7వ భాగం: యేసు పునరుత్థానం నుండి పౌలు చెరసాలలో వేయబడడం వరకు
యేసు మరణించిన తర్వాత, మూడవ రోజున పునరుత్థానం చేయబడ్డాడు. ఆ రోజు ఆయన తన అనుచరులకు ఐదు వేర్వేరు సమయాల్లో కనిపించాడు. ఆ తర్వాత కూడా 40 రోజుల వరకు ఆయన వారికి కనిపిస్తూనే ఉన్నాడు. తర్వాత తన శిష్యులు కొంతమంది చూస్తుండగా, యేసు పరలోకానికి ఆరోహణమయ్యాడు. పది రోజుల తర్వాత యెరూషలేములో కనిపెట్టుకొని ఉన్న యేసు అనుచరులపై దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించాడు.
ఆ తర్వాత, దేవుని శత్రువులు అపొస్తలులను చెరసాలలో బంధించినప్పుడు, ఒక దేవదూత వాళ్ళను విడిపించాడు. వ్యతిరేకులు శిష్యుడైన స్తెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. అయితే వ్యతిరేకులలో ఒకరిని యేసు తన ప్రత్యేక సేవకునిగా ఉండడానికి ఎలా ఎన్నుకున్నాడో మనం తెలుసుకుంటాం, ఆయనే అపొస్తలుడైన పౌలు అయ్యాడు. తర్వాత యేసు మరణించిన మూడున్నర సంవత్సరాలకు దేవుడు యూదుడు కాని కొర్నేలీకి, ఆయన కుటుంబానికి ప్రకటించేందుకు అపొస్తలుడైన పేతురును పంపించాడు.
తర్వాత దాదాపు 13 సంవత్సరాలకు పౌలు తన తొలి ప్రకటన పర్యటనను ప్రారంభించాడు. పౌలు రెండవ యాత్రలో తిమోతి ఆయనతోపాటు వెళ్ళాడు. దేవుని సేవించడంలో పౌలుకు, ఆయన ప్రయాణ సహచరులకు అనేక ఉత్తేజకరమైన అనుభవాలు ఎదురవడం గురించి మనం తెలుసుకుంటాం. చివరకు పౌలు, రోములోని చెరసాలలో వేయబడ్డాడు. రెండు సంవత్సరాల తర్వాత ఆయన విడిపించబడ్డాడు, కానీ ఆ తర్వాత మళ్ళీ చెరసాలలో వేయబడి, చంపబడ్డాడు. 7వ భాగంలోని సంఘటనలు 32 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంలో జరిగాయి.

Post a Comment