Halloween Costume ideas 2015

Ruth and Naomi

రూతు, నయోమి


బైబిలులో రూతు అనే పుస్తకం ఉంది. అది ఇశ్రాయేలుకు న్యాయాధిపతులు ఉన్నకాలంలో జీవించిన ఒక కుటుంబం గురించిన కథ. రూతు మోయాబు దేశానికి చెందిన యౌవన స్త్రీ; ఆమె దేవుని జనాంగమైన ఇశ్రాయేలుకు సంబంధించినది కాదు. కానీ రూతు సత్య దేవుడైన యెహోవా గురించి తెలుసుకున్నప్పుడు ఆయనను ఎంతగానో ప్రేమించింది. నయోమి ఒక వృద్ధ స్త్రీ, ఆమె రూతుకు యెహోవా గురించి తెలుసుకోవడానికి సహాయం చేసింది.
నయోమి ఇశ్రాయేలు స్త్రీ. ఇశ్రాయేలులో ఆహార కొరత వచ్చినప్పుడు ఆమె, ఆమె భర్త, ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి తరలి వెళ్ళారు. కొద్దికాలం తర్వాత నయోమి భర్త చనిపోయాడు. తర్వాత నయోమి ఇద్దరు కుమారులు మోయాబు దేశానికి చెందిన రూతు, ఓర్పా అనే ఇద్దరు అమ్మాయిలను పెళ్ళి చేసుకున్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయోమి ఇద్దరు కుమారులూ చనిపోయారు. నయోమికి, ఆ ఇద్దరు అమ్మాయిలకు ఎంత దుఃఖం కలిగిందో! ఆ తర్వాత నయోమి ఏమి చేసింది?
ఒకరోజు నయోమి మళ్ళీ తన స్వంత ప్రజల దగ్గరకు, తన స్వదేశానికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. రూతు, ఓర్పా ఆమెతోపాటే ఉండాలనుకొని ఆమెతో బయలుదేరారు. అయితే వాళ్ళు కొంత దూరం ప్రయాణించిన తర్వాత, నయోమి ఆ అమ్మాయిలవైపు తిరిగి, ‘మీరు మీ ఇళ్ళకు వెళ్ళి మీ తల్లుల దగ్గర ఉండండి’అని చెప్పింది.
నయోమి ఆ అమ్మాయిలను ముద్దు పెట్టుకొని వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అప్పుడు వాళ్ళిద్దరూ ఏడ్వడం ప్రారంభించారు, ఎందుకంటే వాళ్ళు నయోమిని ఎంతో ప్రేమించారు. ‘మేము వెళ్ళము! మేము నీతోపాటు నీ ప్రజల దగ్గరకు వస్తాము’ అని వాళ్ళు అన్నారు. కానీ నయోమి వాళ్ళతో ‘నా కుమార్తెలారా, మీరు తిరిగి వెళ్ళండి. మీరు మీ ఇళ్ళలో ఉండడమే మంచిది’అని సమాధానమిచ్చింది. కాబట్టి ఓర్పా తన స్వదేశానికి బయలుదేరి వెళ్ళింది. కానీ రూతు వెళ్ళలేదు.
అప్పుడు నయోమి ఆమెవైపు తిరిగి, ‘ఓర్పా వెళ్ళింది. నువ్వు కూడా ఆమెతోపాటు ఇంటికి వెళ్ళు’అంది. అందుకు రూతు, ‘నేను నిన్ను విడిచి వెళ్ళేలా చేయడానికి ప్రయత్నించవద్దు! నన్ను నీతోనే రానివ్వు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేనూ అక్కడికే వస్తాను. నువ్వు ఎక్కడ ఉంటావో నేనూ అక్కడే ఉంటాను. నీ ప్రజలే నా ప్రజలు. నీ దేవుడే నా దేవుడు. నువ్వు ఎక్కడ మరణిస్తావో నేనూ అక్కడే మరణిస్తాను. నేను నీ దగ్గరే పాతిపెట్టబడతాను’అంది. రూతు అలా అన్నప్పుడు నయోమి ఇంక ఆమెను ఇంటికి పంపించడానికి ప్రయత్నించలేదు.
చివరకు ఆ ఇద్దరు స్త్రీలు ఇశ్రాయేలుకు చేరుకొని అక్కడ నివసించడం ప్రారంభించారు. అది యవలు సమకూర్చే కాలము కాబట్టి రూతు వెంటనే పొలాల్లో పని చేయడం మొదలుపెట్టింది. బోయజు అనే వ్యక్తి ఆమెను తన పొలంలో పరిగె ఏరుకొనేందుకు అనుమతించాడు. బోయజు తల్లి ఎవరో మీకు తెలుసా? ఆమె యెరికో పట్టణానికి చెందిన రాహాబు.
ఒకరోజు బోయజు రూతుతో, ‘నేను నీ గురించి అంతా విన్నాను. నువ్వు నయోమిపట్ల ఎంత దయగా ఉన్నావో విన్నాను. నువ్వు నీ తండ్రిని, తల్లిని, నీ స్వదేశాన్ని విడిచిపెట్టి నీకు తెలియని ప్రజలతో జీవించడానికి వచ్చావని కూడా నాకు తెలుసు. యెహోవా నీకు మేలు కలుగజేయును గాక!’ అన్నాడు.
దానికి రూతు, ‘నా యజమానుడా, మీరు నాపట్ల ఎంతో దయగా ప్రవర్తించారు. మీరు నాతో మంచిగా మాట్లాడి నాకు ఎంతో సంతోషం కలిగించారు’అని అంది. బోయజు రూతును ఎంతో ఇష్టపడ్డాడు. కొద్దికాలం తర్వాత వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకున్నారు. అది నయోమికి ఎంత సంతోషాన్ని కలిగించివుంటుందో కదా! రూతు బోయజులకు మొదటి కుమారుడు ఓబేదు పుట్టినప్పుడు నయోమి ఇంకా సంతోషించింది. తర్వాత ఓబేదు దావీదుకు తాతయ్య అయ్యాడు. దావీదు గురించి మనం తర్వాత చాలా తెలుసుకుంటాం.

రూతు, నయోమి
బైబిలు పుస్తకమైన రూతు.


ప్రశ్నలు

  • నయోమి మోయాబు దేశానికి ఎందుకు వచ్చింది?
  • రూతు, ఓర్పా ఎవరు?
  • తమ ప్రజల దగ్గరకు తిరిగి వెళ్ళమని నయోమి చెప్పినప్పుడు రూతు ఎలా ప్రతిస్పందించింది, ఓర్పా ఎలా ప్రతిస్పందించింది?
  • బోయజు ఎవరు, ఆయన రూతుకు, నయోమికి ఎలా సహాయం చేశాడు?
  • బోయజు రూతులకు పుట్టిన అబ్బాయి పేరేమిటి, ఆయనను మనం ఎందుకు గుర్తుంచుకోవాలి?

అదనపు ప్రశ్నలు

  • రూతు 1:1-17 చదవండి.
    రూతు విశ్వసనీయమైన ప్రేమను ఎలా అద్భుతమైన విధంగా కనపరిచింది? (రూతు 1:16, 17)
    రూతు మానసిక వైఖరి, నేడు భూమిపైవున్న అభిషిక్తులపట్ల “వేరే గొఱ్ఱెల”కు ఉన్న వైఖరిని ఎలా వ్యక్తం చేస్తోంది? (యోహా. 10:16; జెక. 8:23)
  • రూతు 2:1-23 చదవండి.
    నేటి యువతుల కోసం రూతు ఒక చక్కని మాదిరిని ఎలా ఉంచింది? (రూతు 2:17, 18; సామె. 23:22; 31:15)
  • రూతు 3:5-13 చదవండి.
    రూతు ఒక యువకుడిని కాకుండా తనను పెళ్ళి చేసుకోవడానికి సుముఖత చూపించడాన్ని బోయజు ఎలా దృష్టించాడు?
    రూతు వైఖరి మనకు విశ్వసనీయ ప్రేమ గురించి ఏమి బోధిస్తోంది? (రూతు 3:10; 1 కొరిం. 13:4, 5)
  • రూతు 4:7-17 చదవండి.
    నేడు క్రైస్తవ పురుషులు బోయజులా ఎలా ఉండవచ్చు? (రూతు 4:9, 10; 1 తిమో. 3:1, 12, 13; 5:8)

Post a Comment

MKRdezign

{facebook#YOUR_SOCIAL_PROFILE_URL} {twitter#YOUR_SOCIAL_PROFILE_URL} {google#YOUR_SOCIAL_PROFILE_URL} {pinterest#YOUR_SOCIAL_PROFILE_URL} {youtube#YOUR_SOCIAL_PROFILE_URL} {instagram#YOUR_SOCIAL_PROFILE_URL}

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.
Javascript DisablePlease Enable Javascript To See All Widget