రేపు రాత్రి చనిపోవాల్సి వస్తే..............? గొప్ప సువార్తికుడు మరియు మెథడిస్టూ సంఘ వ్యవస్తాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఓ స్త్రీ ఇలా ప్రశ్నించింది.
గొప్ప సువార్తికుడు మరియు మెథడిస్టూ సంఘ వ్యవస్తాపకుడైన జాన్ వెస్లీ గారిని ఒకరోజు ఓ స్త్రీ ఇలా ప్రశ్నించింది. అయ్యా! రేపు రాత్రి 12 గంటలకు మీరు చనిపోతున్నారు అని మీకు తెలిస్తే...! మిగిలిన సమయాన్ని ఎలా గడుపుతారు? అందుకు జాన్ వెస్లీ చాల తీరిగ్గా... ఈరోజు నేను యేఎ పనులు చేయాలనీ ముందుగా నిర్ణయించుకున్నానో అనగా, " ఈరోజు సాయంత్రం గ్లొసెస్తర్ అనే ప్రాంతం లో సువార్త ప్రకటిస్తాను. ఆ తర్వాత రేపు ఉదయం 5 గంటలకు వాక్య పరిచర్య చేస్తాను. రేపు మద్యాహ్నం ట్యూకిస్బరి లో ప్రసంగిస్తాను. రేపు సాయంత్రం మా కమిటి మీటింగ్ వుంది అది చూసుకుంటాను. ఆ తర్వాత రెవ. మార్టిన్ ఇంటిని దర్శించి వారితో కలిసి మాట్లాడుకొని, ప్రార్ధించి 10 గంటలకు నా గది చేరి నన్ను నా దేవుని హస్తాలకు అప్పగించుకొని మంచంమీద విస్రమిస్తను. మీరు అన్నట్టుగా అర్ధరాత్రి 12 గంటలకు చనిపోతే మహిమ లోకంలో కళ్ళు కళ్ళు తెరుస్తాను." అని గొప్ప నిస్చయతతో జవాబిచ్చెనట, సిద్దపాటు కలిగిన ఆ గొప్ప సువార్తికుడు.జాన్ వెస్లీ భక్తుడు ఎంత గొప్ప సిద్దపాటు కలిగి ఉన్నాడో చూసాము కదా! బైబిల్ సెలవిస్తుంది " నరుని ఆయువు గడ్డివలె నున్నది అడవి పువ్వు పూయునట్లు వాడు పూయును.దానిమీద గాలి వీచగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. (కీర్తన 103)", " సర్వశరీరులు గడ్డియై యున్నారు వారి అందమంతయు అడవిపువ్వువలె ఉన్నది. యెహోవా తన శ్వాసము దానిమీద ఊదగా గడ్డి యెండును పువ్వు వాడును నిశ్చయముగా జనులు గడ్డివంటివారే. గడ్డి యెండిపోవును దాని పువ్వు వాడిపోవును మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. (ఎషయ 40)". అవును ఏదో ఒక రోజు పువ్వువలె మనము వాదిపోవాల్సిందే, రాలిపోవాల్సిందే కానీ, రాలిపోయిన తర్వాత అనగా మనము కన్ను మూసినా తర్వాత పరలోకంలో కళ్ళు తెరుస్తావో లేక నిత్య నరకంలో కళ్ళు తెరుస్తావో అది నీ సిద్దపాటుపై ఆధారిపడి వుంటుంది.
సూటిగా ఒక ప్రశ్న మనలను మనం వేసుకుందామ? ఈ రాత్రి నేను కన్ను మూయవాల్సి వస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తానా? ఆ విశ్వాసం, ఆ నిశ్చయత, ఆ నీరిక్షణ నీవు కలిగి యున్నావా? లేక నువ్వు చేసిన పాపములను బట్టి , నీ నటనా జీవితన్నిబట్టి, నీ రహస్య పాప బ్రతుకునుబట్టి, నీలో ఇంకా దాగివున్న, మిగిలివున్న, వదిలిపెత్తలేకున్న పాపిష్టి చేష్టలను బట్టి నరకములో కళ్ళు తెరుస్తావా? ఒక్క సరి ఆలోచించు, నీ పాపమును విడచి వాకయ్నుసారముగా జీవించే వాడిగా నిన్ను నీవు కనపరుచుకొని పరలోకంలో సుస్తిరమైన స్థానం సంపాదించు.
"రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే. యాకోబు 4:14" నిథ్యజీవమా? లేక నిత్య నరకమా? తేల్చుకో. ఇదిగో జీవం మరణం నీ ఎదుట ఉంచబడినవి. ఎంపిక నీ చేతుల్లో వుంది మిత్రమా. " ప్రభువునందు మృతినొందు మృతులు ధన్యులు. ప్రకటన 14:13"

Post a Comment