Halloween Costume ideas 2015

Since captive in Babylon to return to Jerusalem and build walls to badadam

5వ భాగం: బబులోనులో బంధీలుగా ఉన్నప్పటి నుండి యెరూషలేము గోడలు తిరిగి నిర్మించబడడం వరకు
బబులోనులో బంధీలుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయుల విశ్వాసం ఎన్నోసార్లు పరీక్షించబడింది. షద్రకు, మేషాకు, అబేద్నెగో కాలుతున్న అగ్నిగుండములో వేయబడ్డారు, కానీ దేవుడు వాళ్లను అందులోనుండి సజీవంగా బయటకు తెచ్చాడు. ఆ తర్వాత బబులోను మాదీయ పారసీకుల చేతిలో ఓడిపోయాక, దానియేలు సింహపు గుహలో వేయబడ్డాడు, కానీ దేవుడు సింహాల నోళ్ళు మూయడం ద్వారా ఆయనను కూడా రక్షించాడు.

చివరకు, పారసీక రాజైన కోరెషు ఇశ్రాయేలీయులను విడుదల చేశాడు. బబులోనుకు బంధీలుగా తీసుకెళ్ళబడిన 70 సంవత్సరాల తర్వాత వాళ్లు తిరిగి తమ స్వదేశానికి వచ్చారు. వాళ్లు యెరూషలేముకు తిరిగి వచ్చిన తర్వాత చేసిన మొదటి పనులలో యెహోవా ఆలయ నిర్మాణ పనిని ప్రారంభించడం ఒకటి. అయితే, త్వరలోనే శత్రువులు వాళ్ల పనిని ఆపుచేశారు. కాబట్టి వాళ్ళు యెరూషలేముకు తిరిగి వచ్చిన 22 సంవత్సరాల తర్వాత చివరకు ఆలయాన్ని పూర్తి చేశారు.

ఆ తర్వాత, ఆలయాన్ని అలంకరించడానికి ఎజ్రా తిరిగి యెరూషలేముకు రావడాన్ని గురించి మనం తెలుసుకుంటాం. అది ఆలయ నిర్మాణం పూర్తయ్యాక దాదాపు 47 సంవత్సరాల తర్వాత జరిగింది. ఎజ్రా వచ్చిన 13 సంవత్సరాల తర్వాత నెహెమ్యా పడిపోయిన యెరూషలేము గోడలను తిరిగి నిర్మించడానికి సహాయపడ్డాడు. అంటే అయిదవ భాగం మొత్తం 152 సంవత్సరాల చరిత్రను వివరిస్తోంది.



ఈ భాగంలో

77వ కథ: వాళ్ళు సాగిలపడలేదు

78వ కథ: గోడమీద చేతివ్రాత

79వ కథ: సింహాల గుహలో దానియేలు

80వ కథ: దేవుని ప్రజలు బబులోనును విడిచి వెళ్ళడం

81వ కథ: దేవుని సహాయంపై నమ్మకం ఉంచడం

82వ కథ: మొర్దెకై, ఎస్తేరు

83వ కథ: యెరూషలేము గోడలు

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget