Halloween Costume ideas 2015

What are the merits of the Bible?

బైబిలు గొప్పతనం ఏమిటి?
బైబిలు గొప్పతనం ఏమిటి?



అక్షర జ్ఞానం లేని పామరుడైనా సరే బైబిలులోని సారాంశం తెలిస్తే చాలు, నేటి విద్యావంతులకు ధీటుగా విషయ పరిజ్ఞానం పొందినట్టే. శాస్త్ర సాంకేతిక రంగం, ఖగోళం, అంతరిక్షం, వైద్యం, భూగర్భం, విమాన శాస్త్రం ఇలా ఎన్నో రంగాల గురించి కొద్దో, గొప్పో విషయాలు గ్రహించినట్లే. నేటి సామాజిక పరిస్థితులకు తగిన చట్టాలు, లోకొక్తులు, సూక్తులు, జనరల్ నాలెడ్జ్ వంటి విభిన్న అంశాలపైన తిరుగులేని పట్టు సాధించినట్లే. అంతగా అనంత విషయాలను అక్షర రూపంలో బైబిలు తనలో నిక్షిప్తం చేసుకుంది. నేడు శాస్త్రవేత్తలు కనిపెట్టె పలు విషయాలు బైబిలులో శాస్తీయంగానే ఉన్నాయి. బైబిలులో ఉన్న అద్బుతమైన విషయాల సమాహారాన్ని చూద్దాం!.


* ఈ సృష్టి ఎప్పుడు? ఎలా ఆవిర్భవించింది?
* విశ్వం విస్తరించుచున్నదా?* భూమి ఎలా ఏర్పడింది?* జీవపరిణామ క్రమం ఎలా జరిగింది?* జన్యువుల పని తీరు ఏంటి?* అంతరించిపోయిన అరుదైన జీవజాతులు, వాటి భౌతిక నిర్మాణము?* నాగరికత వెలసిల్లిన చరిత్ర* భూగోళంపై జనాభా వ్యాప్తి ఎలా జరిగింది?* భాషలు ఎలా ఏర్పడ్డాయి?* మానవులతో మానవాతీతులకు సంబంధాలు ఉన్నాయా?* నేటి చట్టాలు, శిక్షలకు మూలాధారంగా ఉన్న బైబిలుబైబిలు నుంచి వ్యాప్తి చెందిన విఖ్యాత లోకోక్తులు, సూక్తులు* భారత దేశంతో బైబిలు చరిత్రకు ఉన్న సంబంధము?* హిందూ ఆచారాలు, పూజలకు బైబిలులోని కనిపించే మూలాలు?ఇలాంటి మరెన్నో విషయాలను ఇముడ్చుకున్న అద్భుత గ్రంథమే బైబిలు.


బైబిలు క్రైస్తవుల కొరకే నిర్దేశింపబడినదా?
''బైబిలు అనేది క్రైస్తవుల పవిత్ర గ్రంథం" ఇది చాలా మందిలో నెలకొన్న భావన. క్రీస్తు గురించి ముందు మెరుపులతో పాత నిబంధన గ్రంథం, క్రీస్తు ప్రత్యక్షతతో కొత్త నిబంధన గ్రంథం కనిపించడమే అందుకు ప్రధాన కారణం. వాస్తవానికి బైబిలు అనేది సర్వమానవాళి కోసం అందించబడిన పవిత్ర గ్రంథం.
బైబిలు ఉద్బోద దేని గురించి?
ఈ విశ్వం పుట్టుక మొదలుకొని మానవజాతి ఆవిర్భవము, మనుగడ వరకు జరిగిన చారిత్రక ఘటనలు బైబిలునందు నిక్షిప్తమైయున్నాయి. అయితే ఇది బాహ్యంగా కనిపించే చరిత్ర మాత్రమే. నిజానికి ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చరిత్రలో మోపబడిన ప్రతీ ఒక్క అడుగు వెనుక దేవుని ఉద్దేశ్యము ఉన్నది. అందుకే ఆ గాథలను విశ్లేషిస్తే అందులో దేవుని ప్రణాళిక గురించి లోతైన భావనలు కనిపిస్తాయి. ఆత్మీయ జీవనానికి తోడ్పడే చక్కటి సందేశాన్ని కూడా వెల్లడిస్తాయి. ఆ సందేశాలు ఏమిటో చూద్దాం!.
* పాపం యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుంది?
* పాపుల యందు దేవుని ఉగ్రత ఎలా ఉంటుంది?* ఆపత్కాలాల్లో నీతిమంతులు ఎలా రక్షింపబడతారు?* నీతిమంతుల సంతానం ఎలా ఆశీర్వదింపబడుతుంది?* నీతిమంతుల వలన వారి కుటుంబం ఎలా రక్షింపబడుతుంది?* దేవునికి వ్యతిరేకంగా నడుచుకుంటే ఏం జరుగుతుంది?* దేవుని యందు విశ్వాసముతో ఎలా కాపాడబడుతున్నారు?
వంటి పలు సందేశాలను బైబిలులోని యధార్ధ గాథలు వెల్లడిస్తాయి.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget