Halloween Costume ideas 2015

Lot's wife, looking back

లోతు భార్య వెనక్కి చూడడం



లోతు ఆయన కుటుంబం అబ్రాహాముతోపాటు కనాను దేశంలో నివసించేవారు. ఒకరోజు అబ్రాహాము, ‘మన పశువులన్నిటికి సరిపడేంత ప్రాంతం ఇక్కడ లేదు. మనమిద్దరం విడిపోదాము. నువ్వు ఒక ప్రక్కకు వెళ్తే, నేను మరో ప్రక్కకు వెళ్తాను’ అని లోతుతో చెప్పాడు.
లోతు ఆ ప్రాంతాన్నంతటిని పరిశీలించాడు. నీరు సమృద్ధిగా ఉండి, పశువుల కోసం పచ్చగడ్డి విస్తారంగా ఉన్న ఒక మంచి ప్రాంతము ఆయనకు కన్పించింది. అది యొర్దాను ప్రాంతము. లోతు తన కుటుంబాన్ని తన పశువులను అక్కడకు తరలించాడు. వాళ్ళు చివరకు సొదొమ పట్టణంలో నివసించడం ప్రారంభించారు.
సొదొమ ప్రజలు చాలా చెడ్డవారు. మంచివాడైన లోతు వాళ్ళను చూసి ఎంతో కలవరపడ్డాడు. దేవుడు కూడా వాళ్ళను చూసి కలతపడ్డాడు. చివరకు దేవుడు వాళ్ళ చెడుతనాన్నిబట్టి సొదొమ పట్టణాన్ని, దాని దగ్గరి పట్టణమైన గొమొర్రాను నాశనం చేయబోతున్నట్లు లోతును హెచ్చరించడానికి ఇద్దరు దూతలను పంపాడు.
దూతలు లోతుతో, ‘త్వరపడు! నీ భార్యను, నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని ఇక్కడనుండి పారిపో!’ అని చెప్పారు. లోతు ఆయన కుటుంబం పారిపోవడంలో ఆలస్యం చేస్తుంటే దూతలే వాళ్ళ చేతులు పట్టుకొని పట్టణం బయటకు తీసుకువెళ్ళారు. అప్పుడు ఆ దూతలలో ఒకరు, ‘మీ ప్రాణాలు దక్కించుకోవాలంటే పారిపొండి! వెనక్కి చూడొద్దు. చావు తప్పించుకోవడానికి ఆ పర్వతానికి పారిపొండి’ అని చెప్పాడు.
లోతు, ఆయన కుమార్తెలు ఆ మాటలకు లోబడి సొదొమ నుండి పారిపోయారు. వారు ఒక్క క్షణం కూడా ఆగలేదు, వెనక్కి చూడలేదు. కానీ లోతు భార్య మాత్రం అవిధేయత చూపించింది. వాళ్ళు సొదొమనుండి కొంత దూరం వెళ్ళిన తర్వాత, ఆమె ఆగి వెనక్కి చూసింది. అప్పుడు ఆమె ఉప్పు స్తంభమయ్యింది. చిత్రంలో ఆమె మీకు కనిపిస్తోందా?
దీనినుండి మనం ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. దేవుడు తనకు విధేయులైన వారిని రక్షిస్తాడని, ఆయనకు విధేయులు కాని వారు తమ ప్రాణాలను కోల్పోతారని అది చూపిస్తోంది.
ఆదికాండము 13:5-13; 18:20-33; 19:1-29; లూకా 17:28-32; 2 పేతురు 2:6-8.
సొదొమ నుండి పారిపోతున్న లోతు


ప్రశ్నలు

  • అబ్రాహాము, లోతు ఎందుకు విడిపోయారు?
  • లోతు సొదొమలో నివసించాలని ఎందుకు నిర్ణయించుకున్నాడు?
  • సొదొమలోని ప్రజలు ఎలాంటివారు?
  • ఇద్దరు దేవదూతలు లోతును ఏమని హెచ్చరించారు?
  • లోతు భార్య ఎందుకు ఉప్పు స్తంభంగా మారింది?
  • లోతు భార్యకు జరిగినదాని నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు?

అదనపు ప్రశ్నలు

  • ఆదికాండము 13:5-13 చదవండి.
    వ్యక్తుల మధ్య తలెత్తిన సమస్యలను పరిష్కరించే విషయంలో మనం అబ్రాహామునుండి ఏ పాఠం నేర్చుకోవచ్చు? (ఆది. 13:8, 9; రోమా. 12:10; ఫిలి. 2:3, 4)
  • ఆదికాండము 18:20-33 చదవండి.
    యెహోవా అబ్రాహాముతో వ్యవహరించిన విధానం, యెహోవా మరియు యేసు న్యాయంగానే తీర్పు తీరుస్తారని ఎలా హామీ ఇస్తోంది? (ఆది. 18:25, 26; మత్త. 25:31-33)
  • ఆదికాండము 19:1-29 చదవండి.
    దేవుడు స్వలింగ సంయోగాన్ని ఎలా దృష్టిస్తాడనే విషయం గురించి ఈ బైబిలు వృత్తాంతం ఏమి చూపిస్తోంది? (ఆది. 19:5, 13; లేవీ. 20:13)
    దేవుని మార్గదర్శకానికి అబ్రాహాము స్పందించిన విధానంలో, లోతు స్పందించిన విధానంలో ఎలాంటి తేడా కనిపిస్తుంది, మనం దానినుండి ఏమి నేర్చుకోవచ్చు? (ఆది. 19:15, 16, 19, 20; 22:3)
  • లూకా 17:28-32 చదవండి.
    భౌతిక సంపదల విషయంలో లోతు భార్య హృదయ పరిస్థితి ఎలా ఉంది, అది మనకు ఒక హెచ్చరికగా ఎలా ఉంది? (లూకా 12:15; 17:31, 32; మత్త. 6:19-21, 25)
  • రెండవ పేతురు 2:6-8 చదవండి.
    లోతులాగే, మన చుట్టూవున్న దైవభక్తిలేని ప్రపంచంపట్ల మన వైఖరి ఎలా ఉండాలి? (యెహె. 9:4; 1 యోహా. 2:15-17)

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget