Halloween Costume ideas 2015

Jacob to Haran

యాకోబు హారానుకు వెళ్ళడం


యాకోబు మాట్లాడుతున్న వ్యక్తులెవరో మీకు తెలుసా? చాలా రోజులు ప్రయాణం చేసిన తర్వాత యాకోబు వాళ్ళను ఒక బావి దగ్గర కలిశాడు. అప్పుడు వాళ్ళు తమ గొర్రెలను కాస్తున్నారు. యాకోబు వాళ్ళని ‘మీరు ఎక్కడి వాళ్ళు’ అని అడిగాడు.
వాళ్ళు ‘మేము హారాను వాళ్ళం’ అన్నారు.
‘మీకు లాబాను తెలుసా?’ అని యాకోబు అడిగాడు.
‘తెలుసు. అదిగో, ఆయన కూతురు రాహేలు తన తండ్రి గొర్రెలను తోలుకొని వస్తోంది’ అని వాళ్ళు చెప్పారు. రాహేలు దూరంనుండి రావడం మీకు కనిపిస్తోందా?
రాహేలు దగ్గరకు వెళ్తున్న యాకోబు
యాకోబు తన మామయైన లాబాను గొర్రెలను రాహేలు తోలుకొని రావడాన్ని చూసి, దగ్గరకు వెళ్ళి బావిపైనున్న రాయి పొర్లించి గొర్రెలకు నీళ్ళు పెట్టాడు. ఆ తర్వాత యాకోబు రాహేలును ముద్దుపెట్టుకొని తానెవరో ఆమెకు చెప్పాడు. ఆమె ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ విషయాన్ని లాబానుతో చెప్పింది.
యాకోబు తమతోపాటు ఉండడానికి వచ్చినందుకు లాబాను ఎంతో సంతోషించాడు. తర్వాత యాకోబు రాహేలును పెళ్ళి చేసుకుంటానని అడిగినప్పుడు లాబాను చాలా సంతోషించాడు. అయితే రాహేలును చేసుకోవాలంటే తన పొలంలో ఏడు సంవత్సరాలు పని చెయ్యాలని ఆయన యాకోబుకు చెప్పాడు. యాకోబు రాహేలును ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆ విధంగా చేశాడు. కానీ పెళ్ళి సమయం వచ్చేసరికి, ఏమి జరిగిందో మీకు తెలుసా?
లాబాను రాహేలుకు బదులు తన పెద్ద కుమార్తె అయిన లేయాను యాకోబుకిచ్చి పెళ్ళి చేశాడు. యాకోబు మరో ఏడు సంవత్సరాలు పని చేయడానికి అంగీకరించినప్పుడు లాబాను రాహేలును కూడా ఆయనకు భార్యగా ఇచ్చాడు. ఆ కాలాల్లో పురుషులు ఒకరికంటె ఎక్కువమందిని పెళ్ళి చేసుకోవడానికి దేవుడు అనుమతించాడు. అయితే ఇప్పుడు మాత్రం, బైబిలు చెబుతున్నట్లు ఒక పురుషునికి ఒకే భార్య ఉండాలి.
ఆదికాండము 29:1-30.


ప్రశ్నలు

  • చిత్రంలోని యువతి ఎవరు, యాకోబు ఆమె కోసం ఏమి చేశాడు?
  • రాహేలును పెళ్ళి చేసుకోవడానికి యాకోబు ఏమి చేయడానికి సిద్ధపడ్డాడు?
  • యాకోబు రాహేలును పెళ్ళి చేసుకోవలసిన సమయం వచ్చినప్పుడు లాబాను ఏమి చేశాడు?
  • రాహేలును తన భార్యగా చేసుకోవడానికి యాకోబు ఏమి చేయడానికి అంగీకరించాడు?

అదనపు ప్రశ్నలు

  • ఆదికాండము 29:1-30 చదవండి.
    లాబాను యాకోబును మోసం చేసినప్పటికీ యాకోబు తాను మర్యాదస్థుడనని ఎలా చూపించాడు, దానినుండి మనమేమి నేర్చుకోవచ్చు? (ఆది. 25:27; 29:26-28; మత్త. 5:37)
    ప్రేమకు, ఆకర్షణకు మధ్యవున్న తేడాను యాకోబు ఉదాహరణ ఎలా చూపిస్తోంది? (ఆది. 29:18, 20, 30; పర. 8:6)
    ఏ నలుగురు స్త్రీలు యాకోబు కుటుంబంలో భాగమై ఆ తర్వాత ఆయనకు కుమారులను కన్నారు? (ఆది. 29:23, 24, 28, 29)

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget