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నీవే నా మధ్యవర్తివి నీ కృప ద్వారా నీ చిత్తాన్ని నేను జరిగిస్తున్నాను కాబట్టి నేను విశ్వసిస్తున్నాను నేను అడిగినవన్నీ పొందియున్నానని. ఆమెన్!

(8) Holy of Holies -అతి పరిశుద్ధ స్థలము : తండ్రీ! యేసు నామములో నీ కృపాసనము దగ్గరకి ధైర్యముగా చేరియున్నాను. తండ్రియైన దేవా! సర్వశక్తిమంతుడా! మాట్లాడు నీ దాసుడు ఆలకించును. ( ఆలకించండి .. మెల్లనైన స్వరము లేదా వాక్య జ్ఞ్యానము కొరకు , భావాలను బట్టి కాదు గాని మీరు ఇప్పుడు దేవుని సహవాసములొ ఉన్నారు మీ స్వంత మాటలతో ప్రార్ధించండి .. జవాబు కొరకు కనిపెట్టండి .. అయన ఆత్మ మీ ఆత్మతో సాక్ష్యమిచ్చును. హృదయములో ఆయన మాట కొరకు వేచిఉండండి)
                
                                  షాలోం. 
Labels:

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget