4వ భాగం: ఇశ్రాయేలు మొదటి రాజునుండి బబులోను చెరవరకు
సౌలు ఇశ్రాయేలు మొదటి రాజయ్యాడు. కానీ యెహోవా ఆయనను తిరస్కరించి ఆయన స్థానంలో దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. దావీదు గురించి మనం చాలా విషయాలు తెలుసుకుంటాం. దావీదు యువకునిగా ఉన్నప్పుడు ఎంతో శక్తివంతుడైన గొల్యాతుతో పోరాడాడు. తర్వాత ఆయన అసూయాపరుడైన సౌలునుండి పారిపోయాడు. ఆ తర్వాత అందమైన అబీగయీలు ఆయనను బుద్ధిహీనమైన పని చేయకుండా అడ్డుకుంది.
తర్వాత మనం, దావీదు కుమారుడైన సొలొమోను గురించి చాలా విషయాలు తెలుసుకుంటాం. ఆయన దావీదు స్థానంలో ఇశ్రాయేలు రాజయ్యాడు. ఇశ్రాయేలు మొదటి ముగ్గురు రాజులు ఒక్కొక్కరు 40 సంవత్సరాలపాటు పాలించారు. సొలొమోను మరణం తర్వాత ఇశ్రాయేలు రెండుగా అంటే ఉత్తర రాజ్యంగాను, దక్షిణ రాజ్యంగాను చీలిపోయింది.
10 గోత్రాలతో రూపొందించబడిన ఉత్తర రాజ్యం 257 సంవత్సరాలపాటు నిలిచి ఆ తర్వాత అష్షూరీయుల చేతిలో నాశనమయ్యింది. తర్వాత 133 సంవత్సరాలకు, రెండు గోత్రాలతో రూపొందించబడిన దక్షిణ రాజ్యం కూడా నాశనమయ్యింది. అప్పుడు ఇశ్రాయేలీయులు బబులోనుకు చెరగా తీసుకెళ్ళబడ్డారు. కాబట్టి ఈ నాలుగవ భాగం 510 సంవత్సరాల చరిత్రను వివరిస్తుంది. ఈ కాలంలో జరిగిన అనేక ఉత్తేజభరిత సంఘటనలను మనం గమనించవచ్చు.

Post a Comment