Halloween Costume ideas 2015

How is water on Earth?

భూమి మీద నీరు ఎలా ఏర్పడినది?


భూమి మీద నీరు ఎలా ఏర్పడినది? పై ప్రశ్నను చదివిన వెంటనే 'బైబిలుకు ఈ ప్రశ్నతో సంబంధం ఏమిటి?' అనే అనుమానం పలువురిలో కించింతైనను కలుగక మానదు. అయితే సర్వ విజ్ఞాన భండాగార రూపమే మన బైబిలు అనే విషయాన్ని గ్రహించగలిగితే దాదాపు ప్రతీ చిన్న విషయానికి ప్రత్యక్షముగాలో లేక పరోక్షముగానో లేఖన రూపములో సమాధానములు లభించును.
భూమి మీద జలములు ఏర్పడటం గురించి సైన్స్ వివరణ
"మహా విస్పోటనం కారణంగా మండుచున్న భూమి క్రమముగా వేడిమిని కోల్పోసాగింది. చివరి దశలో భూమి చల్లబడగానే ఏర్పడిన రసాయనిక మార్పుల కారణంగా భూమి మీద విస్తారంగా వర్షం కురిసింది. దీంతో జలములతో భూమి అంతా కప్పివేయబడినది. ఆ తరువాత జలములన్నీ అగాధముల్లోకి చేరుకోవడంతో అది సముద్రములుగా ఏర్పడగా బైబిలు వివరణ
"దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను" (ఆదికాండము 1:7) అనే వాక్యములో విశాలము క్రింది జలములు అనే పదము భూమి మీద నున్న జలములను సూచించును. అనగా, అప్పట్లో ఈ భూమి జలములతో కప్పివేయబడి ఉన్నదనే భావనను ఆ లేఖనము తెలియుచున్నది. ఈ విషయాన్ని "ఏలయనగా పూర్వమునుండి ఆకాశముండెననియు, నీళ్లలో నుండియు నీళ్లవలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగెననియు వారు బుద్ధి పూర్వకముగా మరతురు" (2పేతురు 3:5) అనే వాక్యము స్పష్టము చేయుచున్నది. "దేవుడు-ఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను" (ఆదికాండము 1:9-10) అనే వాక్యము ద్వారా సముద్రములు, భూభాగం ఎలా ఏర్పడ్డాయనే విషయమును కూడా చెబుతున్నది. అసలు, ఈ భూమి మీదకు జలములు ఎలా వచ్చాయనే విషయాన్ని "అయితే ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను" ఆదికాండము 2:5 లేఖనము వివరించుచున్నది. ఈ లేఖనము భూమి సృజింపబడిన తొలినాళ్లను (ఆదికాండము 2:4) సూచించును.
నేటి ఆధునిక సైన్స్ చెప్పిన విషయాన్ని సుమారు 3,500 సంవత్సరములకు ముందుగానే గ్రంథస్థము చేయబడుట ద్వారా లేఖనాలు యొక్క విశిష్టత తెలియుచున్నది. ఇదే మన బైబిలు గొప్పదనం.

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget