Halloween Costume ideas 2015

Gideon and his 300 men

గిద్యోను, అతని 300 మంది పురుషులు



ఇక్కడ ఏమి జరుగుతుందో చూస్తున్నారా? వాళ్ళంతా ఇశ్రాయేలు యుద్ధ యోధులు. క్రిందకు వంగిన పురుషులు నీళ్ళు త్రాగుతున్నారు. వాళ్ళ దగ్గర నిలబడివున్న వ్యక్తి న్యాయాధిపతియైన గిద్యోను. ఆయన వాళ్ళు నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనిస్తున్నాడు.
ఆ పురుషులు వేర్వేరు పద్ధతుల్లో నీళ్ళు ఎలా త్రాగుతున్నారో గమనించండి. కొంతమంది తమ ముఖాలను నీళ్ళవరకు పెట్టారు. కానీ ఒక వ్యక్తి మాత్రం తన చుట్టూ జరిగేవాటిని గమనించడానికి వీలుగా నీళ్ళను చేతిలోకి తీసుకొని త్రాగుతున్నాడు. అలా చేయడం ప్రాముఖ్యం, ఎందుకంటే నీళ్ళు త్రాగేటప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే పురుషులను మాత్రమే ఎన్నుకోమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. మిగతావాళ్ళను ఇంటికి పంపించమని దేవుడు చెప్పాడు. ఎందుకో చూద్దాం.
ఇశ్రాయేలీయులు మళ్ళీ చాలా కష్టాల్లో చిక్కుకున్నారు. దానికి కారణం వాళ్ళు యెహోవాకు విధేయత చూపించకపోవడమే. మిద్యానీయులు వాళ్ళపై ఆధిపత్యం సంపాదించుకొని వాళ్ళను బాధించడం ప్రారంభించారు. కాబట్టి తమకు సహాయం చేయమని ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టుకున్నారు, యెహోవా వాళ్ళ మొర విన్నాడు.
యెహోవా గిద్యోనుతో సైన్యాన్ని సమకూర్చమని చెప్పినప్పుడు గిద్యోను 32,000 మంది యోధులను సమకూర్చాడు. అయితే ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ఉన్న సైన్యంలో 1,35,000 మంది పురుషులు ఉన్నారు. అయినా యెహోవా గిద్యోనుతో ‘నీకు చాలామంది పురుషులున్నారు’ అని అన్నాడు. యెహోవా అలా ఎందుకు అన్నాడు?
ఎందుకంటే ఒకవేళ ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయిస్తే, వాళ్ళు తమకై తామే జయించామని అనుకోవచ్చు. యుద్ధంలో జయించడానికి తమకు యెహోవా సహాయం అవసరం లేదని వాళ్ళు అనుకోవచ్చు. అందుకే యెహోవా గిద్యోనుతో, ‘యుద్ధం చేయడానికి భయపడే వాళ్ళందరినీ ఇళ్ళకు వెళ్ళమని చెప్పు’ అన్నాడు. గిద్యోను అలా చెప్పినప్పుడు, 22,000 మంది వెళ్ళిపోయారు. అప్పుడు ఆయన దగ్గర 1,35,000 మందితో పోరాడడానికి కేవలం 10,000 మంది మాత్రమే మిగిలారు.

పురుషులను పరీక్షిస్తున్న గిద్యోను
అయితే, వినండి! యెహోవా మళ్ళీ గిద్యోనుతో ‘నీ దగ్గర ఇంకా ఎక్కువమందే ఉన్నారు’ అన్నాడు. కాబట్టి వాళ్ళందరిని నీళ్ళు త్రాగడానికి వాగు దగ్గరకు తీసుకెళ్ళి, నీళ్ళవరకూ ముఖం పెట్టి త్రాగేవారిని ఇంటికి పంపించమని యెహోవా గిద్యోనుకు చెప్పాడు. ‘నీళ్ళు త్రాగుతున్నప్పుడు తమ చుట్టూ జరుగుతున్నవాటిని గమనించే 300 మంది పురుషులతోనే నేను నీకు విజయాన్ని కలుగజేస్తాను’ అని యెహోవా వాగ్దానం చేశాడు.
యుద్ధం చేసే సమయం వచ్చింది. గిద్యోను తన 300 మంది పురుషులను మూడు గుంపులుగా ఏర్పాటు చేశాడు. ఆయన వాళ్ళలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బూరను, లోపల దివిటీగల ఒక కుండను ఇచ్చాడు. దాదాపు మధ్యరాత్రి అయినప్పుడు వాళ్ళంతా శత్రు సైన్య శిబిరాన్ని చుట్టుముట్టారు. తర్వాత వాళ్ళంతా ఒకేసారి బూరలను ఊది, కుండలను పగులగొట్టి ‘యెహోవా ఖడ్గము, గిద్యోను ఖడ్గము!’ అని కేకలు వేశారు. శత్రు సైనికులు లేచినప్పుడు వాళ్ళు కలవరపడి భయపడ్డారు. వాళ్ళంతా పరుగెత్తడం ప్రారంభించారు. ఇశ్రాయేలీయులు యుద్ధాన్ని జయించారు.
న్యాయాధిపతులు 6 నుండి 8 అధ్యాయాలు.


ప్రశ్నలు

  • ఇశ్రాయేలీయులు ఎలా, ఎందుకు చాలా కష్టాల్లో చిక్కుకున్నారు?
  • గిద్యోను సైన్యంలో చాలామంది ఉన్నారు అని యెహోవా ఎందుకు అన్నాడు?
  • గిద్యోను భయపడేవాళ్ళని ఇంటికి వెళ్ళమని చెప్పిన తర్వాత ఎంతమంది పురుషులు మిగిలారు?
  • చిత్రం సహాయంతో, యెహోవా గిద్యోను సైన్యాన్ని కేవలం 300 మందికి తగ్గించిన విధానాన్ని వివరించండి.
  • గిద్యోను తన 300 మంది పురుషులను ఎలా ఏర్పాటు చేశాడు, ఇశ్రాయేలు యుద్ధంలో ఎలా విజయం సాధించింది?

అదనపు ప్రశ్నలు

  • న్యాయాధిపతులు 6:36-40 చదవండి.
    యెహోవా చిత్తమేమిటో గిద్యోను ఎలా నిశ్చయపరచుకున్నాడు?
    నేడు మనం యెహోవా చిత్తమేమిటో ఎలా తెలుసుకోవచ్చు? (సామె. 2:3-6; మత్త. 7:7-11; 2 తిమో. 3:16, 17)
  • న్యాయాధిపతులు 7:1-25 చదవండి.
    నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి విరుద్ధంగా అప్రమత్తంగా ఉండిన 300 మంది నుండి మనమే పాఠం నేర్చుకోవచ్చు? (న్యాయా. 7:3, 6; రోమా. 13:11, 12; ఎఫె. 5:15-17)
    ఆ 300 మంది పురుషులు గిద్యోనును చూసి నేర్చుకున్నట్లే మనం గొప్ప గిద్యోను అయిన యేసుక్రీస్తును చూసి ఎలా నేర్చుకుంటాము? (న్యాయా. 7:17; మత్త. 11:29, 30; 28:19, 20; 1 పేతు. 2:21)
    యెహోవా సంస్థలో ఎక్కడ సేవ చేయడానికి నియమించబడినా మనం సంతృప్తిగా ఉండడానికి న్యాయాధిపతులు 7:21 ఎలా సహాయం చేస్తుంది? (1 కొరిం. 4:2; 12:14-18; యాకో. 4:10)
  • న్యాయాధిపతులు 8:1-3 చదవండి.
    ఒక సహోదరునితో లేదా సహోదరితో ఉన్న వ్యక్తిగత మనస్పర్థలను పరిష్కరించుకునే విషయానికి వచ్చినప్పుడు, గిద్యోను ఎఫ్రాయిమీయులతో ఉన్న కలహాన్ని పరిష్కరించిన విధానం నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (సామె. 15:1; మత్త. 5:23, 24; లూకా 9:48)

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget