Halloween Costume ideas 2015

From the flood to be released from Egypt 2nd part

2వ భాగం: జలప్రళయం మొదలుకొని ఐగుప్తు నుండి విడుదల వరకు
జలప్రళయం నుండి కేవలం ఎనిమిది మంది మాత్రమే రక్షించబడ్డారు, కానీ కొంతకాలానికి వారి సంఖ్య అనేక వేలకు పెరిగింది. జలప్రళయం వచ్చిన 352 సంవత్సరాల తర్వాత అబ్రాహాము జన్మించాడు. అబ్రాహాముకు ఇస్సాకు అనే కుమారుడిని ఇచ్చి దేవుడు తన వాగ్దానాన్ని ఎలా నిలబెట్టుకున్నాడో మనం తెలుసుకుంటాం. తర్వాత ఇస్సాకు ఇద్దరు కుమారులలో దేవుడు యాకోబును ఎన్నుకున్నాడు.

యాకోబుకు 12 మంది కుమారులు, కొంతమంది కుమార్తెలుగల పెద్ద కుటుంబం ఉండేది. యాకోబు 10 మంది కుమారులు తమ తమ్ముడైన యోసేపును ద్వేషించి ఆయనను ఐగుప్తులో దాసునిగా ఉండడానికి అమ్మేశారు. ఆ తర్వాత, యోసేపు ఐగుప్తులో ఒక ప్రముఖ పాలకుడయ్యాడు. కరవు వచ్చినప్పుడు యోసేపు తన అన్నల హృదయాలలో మార్పేమైనా వచ్చిందేమో పరీక్షించాడు. చివరకు యాకోబు కుటుంబమంతా అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తుకు తరలి వెళ్ళారు. అది అబ్రాహాము పుట్టిన 290 సంవత్సరాల తర్వాత జరిగింది.

ఇశ్రాయేలీయులు తర్వాతి 215 సంవత్సరాలు ఐగుప్తులో నివసించారు. యోసేపు మరణించిన తర్వాత వాళ్ళు అక్కడ దాసులయ్యారు. కొంతకాలానికి మోషే జన్మించాడు, ఇశ్రాయేలీయులను ఐగుప్తునుండి విడిపించడానికి దేవుడు ఆయనను ఉపయోగించుకున్నాడు. మొత్తం 857 సంవత్సరాల చరిత్ర రెండవ భాగంలో వివరించబడింది.


ఈ భాగంలో

11వ కథ: మొదటి వర్షధనుస్సు 

12వ కథ: ప్రజలు ఒక పెద్ద గోపురాన్ని నిర్మించడం

13వ కథ: అబ్రాహాము—దేవుని స్నేహితుడు

14వ కథ: దేవుడు అబ్రాహాము విశ్వాసాన్ని పరీక్షించడం

15వ కథ: లోతు భార్య వెనక్కి చూడడం

16వ కథ: ఇస్సాకుకు మంచి భార్య లభించడం

17వ కథ: భిన్నమైన కవల పిల్లలు

18వ కథ: యాకోబు హారానుకు వెళ్ళడం

19వ కథ: యాకోబు పెద్ద కుటుంబం

20వ కథ: దీనా కష్టాల్లో చిక్కుకోవడం

21వ కథ: యోసేపు సహోదరులు ఆయనను ద్వేషించడం

22వ కథ: యోసేపు చెరసాలలో వేయబడడం

23వ కథ: ఫరో కలలు

24వ కథ: యోసేపు తన సహోదరులను పరీక్షించడం

25వ కథ: కుటుంబం ఐగుప్తుకు తరలి వెళ్ళడం

26వ కథ: యోబు దేవునికి నమ్మకంగా ఉండడం

27వ కథ: ఒక చెడ్డరాజు ఐగుప్తును పరిపాలించడం

28వ కథ: పసివాడైన మోషే రక్షించబడడం

29వ కథ: మోషే పారిపోవడానికిగల కారణం

30వ కథ: మండుతున్న పొద

31వ కథ: మోషే అహరోనులు ఫరోను కలవడం

32వ కథ: పది తెగుళ్ళు

33వ కథ: ఎర్ర సముద్రాన్ని దాటడం



3వ భాగం: ఐగుప్తునుండి విడుదల చేయబడడం మొదలుకొని ఇశ్రాయేలీయుల మొదటి రాజు వరకు coming soon

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget